నిన్న రాత్రి జరిగిన ఫైనల్ లో జహంగీర్ మెహత ఓడిపొయ్యాడు.
ఫుడ్ నెట్వర్క్ వారి కిచెన్ స్టేడియం లో ఇద్దరు వంటగాళ్ళు పోటీపడుతుంటారు. ప్రతీ పోటీకి ఒక రహస్య ఇన్గ్రేడియంట్ ఉంటుంది. నిన్న అది బీఫ్.
మనోడు దేశీయుడు. రెండోవాడు లాటినొ. మనోడు ఎంత నేర్చుకున్నా, చిన్నప్పటినుండీ తినని లేక వండేప్పుడు చూడని, చూసి నేర్చుకోని కొన్ని టెక్నిక్ లను మిస్స్ అయ్యాడు. ఆరెండోవాడు పుట్టినప్పటినుండి బీఫ్ తిన్నాడు, ఇంట్లో వండుతుంటే చూసాడు కాబట్టి అది వాడికి ఎడ్వాంటేజ్ అయ్యింది. నేటివ్ ఎడ్వాంటేజ్ వచ్చేలా రహస్య ఇన్గ్రేడియంట్ ని ఎన్నుకోటం కుట్ర.
మనోడు పులావు వండివార్చాడు, అందరికీ నచ్చింది. బర్గర్ చేసాడు, అదే అతని కొంప ముంచింది. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాడు ఒక్కోటి చేంతాడంత లావున. ఆరుగ్గురు జడ్జ్ లకు అది నచ్చలేదు.
ఒక భారతీయుడు అమెరికా వంటల్లో ఇంత దూరం రాగలగటం గొప్ప. ఫైనల్ లో ఓడినా, నేనేతై, *పో సోదరా గెలిచావ్* అన్నాను. అతనికి నా మాటలు వినిపించలేదు అఫ్కోర్స్.
Nov 23, 2009
Subscribe to:
Post Comments (Atom)
:)
ReplyDeleteఅవును బీఫ్ దెబ్బ కొట్టేసింది. అదే అనుకున్నా నేను..
ReplyDeleteప్చ్. ఇది వ్యూహాత్మకకుట్ర అని నేను ఆరోపిస్తున్నా.
ReplyDeleteబీఫ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇవ్వడం Jose Garcias కి ఖచ్చితంగా అడ్వాంటేజ్.. అయినా మనోడు నెగ్గుతాడనుకున్నా :-(
ReplyDeleteపన్లొ పని ఓసారి ఇక్కడ ఓ లూక్ వెసుకొండి.
http://parnashaala.blogspot.com/2009/11/blog-post_23.html
Ayyoe! nijamae intadaakaa raagaligaaDu kanuka gelichinaTlae!
ReplyDeleteప్చ్..... :(
ReplyDeletehmm :(
ReplyDeleteఈ ఎపిసోడ్ మిస్ అయ్యా. ఓహో, బీఫ్ ఇచ్చారా? సరే. నేను ఆశ పడ్డా, మెహతా గెలుస్తాడని.
ReplyDelete