Nov 5, 2009

తెలుగు మాధ్యమ బళ్ళ బోధనలో నాణ్యత లేదా?

కూడలి/బ్లాగులు వ్యాఖ్యల్లో ఎక్కడో ఎవరో ఇలా ఇచ్చన ఒక స్టేట్మెంట్ నా కంటపడింది -
>>ఇప్పటికీ సగర్వంగా తెలుగుమీడియం చదువులు చదువుతూ, బోధనలో నాణ్యత లేక...యాట యాట యాట
ఎక్కడ నాణ్యత ఉందీ?
సందుచివరన ఉన్న ఒక పాకలో కాన్వెంటుపెడితే, కాన్వెంటుపెట్టినోడి బామ్మర్ది పెళ్ళాం తమ్ముడి బామ్మర్ది అక్కని టీచరుగా అప్పాయింటుచేస్కుంటున్నారు. ఆమె ఏమి చెప్తుందీ? అర్హతలు ఏంటి?
అసలు ఒక ఆంగ్ల లేక తెలుగు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల అర్హతని ఎవరు పరీక్షిస్తారు, ఎవరు నిర్దేశిస్తారూ? ఆ ఉపాధ్యాయ స్థానాకి ఎంపిక విధానం ఏంటి?
కూర్చోపెట్టి నాలుగుముక్కలు ఆంగ్లంలోనైనా తెలుగులోనైనా ఓ బెత్తంపుచ్చుకుని రుబ్బించటానికి ఏ అర్హతా అవసరంలేదు. ఇప్పటి పాఠశాలల్లో జరుగుతోంది అదే.
తమతమ బోధనా అంశాల్లో చేతులుతిరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు నాకు కొన్ని వందలమంది తెలుసు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పరీక్షలు పాసై, ఇంటర్వ్యూలలో నెగ్గి బోధనావృత్తిని చేపట్టినవారు.

ఇక్కడ విషయం - క్రేజ్. పక్కనోళ్ళని చూసి వాతలు పెట్టుకొనుట. ఆళ్ళు జేర్పించారు, మనమేం తక్కువా? అని హంగు పొంగు చూపుకోటంకోసం. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ అని రైం పాడుతుంటే అర్ధం కాకపోయినా వచ్చే కిక్కు కోసం.

ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇలా ఆడిపోసుకునే హక్కు ఎవరికీ లేదు, నిజంగా ఆ ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు తప్పుచేస్తే తప్ప.
ఎన్ని ప్రైవేటూ బళ్ళకు కనీస వసతులు ఉన్నాయీ?
ఓ ఆట స్థలం ఉందా?
ఓ ల్యాబ్ ఉందా?
క్రాఫ్ట్స్ పీరియడ్ అంటే ఎంతమంది ప్రైవేటు బడిపిల్లలకు తెలుసూ?
ఎంతమంది ప్రైవేటు బడిపిల్లలు బళ్ళో మొక్కలు నాటతారు?
ఎంతమంది పిల్లలు ఆ మొక్కలకు నీళ్ళు పోస్తారు?


ఉపాధ్యాయ కుటుంబం మాది, తరతరాలుగా. పల్నాడు మొత్తంలో మా నాయన కీర్తిప్రతిష్టలు సంపాదించిన లెక్కల ఉపాధ్యాయుడు. బజారులో నడచి వస్తుంటే లేచి నిల్చునే వాళ్ళు జనాలు, అదీ ఆరోజున ఓ ఉపాధ్యాయుడికి, *ఉపాధ్యాయుడికి మాత్రమే* దక్కిన గౌరవం.
కారణాలు - ఉపాధ్యాయుల మేధస్సు. విషయపరిజ్ఞానం, సాహిత్యావలోకనం, నిరంతర పఠనం, బాధ్యత, విశాల ధృక్పదం, మరియూ ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం అన్నిటికన్నా నేను నలుగురికీ చెప్పాలంటే నేను నిష్టగా ఉండాలి విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉండాలీ అనే డెడికేషన్.

పదోతరగతి వాళ్ళకు పోటీలుపడి మరీ డిశెంబరుకల్లా పాఠ్యాంశాలు బోధించేసి, వారానికో పరీక్షపెట్టి వాళ్ళకు పదునుపెట్టి, పెద్దపరీక్షలు దగ్గరైయ్యేకొద్దీ రోజుకో పరీక్షపెట్టి, సాయంత్రాలు ఎత్తుబళ్ళో చదువుకునే గంటల విధానాలు ప్రవేశపెట్టి ఇలా అనునిత్యం కష్టపడేవాళ్ళు ఉపాధ్యాయులంటే. కొందరు ఉండొచ్చు, సొంతవ్యాపారాల్లో మునిగితెలేవాళ్ళు.

ఎందుకిలా? ఒకానొన రోజున ఉద్యోగం ఏదైనా మహాప్రసాదంలా భావించేవాళ్ళు. ఉపాధ్యాయవృత్తి చేప్పట్టటం అంటే అదో కల మరియూ అవసరం కూడా. పేద లేక మధ్యతరగతి వాళ్ళు మాత్రమే వచ్చే వాళ్ళు ఉపాధ్యాయులుగా. ధనికులైన వాళ్ళు అతితక్కువ. అందుకే వీరికి వేరే వ్యాపారాలు గట్రా ఉండేవి కావు. మరియూ లైఫ్ టైం కమిట్మెంట్. ముఫైయైదు సంవత్సరాలు సర్వీసు కాలం. మరి ప్రైవేటు ఉపాధ్యాయులకో? ఈరోజు వస్తాడు, రేపు, బబాయ్ ఇంతకన్నా ఎక్కువ డబ్బు చిట్ ఫండ్లో వస్తోందీ అని మానేస్తాడు. కొత్త ముఖం వస్తుంది మళ్ళీ, ఈ వచ్చినవాడు, నేనే వేరే వ్యాపారం చేస్కుంటా అని సగం లో నిష్క్రమిస్తాడు.

ఈరోజున శ్రీ చైతన్యా లాంటి కార్పోరేట్ విద్యాసంస్థలు నిజంగానే స్టేట్ ర్యాంకులని కొల్లగొడుతున్నాయా?
ఉత్తి బూటకం, ఉత్తి నాటకం.
తాడికొండ లాంటి ఏపి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఒకప్పుడు ఊపేసాయి. కారణం, అప్పట్లో దానికి అర్హత కేవలం మెరిట్. తర్వాతర్వాత మెరిట్ కన్నా వార్షికదాయపరిమితి ఎక్కువైంది. దాంతో, వాటికి వెళ్ళే విద్యార్ధుల సంఖ్య, స్థాయి పడిపోయాయి, మరియూ రిజర్వేషన్స్ ఎక్కువకావటం కూడా జరిగింది.

18 comments:

 1. పెవేట్ బళ్లొ పాఠాలు సెప్పరా అంటే, కేసులు పేడతాం అనే పంతుళ్లు ఉండరుగా? :)

  ReplyDelete
 2. so called ప్రైవేటు బడులు, ప్రభుత్వ బడులకన్నా ఘోరంగా ఉంటున్నది. అలాంటివి నాకు మా వూరిలో చాలానే కనిపించాయి.

  ReplyDelete
 3. పైన నా కామెంట్ పరిస్థితి అక్క్డక్కడా ఉన్నా, తెలుగుమీడియం బళ్ళొ ఉన్న నాణ్యత, పెవేట్ బళ్లలో ఉండదు అన్నది మాత్రం నిజమేనండి. అదీ ముఖ్యం గా ఇంకా అక్కడక్కడ గ్రామాలలో స్కూల్లో పంతుళ్లు ఎలా పాఠాలు సెప్తున్నరో కనుక్కొనే వాళ్లు ఉండే చోట అయితే, ఆ బళ్లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కంటే బాంగుటాయి అన్నది,
  ఓ 35 ఏళ్లు పబుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పిన ఓ అయ్యోరి బిడ్డగా నా ఉద్దేశ్యం. ఎవరయినా పబుత్వ పాఠశాలలను ఇలా ఆడిపోసుకొంటుంటే మీ లాగే నాకూ అనిపిస్తుంది, వీళ్లకేమి తెలుసు పబుత్వపాఠశాల గురించి, వాటిలలో ఇష్టంగా పాఠాలు సెప్పే పంతుళ్లు, వాళ్ళకు అందుకు ప్రతిగా ఊళ్లో వాళ్లు ఇచ్చే గౌరవం గురించి అని.

  ReplyDelete
 4. ప్రభుత్వ స్కూలు తల్లి లాంటివి. ప్రైవేటు స్కూళ్ళు సవతి తల్లి లాంటివి. ఇంతకంటే నేనేమీ చెప్పక్కరలేదనుకుంటా!

  ReplyDelete
 5. "46th Round of the National Sample Survey (NSS) had indicated that “lack of interest” by students leads to more dropouts than economic factors; this disinterest, members stressed, is due to the lack of stimulating environments and poor infrastructure in government schools, particularly at the primary level, leading to low interest and thus high dropout rates. Additional factors, such as adverse teacher/student ratios and the
  perceived irrelevance of schooling also affect retention of students.

  Another potential obstacle discussed was the dichotomy between private and public schools in
  terms of school infrastructure, the quality of teachers, and student achievement. Members
  pointed out that only those with adequate monetary capacity are able to send their wards to attend private schools, with superior learning environments."

  ReplyDelete
 6. అయ్యా బాబూ మమ్మల్ని చదువు చెప్పనీయండి మొర్రో అని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. నేనూ గవర్నమెంటు బడిలో అయ్యవారినే. విమర్శలు చేసేవారు ఒక్కసారి ఒక అరగంట మీ సందు చివరన లేదా మీ కాలనీలో ఉన్న ఒక బడికి వెళ్ళండి టీచర్లను చదువు చెప్పనీయకుండా ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో మీకు అర్థం అవుతుంది. ఏ ఈకకు ఆ ఈక పీకే రిపోర్టులు, ఎస్సీలుగా ఎస్టీలుగా నానా రకాలుగా ఖండ ఖండాలు చేసి ఆ రిపోర్టులు రాసే సరికి దేవుడు కనబడతాడు.
  రాజీవ్ విద్యా మిషన్ అని ఒకటి ఉంది. అందులో అపర మేధావులు అందరూ దూరిపోయి, ప్రభుత్వ విద్యను నామరూపాలు లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారు. వారికి పైత్యం ముదిరిపోయి, ఆ అసహ్యాలు తట్టుకోలేక మాకు వాంతులు అవుతున్నాయి. 24 గంటలు పర్యవేక్షణ ఉండే రిషివేలీ లాంటి ఇంటర్నేషనల్ పాఠశాలాల కాన్సెప్టులు కొట్టుకొచ్చి మా బడుల మీద రుద్దుతున్నారు. మంచిదే. అయితే వారు వాటిని సాధిస్తున్న ప్రాక్టికల్ పరిస్థితులకు, మా బడికి వచ్చే పిల్లల పరిస్థితులకు ఎంతో తేడా ఉంది. నిజంగానే ప్రభుత్వానికి అలా పిల్లల్ని బాగుపర్చాలని అనుకుంటే ముందుగా మండలానికి ఒకటి, నగరానికి ఒకటి మోడల్ పాఠశాలల్ని పెట్టాలి. వారికి హాస్టల్ సౌకర్యం కల్పించాలి. అన్నిన్ని నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అనుకుంటున్నారా? రాజీవ్ విద్యా మిషన్ అంటే అరుణాచలం సినిమా. సంవత్సరానికి చచ్చీ చెడీ వచ్చిన నిధులను బిల్లులు వచ్చేలా ఖర్చుపెట్టాలి. రకరకాల రూపాల్లో పాపం వారు చాలా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. అప్పుడప్పుడు సరసాదేవి లాంటి వారి సరసాలు కొసరు.

  ప్రజలకు ఇంగ్లీషు మీడియం మోజు అంతాఇంతా కాదు. ప్రభుత్వ బడులకు పిల్లలు తగ్గడానికి కారణం ప్రతి వీధికి రెండు మూడు ప్రైవేటు పాఠశాలలు ఉండటం. మేమంతా బడుల్లో నిద్రపోతున్నాం అని భ్రమపడి అధికారులు సింపుల్గా ఒక మాట చెప్తుంటారు టీచర్స్ లో చిత్తశుద్ధి లేదండీ అని. నిజమే మా వాళ్ళు అందరూ విరగబడి పనిచేస్తున్నారని చేప్పను. ఎట్లాంటి వ్యవస్థలో అయినా సోమరులు ఉంటారు. కానీ ప్రభుత్వ బడులగురించి ఇలా అనేవారికి ఏమాత్రమైనా ఇంగితం ఉందా అనిపిస్తుంది. మీడియం మోజు ఒక మాస్ మానియా అయింది. మొత్తం ప్రాథమిక విద్యను తెలుగు మీడియం చేయమనండి ప్రభుత్వ బడులు ఎలా మళ్ళీ లేచి కూర్చుంటాయో తెలుస్తుంది.

  మొన్న దిక్కుమాలిన ట్రైనింగులు జరిగాయి మాకు. అక్కద కొందరు అడిగిన ఒకేఒక ప్రశ్న. మన బడుల్లో అవలంబిస్తున్న విధానాలు గొప్పవె అయితే మరి ప్రైవేటు స్కూలు టీచర్లకు కూడా ట్రైనింగులు ఇవ్వండి అని. అంత ధైర్యం విద్యాశాఖకు ఉందా?


  ప్రైవేటు బడుల్లో ఇంగ్లీషు మీడియం అన్నా సరిగ్గా ఏడుస్తున్నారా అంటే కొద్దిగా పేరున్న కార్పొరేటు స్కూళ్ళు మినహాయిస్తే మిగతా అన్ని స్కూళ్ళలో ముప్పావు తెలుగు పావు ఇంగ్లీషు.

  ఇలా చెబుతూ పోతే చాలా అవుతుంది.


  డియ్యేలమీదా, పీఆర్సీల మీద ఉన్న శ్రద్ధను ఉపాధ్యాయ సంఘాలు విద్యావ్యవస్థను బలోపేతం చేయడంపై పెట్టాలి. ప్రాథమిక స్థాయి వరకు తెలుగు మీడియం ఉండేలా కృషి చేసి పిల్లల స్వేచ్చా స్వాతంత్ర్యాలను కాపాడాలి. నిజజీవితంలో పైసాకు పనికిరాని దరిద్రపుచదువులని పిల్లలపై రుద్ది కొన్ని తరాలను అందరూ కలసికట్టుగా నాశనం చేస్తున్నారు. నైతిక విలువలు, సామాజిక బాధ్యత, బాహ్య ప్రపంచం తెలీకుండా వారిని యంత్రాల్లా మారుస్తున్నాము.

  విచిత్రం ఏమంటే ఇంగ్లీషు మీడియంలో ఇంగ్లీషు ఎక్కువ ఉండేది ఒక్క సోషియల్లో మాత్రమే మిగతా అన్నీ టెర్మినాలజీలో కొట్టుకుపోతాయి. ప్రస్తుతం డిగ్రీలు పీజీలు చేసినా ఇంగ్లీషు మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. పాత కాలానికి కేవలం పదో తరగతి చదివినవారు ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడేవారు. సమస్యలు ఇక్కడ ఉంది, మరి మదు ఇక్కడ వేస్తే మొత్తం సర్దుకుంటుంది. ఒక చెయిన్ లాగా. అంటే తెలుగుమీడియం తద్వారా ప్రభుత్వ బడులు బలోపేతం కావడం.

  ఒక వరుసలో లేనట్లు అనిపిస్తే క్షమించండి. బడి అనే పదం కనిపించంగానే ఎంతో అక్కసు వెళ్ళగక్కాలని అనిపిస్తుంది. కాకపోతే నా స్లో టైపింగ్ అందుకు సహకరించదు. ధన్యవాదాలు

  ReplyDelete
 7. అసలు infrastructure అంటే ఏంటి? ఆ డెఫినిషన్ కూడా తెలియాలి కదా?
  ప్రైవేటు పాఠశాలల్లో ఎంత ఎక్కువగా ఉండీ ఈ infrastructure?
  పక్కా భవనాలు, బోర్డు, బోధనావసర పరికరాలు, బోధనా సిబ్బంది, మురుగుదొడ్లు, మంచినీటి సదుపాయలు, ఆటస్థలాలు, ఆటవస్తువులు వీటిని ఇత్యాదివి infrastructure అనుకుంటే -
  మనది పేద-మధ్యతరగతి దేశం, అనగా డెవలపింగ్ దేశం. బేసిక్ నెసెసిటీస్ జీవితాలకే లేవు, ఇక ప్రభుత్వపాఠశాలల్లో అన్నీ వసతులు సదుపాయాలు ఉండాలంటే ఎలా? ప్రభుత్వం పై అన్నిటినీ సమకూర్చాలంటే ఎలా? చాలా బళ్ళలో బోధనాసిబ్బందే లేరు.
  సరే!! ఎన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నాయి పై అన్నీ వసతులు, సదుపాయాలు?
  కావాల్సింది చదువు అని బడికి పంపించే తల్లితండ్రులు, బడికివెళ్ళి మురుగుదొడ్లలో ఏసీ ఉందా అని చూడరు.
  మేము ఎనిమిద్దాకా కిందనే కూర్చుని చదువుకున్నము. మా తండాబడి, దాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రాధమికోన్నత అభ్యుదయ పాఠశాల అంటారు, దాంట్లో దొడ్లే కాదు, మంచినీరు తాగటానికి ట్యాపు కూడా ఉండేది కాదు. బావిలో చేదవేసి తోడుకుని తాగాల్సిందే.
  సరే - మరి వసతులు లేవు, మరి ఇది సమాజ అవసరం కదా? ఎవరైనా ముందుకువచ్చి ఏమైనా సహాయం అందిస్తున్నారా? పక్కాభవనాలు కట్టించిన దాతలు ఉన్నారేకానీ, మిగతా సదుపాయలు అందించటానికి ముందుకొచ్చిన ఒక్కడులేడు.
  మొన్నీమధ్య దగ్గుబాటి వెంకటేశ్ అనుకుంటా ఓ ప్రకటనలో ఇలాచెప్పుకొచ్చాడు - ఆం.ప్ర లో పద్దెనిమిదివేల బళ్ళలో కనీస వసతులు లేవు. ముందుకి రండీ అని.
  చేయదల్చుకుంటే ప్రభుత్వంతో జతచేసి ఏదైనా చేయవచ్చు.
  ఇన్ని అడ్రస్సు చేయాల్సిన విషయాలు పెట్టుకుని బోధనలో నాణ్యత లేదు అని తేల్చేయటం ఎంతవరకూ సమంజసం?

  ReplyDelete
 8. ఇప్పుడు ఇక్కడ తరచుగా ఒక మాట వినబడుతోంది అది కమ్యూనిటీ స్కూళ్ళు. అమెరికాలో పేదా ధనిక తేడాలేకుండా అందరూ ఒకే స్కూలో చదువుతారట కదా ! అలా చేస్తే సమాజ భాగస్వామ్యం పెరిగి స్కూళ్ళు బాగుపడతాయని మేధావుల ఉవాచ. ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు రానంతవరకూ మన తాతల కాలం నాటినుంచి ఉన్నవి అవే స్కూళ్ళుకదా . ఇంతకు ముందు మనం అందరం అలాంటి బడిలోనే చదివం కదా. గడచిన 30 యేళ్ళుగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి, ప్రభుత్వ బడులు నాశనం చేసారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా వల్ల వాటి విలువ తెలిసి వచ్చింది. అయినా ఇదంతా మన బాధ మాత్రమే సార్! నిజంగానే మంచి విద్యను అందించాలన్న తపన ప్రభుత్వాలకు ఉంటే కదా.

  ReplyDelete
 9. బోధనలో నాణ్యత అంటున్నారు. బోధనలో నాణ్యతకు ముఖ్యం అయ్యవారిలో ప్రతిభ. నాకు తెలిసీ బీఎడ్ చేసి డీఎస్సీలో ఎంపికయ్యినవాడు ఎవ్వడూ ప్రైవేటుబడిలోనే పనిచేస్తా నన్ను కాన్వెంటుల్లోనే ఉండనివ్వండి అనడు. అక్కడీ వ్యవస్థ అంతగొప్పదైతే నూటిలో కాకపోయినా కనీసం కోటిలో ఒక్కడైనా అనాలిగా? ఇప్పుడున్న పోటేఎలో డీఎస్సీలో ఉద్యోగం రావడం ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడానికి వెయ్యిరెట్లు కష్టం.
  మరి కాన్వెంటుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ల అకడమిక్స్ ఒకసారి చూడమ్డి. వాల్లకి బీఏడ్లో మెథడాలజీ మార్కులు, లెసన్‌ప్రాఖ్టీసు మార్కులు చూడండి అర్థం అవుతుంది. ఇకవాళ్ల ఇంగ్లీషు నెర్చుకుంటే పిల్లవాడికొచ్చేది 'తాటిమట్టయ్య‌' ఇంగ్లీషే. నాకుతెలిసీ ఈకాన్వెంటు సంస్కృతి తర్వాతే సమాజంలో తెంగ్లీష్, హింగ్లీష్ సంస్కృతి వచ్చిందనుకుంటా.

  ReplyDelete
 10. జీవని గారూ
  మీరు లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవి, ప్రతీ ప్రభుత్వం వాటిపై దృష్టిపెట్టాలి.
  >>ప్రజలకు ఇంగ్లీషు మీడియం మోజు అంతాఇంతా కాదు.
  ఇది మనం అందరం ఒప్పుకుని తీరాలి. అది చేయకుండా బోధనలో నాణ్యత లేదు అనటం అవివేకం.
  >>ప్రభుత్వ బడులకు పిల్లలు తగ్గడానికి కారణం ప్రతి వీధికి రెండు మూడు ప్రైవేటు పాఠశాలలు ఉండటం.
  దీనికి ప్రభుత కఠినమైన పద్ధతలు అవలంబించాలి.
  >>మేమంతా బడుల్లో నిద్రపోతున్నాం అని భ్రమపడి అధికారులు సింపుల్గా ఒక మాట చెప్తుంటారు టీచర్స్ లో చిత్తశుద్ధి లేదండీ అని.
  ఇది కేవలం అక్కసు మాత్రమే. కారణం టీచర్లకు జీతాలు ఇవ్వటం డెడ్ క్యాపిటల్ అనే ధోరణి.
  >> అమెరికా విద్యా విధానం -
  ఇదో పెద్ద టాపిక్కండీ మాష్టారూ. ఊర్కనే అక్కడ కూర్చుని చాలా మంది హా అమెరికా అమెరికా అనుకుంటుంటారు. ఇక్కడ ఉండే సమస్యలు ఇక్కడ. ఇక్కడ ఉండే అడ్వాంటేజీలు ఉండాగా ఉండే డిజడ్వాంటేజీలూ ఉన్నాయి.

  ReplyDelete
 11. అయ్యో జీవని మేష్టారండీ! మీకిక్కడ విషయమ్ అర్ధం కావట్లేదు. అప్పట్లో అందరూకలిసి కూర్చుని చదువుకునేవారు. ఇప్పుడు కూడా అంటే. కాకపోతే ఇది కమ్యూనిటీస్కూలు కాబట్టి చదువుకునేవాళ్లంతా వాళ్లవాళ్ల కమ్యూనిటీలపేర్లను మెడలో బోర్డులా వేస్కుని కూర్చోవాలి. ఏమోవీళ్లలో ఎవరైనా ప్రజాప్రతినిథులైతే ఆపేర్లతో కొట్టుకోవడం రాకపోతే ప్రజాస్వామ్యం నిలబడదుగా? అందుకే ఈకమ్యూనిటీలు

  ReplyDelete
 12. మా గుంటూరు హిందుకాలేజి లెక్కల లెక్చరర్లని గుర్తు చేసారండి. ముకుందరావుగారు హెచ్.ఒ.డి. (మా బంధువులు కూడా), వి.వి.ఆర్. గారు (మా బంధువులు) అలానే జె.ఆర్.కే, కె.ఎస్.ఆర్.కె.లు, ఎ.సి.కాలేజి కోటేశ్వరరావుగారు, సోమయాజులుగారు.
  థాంక్యూ.

  ReplyDelete
 13. సాయికిరణ్ గారూ - ముకుందరావు గారు, *రామరాజు ముకుందరావు*, మా పెదనాయనే [దాయాదులు].
  సోమయాజులు గారు!! హ్మ్!! ఆయన అత్భుతమైన వ్యక్తి. ఎప్పుడూ చిరునవ్వుతో, ముత్యాల్లాంటి అక్షరాలతో, కమ్మని భాషతో....
  కె.యస్.ఆర్.కె గారి అబ్బాయి ఉమామహేశ్వర రావ్ అని కెమిష్ట్రీ లెక్షరర్ హిందూ కాలేజిలో. మంచి వ్యక్తే ఆయనకూడా.
  కోటయ్య మామ అంటాఉ కోటేశ్వరరావు గారిని. :):)

  ReplyDelete
 14. కత్తి మహేష్ కుమార్ గారు - ధన్యవాదలు. చాలా మంచి లింక్ అందించారు. నాకు డిపెప్ అంటే తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా.

  ReplyDelete
 15. నాకు డిపెప్ అంటే తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా.>> ఇదేమిటి మీకు నిజం గా తెలియదా పాజిటివ్ గా తెలియకపోయినా నేగటివేయినా సరసాదేవి , సుబ్రహ్మణ్యం , సూర్యుడు వీళ్ళ గురించి తెలియదా ?

  ReplyDelete
 16. ఇది 1980-1988 సం|| ల నాటి మాట ఆ రోజుల లో గవర్నమెంట్ పాఠశాలలో చదివే టిచర్స్ రిటైర్డ్ ఐతె వారిని వెంటనే భర్తీ చేసేవారు కాదు. అలా మెల్ల గా పాత తరం సిన్సియర్ పంతుళ్ళులందరు రిటైర్డ్ అయ్యారు. మధ్యలో ఈ మధ్య కాలలో ఎవరిని భర్తి చేయ లేదు తరువాత ఎప్పుడో ఎలెక్షన్ టైం లో ఉపాధ్యయులను రికౄట్ చేసుకున్నారు. వారికి ఈ సినియర్ ఉపాధ్యాయులు రిటైర్డ్ కావటం వలన వారి మార్గదర్శకత్వం నేది లేకుండా పోయింది. అదే కాక అప్పుడు రిక్రుమెంట్ లలో అధికార దుర్వినియొగం జరగటం కమిట్మేంట్ లేని వారు చేరటం వలన చాలా దెబ్బతినింది. నా మిత్రుడు ఒకడు టిచర్ గా పల్లేటురి లో పని చెసేవాడు అతను తన సహ ఉపాధ్యయులు తరగతులు పూర్తి కావటం వెంటనే సాయంత్రం బీరును పాఠశాల బయట ఉన్న మందుల దుకాణం లో విధ్యార్దుల ముందే తాగే వారని అలా పిల్లల ముందు తాగితె బాగుండదని ఎంత చెప్పినా వినేవారు కాదు. ఆ టిచర్ల లో చాల మంది కి మంచి భూములు,ఆస్తి పాస్థులు ఉన్నాయి ఈ జితం వారికి మందు కోట్టానికి ఎదుటి వారికి నేను ఒక ఉద్యొగం చేస్తున్నాను అని చెప్పు కోవటానికి మాత్రమే వారు పని చేసే వారని చెప్పేవాడు.

  ప్రతి వ్యాపారంలో రిసెషన్ ఉంట్టుంది ఇప్పటి వరకు పూర్తి రిసెషన్ ఈ విద్యా వ్యాపరం లో రాలేదు. అది త్వరలో వస్తుంది రానున్న 5-10 సం || విద్యా రంగం కుప్ప కూలటం ఖయం. ఊరికే దీని మిద ఉన్న డబ్బు పెట్టి చదవటం వ్యర్థం.

  అసలికి ఈ రోజుల లో పిల్లని ఎవిధం గా తల్లిదండ్రులు పెంచుతున్నరో ఒకసారి ఈ క్రింది వార్తను చదివితె అర్థమౌతుంది. ఒక పెద్దా ఆవిడ తన కూతురిని , ఆ అమ్మాయి స్నేహితురాళ్ళను రాత్రి పూటా ఇంటికి ఆలస్యంగా వస్తె చిన్న పిల్లలు కాదా అనే దృష్టి తో ఆవిడ అన్న మాటలను 10+2 చదివే అమ్మాయిలు సహించ లేక పోయారు. ఈ అమ్మాయిని వారు ఎంత వేదించక పోతే దూకి చని పోయింది. ఈ కాలాం లో అందరికి మహా అయితె ఒకరు చాల కొంతమందికి ఇద్దరు పిల్లలు ఉంట్టున్నారు. వాళ్లూ కూడా ఇలాచని పోతె ఈ తల్లిదండ్రులు కి భర్తకి 40-45 సం || భర్యకి 35-40 వయసు ఉంట్టుంది. వీరు జీవితాంతం పిల్లలు లేకుండా గడపాల్సిందే. ఎందుకంటె ఆ వయసులో వారికి పిల్లలు పుట్టె అవకాశాలు చాలా తక్కువ కదా.
  http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel8.htm

  ReplyDelete
 17. ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు ఒత్తిడి తో కొంతమందిని, కాంపిటేషన్ పేరు తో కొంతమంది జీవితాలను ప్రతి సంవత్సరం నాశనం చేసుతున్నాయి. నాకు తెలిసిన వాళ్లు చాలా మంది తీవ్ర మానసిక వత్తిడులకు లోనై పిచ్చా ఆసుపత్రుల పాలైనారు. ఇక రానున్న రోజులలో తల్లిదండ్రులు పిల్లల ప్రాణాలా లేక వారి చదువులో నిర్ణయించు కోవలసిన రోజు వచ్చెసింది. ఈ సంఘటనలు బయట పడినవి మరి పడనివెన్నొ ఉనంటాయి కదా!!!. నేను రాసింది టాపిక్ నుంచి డివియేట్ చేసే విధంగా ఉంటె నన్ను మన్నించేది.

  ReplyDelete