Nov 6, 2009

డ్రాపౌట్స్ కి కారణం విద్యార్ధుల్లో ఉత్సుకత లేమి ప్రధానకారణమట

National Sample Survey Organisation (NSSO) conducts nationwide sample surveys on various socio-economic issues in successive rounds, each round covering subjects of current interest in a specific survey period. The organisation has four divisions :
(i) Survey Design and Research Division (SDRD)
(ii) Field Operations Division (FOD)
(iii) Data Processing Division (DPD) and
(iv) Co-ordination and Publication Division (CPD)
ఈ NSSO నిర్వహించిన ఒక సర్వే ప్రకారం డ్రాపౌట్స్ కి కారణం విద్యార్ధుల్లో ఉత్సుకత లేమి ప్రధానకారణమట.
మా నాయన ప్రధానోపాధ్యాయుడిగా చేసేప్పుడు డ్రాపైట్స్ పై జరిగిన ఒక సర్వే ప్రకారం కనుగొన్న కొన్ని నిజలు -
తెలుసుకునే ముందు -
అసలు ఈ రోజూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న పిల్లలు ఎవరూ? సింహభాగం బీద బిక్కి, కూలీలు, పేద లోయర్ మిడిల్ క్లాస్, మిగతావాళ్ళు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే తాయిలాలను మిస్ కాకూడాదూ అనుకునే గుంపు. అలానే ప్రతీ సంవత్సరం, కాలంలో మార్పుల చక్రం మనకి తెలుసు. బళ్ళు మొదలైయ్యేది జూన్ మన్నెండు. డ్రై సీజన్. అప్పుడు బళ్ళు కళకళల్లాడతాయి. జులై దాటి ఆగస్ట్ వచ్చేప్పటికి సగం అయి కూర్చుంటాయి బళ్ళు. కారణం, నాట్లు మొదలవ్వటం, కూలలకి గిరాకీ ఏర్పట్టం. వ్యవసాయ కూలీలుగా వెళ్ళేవాళ్ళలో పది నుండి పదిహేనేళ్ళ పిల్లశాతం ఇంత అని పై సర్వే చెప్తే నేను మెచ్చుకునేవాణ్ణి. అలానే పంట చేతికొచ్చే సమయంలో బళ్ళు ఖాళీ.
సర్వే వివరాల్లోకొస్తే -
ఎక్కువ డ్రాపౌట్లకు ఎవరివీ? - పై కూలీల పిల్లలవి.
ఉదాహరణ - మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యమైన పంట మల్లెలు. ఇటు గుంటూరికి అటు బెజవాడకీ మల్లెపూలు మంగళగిరి మండలం నుండే వచ్చేది. పూలు కోసేది ఎవరూ? ఈ పిల్లలే!!
కొంతశాతం - కూలీలుగా వెళ్ళిన తల్లితండ్రుల కుటుంబాలకు పిల్లల్ని చూసుకునే అవసరాలు, బరెగొడ్లు కాసుకొచ్చే అవసరాలు ఇత్యాదివాటికోసం కొంతశాతం మంది పిల్లలు బడికి ఎగనామం పెట్టేస్తున్నారు.

తగ్గించే దిశ -
మధ్యాన భోజన పధకం
పనికి ఆహార పధకం (తల్లితండ్రులకు, సో దట్ పిల్లల సంపాదనపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా)
ఉచిత వసతి
ఉచిత పుస్తకలు
యాట యాట యాట.

NSSO ప్రభుత్వ యాజమాన్య సంస్థ కదా. అందుకని వాళ్ళు నిజాలను కప్పెట్టేసారేమో, ఎందుకంటే “lack of interest” by students అనే పదం లేక స్థితి మనకి లేనె లేదు. అసలు పిల్లవాడికి *నాకు నచ్చలేదు* అనే స్వాతంత్రం లేదు. బడిమానెసే నిర్ణయం పిల్లవాడికి కలలో కూడా అందుబాటులో లేదు. బడిమానేయటం కేవలం తల్లితండ్రుల నిర్ణయం. నిజమైన పరీస్థితులను అందించటం ప్రభుత్వ రంగ పబ్లికేషన్స్ కి కష్టమే. అందుకని సమస్యని ఏ ఉపాధ్యాయులమీదనో తోసేస్తే *ఉపాధ్యాయుల ప్రక్షాళన* అని చెప్పో మరింకో మాటచెప్పో ప్రపంచబ్యాంక్ ఫండ్స్ కొట్టేయచ్చని ప్రభుత్వ పన్నాగం అయిఉండొచ్చుకూడా.

21 comments:

  1. పాతికేళ్ళొచ్చిన తరువాత, మనబాధ్యతలేమిటొ మనకు తెలిసొచ్చిన తర్వాత నెలనెలా జీతం ఒకటోతేదికల్లా పుచ్చుకుంటున్నా, ఆజీతమే మనకి, మనకుటుంబానికి ఆధారం అని తెలిసిన తర్వాత కూడా మనకున్న సెలవుల్ని ఒక్కటికూడా వృధాకాకుండా ప్రణాళికలు వేసుకుంటాం. లోకంలోని ఉద్యోగస్తుల్లో ఎంతమంది ఎప్పుడెప్పుడు తొమ్మిదవుతుందా అని ఎదురుచూసేవాళ్లు ఎంతమంది?
    మరి మనపరిస్థితే అలా ఉంటే ఆవయసులో వాళ్లకి నచ్చట్లేదని చెప్పడంలో ఔచిత్యం ఏవిటి? ఒకవేళ డ్రాపౌట్లకి కారణం అదే అయితే మరిప్రపంచంలోని మిగతాదేశాల్లోని పిల్లల సంగతేమిటి?
    ఎందుకంటే ఇక్కడపిల్లలకు చదువుగురుంచి ఎలా ఆలోచిస్తున్నారో మిగతాదేశాల్లో కూడా అలానే ఆలోచిస్తారు. ఆవయసులో ఏదేశంలో విద్యార్థి అయినా ఒకటే.
    ఏమో నామాటల్లో అర్ధం ఉందో?లేదో? నేనుకొద్దిగా *గందరగోళంలో* ఉన్నా.

    ReplyDelete
  2. అమెరికాలో మహానగరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మైనారిటి డ్రాపౌట్ శాతం డెబ్భై. కారణాలు - నేరప్రవృత్తి, డ్రగ్స్, కొట్లాటలు, గ్రూపిజంస్ ఇత్యాదివి.

    ReplyDelete
  3. భారారా గారూ మీరు నా కడుపు మండించి బీపీ పెంచే ప్రోగ్రాం పెట్టుకున్నట్టు ఉన్నారు. ( సరదాకి )

    ఒకసారి మన బాల్యంలోని పరిస్థితులకు వెళ్దాం. ఒకప్పుడు కులవృత్తులు, వ్యవసాయం నీడన ఎక్కువ మంది ప్రజలు పొట్టపోషించుకునేవారు. ఉద్యోగం అనేది చాలా సిల్లీగా వుండేది. మన తల్లిదండ్రుల తరంలో అటువంటి వారు కోకొల్లలుగా ఉండేవారు. ఒకడి కింద నేను పనిచేయడం ఏమిటని వ్యవసాయం చేస్తున్న వారిని మా పల్లెలో చాలా మందిని చూశాను. వాళ్ల క్వాలిఫికేషన్లతో ఉన్నవారు పెద్ద పెద్ద క్యాడర్లలో రిటైర్ అయిన వారు ఉన్నారు. తర్వాత వ్యవసాయం, కులవృత్తులు నాశనం అయ్యాయి. ఇప్పుడు చదువుల పరమార్థం 100 శాతం కెరీర్ మాత్రమే. డిగ్రీలు డాక్టరేట్లు చేసి తల్లిదండ్రుల మీద ఆధారపడేలా ఉన్న ఈ వ్యవస్థను ఉమ్మి వేయాలి. ఎందుకు కావాలండీ ఈ దిక్కుమాలిన చదువులు. 20 ఏళ్ళు ఏదో ఒక చదువు చదివితే అది నీకు జీవనాధారం కాకపోతే అది ఎందుకు? అదే 20 ఏళ్ళు ఏ ప్లంబింగో కరెంటు పనో చేయగలిగితే వాడు కుటుంబాన్ని పోషించుకో గలుగుతున్నాడు. విద్య యొక్క పరమార్థం మనిషి వికాసం ఙ్ఞాన సముపార్జన, విద్య లేనివాడు వింత పశువు ఇలాంటివి నాకు అసహ్యం అనిపిస్తాయి. ఒకప్పుడు సంపాదనకు అనేక మార్గాలు ఉన్నపుడు అది కరెక్టు. తినడానికి కూడు లేక చస్తున్నవాడిని నాయనా నీవు ఙ్ఞానం సంపాదించడానికి చదువు అని చెబుతున్నారు. ఇవి కడుపు నిండి బలిసిన వారు చేసే వాదనలు.
    కాలం మారింది. ఏ తల్లీదండ్రీ తాము సుఖంగా ఉండి పిల్లలు పనిచేస్తే ఆ సంపాదనతో ఇల్లు నడిపించాలని అనుకోరు. అత్యంత దరిద్రులు నిరక్ష్యరాస్యులు కూడా తమ పిల్లలు తమలా నానా కష్టాలు పడకూడదు అనుకుంటున్నారు. పిల్లలతో భిక్షం ఎత్తించే ఘటనలు అక్కడక్కడా ఉంటాయి. వాటిని వదిలిపెట్టండి. మరి ఎంత దయనీయ పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని పనులకు పంపుతుంటారో ఆలోచించండి.

    ఎండలు మండిపోతున్న ఒక రోజున నా 5 వతరగతి విద్యార్థి పెప్సి ఐస్ అమ్ముతున్నాడు ( చిన్న ప్యాకెట్లలో అమ్ముతారు ). ఆ పసి బిడ్డ ఎండకు ఒట్టి కాళ్ళతో మా బడి ముందే అమ్ముకుంటూ పోతుంటే నా గుండె పిండినట్లు అయింది. ఏమీ చేయలేని నా చేతకానితనానికి సిగ్గు వేసింది. వాళ్ళ నాన్నను అయిదేళ్ళలో ఎపుడూ చూడలేదు. వాళ్ళ అమ్మ కూలి పనికి పోతుంది. నాకు తెలిసి వాళ్ళ నాన్నతో సంబంధాలు లేనట్లు ఉంటుంది. కొసమెరుపు ఏమంటే వాడు క్లాసు ఫస్టు. చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్ళ పిల్లలు వాడి ముందు ఎందుకూ పనికిరారు. వాడి తల్లి సంపాదన సరిపోనపుడు మరి యేమి చేయగలదు?
    బాలకార్మికులు ఉన్నారంటే అది ఈ వ్యవస్థ లోపం. అందుకు విద్యా వ్యవస్థ సిగ్గుతో తల దించుకోవాలి.

    నయాపైసాకు పనికిరాని ఈ చదువులు చదవకుండా, పిల్లలు పని చేస్తే నేరం అట! నేను గతంలో హైస్కూల్లో ఉండేవాడిని 2001 లో నా క్లాసులో హసేన్, హుసేన్ అని కవలలు వుండేవారు. వారు 7 వతరగతి. అప్పుడు డ్రాపౌట్ అయ్యారు. కట్టెపనికి పోయేవారు. ఇప్పుడు వారు సొంత కాళ్ళ మీద నిలబడ్డారు. వారితో పాటు చదివినవారు, చదువుని నమ్ముకుని రోడ్ల పాలయ్యారు. జులాయిగా తిరుగుతూ కనబడుతుంటారు. నాకు తెలిసి పీహెచ్డీలు చేసి ఇళ్ళల్లో ఉన్నవారి కంటే వీరు గొప్ప కాదా?

    పిల్లల్ని దోచుకోకుండా చట్టం తేవాలి. నైపుణ్యం ఉన్న రంగాల్లో పిలలు పని చేస్తుంటే వారిని ప్రోత్సహించాలి. బాలకార్మిక నిర్మూలన అధికారులు అప్పుడప్పుడు మేలుకుని జూలు విదిలిస్తుంటారు. షాపువాడికి జరిమానా వేసి పిల్లవాడిని విముక్తి చేస్తారు. పిల్లవాడిమీద ఆధార పడి ఉంటే ఆ కుటుంబం సంకనాకి పోతుంది. ఇదేనా చేయవలసింది? వాడు కార్మికుడు కావడానికి గల పరిస్థితులను తెలుసుకుని ఆ కుటుంబంలో పని చేసే పెద్దలకు పని కల్పించాలి. అదే చేయగలిగితే పిల్లలు పని ఎందుకు చేయవ్లసి వస్తుంది? మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టినా డ్రాపౌట్లు బాలకార్మికల టాపిక్ పేదరికం దగ్గరకు వస్తుంది. మాకు అనవసర ట్రైనింగులు వాటికి అవసరమయ్యే పుస్తకాల ప్రింటింగులు అన్నీ ఆపేసి వాటిని పేదరిక నిర్మూలనకు ఫేజుల వారీగా ఖర్చు పెట్టినా బావుంటుంది. అయినా ఇవన్నీ ఎవడికి కావాలి?

    ReplyDelete
  4. మామూలుగా డిగ్రీలు పీజీలు చేసినవారికి ఈ విద్యావ్యవస్థ ఏమి ఇవ్వగలుగుతోంది? చేతికి చిప్ప.
    మరి నిజంగా చేయాలనుకుంటే ఏమి చేయవచ్చు? 6 వతరగతి దాటిన తర్వాత వాడి చదువును బట్టి వొకేషనల్ ట్రైనింగు ఇవ్వాలి. 10 వతరగతి అయ్యేసరికి వాడికి చదువు రాకపోతే ప్రత్యామ్నాయంగా పొట్టపోషించుకునే నైపుణ్యాన్ని ఇవ్వాలి. బాలకార్మికులు ఏపని చేస్తుంటారో వాటిలోనే త్రైనింగు ఇవ్వమనండి. పిల్లవాడు ఏతరగతిలో డ్రాపౌటు అయినా వాడు సొంత కాళ్ళమీద నిలబడాలి. చదువురాక వాడు ఏడుస్తుంటే వాడికి పరమాణు నిర్మాణాలు, త్రికొణమితులు చెప్పడం ఏమైనా సమంజసమా? వాడు చచ్చేవరకు పరమాణు నిర్మాణంతో ఎప్పుడూ అవసరం రాదు. బాగా చదివేవాడికి మాత్రమే ఈ చదువులు. చదువురాకపోతే అన్ని రోజులు చదివింది వేస్టు.

    ఇంకా రాయాలి నిద్దరొస్తోందండీ. మళ్ళీ అయినా రాస్తాను.
    ఈ దిక్కుమాలిన విద్యావ్యవస్థను బండబూతులు తిట్టీ తిట్టీ ఇప్పుడు ఒక ప్లాటూ స్టేజి వచ్చింది.

    ReplyDelete
  5. జీవని గారూ - మీ బాధ నాకర్ధమయ్యింది. అలా కసి కోపం ఉండాబట్టే పై పోస్టు రాసాను.
    చేతివృత్తుల మీద ట్రైనింగులు, వకేషనల్ కోర్సుల మీద నెర్పే సంస్థలు చాలా ఉన్నాయండి. కొన్నిటికి సరిన *మార్కెటింగు* విధానం లేదు. ప్రతీ మండలానికి ఒక హ్యూమన్ రిసోర్సెస్ డిపార్టుముంటు ఉందనుకుంటా. అవి పనిచేతున్నాయో లెదో తెలియదు. వాటి గురించిన సమాచారం ఎవ్వరివద్దా ఉండిఉండదు కూడా బహుశా. ప్రతీ ఊరికీ ఓ చేతివృత్తుల అధ్యయన కేంద్రం ఉంటే బానే ఉంటుంది కానీ ప్రభుత్వం వద్ద అన్ని వనరులు, అంత పెట్టుబడీ, జనాల్లో అంత తీరిక మరియూ కోరికా లేవు.
    ఇక 10 వతరగతి అయ్యేసరికి వాడికి చదువు రాకపోతే ప్రత్యామ్నాయంగా పొట్టపోషించుకునే నైపుణ్యాన్ని ఇవ్వాలి - పదోతరగతి అనేది ప్రతీదానికీ కనీస అర్హత పరీక్ష. ఐ.టి.ఐ లు ఉన్నవి ఇలాంటి శిక్షణ ఇచ్చేందుకే కదా?
    >>బాగా చదివేవాడికి మాత్రమే ఈ చదువులు. చదువురాకపోతే అన్ని రోజులు చదివింది వేస్టు.
    హ్మం!!! ఇది నిజమే కాస్త కఠోరంగా ఉన్నా సత్యం.

    ReplyDelete
  6. జీవని గారు మీరు చెప్పింది అంత బాగుంది. తప్పకుండ చదువుతో పాటు లైఫ్ గురించి కూడా పిల్లలకి వివరించాలి. మీరు చెప్పిన ఉదాహరణ లో తల్లికి సహాయ పడే అబ్బాయినే తీస్కోండి, అతను అవసరానికి చేస్తుంటే జాలి పడుతున్నాం. కానీ అవసరం లేకున్నా అలా కష్టపడటం ప్రతి ఒక్కరికి తెలియాలి అనుకొంటున్నాము. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మరి :)

    మనం బాగా చదివే వాళ్ళు ఇంటర్ తర్వాత లైట్ తీస్కోడం, ఇంటర్ వరకూ మామూలు గ చదివేవారు ఇంప్రూవ్ అవ్వడం ( టర్నింగ్ పాయింట్ అనే వారు) కోకొల్లలు. క్లాసు లో ౩౦ స్టూడెంట్స్ ఉన్నట్లే, బాగు పాడటానికి ఒక ౩౦ ప్రొఫెషన్ లు ఉన్నాయి.అవన్నీ స్కూల్ లో చెప్పలేరు అని నా భావము.

    ReplyDelete
  7. ఇది చూడండి.. http://www.barefootcollege.org/
    ఇక్కడ వెనకబడిన దేశాల నుండి మహిళలు వచ్చి శిక్షణ పొందుతున్నారంట. కాని మన దేశంలో ఎవరికీ దీని గురించి తెలీదు. పబ్లిసిటి కోసం విదేశాల్లో కాన్సులేట్ లలో పోస్టర్లు పెట్టారు (నేను రెండేళ్ళ క్రితం బెర్న్ లో చూశా). జీవని గారు చెప్పినట్టు ఇలాంటి వాటిల్లో శిక్షణ ఇప్పిస్తే 10వ తరగతి తప్పిన వాళ్లు వాళ్ల కాళ్ళ మీద వాళ్లు నిలబడగలుగుతారు.

    నేను మా ఊరినుండి కొంతమందిని పంపిద్దామని అడిగితే ఎవరిలోను కదలిక లేదు. నా వల్ల కాదులే అని వదిలేశా.

    నిన్నటికి దీని గురించి ఈనాడులో వసుంధరలో వచ్చింది. కనీసం దాన్ని చూసి ఎవరన్నా స్పందిస్తారొ లేదో.


    ఈ వ్యాఖ్య ఈ టపాకి సంబంధం లేనట్టు అనిపిస్తే క్షమించండి.

    ReplyDelete
  8. మౌళి గారూ అలా అవసరం లేకుండా పనిచేసేవాళ్ళూ ఉంటారు. అది తక్కువ అని చెబుతున్నాను. మన పిల్లల్ని అయినా మనం పని చేయించాలని అనుకోము కదా. అదీ తల్లి ఎలా అనుకుంటుంది? నేను చెప్పిన కేస్ లో కచ్చితంగా పేదరికమే.

    మీరు చెప్పినట్లు మధ్యలో అటూ ఇటు అయ్యేవారు ఉంటారు. అయితే అది యావరేజి పిల్లల విషయంలో ఎక్కువ జరుగుతుంది. పూర్తి చదువు రానోడు అలా జరిగి గొప్ప స్థాయికి పోవడం అక్కడక్కడా ఉండొచు అయితే మెజారిటీ మాత్రం కాదు. ప్రతి విషయంలోనూ ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి కదా. నేను చెబుతున్నది చదువు ఒంటబట్టని వాళ్ళ గురించి.

    వాడికి బుద్ధి వుండి చదువుకోవాలి అని మనం అనలేము. మనిషి ప్రతిభకు చదువు మాత్రమే కొలమానం కాదు కదా!

    ReplyDelete
  9. జీవని,
    బాల కార్మికుల పరిస్థితి గురించి బాగా చెప్పారు. ఏ టీ కొట్లోనో పని చేసే పిల్లల్ని దారే పోయే దానయ్య దయా హృదయ ఫిర్యాదు ఆధారంగా విడిపించడంలో ఈ అధికారులు శ్రద్ధ చూపిస్తారు కానీ, తర్వాత పునరావాసానికి కానీ, స్కూలు కు పంపే విషయం గానీ ఏమీ ఆలోచించరు. వాళ్ళు ఇక్కడ పని మానేసి వేరే చోట ఇంకా తక్కువ పనికి చేరే సంఘటనలు బోలెడు.

    ఒక్కోసారి ఇలా విముక్తి పొందిన పిల్లలకు పని కూడా దొరకదు. పిల్లల బాధ్యత పూర్తిగా తీసుకోగలిగితేనే అధికారులు విముక్తి కార్యక్రమాలు చేపట్టాలి. లేదా వారికి కష్టం తెలీని చిన్న చిన్న ఒకేషనల్ పనుల్లో శిక్షణ అయినా (వయసుని బట్టి) ఇప్పించాలి.దీని గురించి ఏమీ చేయలేమా?

    ReplyDelete
  10. .Child-Friendly Schools and learning spaces
    work to strengthen families by establishing vital relationships with communities and teachers.Because the family unit and the school are two of the most important influences for children, engaging parents and caregivers in activities and decisions and mobilizing communities are crucial to establishing schools that function effectively.

    • Child-Friendly Schools promote quality teaching and learning processes that include gender-sensitive,individualized instruction, and
    support the abilities of teachers to apply active,cooperative and democratic learning methods.

    • Child-Friendly Schools encourage gendersensitive learning by providing a secure and intellectually challenging educational setting for both girls and boys. This learning encompasses personal empowerment and social responsibility.
    It also ensures that children are provided with
    relevant and flexible gender-responsive curricula,as well as professionally capable and committed teachers.

    • Child-Friendly Schools promote a healthy,
    safe and protective environment for children’s
    emotional, psychological and physical wellbeing,
    including school-based health and nutrition services, life skills and provision of
    water and sanitation facilities. In addition, these schools enforce policies that guarantee children’s safety and protection from violence and harassment.

    ReplyDelete
  11. సరిగ్గా చెప్పారు. ఈ విషయం నా అనుభవం కూడా.

    ReplyDelete
  12. సుజాత గారూ,

    పిల్లల పునరావాసానికి ఒక పథకం మన ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంది. వాటిని రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సు స్కూళ్ళు అంటారు. శవాల మీద మరమరాలు ఏరుకునే ఈ వ్యవస్థలో వీటి నిర్వహణ ఒక పెద్ద బోగస్. 10 మంది పిల్లలు ఉన్నారంటే 100 మందిని చూపుతారు. ఇదో పెద్ద వ్యాపారం మళ్ళీ. ఇక్కడా వాటిని నిర్వహించేది, స్వచ్చంద సంస్థలు కావడం దురదృష్టకరం. వున్న కొద్ది మంది పిల్లలకు సరిగ్గా తిండి పెట్టి చావరు. ఆ మధ్య వాటికి ఎవరైనా అప్ప్లై చేసుకొండని నోటిఫికేషన్ చూశాను. మా మిత్రుడు ఒకరిని అడిగాను. జీవని తరఫున అప్లికేషన్ వేద్దామా అని. అంత పని చేయవద్దు. నీకు అది సరిపడనిది. అది గలీజు వ్యవహారం అని సలహా ఇచ్చాడు. ఇక చెప్పండి. ఎక్కడికి ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళనం అవుతుంది?

    మహేష్ గారూ,

    పిల్లల్ని ముందుగా - చదివే యంత్రాలుగానూ, భవిష్యత్తులో డబ్బులు సంపాదించే సాధనాలుగానూ చూస్తున్న తల్లిదండ్రులలో మార్పు రావాలి. ఇంతింత టెన్షన్లు పెట్టి పిల్లల్ని చదివించే అవసరం లేదు అని ఒక్కసారి వాళ్ళు తెలుసుకుంటే కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల పునాదులు కదులుతాయి. మీరు చెప్పిన వాతావరణం పాఠశలల్లో సృష్టిస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ అది 100% అసాధ్యం మన వ్యవస్థలో.

    ReplyDelete
  13. వినటానికి కొంచం హైపోథెటికల్ గా అనిపించినా గురు కులాలు కావాలేమో మనకు. విధ్యార్ధి ఆసక్తి, తెలివి వెసులు బాటు ని బట్టి ఎవరికి ఏది అవసరమో ఎంత వరకు అర్హులో అంత వరకు నేర్చుకుంటారు.. కాని అలా నిర్దేశం చేసే గురువులు లేరు కదా. మన బ్రిటీష్ విద్య విధానం ఇంకా క్లర్క్ లను తయారు చేయటం కోసం నెహ్రూ వంటి మేధావుల తో కలిసి మరి రూపొందించిన విధానం కదు మన విద్యా విధానం అంత తొందర గా మార్పు వస్తుందా?
    సుజాత: అలా పని చేసే బాల కార్మికులను ఆపెయ్యటం అసంభద్దమేనంటారా.. మీరు చెప్పిన వెసులు బాటు ను అడ్డం గా పెట్టుకుని బాల కార్మికులను ఎక్స్ ప్లాయిట్ చెయ్యటం లేదంటారా?

    నేను మొన్నీ మధ్యన ఇక్కడ టీవీ లో ఒక ముల్టీ మిలియనీర్ ఫార్త్యూన్ 100 కంపెనీ ల లో వున్న అతని ఇంటర్వ్యూ చూసేను అతను మనకు లానే బాధ పడుతున్నాడు, 12 వ తరగతి అయ్యే సరికి మా కాలం లో ఒక సగటు విధ్యార్ధి కి ఇల్లు కట్టటం లో ముఖ్యమైన పనుల నుంచి, ప్లంబింగ్, ఎలెక్ట్రిక్ పని వంటి వృత్తి విద్యలలో నిపుణుడై వుండే వాడు ఇప్పుడూ కార్ లో ఆయిల్ మార్చాలన్న రాదు ఇంట్లో ఒక చిన్న తలుపు బిగించాలన్నా రాదు. ఎందుకు పనికొస్తారు యువతరం అని. ఎంత చదివి ఏమి వుపయోగం అని.
    మహేష్: ఈ Child-Friendly స్కూల్స్ ఏమిటీ ఇండియా లో అమలు లో వున్నాయా ఇవి అన్ని?

    ReplyDelete
  14. భావన గారూ నైపుణ్యం సంపాదించే పనుల్లో పిల్లలు చాకిరీ చేసినా వాళ్ళకు అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా? హోటళ్ళలో ప్లేట్లు కడగడం వంటి వాటిలో పిల్లల్ని నిషేధించాలి. ఒక వేళ కుటుంబం ఆ పిల్లవాడి సంపాదనపై కూడా ఆధారపడే పరిస్థితి ఉన్నపుడు ఎక్స్ ప్లాయిటేషన్ భరించక తప్పదు. నేను బాల కార్మికులను సపోర్ట్ చేయడం లేదు. పసిపిల్లలు పని చేయడం నేరమే. అయితే ప్రాక్టికాలిటీ చాలా వేరు. మాకు నిత్యం ఈ అనుభవలు తగులుతూనేఉంటాయి. రోజూ కూడు తినడమే గగనం అయినప్పుడు మరి మార్గం ఏమిటి ?

    ReplyDelete
  15. ప్రతి మనిషి కి కనీస విద్యార్హత పదవతరగతి వరకు ఉండితీరాలి అనుకుంటాన్నేను.కనీసం తనకి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవడానికయినా ఇది అత్యవసరం..

    కానీ క్లర్కు ల దిశ గా సాగుతున్న విద్యావిధానం లో చాల వరకు లోపాలున్నాయి. పదవతరగతి దాటగానే ప్రత్యామ్నాయంగా చేతివృత్తులు , జీవనోపాధి దిశగా ప్రభుత్వం చాల షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెట్టింది. వాటిల్లో ,
    Dairy Cattle farms/Fish
    farm/Government/University farms/Small medium Bakeries/Food Craft
    Institutions/Home science Colleges
    /Food catering Institution/Beauty
    parlors Hotels/ Garment Units/CMC
    ATC/Setwin. లాంటివి దాదాపు యాభయి ఏడు కోర్సులున్నాయి...ఇక్కడ చార్జీలు కూడా చాల తక్కువ. బహుశా పైన చెప్పినట్లు మార్కెటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది ప్రజల లోకి వెళ్ళలేక పొతోంది.

    ReplyDelete
  16. అన్వేషిత గారూ మీ ఆలోచన కరెక్టే, మనిషికి కనీస విద్య అవసరం. కానీ చదువులకు ప్రాక్టికాలిటీ అవసరం. పదో తరగతి వరకు చదివితే వాడికి లోకఙ్ఞానం వస్తుందని మీరు భావిస్తున్నారు. చదువులు రెండు స్ట్రీముల్లో సాగాలి. బగా చదివే వాళ్ళు ఇదే సిలబస్ లో సాగుతారు. పూర్తి అధమ స్థాయిలో అంటే సున్నాలు ఒకటి రెండు మార్కులు వచ్చేవారిని 7 వతరగతి నుంచే ప్రధాన స్రవంతి నుంచి తప్పించాలి. వారికి జీవితంలో అవసరం అయ్యే చదువు నేర్పించాలి. కిరణజన్య సమ్యోగ క్రియలు, ఐరోపా ఎగుమతులు దిగుమతుల గురించి వాళ్ళకు చచ్చే వరకు జీవితంలో అవసరం ఉండదు. ఇక్కడ సున్నాలు వచ్చినవాడు భవిష్యత్తులో వంద తెచ్చుకోవచ్చు అనేవారు ఉంటారు. జైళ్ళలో అందరూ దోషులు లేనట్లే ప్రాబబిలిటీ తీసుకుంటే పిల్లలకు న్యాయమే జరుగుతుంది. విద్యా విధానం ఇలా ఉండాలని నా అభిప్రాయం.

    ప్రభుత్వ ఒకేషనల్ కోర్సులు మంచివే. అయితే పదో తరగతి వరకు హింసను భరించలేక వెనుకబడిన పిల్లలు అసలుకే చదువు మానేస్తున్నారు. దీన్ని 7 వతరగతికి మార్చాలి. అదీ కాక వీటిలో సగం పనుల్లో బాలకార్మిక వ్యవస్థ ఇప్పటికే వర్దిల్లింది.

    మన చదువులు నిజ జీవితంలో ఎంత శాతం ఉపయోగపడుతున్నాయి? రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు, ఇతర అధికారిక కార్యాలయాల్లో మనం ఎంత చదువుకున్నా ఓనమాలు మాత్రమే చదువుకున్న బ్రోకర్ గాళ్ళ చేతుల్లో మనం మోసపోతాము. రోజువారీ జీవితంలో తెలుగు, ఇంగ్లీషు చదివి అర్థం చేసుకోడానికి మాత్రమే మన చదువులు నిజానికి ఉపయోగపడుతున్నాయి. అందుకే సిలబస్ మొదలుకుని మొత్తం విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. కానీ ప్రక్షాళన కథ దేవుడెరుగు పిల్లల్ని ఈ చదువులు రాచి రంపాన పెట్టి వాళ్ళ సృజనాత్మకతను నాశనం చేసి, భవిష్యత్ ఉత్తమ యంత్రాలను తయారు చేస్తున్నాయి.

    ReplyDelete
  17. Hey look I can copy patse:

    http://www.ingfoundation.com.au/UNICEF-Pacific-Education-Project-Update-Feb09.pdf

    http://www.unicef.org/devpro/files/Child_Friendly_Schools_Manual_EN_040809.pdf

    Hey bhaskar, take this tip from me. Learn copy paste, and pass that off as your own. People around here are so dumb that no one will figure what is happening.

    I Love Google**

    ---

    **conditions apply

    ReplyDelete
  18. http://www.unicef.org/jamaica/CFS_info_sheet.pdf

    Now thats the exact source. This time I loavvve google. lufff google, unconditionally!

    ReplyDelete
  19. Knowledge comes out of learning from "available sources". Government programme such as SSA and UNICEF's policy recommendations are not my figment of imaginations. They are available out there to learn.I am only making relevant available for this discussion available here.

    ReplyDelete
  20. correct gaa chepparandi raju gaaru......

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete