Feb 13, 2009

TV99 నిరంతర వార్తాస్రవంతి

మనం రోడ్ మీదవెళ్తూ ఉంటాం. ఒక కుక్కపిల్ల కాలువిరిగి కుంటుtUతుంది.
మనకి టైంఉంటే ఆగి దానికి ఏమికావాలో చూస్తాం, లేదు అంటే అయ్యోపాపం అని జాలిపడి వెళ్ళిపోతాం..
అదే TV99 రిపోర్టర్ ఏంచేస్తాడూ?
వెంటనే Tv99 ఆఫీసుకి ఒక ఫోన్ వెళ్తుంది, ఒఫీసోడు కెమెరామన్ ని పంపుతాడు.ఇక మొదలు ........
కృష్ణా ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?
ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుతుంది ......రాధా
అక్కడి వాళ్ళు ఎమన్నా చెబుతున్నారా?...కృష్ణా
రాధా...ఇక్కడి వాళ్లు ఇది ఒక మంచి కుక్క అని , దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా గతంలో ఈకుక్క ఈ ఏరియా లో ఇలా కుంటలేదని , ఇదే తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు. ......రాధా
కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది ? .....కృష్ణా
కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న . ఈ విధంగా కాలుకు దెబ్బతగలటం కొత్త అనుకుంట, అందుకే కున్టటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటానికి ప్రయత్నిచిన అది సమాధానం చెప్పకుండా మూలుగుతూంది ......రాధా
థాంక్స్ కృష్ణా , ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తూ ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ అందించిన వివరాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ .. తర్వాత కుక్కలు - కుంటుడు అనే అంశం పై చర్చింటానికి ప్రముఖ డాక్టర్ కుక్కుటేశ్వర రావు గారు మన స్టూడియో కి వస్తున్నారు.
బ్రేక్ .. తర్వాత
కాంత్ : చెప్పండి కుక్కుటేశ్వరరావుగారు గతంలో మీరుఎప్పుడైనా ఇలా కుక్కలు కుంటటం చూసారా? ఒక వేళ చూస్తే ఏ జాతి కుక్కలు కుంటటం చూసి ఉంటారు.
కుక్కుటేశ్వర రావు : ఈ విదంగా కుక్కలు కున్టటం ఇది మొదటి సారికాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లో ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయ్. కుంటటానికి జాతితో సంబంధం లేదు.
కాంత్ : అంటే కుక్కలు కుంటేప్పుడు వాటికి ఎమన్నా బాధ ఉంటుందా? ఉంటే ఎటువంటి బాధ ?
కుక్కుటేశ్వర రావు : బాధలో రకాలు ఉండవండి . కుంటేప్పుడు జనరల్గా దెబ్బ తగిన కాలుకి నొప్పి ఉంటుంది అని కుక్కల మెడికల్ సైన్సులో గట్టి ఆధారాలు ఉన్నాయ్.
కాంత్ : తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ చెప్పండి ..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.
కృష్ణ : (చెవిలో చివిమిషను పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు )
కృష్ణ చెప్పండి ..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది?
కృష్ణ : కాంత్ కుక్క మూలుగుతుంది , ఇప్పుడే బ్లూ క్రాస్ వాళ్ళు దానినితీసుకు వెళ్లారు.
కాంత్ : కుక్క కాలుకి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నాయ్ ?...కృష్ణా
కృష్ణ : కాంత్, కుక్క కాలుకి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకరగా ఉంది.
కాంత్ : వంకర అంటే ఎలా ఉంది ...కృష్ణ (ఇప్పుడు కాంత్ మొహంలో ఎప్రెషన్ ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ని ధ్వంసంచెయ్యటానికి వెయిట్ చేస్తున్న సోల్జెర్ర్ మొహంలో తప్ప)
కృష్ణ : కాంత్ వంకరగా అంటే చుట్టుకుని ఉంది, నేను అప్పటికి దానిని చక్కగా చెయ్యటానికి ట్రై చేస్తున్న కాని అది చుట్టుకుపోతోంది. బహుశా కాలుకి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దేశం.
కాంత్ : థాంక్స్ కృష్ణ ....కుక్కుటేశ్వర రావు గారు, కాలుకి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి కృష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?
కుక్కుటేశ్వర రావు : స్పందన అంటే ఏమి ఉంటుందితరా వెధవా...కుక్క కాలుకి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంటిరా దేడ్ దిమాక్గా. ఏం మనిషివి రా నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచిన ఆన్సర్లు చదివాను, ఇంక నా వల్ల కాదు , నా టీ మరిగిపోతూ ఉంటాయి. బంగారం లాంటి కొండయ్య అనే పేరు మార్చి కుక్కుటేశ్వర రావు అని మార్చి, షర్టు ప్యాంటు రెంట్కి తీసుకు వచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ నటించాలా? అల నటిస్తే నా టీ కొట్టు నుంచి ఎదురుగా ఉన్నా మీ TV99 ఆఫీసుకి రోజు 100 టీ ఆర్డర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందారా ఎదవ .. ఇలా తిడుతూ ఉండగానే, TV99 లోగో వచ్చి, మెరుగైన సమాజం కోసం చూసిచస్తూనే వుండండి TV99 అని వొచ్చి యాడ్స్ రావటం మొదలైంది..

నా మితృడు పంపిన మెయిల్ ఇది...:):)

9 comments:

  1. హహ్హ..బాగున్నది కుక్కుటేశ్వర ప్రసంగం...:)..

    ReplyDelete
  2. ఈ చానల్లో వార్తలు ఇంతే. I reclaimed my life by not viewing TV :)

    ReplyDelete
  3. ఈ మధ్యనే విశ్వామిత్రుల వారి మరోప్రపంచం లో చదివాను ఇదే పోస్ట్.

    ReplyDelete
  4. ముందుగా కామెంటేసిన అందరికీ ధన్యవాదాలు!!
    రెండు ఇది నేను సొంతగా రాసింది కాదు. కాబట్టి కంటెంటు కాపీ చేసినదే.
    మూడూ!! నా సోదరుడు పప్పుయార్ ఇది ముందేరాశాడని నాకు తెలియకపోయినా, ఇద్దరం ఒకలా ఆలోచిస్తున్నాం అని తెల్సినందుకు ఆనందంగా ఉంది. పప్పుయార్ - ఇదిగో ఓ థంసప్...

    ReplyDelete
  5. "బంగారం లాంటి కొండయ్య అనే పేరు మార్చి కుక్కుటేశ్వర రావు అని మార్చి, షర్టు ప్యాంటు రెంట్కి తీసుకు వచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ నటించాలా?" హ్హ హ్హ హ్హ బాగుంది.

    ReplyDelete
  6. కుక్కుటేశ్వర రావు : స్పందన అంటే ఏమి ఉంటుందితరా వెధవా...కుక్క కాలుకి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంటిరా దేడ్ దిమాక్గా. ఏం మనిషివి రా నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచిన ఆన్సర్లు చదివాను, ఇంక నా వల్ల కాదు , నా టీ మరిగిపోతూ ఉంటాయి. బంగారం లాంటి కొండయ్య అనే పేరు మార్చి కుక్కుటేశ్వర రావు అని మార్చి, షర్టు ప్యాంటు రెంట్కి తీసుకు వచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ నటించాలా? అల నటిస్తే నా టీ కొట్టు నుంచి ఎదురుగా ఉన్నా మీ TV99 ఆఫీసుకి రోజు 100 టీ ఆర్డర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందారా ఎదవ .. ఇలా తిడుతూ ఉండగానే, TV99 లోగో వచ్చి, మెరుగైన సమాజం కోసం చూసిచస్తూనే వుండండి TV99 అని వొచ్చి యాడ్స్ రావటం మొదలైంది..
    saar mee tv99 chaala bavundhi

    ReplyDelete