Feb 23, 2009

రుద్ర హోమం

ఈరోజు అనగా ఆదివారం, 23 Feb, మా ఊళ్లో శివరాత్రి చేసుకున్నాం. మా గుళ్లో ఈరోజు చాలా కార్యక్రమాల సమాహారం సిద్ధం చేసారు.

పొద్దున్నే ఆరుకే కార్యక్రమాలు మొదలు.
8-11 గణపతి హోమం
11-1 రుద్ర హోమం
దేనికి వెళ్దాం అని ఊగిసలాడి, రుద్ర హోమానికి వెళ్దాం అని నిర్ణయించి, కారు తీసా. సరిగ్గా పదకుండింతికి చేరుకున్నా. మాకు గుడి చాలా దూరం, రెండు మైళ్లే. వెళ్లేసరికి హడావిడిగా ఉంది గుడి. అయ్యవారికి అలంకరణ అవీ ఇవీ, కలశపూజా అన్నీ అయ్యాయి. ఇక, హోమానికి మొదలుపెడుతున్నారు. భాస్కరా, రా కూర్చో అన్నారు పూజారి గారు, కోఆర్డినేటరు శాస్త్రిగారు. అందరూ మనకి తెలిసినవారే.
ఇక కార్యక్రమం మొదలు. నా జీవితింలో రుద్రహోమం చెయ్యటం ఇదే మొట్టమొదటి సారి. బ్రహ్మాండంగా జరిగింది. రుద్రంలోని ప్రతీ మంత్రంతో ఇలా -
ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ:
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమ: స్వాహా"
అంటూ హోమం చెయ్యటం, ఆ మంత్రోఛారణలో నా గొంతూ కలవటం, అయ్యాక, అందరం ముక్తకంఠంతో వెయ్యిఎనిమిది సార్లు శివబీజాక్షరీ జపించటం మరోవైపు ఆమంత్రతోఛారణతో హోమం, అయ్యాక, పూర్ణాహుతి, మహా మంత్రపుష్పం, శాంతిమంత్రం. నారోమాలు నిక్కబొడుచుకున్నాయి ఈరోజు.
ఇదంతా నా ఆర్.సి.యే వాయిస్ రికార్డర్లోకి రికార్డ్ చేసా. కానీ ఎందుకో సరిగ్గా రికార్డ్ కాలా. చివరకొచ్చేసరికి బ్యాటరీ అయిపోయింది. అందరితో పంచుకుందాం అనే నా ఆనందంమీద నీళ్లు జల్లిందీ వాల్మార్టు సరుకు.
ఏమైనా, చాలా తృప్తిగా ఉందీరోజు.
నా ఫోనుతో తీసిన హోమ గుండం ఇక్కడ పెడుతున్నా.




మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ భోళాశంకరుని చల్లని చూపులు మనందరిపై ఉండాలని కోరుకుంటా.

గమనిక:- http://www.geocities.com/yajur.veda/ ఈ లింకులో రుద్రం స్వరసహితం లభిస్తుంది.

6 comments:

  1. మీకు,మీ కుటుంబానికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మీకు,మీ కుటుంబానికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మంచి అనుభవం! శివరాత్రి శుభాకాంక్షలు మీకూనూ.

    ReplyDelete
  4. మీకు,మీ కుటుంబానికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు

    ReplyDelete