Feb 8, 2009

స్వేఛ

ఈ ప్రపంచంలో ప్రతీవోడు స్వేఛా ప్రాణే, పక్కనోళ్లకి ఇబ్బంది కలగనంతవరకూ. పక్కనోళ్లకి ఇబ్బందికలుగుతుంది అని తెల్సినా, వాళ్లని ఇబ్బంది పెడదాం అనే స్వేఛ ని స్వేఛ అనం. దానికి దాని "డిగ్రీ" ని బట్టి పేర్లుపెడతాం. నేనో స్వేఛా జీవిని, కాబట్టి పాకిస్థాన్ వెళ్తా, టెర్రరిజం నేర్చుకునివచ్చి నీ స్వేఛని "తెలిసి" హరిస్తా, నీ మీద బాంబేస్తా అనేది "తీవ్రవాదం". నేను బలవంతుణ్ని, నేను మాత్రమే స్వేఛని అనుభవించాలి నువ్వు నా కాలికింద పడుండాలీ అనే స్వేఛ "బలుపువాదం". నక్సలైట్లు ఇట్టాంటోళ్లని కుక్కల్ని కాల్చినట్టు కాల్చారు మన చరిత్రలో.
ఐతే ఇక్కడ పాయింటేంటాంటే, నా బ్లాగు నాఇష్టం, నాకు స్వేఛ, నా ఇష్టంవచ్చినట్టు రాస్తా. రాస్కో, ఎవడొద్దంటాడు. రాస్కో, పలనావాడు ఎదవ - అది నీ ఉద్యోగం కాదు, నీకు సంబంధించిది కాదు.
పలానా ఆమె అప్పడాలుచేస్కుని అమ్ముకుంటుంది - అది నీకనవసరం.
బ్లాగుల్లో గుంపులున్నాయ్ - అవును, ఉంటే నీకేంటి, నీపని నువ్వుజూస్కో.
ఒకళ్లనొకళ్లు ముఖాముఖీలు జేస్కుంటున్నారు - చేస్కోనీవయ్యా? చేస్కోనీ.
ఆమె కధ రాసింది - నీకు ఇష్టమైతే చదువు, లేకపోతే, కుడిచెయ్యి వైపు పైన ఒక "x" ఉంటుంది అది నొక్కు, మూస్కుంటుంది నీ బ్రౌజరు.
ఇంత చిన్న విషయానికి వ్యక్తిగతంగా బూతులు దేనికి?

ముక్కుసూటిగా మాట్టాడ్టం అంటే నోటికి మెదడుకీ సంబంధంలేకుండా మాట్టాట్టం కాదు. నిజాయితీ అంటే నీలో నిజాయితీ అని, సమాజంలో నిజాయితీ అనికాదుగా. ముందు నువ్వు నిజాయితీ పరుడివాకాదా అనేది తెల్సుకో. నీ నిజాయితీ ఎంటో చెప్పు. పక్కనోడు ఒంటేలుకెళ్లి ఏంజేసాడో నీకుదేనికి? అంటే దొంగతనంగా చూస్తున్నావా? దాన్నే నిజాయితీ ఆంటారా? భజన పరులను నీ దెగ్గర చేర్చుకోకు. ఇంకొకళ్ల భజన బృందంతో నీకేంపని? నువ్వేమైనా సంఘసంస్కర్తవా?

నువ్వు నాకొడకా అంటే నేనూ నాకొడక అంటానికి ఎంతోసేపు పట్టదుగా. సమీకరణం చాలా వీజీ. అనకు, అనిపించుకోకు. పలానామె బ్లాగు హిట్లు పెంచుకోటానికి ఎదో రాసింది. నువ్వు మహాభారతం రాస్తున్నావా మరీ? అక్కడ ఉపయోగపడే వస్తువైనా ఉంది నువ్వు రాసిందు బూతు, దానికో రంగు - ముక్కుసూటి, నిజాయితీ.

ఏమైనా చెప్పేది ఒక్కటే ఎవ్వడికైనా, నాకైనా - ఇంకోళ్ల ముడ్డి కింద నలుపు చూపించే ముందు, నీ ముడ్దికిందనలుపు తెల్సుకో.

నలుగురు ఆడోళ్లపైన నువ్వు నీ నిజాయితీ భూతద్దంలోంచి చూసిన బూతుసినిమా కధని విసరంగనే నువ్వేమీ ఓ పెద్ద "కనిపెట్టినోడి"వేంకాలా.

గమనిక :- ఇక్కడ కామేంట్లు రాసేవాళ్లు నా నిజాయితీని గురించి కానీ, నా పనిని గురించికానీ, నాకెన్ని బ్లాగులున్నాయ్ ఇట్టాంటి మాటలు రాసేపనైతే కామెంటు పెట్టాల్సిన పనిలేదు. దానిబదులు ఈ పనిచేస్కోవచ్చు - పు.ఏ.పె.వాసన చూస్కోవచ్చు మహదానందంగా.

7 comments:

  1. :)..ఇద్దీ ఇట్టాగుండాలి రాసినా...రాయేసినా...

    ReplyDelete
  2. చాలా చక్కగా చెప్పారు. కనీసం ఇప్పటికైనా ఈ గొడవ సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా....

    ReplyDelete
  3. "నువ్వేమైనా సంఘసంస్కర్తవా"

    Mastsaru, Well said. Reformers live among people and solve their problems. Blogging's capacity to solve real world problems is questionable.

    ReplyDelete
  4. నాన్న గారూ , ఘాటు ఎక్కువైనట్టుందండీ. ఇబ్బందిగా అనిపించి కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నా ( తూచ్......తూచ్... ఇది కమెంట్ కాదు)

    ReplyDelete
  5. కామెంటు చేసిన అందరికీ నమస్తే!! చేయ్యకుండా వెళ్లి నోళ్లకీ నమస్తే.
    లలిత గారు :)

    ReplyDelete
  6. నాకూ ఘాటు ఎక్కువయ్యింది. కామెంటాలా వద్దా అర్ధం కాలా! నిజంగా చెప్పాలంటే ఏంటో అదో రకంగా అనిపించింది మీ పోస్ట్. చదవబుద్దే కాలా.

    ReplyDelete
  7. నాకూ ఘాటు ఎక్కువయ్యింది... రాజు గారిది గుంటురాయే, ఆ మాత్రం ఘాటు లేకపోతె గుంటూరు పేరే చెడిపోతుంది మరి. ఫర్వాలేదు కానివ్వండి.

    ReplyDelete