Sep 27, 2020

కీ|శే|| బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి ఆకాశవాణిలో (రిప్లే)

 కీ|శే|| బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి ఆకాశవాణిలో


నిన్న మధ్యాహ్నం అనుకుంటా ఆకాశవాణిలో బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖీ (రిప్లే) వచ్చింది. నిజం చెప్పాలంటే ఎటువంటి నాన్-సెన్స్ లేకుండా సుత్తిలేకుండా ఎంతో హుందాగా చక్కటి భాషతో స్లోగా ఉంటుంది ఆకాశవాణి. 

అదేకోవకు చెందింది ఈ ముఖాముఖీ కార్యక్రమం. శ్రీ మోహన కృష్ణ గారు బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖీ కార్యక్రమాన్ని ఎంతో హుందాగా నిర్వహించారు. బాలసుబ్రహ్మణ్యంగారితో ముఖాముఖీ ఒక గంటలో తేలేది కాదు. ఆయన పాడిన పాటలు ఎన్నో పాటతో ఆయన ప్రయాణానికి ఎన్ని ఏళ్ళో - ఆసారాన్నంతా ఒక గంటలోకి కుదించటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. 


బాలసుబ్రహ్మణ్యం గారికి లలిత గీతాల పోటీలో బహుమతి రావతం, ఆ నాటి జ్ఞాపకాలు అయన పంచుకోవటం బాగుంది. అయితే మోహన కృష్ణగారు చక్కటి ప్రశ్న వేయటం కొస పెరుపు - మీరు పాడిన పాట ఎదీ? అని. బాలసుబ్రహ్మణ్యం గారు వారి తండ్రిగారు రాసిన పాట అని ఆ పాటన తడమటం -"పాడవే వల్లకీ పాట". తండ్రిగారు రాసిన పాటను ఆయన పాడటం ఎంత గొప్ప అనుభూతి? బాలసుబ్రహ్మణ్యంగారు కాలంలో కలసి పోయినా వారి పుత్రుడు తాత గారి రచనలని, తంద్రి గారి రచనలని సెకరించి అచ్చు వేయిస్తే అంత గొప్పగా ఉంటుందో అని నా మనసులో ఓ ఆలోచన స్పురించింది, అది ఇప్పటికే జరిగుండకపోతే.


ముఖాముఖీ అనేక పాటలని స్పృశించకపోయినా మోహనకృష్ణ గారు చక్కగా తన స్టైల్లో ప్రశ్నలు అడగతం, బాలసుబ్రహ్మణ్యం గారు న్వ్వుతూ జవాబులు చెప్పటం - వీనుల విందుగా అనిపించింది.



కొన్ని మెరుపులు -

"అబ్బాయ్ మురళీకృష్ణ సరస్వతీ  పుత్రులైన శ్రీ బాలమురళీకృష్ణ గారి దగ్గర నువ్వు అంతేవాసివి - నేను అంతే" ఎంత నిజాయితీగా చెప్పుకున్నారో?


1 comment:

  1. అద్భుతమైన ముఖా ముఖీ. మోహనకృష్ణ గారు బాలు గారినుంచి చాలా చక్కగా మంచి విషయాలు చెప్పించారు. ముఖ్యంగా చివరి ఐదు నిముషాలు విన్న తరువాత గుండె బరువెక్కుతుంది. Thank you for sharing a gem.

    ReplyDelete