Sep 25, 2020

గాయకుడు పాటకు ఊపిరి, కవి పాటకు ఆత్మ

 


ఊహ తెలిసినప్పటి నుంచి రేడియోలో ఆయన పాటలు వింటూ పెరిగినవాళ్ళకు ఆయన పాట జీవితంలో ఓ భాగం అయిపోతుంది. మనసులో ఆయన ఒక చోటు చేసుకుని కూర్చున్నట్టే ఉంటుంది. అమ్మా నాన్నా అన్నా చెల్లీ లతో పాటు ఆయన ఒక కుటుంబ సహ్యుడే. బాధల్లో *దుఖఃభరిత పాటల* ఓదార్పు. ఆనందంలో *ఉత్సాహాన్ని రేకెత్తించే పాటలు* వాటంతట అవే పెల్లుబుకుతాయి. ఈ పాటలన్నీ మనసొత్తు అయినట్టు. ఆ పాడినవాడు మనోడన్నట్టు మనకోసమే అన్నట్టు.


గాయకుడు పాటకు ఊపిరి

కవి పాటకు ఆత్మ


పాట నిలిచినంత కాలం గాయకుడికి మరణం లేదు

రచయితకీ మరణం లేదు


కానీ ఒక వ్యక్తిగా కరోనాతో ఆయన కాలం చేయటం బాధగా ఉంది.


ఆయన గళంలోంచి వచ్చిన ఈ పాట మనసులో తిరిగుతోంది -


ఎక్కడో దూరాన కూర్చున్నావు

ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు 

చిత్రమైన గారడి చేస్తున్నావు

తమాష చూస్తున్నావు సామీ



లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు

మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు 

లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు

మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు 

అంతా మా సొంతమని అనిపిస్తావు

అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా సామీ 


ఎక్కడో దూరాన కూర్చున్నావు

ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు 

చిత్రమైన గారడి చేస్తున్నావు

తమాష చూస్తున్నావు సామీ

 

ఎక్కడో దూరాన కూర్చున్నావు 


పెరుగుతుంది వయసనీ అనుకుంటాము

కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము 

పెరుగుతుంది వయసనీ అనుకుంటాము

కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము 

కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా 

మా కళ్ళముందు మాయతెరలు కప్పేస్తావు సామీ 


ఎక్కడో దూరాన కూర్చున్నావు

ఎక్కడో దూరాన కూర్చున్నావు 

ఎక్కడో దూరాన కూర్చున్నావు సామీ

ఎక్కడో దూరాన కూర్చున్నావు


4 comments:

  1. Everyone hoped that Balu sir would come back Hale and healthy from the hospital. Had he skipped the trip to Hyderabad... It was not to be. He passed away at least ten years early. బాలు గారు. The true legend. A colossus. The last among the great singers. RIP sir🙏🙏🙏

    ReplyDelete
  2. Very Sad. My parody to one of his best rendition
    గీతమా మా గంధర్వ గీతమా
    పాటకే ప్రతిరూపమా
    మా గుండేలో నిండిన గానమా
    మము శ్రోతగా చేసిన గాత్రమా

    శిలల్లాంటి మాకు శ్రావ్యతని పంచి
    క్షణమైన బ్రతుకును కళతోటి నింపి
    మకరందపు మాటా ప్రతిసారీ చేర్చి
    యదలోని వెతలు క్షణమైన మాపి
    నును వెచ్చనైన ఓదార్పు పాటవై
    శ్రుతిలయ లాగా జతచేరీనావు

    నువు లేని నేల వుహించలెము
    మా వేదనంతా నివేదించలేము
    అమరం అఖిలం నీ పాటా...

    ReplyDelete
  3. తమిళులు బాలసుబ్రహ్మణ్యాన్ని అక్కున చేర్చుకున్నంతగా తెలుగులు చేర్చుకోలేదేమో అనే అనుమానం వేధిస్తున్నది

    ReplyDelete
  4. yes, Tamils love him more than Telugites.

    ReplyDelete