Sep 26, 2020

దొరకునా ఇటువంటి సేవా

మధ్యానం బాధ లోంచి  బయట పడటానికి ఛానెల్స్ బ్రౌజ్ చేస్తుంటే జెమినీలో శంకరాభరణం తగిలింది.

సామజ వర గమన పాట వస్తున్నది అప్పటికే


బహుశా నా ఒకటో లేక రెండో తరగతిలో వచ్చిందనుకుంటా శంకరాభరణం.

చూసిన ప్రతిసారీ ఓకొత్త అనుభూతి అనుభవం

నా దృష్టిలో గొప్పనటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారుశంకరాభరణం నిలువెత్తు ఉదాహరణ.

నా దృష్టిలో గొప్ప నటుడు శ్రీ జొన్నలగడ్డ సోమయాజులు గారు.

నా దృష్టిలో గొప్ప నటి నిర్మలమ్మ.

నా దృష్టిలో గొప్ప నటుడు చంద్రమోహన్.

నా దృష్టిలో గొప్ప నటుడు సాక్షి రంగారావు.


సరే సినిమాలోకొస్తే సామజ వర గమన పాటప్రాణం వేటూరిఊపిరి బాలు జానకి.

ప్యూర్ వేటూరి మాయాజాలం బాలు దాన్ని తారాస్తాయికి తీసుకెళ్ళటం -



"ఆమని కోయిల

ఇలా 

నా 

జీవన వేణువులూదగ

ఆమని 

కోయిల 

ఇలా 

నా జీవన వేణువులూదగ

మధురలాలసల 

మధుపలాలనల 

మధురలాలసల 

మధుపలాలనల 

పెదవిలోని మధువులాను రసముపూని జతకు చేరగా 


వేసవి రేయిలా 

ఇలా 

నా 

ఎదలో మల్లెలు చల్లగ 


మదిని కోరికలు 

మదన గీతికలు 

మదిని కోరికలు 

మదన గీతికలు 

పరువమంత విరుల పానుపు పరచి నిన్ను పలకరించగా"


పాటని అనుభవిస్తూ పాడితే ఎలా ఉంటుందో  పాట ఒక మైలురాయి.


ఇంతలో సినిమా చివరకు వచ్చేసింది.


"దొరకునా ఇటువంటి సేవ"

సన్నివేశం విశ్వనాథ్ గారు ఎలా చిత్రీకరించారు నాటకీయత  ఇవన్నీ పక్కన పెడితే!


వేటూరి ఆలోచనా తీరుజంధ్యాల మాటబాలసుబ్రహ్మణ్యం పాటవిశ్వనాథ్ దర్శకత్వం -


ఎన్నో ఏళ్ళ తర్వాత కచేరీకి అంగీకరించిన  సంగీత శాస్త్రవేత్త.

కచేరికి వేంచేసి అతని పేరు మీద వెలసిన క్షేత్రంలోకి ఆశ్చర్యపోయి వచ్చి - 

పాశ్చాత్య సంగీతపు పెనుతుపానుకి రెపరెపలాడుతున్న సత్-సాంప్రదాయ సంగీతపు జ్యోతిని ఒక కాపుకాయటానికి తనచేతులు అడ్డుపెట్టిన దాత ఎవరో వారికి శత సహస్ర వందనాలు అర్పిస్తున్నానుసుష్కించిపోతున్న భారతీయ సంస్కృతీసాంప్రదాయాలని పునరుద్ధరించటానికి నడుంకట్టిన  మహా మనీషీకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానుకళ జీవకళఅజరామమైనదిదీనికి అంతం లేదునిరాదరణ పొందుతున్న  కళని పోషించటానికి కోటికి ఒక్క వ్యక్తిముందుకొచ్చినా సరే -  అమృతవాహిని అనంతగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుందిమనిషి నిలువెత్తు ధనంసంపాదించినా -

దొరకునా ఇటువంటి సేవ

నీ పద రాజీవముల చేరు 

నిర్వాణ సోపాన మధిరోహణము 

సేయు త్రోవ


రాగాలనంతాలు నీ వేయి రూపాలు

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు

రాగాలనంతాలు నీ వేయి రూపాలు

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు


నీ పాదాలు చేరటానికి నిచ్చెన సేవ

తిమిరాలను పోకార్చు దీపాలు - 

తిమిరం - చీకటి

పోకార్చుట - 'పొకారు or పోకారు [Tel.] v. n. To be ruined, నాశమగుపొకార్చుపొకారుచుపోకారుచు or పోకార్చుpokārṭsu. To kill or ruin, to render powerless, to strike with stupor, ".. కానకకన్నమాసుతుబొకారిచియిన్నియుమిధ్యచేసితే."'


జీవితాన్ని మింగేసిన చీకట్లను నాశనం చేసే దీపం సేవ.. 



బాలసుబ్రహ్మణ్యం  పాటకి నిజంగా ఊపిరి!

నా కళ్ళు చెమర్చాయి.


సినిమా ఇండస్ట్రీ అంతా హీరో చుట్టూతా పరిభ్రమిస్తూ ఉంటుంది ముఖ్యంగా తెలుగులో.


రచయితకి గుర్తింపు ఉండదు.

పాటకర్త  ఎవరో తెలియదు.

వీటి ప్రస్తావన ఎక్కడా ఉండదు.

దౌర్భాగ్యం

పై మాటలు ఎంత లోతుగా ఉన్నాయీదర్శకుడి తపనని గుర్తెరిగిన రాసిన రాత - శంకరాభరణం మాట కర్త జంధ్యాల.

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మాటలు పాటలు నటన దర్శకత్వం.

10 comments:

  1. గొప్ప ఆర్ద్రత తో కూడిన పోస్టు వ్రాశారు భాస్కర్ గారు. శంకరాభరణం an immortal classic - తెలుగు జాతి చరిత్ర లో నిలిచిపోయే చిత్రం. దొరకునా ఇటువంటి సేవ పాట సందర్భం ఆ సన్నివేశం నటన సాహిత్యం సంగీతం గానం - కంట తడి పెట్టిస్తాయి.

    ReplyDelete
  2. దొరకునా ఇటువంటి సేవకు ముక్తాయింపు - తన తండ్రి ఇచ్చిన ఆస్థిని తను నమ్ముకున్న సిద్ధాంతాలకు ఏమాత్రమూ తొణకకుండా ధారాదత్తం చేయటం - వెరసి ఆ ఆస్థి వేదం అనే పళ్ళెమును నిలబెట్టే గట్టి గోడ అవడం


    దొరకునా ఇటువంటి సేవా

    ReplyDelete
  3. అద్భుతం సోదరా.. ఈ పాటకు చక్కని వివరణను రాశారు. ఇలాంటి అమృత తుల్యమైన పాటలు ఎన్నో. ఆ మహానుభావుని స్వరంలో _/\_

    ReplyDelete
  4. "శంకరా.................ఆఆఆ " ఈ ఒక్క రాగం వినగానే మనసు ఏ మూడ్ లో ఉన్నా ఒకే మూడ్ కి ట్యూన్ అయిపోతుంది. అసలు ఈ సినిమాలో పాటలు బాలుగారు పాడినట్లు కాక శంకర శాస్త్రే పాడినట్లు ఉంటాయి. అదే మ్యాజిక్.
    ఇవాళ యూట్యూబ్ లో వెతుకుతూ ఉంటే "ఒక్కడై రావడం..ఒక్కడై పోవడం" అనే ఆనలుగురు సినిమాలో పాట దొరికింది. అది వింటే గుండె బరువెక్కింది. బాలుగారు తనకోసమే పాడుకున్నారా అనిపించేలా ఉంది.

    ReplyDelete
    Replies
    1. // “ ఒక్కడై రావడం..ఒక్కడై పోవడం" అనే ఆనలుగురు సినిమాలో పాట” //

      అవును.
      నిన్న (26-09-2020) బాలు గారి అంత్యక్రియలను లైవ్ గా చూపిస్తున్న చాలా టీవీ ఛానెళ్ళు కార్యక్రమం పూర్తయ్యే వరకు ఈ పాటే వినిపించాయి.

      Delete
  5. ఈ ఛానళ్ళు వాటి విశృంఖల విన్యాసాలు చూసేకన్నా నాలుగు గొఱ్ఱెలు పెంచుకోటం ఉత్తమం. వార్తాపుత్రికలు చదవటం కన్నా చెఱువులో కప్పలు పట్టుకోడం ఉత్తమం.
    వార్తాపుత్రికల ఘోష - బాలు గారికి ఎవరెవరు నివాళి అర్పించారో - చూడండి అంటూ ఫోటోలు.

    ReplyDelete
  6. లాలస [Skt.] n. Ardent desire, అతికాక్ష, ఔత్సుక్యము. Soliciting, asking. ప్రార్థన, యాచన. Amorousness, విషయలంపటము. లాలసము lālasamu. adj. Devoted to, attached to. విషయలంపటమైన, మిక్కిలి కాంక్షగల. లాలసుడు lālasuḍu. n. One who loves, one who is wishing for, మిక్కిలి కాంక్షగలవాడు.

    ReplyDelete
  7. లాలన or లాలనము [Skt.] n. Wheedling, coaxing, flattering. బుజ్జగింపు

    ReplyDelete
  8. బాలుగారి అతిపెద్ద దురదృష్టం ఏమిటంటే జరిగింది జరిగినట్లు చెప్పే మా సిద్ధాంతితో జరిగాక జ్యోతిష్యం చెప్పించుకోవడం.

    ReplyDelete
    Replies
    1. అచట మరణించిన వారికి జాతకం చెప్పబడును.😁

      Delete