May 25, 2019

శ్రీ నారా లోకేశ్


ఆకలేసి అన్నమడిగితే -

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం.
ఎటు చూసినా చిక్కులే.
ఎటు చూసినా సమస్యలే.
పిరికిటి నిండా చిల్లర లేదు.
జేబుల నిండా నోట్లు లేవు.
ఇంతలోనే అహంకారం
ఇంతలోనే అతివాద ప్రకోపం.
ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మిస్తాం అని ఎవరెస్టు శిఖరానికి దారం వేయటం

ఒక కొత్త ఊరికి బదిలీ కాబడ్డ బడుగు ఉపాధ్యాయుడిలా ఉన్న ప్రభుత్వం. చిన్న గది తీసుకుని సంసారాన్ని కుదుట పరిచి, తననితాను సంభాళించుకుని కాలూచేయీ తీసుకుని అడుగు ముందుకేద్దామనే మధ్యతరగతి ఆలోచన చేయని ఆలోచనరాని ఆలోచన రానివ్వని ఆ మనిషి

రోజులు దొర్లాయి.
సామాన్యుడి జీవితంలో మార్పు లేదు.
అదిగో నవలోకం అంటూ గోడమీద "రేపు" అని రాసి ఊరిస్తూ వంచిస్తూ

ఒకవైపు ఏడాదికి నాలుగు పంటలు పండే బంగారు డెల్టాని సిమెంటూవనంలా మారుస్తూ

వెరసి రైతుల కష్టాలు కన్నీళ్ళు

ఇలాంటి సందర్భంలో చినరాజావారు శ్రీశ్రీశ్రీ నారా లోకేశ్

జాలితో
దయతో
కరిగిపోయి
కన్నీరులో కన్నీరై
మున్నీరులో మున్నీరై
యావత్ జాతిని మేల్కొల్పేలా
జనాలకోసమే
తానంటూ
ముందుకొచ్చాడు

గొప్ప నేత. దూరదృష్టి. తెలివి. ఆలోచన. సేవ.
ఇన్ని గుణాలు కలపోసి పోతపోసిన మనిషి లోకేశ్.

సాధారణ స్థాయిలో మనిషి ఇలాంటప్పుడు రైతులకు సరసమైన్ ధరలు ఇద్దాం ఏవోకొన్ని సబ్సీడీలు ఇద్దాం ఋణం ఇద్దాం పోనీ ఉన్నదాన్ని మరికొంత మాఫీ చేద్దాం అని అనుకుంటాడు

కానీ లోకేశ్ అలా ఆలోచించలేడు.
గొప్ప మహానుభావుడికి మాత్రమే మార్గదర్శకుడికి మాత్రమే ఇంద్రుడికి మాత్రమే చంద్రుడికి మాత్రమే వచ్చే ఆలోచన చేశాదు.

ఆకలేసి వచ్చిన రైతుకోసం
5000 వేల కోట్లతో ఫైబర్ కేబుల్ వెయించి
అందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోణులు ఇప్పించి
అందులో
కే.యఫ్.సి అప్లికేషనో
మ్యాక్.డోనాల్డ్ అప్లికేషనో వేసి
ఫోను ద్వారా ఆర్డర్ చేస్కునేలా ఏర్పాటూ చేశాడు.

దార్శనికతకు నిలువెత్తు ఉదాహరణ.

అందుకే మందలగిరికి పంపించారు జనాలు గౌరవంగా

7 comments:

 1. ఆంధ్రాని వదలి విదేశాల్లో ఇంటర్నెట్ ని నమ్ముకుని బ్రతికేవారికి వచ్చే కిక్కు కన్నా, 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన వారిమీద మళ్ళీ పోటీకి దిగి గెలిస్తే వచ్చే కిక్కే వేరబ్బా !

  ReplyDelete
 2. >>>సాధారణ స్థాయిలో మనిషి ఇలాంటప్పుడు రైతులకు సరసమైన్ ధరలు ఇద్దాం ఏవోకొన్ని సబ్సీడీలు ఇద్దాం ఋణం ఇద్దాం పోనీ ఉన్నదాన్ని మరికొంత మాఫీ చేద్దాం అని అనుకుంటాడు>>>>

  రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించారు. ఈ ఒక్కపనికే నేను ఫిదా అయిపోయాను. ఆంధ్రా వాళ్ళు లాభం లేకుండా పిల్లికి కూడా బిచ్చం వేయరు. అటువంటిది 33 వేలంటే మాటలా ?

  ఒక్క ఎకరం నేలకోసం బీ జే పీ మరియు హిందూ సమాజం సుప్రీం కోర్టులో కొట్టుకుంటున్నారు.

  ఆడు మగాడ్రా బుజ్జీ !  ReplyDelete
 3. Your comments are so irrelevant. Not sure why your wasting your time

  ReplyDelete
 4. I am from now filtering comments
  Will publish only relevant comments period

  ReplyDelete
 5. బంగారం పండే పొలాలను బలవంతంగా లాక్కుని కుల పిచ్చితో అస్మదీయులకు పందేరం చేసినవాడు మగాడా. హిందూ సమాజం కొట్టుకుంటుందా. అవగాహన లేని పిచ్చి వ్యాఖ్యలు ఇవి.

  ReplyDelete
 6. https://www.youtube.com/watch?v=gDDXMUh-ClM

  ReplyDelete
 7. More fun

  https://www.youtube.com/watch?v=s5182WvPHW4

  ReplyDelete