గత వారం పది రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు. ఇక జరగబోయే రాజకీయ తంతు. బాగా దగ్గరుండి ఇవాళ్టి రాజకీయాలను గమనించాల్సిన సమయం.
ఈ గందరగోళంలో గమనించాల్సింది మీడియా పోకడని
మింగలేక కక్కలేక
జగన్ అనలేక అనకుండా ఉండలేకా
తెగ బాధపడిపోవటం.
ఒబామా మొదటిదఫా పాలన సగానపడేలోపు నేను న్యూయార్క్ నుంచి కేన్సాసుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పట్లో KMBZ అనే రేడియో వింటం జరిగింది. దాంట్లో మధ్యాహ్నం రెండు మూడు గంటలపాటు Rush Limbaugh అనేతని టక్ షో వచ్చేది. దాన్ని రిపబ్లికనులు అదొక మహత్తర కావ్యంలా ఇతిహాస పురాణాలకన్నా దేవుని వాక్యంలా చెవులు రిక్కించి మరీ వినేవారు.
ఇతను ఎంత గొప్ప వ్యక్తి అంటే బారాక్ హుస్సేన్ ఒబామా అని ఉచ్ఛరించటనికి ఇష్టపడేవాడు కాదు, ఉచ్ఛరించే పాపం చేసేవాడు కాదు. రిపబ్లికనులు ఆ పేరు వినేప్పుడు ఎంతో పాపం చేసినవారిలా ఊగిపోయేవారు. బాధపడేవారు. చర్చీలకి వెళ్ళి నాలికని నేలకేసి రాసుకునేవారు. Rush Limbaugh బారాక్ హుస్సేన్ ఒబామా అనాల్సి వచ్చినప్పుడు బారాక్ ఆఆఆ ఒబామా అనేవాడు.
ఒక వ్యక్తిని వ్యతిరేకించవచ్చు
ఒక వ్యక్తిని ద్వేషించవచ్చు
కానీ ఈస్థాయికి ద్వేషించటం వాళ్ళ విచక్షణకి తార్కాణం
మానసిక స్థితికి నిలువెత్తు అద్దం
అదేస్థాయికి ఇవ్వాళ్ళ మీడియా దిగజారింది. నిన్నటిదాకా విషప్రచారం చేసింది. A1 అంటూ జైలు పక్షి అంటూ ఎన్ని విధాలుగా దిగజారాలో అన్ని విధాలుగా పాకుడు మెట్ల మీదనే నిల్చుంది.
చివరికి తాము ఎవ్వరి గెలుపుకోసం పాటుపడుతున్నాము అని భ్రమించాయో, ఆ సంకల్పాన్నే పాకుడురాళ్ళ మీద నిలబెట్టి అధోపాతాళానికి నెట్టి తామూ అధోపాతాళానికి జారిపోయాయి.
ఇవ్వాళ్ళ కొదరు పచ్చలయ్యలు "వార్తా సమీక్ష" లకు జగన్ పార్టీ నుంచి ఎవ్వరూ రాకుండానే చర్చిస్తున్నారు.
ప్రజలచేత ప్రజలకొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటు అయే సందర్భంలో, 50% మెజారిటీ సాధించుకున్న పార్టీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేకుండా గెలుపోటముల చర్చలు *తల లేని మొండెం*లా అనిపిస్తున్నాయి.
ఇక భజన పత్రికలు తమ భక్తిని ఇలా చాటుకున్నాయి -
ఎవరన్నా ఫలితాలు రాసేప్పుడు క్రొనొలోజికల్ ఆర్డర్లో రాస్తారు. ఎక్కువ సీట్ల నుంచి తక్కువ సీట్లు వచ్చిన ఆర్డరులో లేక ఆల్ఫాబెటికల్ ఆర్డరులో.
కానీ రామోజీ తాత
TDP 23
YSCRCP 151
JSP 1
అంటూ లిస్టింగ్ ఇచ్చాడు.
మీడియా కుక్క తోక వంకర అని నిరూపించాడు
May 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
భారతీయుడు సినిమాలో చచ్చేముందు కూడా లంచం ఇవ్వజూపుతాడు డాక్టర్. మీరు మారరు రా అని వాణ్ణి చంపేస్తాడు.
ReplyDeleteఈ పచ్చ మీడియా కేతిగాళ్ళు born with genetic disorder. కులపిచ్చి అనేది వాళ్ళ Dna లోనే ఉంది.
ప్రజలు తమను అసహ్యించుని ఉమ్మేశారు అన్న విషయం తెలిసి కూడా నటిస్తున్న నీచులు .
రష్ లింబాగ్ లాంటి జాతి దురహంకారులు వానపాములయితే డ్రామోజీ, వేమూరి వంటి వారు నిలువెల్లా విషమున్న తాచుపాములు. సర్పయాగానికి ముహూర్తం ఎప్పుడుస్తుందే ఏమో?
ReplyDeleteBTW టీవీ5 వానరు గారు నిన్న పొద్దున్న కిషన్ రెడ్డి ఇంటికెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారట FYI.
నలభైయేళ్ళిండష్ట్రీ
ReplyDeleteవలవల యేడ్వంగబట్టె , వారి తరపునన్
తులువలు గలీజు కూతల
నలుపెరుగక వాగబట్టి , రంతా యేడ్పే .
పచ్చమూకలకు మాస్టారు మూ తోడ్ జవాబు భలే భేషుగ్గా ఉన్నది!
Delete