May 25, 2019

చింతమనేని ప్రభాకర్

ఒక దుర్మార్గుడు దగ్గరుండి తన మనుషుల చేత యధేచ్ఛగా పట్టపగలు మిట్టమధ్యానం అందినకాడికి అందరూ చూస్తుండగా నిర్లజ్జగా నిర్భీతిగా వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ చట్టాన్ని కుళ్ళబొడుస్తూ న్యాయాన్ని కాలరాస్తూ దేశ సహజ సంపదని దోచుకుంటున్నాడు.
అతను ఓ రాజికీయ అతివాది. రాజకీయ మితవాదుల కాలం నుంచి దేశం పరిణితి చెందుతూ ఈనాటికి రాజకీయ అతివాదుల చేతిలోకి పోబడిందని వేరే చెప్పక్కర్లేదు. రోజుకి కొన్ని వందల సంఘటనల్లో చూస్తూనే ఉన్నాం, ఆట్టే వెతుక్కోవాల్సిన పనికూడా లేదు.
ఇతను ఆంధ్రప్రదేశ్ అనే దేశాన్నికి పేరు ప్రఖ్యాతులతో పాటు అనితరసాధ్యంకాని అనుభవపాటవాలతో పరిపాలిస్తున్న రాజువద్ద ఓ పేద్ద అమాత్యుడు.
దోపిడీలు చేయించటం, సహజ సంపదలని దగ్గరుండి దోపిడీ చేయించటంలో సిద్ధహస్తుడు.
కనిపించిన వారిని అమ్మనానబూతులు తిట్టిటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.

ఆరోజు ఆ మధ్యాహ్నం అలా దోపిడీ ఛెస్తుండగా తన జీవితంలో చేయకూడని తప్పు చేస్తున్నాను అని తెలియని ఓ ప్రభుత్వ ఉద్యోగిని అటుగా వెళ్ళటం తారసిల్లింది. ఆమె తెలిసే వెళ్ళిందో లేక విధి ఆమెతో ఆడించిన వింత నాటకమో - ఆమె అటుగా వెళ్ళటం దోపిడీ అంతా ఆమెకు అవగతం కావటం క్షణంలో జరిగిపోయాయి.
విధి బలీయం ఆమె సదరు ఆమాత్యుడిని నిలదీయటం చకచకా జరిగిపోయాయి. ఆమె అధికార్ణిగా అతన్ని ప్రశ్నించింది.
ఏవిటి జరుగుతోందీ? ఏవిటీ ఈ దోపిడీ? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ప్రముఖ అమాత్యుడి కనుసన్నల్లో ఇలా దోపిడీ చేయటానికి సిగ్గుగా లేదా అని ఆక్రోసించింది.

సదరు అమాత్యుడు జూలు విదిలించి తాన ధికార దర్పాన్ని ఆసాంతం ప్రోగుచేసి ఆమెని కాల రాసే ప్రయత్నంలో ఆమెని ఘాట్టిగా ఒక్కటి పీకనే పీకాడు.

ఈ సంఘటనని సిగ్గున్న సమాజం ఏంచేయాలీ? గర్హించాలి.
ఒక పోలీసుమీద డ్యూటీలో ఉండగా చేయిచేసుకుంటే ఓ పేద్ద నేరం అవుతుంది
ఓ ప్రభుత్వోద్యోగిని డ్యూటీలో ఉండాగా చేయి చేసుకుంటే అంతే పెద్ద నేరం అవుతుందా కాదా?
ఇలాంటి సమయంలో సదరు ప్రభుత్వం తన ఉనికిని ప్రజలవద్ద కాపాడుకునేందుకూ కనీస ధర్మంగా ఏంచేయాలీ?

ప్రభుత్వం ఆట్టే పెద్దగా ఉలిక్కి పడలేదు. నెగడు వద్ద కూర్చుని బీడీ వెలిగుంచుకునే తరహాలో ముట్టీ ముట్టనట్టుగా ఉంటమే కాకుండా
ఆమెని ప్రశించింది. అసలు పట్టపగలు మిట్టమధ్యాహ్నం నువ్వు అటు ఎందుకెళ్ళావని ఆమె అవాక్కైయ్యేలా ప్రశ్నించింది.

ఆమె తన సరిహద్దులు దాటి వెళ్ళిందని ఆరోపణ
సదరు అమాత్యుడు సరైన తీరులోనే ప్రవర్తించాడని అతనికి మెడలోంచి హారం తీసి మరీ బహుకరణ

అమాత్యుడు - చింతమనేని ప్రభాకర్
ప్రభుత్వోద్యోగి - వనజాక్షి
ప్రభువు - శ్రీ నారా చంద్రబాబు

no one respects women more than me అన్నాడు Donald Trump. అనీఅనగానే నిండు సభలో Hillary Clinton ని Nasty Woman అన్నాడు. ప్రజలు అతనికి పట్టం కట్టారు.

చింతమనేని ప్రభాకర్ ఆగడాలను వెనుకేసుకొచ్చిన చంద్రబాబుని ఇంటిముఖం పట్టించారు ఓటరులు.
చింతమనేని ప్రభాకరుని దారుణంగా ఓడగొట్టారు.

రేపొద్దున Donald Trump కైనా ఇదేగతి.
ఆమె ఆడది కావచ్చు మగాడు కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగికి ఆమాటకొస్తే మనిషికి విలువ ఇవ్వగలిగేది కేవలం మనిషి మాత్రమే

10 comments:

  1. మొన్నటి ఎన్నికల ఫలితాలలో అధిక తృప్తినిచ్చింది చింతమనేని ప్రభాకర్ ఓటమి.

    ReplyDelete
  2. అధికారమదంతో కులగజ్జి పైత్యంతో ఖుర్చీలో ఉన్నానన్న కండకావరంతో కళ్ళు నెత్తికెక్కిన నీచ నికృష్ట కీచకుడు చింతమనేని ప్రభాకర్. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్న చందాన ఈ అధముడికి జాడించి వాత పెట్టిన దెందులూరు ప్రజలకు అభినందనలు.

    ఇదే కోవలో కోడెల శివప్రసాదరావు, బోండా ఉమా, అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరి, పరిటాల, జేసీ బ్రదర్స్, పులివర్తి నాని వగైరా ఇంకొందరి పీడా విరగడయింది. Good riddance to bad rubbish!

    ReplyDelete
  3. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారు ఆనాడే అన్నారు:

    "మన కొంపలార్చీన
    మన స్త్రీల చెరచిన
    మన పిల్లల చంపి
    మనల బంధించిన
    మానవాధములను మండలాధీశులను
    మరిచి పోకుండా గురుతుంచుకోవాలె
    కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలే
    కాలంబు రాగానే కాటేసి తీరాలే"

    అదే స్పూర్తితో ఓపిగ్గా వేచి సరైన సమయానికి పచ్చముఠాకు చావుదెబ్బలు కొట్టిన ఆంధ్ర (అందులోనూ ముఖ్యంగా రాయలసీమ, కళింగ & పల్నాడు) ప్రజానీకానికి వందనం.

    ReplyDelete
    Replies
    1. స్వంత ఇల్లు కూడా లేని దాన్నని బొంకేసి, 185 మంది కాదు ఎంతమంది వచ్చినా కేసీఆర్ కూతుర్ని ఏమీ చేయలేరు అని గిన్నెస్ బుక్ లోకి ఎక్కేద్దామనేసి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న కవితక్కని, 80 వేల ఓట్ల తేడాతో ఓడించిన నిజామాబాద్ ప్రజలకూ, కాంగ్రెస్ నుండి బీజేపీలోకి జంప్ చేసిన డొక్కా అరుణని ఓడించిన మెహబూబ్ నగర్ ప్రజలకూ పాదాభివందనాలు.

      Delete
  4. ఇలాంటి పచ్చ పిశాచులను కులపిచ్చి రాక్షసులను పెంచి పోషించిన బాబుకు కూడా వాళ్ళ పాపంలో భాగం ఉంది. కోడికత్తి పార్టీ అని అవహేళన చేశాడు. ఎన్నికలు అయినకాణించి ఈవీఎంలు అని వెర్రిగోల చేశాడు. దానికి పచ్చ అనుకుల గొట్టాలు ఉదర గొట్టాయి. పాపం పండి అందరూ బొక్కబోర్ల పడి చచ్చారు. థూ మీ బతుకులు చెడ.

    ReplyDelete
    Replies
    1. దేశంలో అందరికంటే పెద్ద జోకరుగా నారాసురుడు అవతరించాడు. ఇతగాడి ఇరాన్ లెగ్ మహత్యం చూద్దాం.

      రాహుల్ గాంధీకి శాలువాలు మీద శాలువాలు కప్పాడు. బల్లి మీద పడ్డట్టయిన రాహులుడు అమేథీలో ఖంగు తిన్నాడు.

      దీదీ మమతా బెనర్జీ దగ్గరికి పిలువని పేరంటంగా వెళ్తూ వచ్చాడు. ఈ దరిద్రం సోకి ఆవిడకి సగం సీట్లు తగ్గిపోయాయి.

      బీహార్ బీహార్ అంటూ ప్రశాంత్ కిషోర్ గారిని ఆడిపోసుకుంటూ లాలూతో జత కట్టాడు. ఈ అపశకునం మూలాన లాలూ కుటుంబం చీలడమే కాక పార్టీ కుప్పకూలింది.

      దేవెగౌడ & కోలను "మీదీ మాదీ అనుబంధ కులాలు" అంటూ తగులుకున్నాడు. ఈ దెబ్బతో జీడీఎస్ కుదేల్ కావడమే కాక కుమారస్వామి ప్రభుత్వం ఉంటుందా పోతుందా అన్నట్టయింది.

      ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని అతుక్కున్నాడు, ఆయన పాపం మూడో స్థానానికి పడిపోయాడు.

      గ్రహబలం బాగుందేమో లేదా నాస్తికుడు కనుకో స్టాలిన్ ఒక్కడికి పచ్చ మారక అంటలేదు

      Delete
    2. Stalin didn't even give appointment to Ka.Cha.Ra sir

      Delete
    3. Get your facts right bro.

      Stalin gave an appointment to KCR but refused to join the so called Federal Front.

      Delete
    4. ఫెడరల్ ఫ్రంట్ కోసం కే సీ ఆర్ పనిగట్టుకుని వెళ్ళి మరీ కాళ్ళు పట్టుకున్న వాళ్ళ వివరాలు. ఫెడరల్ ఫ్రంటే చచ్చిపోయింది.

      https://youtu.be/RiSYX5MU7SU
      https://youtu.be/QMekOiKBt9Y
      https://youtu.be/GNfdzOiGJLA
      https://youtu.be/MoW6bIwHntU
      https://youtu.be/sOpvLcgekeQ
      https://youtu.be/C845NQWNhWQ

      Delete
  5. What is relationship between Chintamaneni and KCR Stalin talks?

    ReplyDelete