May 17, 2019

బలవంతపు గాంధీఇజం



గాంధీ గొప్పవాడు అయుండచ్చు. గాంధీఇజాన్ని కాంగ్రేస్ జనాల నరనరాల్లోకి ఇంకింపజేసి ఉండచ్చు.
ఎక్కడో ఓ మూల ఎవడోకడు దాన్ని వ్యతిరేకించే తిరుగుబాటు చేసే ఇజంతో ఉండడా?

గాంధీ అనే ఓ మనిషి తీసుకున్న కొన్ని నిర్ణయాలు సదరు విప్లవకారుడికి నచ్చలేదు. అతను గాంధీని అంతం చేశాడు.

గాంధీని హత్య చేయడం నేరం. నేరానికి ఖచ్చితంగా శిక్ష వేసింది న్యాయస్థానం. కాటాలో నేరమూ-శిక్ష సమం అయ్యింది వ్యవస్థకి.

అయితే గాంధీ అనే వ్యక్తిని హతమార్చటం దేశద్రోహమా? దేశవ్యతిరేకమా?

అభివృద్ధి పేరుతో దేశాన్ని అమ్ముకుంటున్న ఈతరం రాజకీయనాయకులు దేశభక్తులా?

9 comments:

  1. వ్యక్తిగత ద్వేషంతో మిమ్మల్ని చంపేస్తే దేశద్రోహమా ? దేశ వ్యతిరేకమా ?
    అభివృద్ధి పేరుతో అప్పులు చేయడం మంచిదే అని మోడీ అంటున్నారు మరి !

    ReplyDelete
  2. అభివృద్ధి(అవసరం) పేరుతో మనం రోజూ చేస్తున్న పని అదే, క్రెడిట్ కార్డులూ,డెబిట్ కార్డులూ,ఇంటి లోన్లు.

    ReplyDelete
    Replies
    1. రాజకీయ గాంధీని
      నేటి గాంధీలు అనేకమర్లు చంపేశారు
      ఇప్పుడెందుకో ఈ కొత్త గొడవ అర్థం కాదు

      Delete
    2. డెబిట్ కార్డ్ అప్పు ఎలా అవుతుంది ?

      Delete
    3. అన్నిటికీ డెబిట్ కార్డు ఉపయోగిస్తూంటే అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియక, ఓవర్డ్రాఫ్ట్ ఉపయోగిస్తారు. డబ్బులు తక్కువుంటే బ్యాంకు అప్పు ఇస్తుంది.

      Delete
  3. Many Indian banks issue credit cards only against Fixed Deposits. In past, some banks issued credit cards even to auto drivers and also hired gangsters for recovery.

    ReplyDelete
  4. గాంధీజీని గౌరవించకపోతే మానేయండి. కాని అవమానించేవాళ్ళని సమర్ధించకండి.

    ReplyDelete
  5. పోలీసులు,సైనికులు, మానసంరక్షణ కోసం చంపేవాళ్లు తప్ప, వ్యక్తిగత ద్వేషంతో కానీ మతవిద్వేషం వల్ల కానీ ఒక మనిషిని ఇంకొకరు చంపితే అది నేరం.
    నేరం చేసినవాడిని ఉరి తీయడం దేశద్రోహమంత నేరం. చచ్చేవరకూ జైలులో ఉంచడమే న్యాయం !

    ReplyDelete
  6. మహాత్మా గాంధీ మరణం గురించి జీబీ షా శ్రద్ధాంజలి:

    It shows how dangerous it is to be good: George Bernard Shaw

    ReplyDelete