Jul 26, 2012

లెగొ క్రియేటర్

సూరిగాడికి పజిల్స్ పిచ్చి. ఒక వంద పీసెస్ ఉన్న పజిల్ ఇస్తే చాలు. అది అయ్యిందాకా లేవడు. మొన్నీమధ్య సమ్మక్క కాడ లెగొ స్టార్ వార్స్ కొన్నాడు. ఇక కుమ్ముకున్నాడు దాన్ని ఓ యాభైసార్లు తీసిపెట్టి తీసీ పెట్టి. ఇక లెగొ మీదపడ్డాడు. కొత్తవి కొను కొత్తవి కొను అని గోల. సరే ఆడుతున్నాడుగా అని ఇప్పటికి ఓ నాలుగో ఐదో కొని పెట్టినాను అప్పుడొకటి అప్పుడొకటి. ఒక్కోటి ఇరవై డాలర్లు మరి.
ఎండ్లకాలం సెలవుల్లో చెప్పినట్టు విని బుద్ధిమంతుళ్ళా తయ్యారయ్యాడు. పెట్టింది తినటం చెప్పింది వినటం ఇలాంటివి చేస్తున్నాడు. టెయ్క్‌వాండోలో ఫోకస్ పెరిగింది. ఇంట్లోకూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాళ్ళ గురువు "మీవాడికి ఫోకస్ బాగా పెరిగిన్! మీవాడికి బెస్ట్ ఫామ్స్ ఇన్ ది క్లాస్! హి విల్ బి మై డైమండ్" లాంటి పలుకులు పలికితే బ్రహ్మానందంలాగా కిందపడి దొర్లా.
అసలు వీరపల్నాటివాడిలాగా స్వీట్ ముట్టనివాడు ఈ మధ్య సున్నుండలు రుచి చూస్తున్నాడంటే మరి మనకి ఆశ్వర్యంతో ఉబ్బై తబ్బిబ్బై మబ్బై చినుకై వానై వరాలు కురవవా.
అరేయ్! నువ్విలానే చెప్పినమాటా వింటుంటే నీకో గిఫ్ట్ అని ఓ రోజు మబ్బులు పట్టినరోజు చెప్తే మొన్న పదా పదా అని గోలపెడితే వెళ్ళాం ఓ దుకాణానికి.
వాడికి త్రీ ఇన్ వన్ లెగొ క్రియేటర్ కొనిపెట్టాను
[రేసుకార్ల పిచ్చిగా మరి]


ఇప్పటికి ఓ పది సార్లు మార్చి మార్చిపెట్టాడు.
ఐతే ఓ సమస్య.
ఇవి పెట్టేప్పుడు వాడికి హెల్పింగ్ హ్యాండ్ కావాలి. ఇవి చాలా టైని టీనీ బ్లాక్స్ అవటంవల్ల
"అమ్మాఆఆఆఆఆ! ఇది కనిపించటంలేదు వెతికివ్వు".
"అరేయ్ వంట చేయాలా వద్దా?"
"వంట తర్వాత! ప్లీజ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్ అమ్మాఆఆఆఆఆఆఆఆఆఅ"
తీరా చూస్తే అక్కడే ఉంటుందా పీసు.
అంతలో పిల్ల
"సూర్యా నాతో ఆట్టంలేదూఊఊఊఊఊఊఊఊఊఉ"
"పోవే నేను బిజీ"
"సూర్యాఆఆఆఆఆఆఆఆఆఆఅ యూఆర్ సో మీన్"
"‌%&%#‌$%‌$%౬౪౩౩#@$%#@%$"
"$#%$‌‌%&‌&*&(*&)*()"

అలా ఉంది కథ

Jul 21, 2012

మళ్ళీ పేలిన తుపాకులు

అమెరికాలోని కొలరాడోలో మరో మారు తుపాకులు పేలినాయి
మన్నెండు మంది నేలకొరిగినారు
వాడెవడో మెడికల్ స్టూడెంటు. నాలుగు తుపాకులు కార్లోవేస్కొని థియేటరుకి వెళ్ళి, ఫైర్ ఎమర్జెన్సీ లోనించి దూసుకెళ్ళిమరీ కాల్చాడు మనుషుల్ని పిట్టల్లాగా.

Police said the gunman entered through an exit door and appeared at the front of the theater in Aurora and released a canister, thought to be tear gas, that let out a hissing sound.

He then started shooting into the crowd, sparking pandemonium.

Witnesses said the shooter was wearing a bullet-proof vest and dressed entirely in black. Some also said he was wearing a gas mask or goggles.

"He had no specific target. He just started letting loose," the witness added.

Witnesses told reporters that the gunfire erupted during a shootout scene in the "The Dark Knight Rises."

Aurora Police Chief Dan Oates said it was established that the apartment had been booby-trapped with sophisticated explosives or flammable material and officers were trying to determine how to defuse the device or devices.

౧. హ్మ్! ఎన్టర్టైన్మెంట్ అనేది మనిషి మానసిక స్థితిపై ఇంతలా ప్రభావం చూపే పనైతే దాన్ని ఒకదగ్గర ఆపగలగటం మంచిది అని నా అభిప్రాయం.

౨. అమెరికాలో షూటింగ్ కొత్త కాదు. ఐతే, అమెరికాలో తుపాకులు దొరకటమూ కష్టం కాదు. తప్పెవరిదీ? మొన్నటికి మొన్న ఒకడు కొత్త గన్ కొని సోఫా మధ్యలో పెట్టాట్ట. వాడి మూడేళ్ళ కొడుకు ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ నొక్కాట, తూటా పిల్లాడికే తగిలింది. తర్వాత ఏవైందో చెప్పాల్సిన పనిలేదు. తప్పెవరిదీ? ప్రస్థుత సంఘటనలో ఇరవైనాలుగేళ్ళ హోమ్స్ అనేవాడికి తుపాకులు అందజేసిన వ్యాపారానిదా తప్పు లేక, స్పైడర్మాన్ లాగా డ్రస్ వేసి క్యాన్స్ థియేటర్లోకి వదిలి కనిపించిన వాడ్నల్లా సినిమాలోల్లాగా కాల్చివేయటం అనే ఓ స్థితిని కలుగజేసిన సినిమా మాధ్యమానిదా లేక, తుపాకులను అడ్డుకోలేని ప్రభుత్వ పాలసీలదా?

౩. లేక, సదరు హోమ్స్ అనేవాడి మానసిక స్థితిని దిగజార్చిన కఠోరమైన మెడికల్ విద్యదా? అమెరికాలో మెడికల్ విద్యార్థుల కష్టాలు చెప్పనలవి కావని చాలా మందే చెప్పగా విన్నాను.

౪. గత పదిహేనేళ్ళుగా పబ్లిక్ షూటింగ్ అనేది కొత్త విషయం కాదు. అందునా షూటింగ్ చేస్తున్న వాళ్ళలో స్టూడెంట్ కుర్రాళ్ళే ఎక్కువ అన్నదీ కొత్తవిషయం కాదు. కానీ ఇంతవరకు ఎవరూ ఏఏ అడుగులు ముందుకి వేశారో నాకైతే తెలియదు.

౫. తల్లితండ్రులు తమ భద్రపరచుకోవాలి పిల్లలకి విలువలు నేర్పాలని ఇందాక ఎవరో రేడియోలో చెప్పగా ఇలా అనిపించింది -

"తుపాకులు బీరువాల్లో దాచిపెట్టినా, అందనిది ద్రాక్షా అవుతుంది. దాన్ని తాకాలనీ, జేబులో పెట్టుకోవాలని, గిర గిరా తిప్పాలనీ, పలానీ హీరోలాగా చేయాలనీ ఫ్యాంటసీసుని క్రియేటు చేస్తున్న మాధ్యమం, క్రియేటు చేస్తున్న వ్యవస్థా ఉన్నంత కాలం బీరువాలు ఉట్టి బీరువాల్లాగనే మిగుల్తాయి"

౬. కాపీక్యాట్ అయిన మన దేశంపై ఇలాంటి గన్ కల్చెర్ యొక్క ఇంపాక్ట్ ఏవిటీ అని ఆలోచిస్తుంటే వళ్ళు జలదరించక మానదు. తుపాకీని చూపని సినిమా చూపండి, ఒక్కటన్నా [దాదాపు లేవు అని నా అభిప్రాయం]. చట్టం నిద్రపోతూ న్యాయవ్యవస్థ కుళ్ళిపోతూ ఉన్న మన సమాజంలో తుపాకీని పొందటం ఎంత తేలికో ఆలోచించండి.

ఎలా? వీటిని ఆపటం ఎలా?

-ఆపలేము

Jul 19, 2012

రాహు డిఫెన్స్ మినిష్టరుగా రాబోతున్నాడా?

నాకే పదవులూ వద్దు అన్నాడు జస్ట్ మొన్ననే.
ఉత్తర ప్రదేశులో కాంగ్రేసుని గెలిపిస్చా అన్నాడు, బోర్లాపడ్డాడు.
ఆం.ప్రలో కాంగ్రేసు గెలుకుదామనుకున్నాడు సతికలపడ్డాడు.
వీడికి డిఫెన్స్ మినిష్ట్రీ ఏంటీ?
ఇంత వెంపర్లాట ఎందుకూ దేశాన్ని దోచటానికీ?
కాంగ్రేసు వారికి మతి అరికాల్లోంచి మరింత కిందకి జారినట్టుంది
దేశం ఎటు పోతే వాళ్ళకేం పట్టిందీ?
అంతా తాత నెత్తిన తోసేసి సంచులు షిప్పుకేసి
ఆబగా అందినకాడికి ఇటలీ పంపుకోచ్చు, ఎంచక్కా అని ఆశ

ఐతే! ఇదంతా పధకం ప్రకారం నడుస్తున్నట్టుగా ఉంది. డిఫెన్స్ మినిష్టరుగా చేసి మరిన్ని వేల కోట్లను ఇటలీ పంపుకునే ప్రయత్నంగా ఉంది. ఏవో, ఎవుడికి తెలుసు వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ నెత్తిన తెల్ల గుడ్డ పడితే ఈమాత్రం అవకాశం కూడా రాదుగా అన్న తొందర కనిపిస్తున్నది.

బెంగొలి తాత పొజీషనుతో పాటు డిఫెన్స్ మినిష్టరీ కట్టబెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఢిల్లీ వర్గాల భోగట్టా అట.

ఏవైనా రాహు డిఫెన్స్ మినిష్టర్ ఐతే, దేశానికి తూట్లే అని బాధగా మూలుగుతున్నా, ఆపలేను కాబట్టి.

Jul 18, 2012

खिज़ा के फूल पे आती कभी बहार नहीं

मैं बनके आँसू खुद अपनी, नज़र से गीर जाऊं

రాజేష్ ఖన్నా గారికి నా నివాళి

Jul 17, 2012

అనఘ ఆర్ట్ - గణేశ



అయ్యా
అదన్నమాట
తన ఊహల్లోని గణేశుడిలా ఉన్నాడన్న మాట



పింక్ గణేశ్ అన్నమాట
చెల్లిని చూసి అన్న స్పూర్తిపొంది ఇప్పటికిప్పుడు ఇలా వేసినాడు

 
ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.

Jul 14, 2012

గౌహతి మొలెస్టేషన్

ఇరవై మంది మగాళ్ళు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయటం దాన్ని వీడియోతీయటం, యూట్యూబుకి ఎక్కించటం
థూ!!
ఎటుపోతున్నాం మనం? మనదీ ఓ సమాజమేనా? మనం మనుషులమేనా? మానవత్వం అనేది అసలు ఏడ్చిందా అనే ప్రశ్నలను అడగలేక అడిగినా బదులు రాక గోడల్తో మాట్లాడినట్టుగా అనిపించి, గొంతులోనే ఆపుకున్నాను.

థూ!! నాకు మాటలు రావటంలేదు.

పిల్లలు ఎటు పోతున్నారో కూడా పట్టించుకోని తల్లితండ్రులదా తప్పు? పుట్టినరోజు పండక్కి బారుకెళ్ళే సంస్కృతిదా తప్పు?

తప్పెవరిదీ అనేకన్నా మన సిస్టం ఎంతలా కుళ్ళిపోయిందో అనాలనిపిస్తున్నది

ఎందుకంటే  -
ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండు పుట్టిన్రోజు పండగ సెలబ్రెషన్సు కోసరం బార్ కి వెళ్ళింది.
మైనర్ బాలికని బారులోకి ఎలా అనుమతించారూ?
అనేది కూడా ఓ మౌళిక ప్రశ్న.
ఏవైనా సిగ్గుపడాల్సిన సంఘటన
సదరు వ్యక్తులకు కఠిన శిక్ష పడాలని కొనఊపిరితో ఉన్న న్యాయవ్యవస్థని ప్రార్థిస్తున్నా

Jul 12, 2012

తలకి గాయం - రెండో కేసు

మా బావగారు! అరవై ఏళ్ళ వయసు. భారత ప్రభుత్వానికి తనవంతు సేవ చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు.
మా అక్కగారికి[పెద్దమ్మ కూతురు] భర్త, మా నాయనమ్మ వైపు బంధువులు కూడా. వీరికి ఒక్కతే కూతురు. బిటెక్ చదివి ఎదో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. ఈమధ్యనే పెండ్లి కుదిరింది పిల్లకు. ఈనెల చివర్లో పెండ్లి. పెండ్లి పిలుపులు కూడా అందరికీ అందినాయి. పిల్లాడు కూడా మాకు బంధువే.
నిన్న బావగారు స్నానాలగదిలో జారిపడ్డారుట. తలకి తీవ్రమైన దెబ్బ. కోమాలోకి వెళ్ళారుట.

ఏంటీ ఈ స్థితి?
పిల్ల పెండ్లి ఓవైపు
మరోవైపు ఇలా

మా అక్కయ్యకి పైవాడు ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను.

Jul 11, 2012

ఆమె తల్లేనా?

కేన్సాసులో నిన్నటి ఓ వార్త
ఓ తల్లి, తాను వ్యభిచారం చేస్తూ, తన ఇద్దరు పిల్లలలి వ్యభిచారం చేయిస్తున్నదిట. ఆ పిల్లలకి పెద్దఅమ్మాయికి పదునాలుగు, చిన్న పిల్లకి పదకుండేళ్ళు.
మధ్యాహ్నం మూడు నాలుగింటి నుండి పొద్దున ఏడింటివరకూ డ్యూటీ అట ఈ పిల్లలకు.
హ్మ్! సదరు తల్లికి ఏమి శిక్ష పడింది ఇత్యాదివి పక్కన పెట్టి, తను నరక కూపంలోకి వెళ్తూ తనవాళ్ళని కూడా లాగటం, తెలిసి తెలిసీ....ఆమె తల్లేనా? అనిపించేలా చేసింది.
స్టాటిస్టిక్స్ ప్రకారం, అసలు వ్యభిచారానికి కారణాలలో అతిముఖ్య కారణం *డ్రగ్స్* అట. పై సంఘటనలో కూడా, సదరు తల్లి కూతుళ్ళ రక్తాన్ని డ్రగ్స్ కోసమే అమ్మింది.