Feb 25, 2010

తెలుగులో మాట్లాడినందుకు ఓ చిన్నారిని అర్థనగ్నంగా నిలబెట్టిన సంఘటన

తమ్ముడు సుబ్బులు ఓ లంకెని పంపాడు. దాని సారాంశం ఇది -

"తెలుగులో మాట్లాడినందుకు ఓ చిన్నారిని అర్థనగ్నంగా నిలబెట్టిన సంఘటన విజయవాడ లో చోటు చేసుకుంది. స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న యామిని అనే విద్యార్థిని తెలుగులో మాట్లాడిందని టీచర్‌ అర్థనగ్నంగా నిలబెట్టింది. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు స్కూలు యాజమాన్యాన్ని నిలదీయడంతో విషయం బయటికి తెలిసింది. ఆ స్కూల్లో ఇదొక్కటే ఘటన కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి దండన ఇచ్చారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు."

వప్పుకుంటా!! ఆంగ్ల భాషా మాధ్యమ పాఠశాలల్లో తెలుగు మాట్లాట్టం ఘోరం, క్షమించరాని నేరం, శిక్షార్హం. ఐతే ఎలాంటి శిక్ష? ఆ పాఠశాల నిబంధనలు ఏంటీ? ఏమైనా పబ్లిష్డ్ డిస్క్లైమర్ ఉందా? తెలుగులో మాట్లాడితే ఇదీ శిక్ష అని తల్లితండ్రులకు ఏమన్నా చెప్తున్నరా?

ఇక నాణేనికి ఇంకో వైపు -
అసలు ఆంగ్ల భాషా మాధ్యమ పాఠశాలల్లో పనిచెసే ఉపాధ్యాయులకు భాషార్హతలు ఏంటీ?

Feb 23, 2010

ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూస్

నేను అత్తెసరు మర్కులతో, లోకల్ ఇంజనీరింగు కాలేజీలో, సాదాసీదా యం.సి.యే చదివా. ఏవరేజి మార్కులు. పాస్ అయ్యాక కేంపస్ ఇంటర్వ్యూలు లేవు మాకు. ఏదో కష్టపడ్డా. ఎలానో ఓలా ఉద్యోగం తెచ్చుకున్నా. కిందపడ్డా లేచా. మళ్ళీ పడ్డా మళ్ళీ లేచా. దూరపుకొండల నునుపు చూద్దాం అని ఇక్కడకొచ్చా. నునుపు చూస్తున్నా. ఓ కన్సల్టెంట్ గా నెట్టకొస్తున్నా.
నాకు తెలిసినోడు ఒకడు, పేర్లనవసరం, ఆర్.ఈ.సి లో చదివాడు. మాంచి ర్యాంకు యంసెట్లో. సరే!! సదివాడు. అయ్యింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీయస్లోనో దేంట్లోనో కొట్టేసాడు. రెండేళ్ళయ్యాక అమెరికాలో వాలిపొయ్యాడు. ఓ కన్సల్టెంట్ గా చేస్తున్నాడు.
నాకూ వాడికీ తేడా ఏంటి?
నాబోటి సాధారణ బ్యాక్ గ్రౌండ్ గాడికి గంటకి సే $60 వస్తే, ఆర్.ఈ.సీ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుండొచ్చిన వాడికీ అంతే.
నాకు తెలిసిన కుఱ్ఱాడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో పిజి చేసాడు. బెంగళూరులో ఏదోక కంపెనీలో చేస్తున్నాడు.
మరింక తేడా ఏంటీ?
ఆర్.ఈ.సి లేక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ల నుండి వచ్చిన వాళ్ళు సమాజాన్ని ప్రభావితం ఎందుకు చెయ్యలేకపోతున్నారూ?
వీళ్ళు చదివిన చదువు అడవికాచిన వెన్నెల అవుతోందని ఎందుకాలోచించట్లేదు?

Feb 21, 2010

ఏంటీ ఈ అపోహలు? ఎవరు నేర్పుతున్నారిలా?



ఎవరు నేర్పుతున్నారిలా? రాజకీయ స్వార్ధాల కోసం ఇంతలా దిగజారిపోతున్నారా రాజకీయ నాయకులు?

*ఆత్మ త్యాగాలు* అని ఒక అందమైన అర్ధంకాని పదాన్ని అమాయకప్రజలపై ఉసికొల్పి, వేడెక్కించి, ముందుకునెట్టి పబ్బంగడుపుకునే ఈ ఎదవ రాజకీయ నాయకులు, దీని గురించికూడా మాట్టాడితే ఎంతబాగుంటుందీ -



పోయిన ప్రతీ ప్రాణం,
తగలబెట్టే ప్రతీ బస్సు,
నిప్పట్టించే ప్రతీ వస్తువూ,
గడచిపోయిన ప్రతీ నిమిషం,
కూలగొట్టిన ప్రతీ ప్రభుత్వ కార్యాలయ గోడా
- ప్రతీదీ విలువైందే.

మన తెలివితేటల్నీ, ఆవేశాల్నీ, ఆందోళనల్నీ, ప్రాణాల్నీ, ఆలోచనల్నీ, కన్స్ట్రక్టివ్ ప్రగతి కోసం వాడాలని కోరుకుంటా

Feb 19, 2010

ప్లేన్ హిట్స్ ఐ.ఆర్.యస్ బిల్డింగ్

ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్, ఆస్టిన్, టెక్సస్ బిల్డింగ్ పై ఒకడు ప్లైన్ తో ఎటాక్ చేసాడు.

మనవాళ్ళందరూ క్షేమం అని భావిస్తున్నా.

పన్ను సంబంధిత సమాచారం (డేటా) కూడా క్షేమం అని భావిద్దాం..

On Thursday morning, authorities in Texas said that a 53-year-old man named Joseph A. Stack III crashed a small plane into an office building in Austin that houses offices of the Internal Revenue Service. The pilot was killed and at least two people were injured.

Feb 17, 2010

35 మంది రాజినామా

వాహ్!! అత్భుతంగా ఉంది. ముప్ఫైయ్యైదు మంది లెజిస్లేచర్స్[వీళ్ళు రాజ్యాంగం చే గుర్తింపబడని - తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యులు.] రాజీనామా చేసారు. వీళ్ళు ప్రజల చేత ప్రజలకొరకు ప్రజలే ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినుధులు. వీళ్ళు భారత[కాదు కాదు!! ఏమో ఏమో??]రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధుల్లో చేరతారు.
ఐతే, వీళ్ళ పంచెలు కాపాడుకోటం కోసం ఏమైనా సేస్తారు, చేసారు, చేస్తున్నారు, ఇప్పుడు -
తమ రాజీనామాలను మన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్/రేపటి తెలంగాణా గవర్నర్ [తెలంగాణా ప్రజలు కోరుకుంటే ఈ గవర్నర్ లేకపోతే రాష్ట్రపతి, వాళ్ళిష్టం!! నేనేమీ వ్యాఖ్యానించబోను] ప్రొఫెసర్ కోదండరాం గారికి అందజేసారు.

Feb 16, 2010

మీకో బంపర్ ఆఫర్ అంట

మీకో బంపర్ ఆఫర్ అంటయ్యా!!

ఎన్దా కతా అంటారా? ఇదిగో సదూకోన్డి -

మీకో బంపర్ ఆఫరండీ. ఇంతకీ *నాన్ స్టాప్* చూసారా? చూడకపోతే ఎన్టనే సూడండి.
పస్టు ప్రైజు సాంత్రో కారండీ
రెందో ప్రైజు లచ్చ రూపాయలండీ
మూడో ప్రైజు యాబయ్య ఏలన్డీ
ఇంకా మరెన్నో ప్రైజులన్డీ

మీరు చెయ్యాల్సిందల్లా
నాన్ స్టాప్ సినిమా జూట్టం, ఈరో ఎవురో ఇలనెవరో కనిపెట్టి
మీ టికట్టుతో పాటు *సుమన్ ప్రొడక్షన్స్* కి పంపించడం.


-----
రిపరెన్సు - ఈనాడు టీవీ

Feb 14, 2010

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ

ఓం నమో భగవతే రుద్రాయ

అయ్యా అదీ సంగతి.
జీవితంలో మొట్టమొదటి సారి శివరాత్రికి జాగారం చేసా. అదీ శివాలయంలో, అదీ అనుకోకుండా, అదీ శివ ధ్యానంలో, అదీ శివ ఘోషలో తడిసిపోతూ, అదీ ఆ ఘోషలో పాలుపంచుకుంటూ.
అత్భుతమైన అనుభవం.
ఆనందకరమైన అనుభవం.
చాలా అవసమైన దీవెన.

శుక్రవారం, మా ఊళ్ళో శివరాత్రి పండుగని జనసందోహం భక్తి శ్రద్ధల్తో జరుపుకున్నాం. వారంముందే పోష్టరేసారు. అహోరాత్ర మహన్యాస పారాయణలో పాల్పంచుకోండీ అని. అప్పుడే చెప్పా, రెండో ఝాములో వస్తా అని చెప్పా.

పదకుండింటికల్లా చేరుకున్నా. కొందరు వారి టర్మ్ ముగించేయబోతున్నారు. వెళ్ళా. కూర్చున్నా.
నా స్లాట్లో మొత్తం ఐదుగ్గురు ఔత్సాహితులు ఉన్నారు నాతో కలిపి.
ఎలా ఏంటి ప్లాన్ అన్నా.
ప్రతీ ఝాముకి పదకుండుసార్లు పారాయణం చేయగల్గాలి అన్నారు.
లఘున్యాసం తో మొదలియ్యింది పారాయణ.
త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనం
ఊర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతా"త్॥

అయ్యాక చమకప్రశ్నలోని మొదటి పన్నా
అగ్నావిష్ణూ సజోషసేమా వర్ధన్తు వాంగిరః। ద్యుమ్నైర్వాజేభిరాగతం....శరీరాణి చ మే।
జ్యైష్ఠం చ మ ఓం శాంతిః శాంతిః శాంతిః

తో ఆగి మళ్ళీ మొదలై
ఓం నమో భగవతే రుద్రాయ।
ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
...నుండి
త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనం
ఊర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతా"త్॥

తర్వాత
జ్యేష్ఠం చ మ ఆధిపత్యం చ మే ... మతిశ్చ మే సుమతిశ్చ మే।
శం చ మే। ఓం శాంతిః శాంతిః శాంతిః

తో ఆగి మళ్ళీ మొదలి......
అలా పదిసార్లయ్యాక, పదుకుండోసారితో అభిషేకం చేసి, అలంకారం చెసి, నివేదనలు చేసి...
మళ్ళీ మొదలుపెట్టి...
అలా....
తెల్లవారి ఆరుకల్లా మొత్తం పూర్తిచేసి,
కలసాలను కదిలించి, వాటితో అభిషేకించి -
అలంకారం నివేదనలు చేసి - అయ్యా అని నమస్కరించుకుని, గుడి మొత్తం శుభ్రంగా ఊడ్చి పొద్దున ఏదుకి ఇంటికిజేరా.

నేను ముందు పదకుండునుండి కూర్చుని, పదకుండు సార్లు చదివి వచ్చేద్దాం అనుకున్నా.
ఇంతలో ఓ పెద్దాయన, భాస్కరం! సాధ్యమైనంత సేపు కూర్చోండి, పూజారికి కాస్త తోడుగా ఉండండి, ఏమైనా అభ్యంతరమా అన్నారు.
సరే నండీ మాష్టరూ ఉంటా అన్నా....మొత్తానికి ఓ పదిమందిమి ఆ పరమశివుని సేవలో తరించాం.

చాలా ఆనందంగా ఉంది.

మరొక్కసారి -
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ
మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవయ నమః



From shivaratri

Feb 6, 2010

ప్రసూన్ జోషి

ఇతను చాలా చక్కటి పాటలు రాసాడు. ఫనా, తారే జమీన్ పర్, దిల్లీ ఆరు, రంగ్ దె బాసన్తి ఇత్యాది సినిమాలకి కమ్మని పాటలు అందించాడు.

ఐతే, అంతే కమ్మగా పాడగలని ఈ పాట చూసాక అర్ధం అయ్యింది.


అలానే ౯/౨౬ పై ఒక పాట, కవిత -

Feb 4, 2010

ఆహార ధాన్యాల ధ్వంసం - జాతి విద్రోహం

అహా!! మొత్తానికి హైకోర్టు వజ్రాల్లాంటి మాటలు పలికింది. ఈ వార్త చూడండి.
http://www.eenadu.net/story.asp?qry1=3&reccount=38
డిశెంబరు ౨౪ బంద్ సందర్భంగా మహబూబ్ నగర్ జుల్లాలో తహసీల్దారు కార్యాలయానికీ, ధాన్య గిడ్డంగికీ నిప్పుపెట్టారు మన *తెలంగాణా* సహోదరులు. దానివల్ల వంటనూనె, బంగారంలాంటి కందిపప్పు, పందార, బియ్యం మొత్తం యాభైలక్షల సరుకు మసి.
"ఇలాంటి సందర్భంలో దేశంలో సంభవిస్తున్న ఆకలి చావులని మరువరాదు: అన్నారు న్యాయమూర్తి. "కొన్ని కోట్లమంది దారిద్యరేఖకి దిగువన ఉన్నార"ని, "ఈ నేపధ్యంలో ధాన్యానికి కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ నష్టం కలిగించటాన్ని జాతి వ్యతిరేక చర్య"గా న్యాయమూర్తి పేర్కొన్నారు.
"రాజ్యాంగంలోని ౫౧-ఎ అధికరణ మన విధులను తెలియజేసుంది".
"జాతికి చెందిన ఆస్తుల విధ్వంసంలో పాల్గొనే వ్యక్తి..భారతీయుడిగా విధులను ఉల్లంఘించినట్టే"నని స్పష్టం చేసారు.

పై వాటికి కారణాలు సరైన మార్గదర్శకం లేకపోవటం ఒక కారణం.

కొందరు పెద్దలు దీన్ని మార్గదర్శకం లేకపోటమే కాదు, కొవ్వెక్కి, సమాజిక బాథ్య లేక, తిన్నదరక్క అనికూడా అంటుంటారు.
బస్సులు తగలెట్టటం, కార్యాలయాల్ని తగలెట్టటం ఇవీ మనం ముందుతరాలకి నేర్పాల్సిన విద్యలు.
మొత్తానికి మంచి మాట చెప్పెరా సదరు న్యాయమూర్తి గారు.
ఐతే, ఈ నష్టాన్ని ఉద్యమకారులే, ఉద్యమ కర్తలే భరించాలి అని బిల్లు పంపితే బాగుటుంది.

Feb 2, 2010

టయోటా!! ఏమైంది నీ మాట

టయోట అ.క.అ టొయొట. ఈపేరు ఈవ్వాల్టి రోజున కొత్తగా పరిచయం చేయ్యాల్సిన పనిలేదు. అత్భుతమైన కార్లు వీడి సొంతం. కామ్రి, కరోలా, హైల్యాండర్, యారిస్, ప్రయస్, యాట యాట యాట.

ఈ మధ్య వార్త -
టయోటా వాడు మొత్తం ఇప్పటికి ఇరవైలక్షల కార్లను వెనక్కి పిలిచాడు. కారణం - గ్యాస్ పెడల్ అనగా యాక్సిలేటర్.
సమస్యేంటంటే, గ్యాస్ పెడల్ ని తొక్కామనుకోండి. దానిపైనుండి కాలు తీసేస్తే అది మళ్ళీ వెనక్కి అనగా యధాస్థానానికి రావటనికి కష్టపడుతోంది. అనగా, గ్యాస్ పెడల్ పైన కాలు తీసేసినా మీ కారు యాక్సెల్ అవుతూనే ఉంటుంది. అది డేంజర్ అపాయం.
అలానే గ్యాస్ పెడల్ ఫ్లోర్ దగ్గర ఇరుక్కుపోతోందనికూడా తెలిపారు టయోటా వారు.

On January 21, Toyota announced its intention to recall approximately 2.3 million select Toyota Division vehicles equipped with a specific pedal assembly and suspended sales of the eight models involved in the recall on January 26.

Toyota vehicles affected by the recall include:
• Certain 2009-2010 RAV4
• Certain 2009-2010 Corolla
• 2009-2010 Matrix
• 2005-2010 Avalon
• Certain 2007-2010 Camry
• Certain 2010 Highlander
• 2007-2010 Tundra
• 2008-2010 Sequoia

కాబట్టి, బాబయా!! జరహుషారుండాలే!!!