నిన్న రాత్రి జరిగిన ఫైనల్ లో జహంగీర్ మెహత ఓడిపొయ్యాడు.
ఫుడ్ నెట్వర్క్ వారి కిచెన్ స్టేడియం లో ఇద్దరు వంటగాళ్ళు పోటీపడుతుంటారు. ప్రతీ పోటీకి ఒక రహస్య ఇన్గ్రేడియంట్ ఉంటుంది. నిన్న అది బీఫ్.
మనోడు దేశీయుడు. రెండోవాడు లాటినొ. మనోడు ఎంత నేర్చుకున్నా, చిన్నప్పటినుండీ తినని లేక వండేప్పుడు చూడని, చూసి నేర్చుకోని కొన్ని టెక్నిక్ లను మిస్స్ అయ్యాడు. ఆరెండోవాడు పుట్టినప్పటినుండి బీఫ్ తిన్నాడు, ఇంట్లో వండుతుంటే చూసాడు కాబట్టి అది వాడికి ఎడ్వాంటేజ్ అయ్యింది. నేటివ్ ఎడ్వాంటేజ్ వచ్చేలా రహస్య ఇన్గ్రేడియంట్ ని ఎన్నుకోటం కుట్ర.
మనోడు పులావు వండివార్చాడు, అందరికీ నచ్చింది. బర్గర్ చేసాడు, అదే అతని కొంప ముంచింది. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాడు ఒక్కోటి చేంతాడంత లావున. ఆరుగ్గురు జడ్జ్ లకు అది నచ్చలేదు.
ఒక భారతీయుడు అమెరికా వంటల్లో ఇంత దూరం రాగలగటం గొప్ప. ఫైనల్ లో ఓడినా, నేనేతై, *పో సోదరా గెలిచావ్* అన్నాను. అతనికి నా మాటలు వినిపించలేదు అఫ్కోర్స్.
Nov 23, 2009
Nov 19, 2009
మెహత గెలుస్తాడా?
వంటగాడు జహంగీర్ మెహతా -
జహంగీర్ మెహతా, born July 9, 1971 in Mumbai, India, ఒక executive chef మరియూ New York City restaurant Graffiti అనే దానికి ఓనరు. ఇతను "Mantra: The Rules of Indulgence," అనే ఒక పుస్తకం కూడా రాసాడు. ఇతను 4-14 సమచ్చరాల వయసున్న పిల్లలకి క్యాండీ క్యాంప్ నిర్వహిస్తుంటాడు. చక్కటి ఆలోచనే.
ఇక విషయంలోకొస్తే ఐరన్ షెఫ్ అమెరికా అనే ఓ ఫుడ్ నెట్వర్క్ వారి ఛాలంజ్ లో ఇతను ఫైనల్ కి చెరుకున్నాడు.
చక్కటి వంట, చక్కటి ప్రజెంటేషన్, సమయస్పూర్తి, నవ్వు మొఖం ఇతని సొంతం. ఐతే పోయినవారం ఇతనిపై జడ్జ్ ల కామెంట్ - నీ ప్రెజెంటేషనే నీ బలం, అదే నీ ఈక్నెస్ కూడా అని.
రెండో చెఫ్ - హొసె గార్సెస్.

Nov 11, 2009
Nov 6, 2009
డ్రాపౌట్స్ కి కారణం విద్యార్ధుల్లో ఉత్సుకత లేమి ప్రధానకారణమట
National Sample Survey Organisation (NSSO) conducts nationwide sample surveys on various socio-economic issues in successive rounds, each round covering subjects of current interest in a specific survey period. The organisation has four divisions :
(i) Survey Design and Research Division (SDRD)
(ii) Field Operations Division (FOD)
(iii) Data Processing Division (DPD) and
(iv) Co-ordination and Publication Division (CPD)
ఈ NSSO నిర్వహించిన ఒక సర్వే ప్రకారం డ్రాపౌట్స్ కి కారణం విద్యార్ధుల్లో ఉత్సుకత లేమి ప్రధానకారణమట.
మా నాయన ప్రధానోపాధ్యాయుడిగా చేసేప్పుడు డ్రాపైట్స్ పై జరిగిన ఒక సర్వే ప్రకారం కనుగొన్న కొన్ని నిజలు -
తెలుసుకునే ముందు -
అసలు ఈ రోజూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న పిల్లలు ఎవరూ? సింహభాగం బీద బిక్కి, కూలీలు, పేద లోయర్ మిడిల్ క్లాస్, మిగతావాళ్ళు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే తాయిలాలను మిస్ కాకూడాదూ అనుకునే గుంపు. అలానే ప్రతీ సంవత్సరం, కాలంలో మార్పుల చక్రం మనకి తెలుసు. బళ్ళు మొదలైయ్యేది జూన్ మన్నెండు. డ్రై సీజన్. అప్పుడు బళ్ళు కళకళల్లాడతాయి. జులై దాటి ఆగస్ట్ వచ్చేప్పటికి సగం అయి కూర్చుంటాయి బళ్ళు. కారణం, నాట్లు మొదలవ్వటం, కూలలకి గిరాకీ ఏర్పట్టం. వ్యవసాయ కూలీలుగా వెళ్ళేవాళ్ళలో పది నుండి పదిహేనేళ్ళ పిల్లశాతం ఇంత అని పై సర్వే చెప్తే నేను మెచ్చుకునేవాణ్ణి. అలానే పంట చేతికొచ్చే సమయంలో బళ్ళు ఖాళీ.
సర్వే వివరాల్లోకొస్తే -
ఎక్కువ డ్రాపౌట్లకు ఎవరివీ? - పై కూలీల పిల్లలవి.
ఉదాహరణ - మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యమైన పంట మల్లెలు. ఇటు గుంటూరికి అటు బెజవాడకీ మల్లెపూలు మంగళగిరి మండలం నుండే వచ్చేది. పూలు కోసేది ఎవరూ? ఈ పిల్లలే!!
కొంతశాతం - కూలీలుగా వెళ్ళిన తల్లితండ్రుల కుటుంబాలకు పిల్లల్ని చూసుకునే అవసరాలు, బరెగొడ్లు కాసుకొచ్చే అవసరాలు ఇత్యాదివాటికోసం కొంతశాతం మంది పిల్లలు బడికి ఎగనామం పెట్టేస్తున్నారు.
తగ్గించే దిశ -
మధ్యాన భోజన పధకం
పనికి ఆహార పధకం (తల్లితండ్రులకు, సో దట్ పిల్లల సంపాదనపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా)
ఉచిత వసతి
ఉచిత పుస్తకలు
యాట యాట యాట.
NSSO ప్రభుత్వ యాజమాన్య సంస్థ కదా. అందుకని వాళ్ళు నిజాలను కప్పెట్టేసారేమో, ఎందుకంటే “lack of interest” by students అనే పదం లేక స్థితి మనకి లేనె లేదు. అసలు పిల్లవాడికి *నాకు నచ్చలేదు* అనే స్వాతంత్రం లేదు. బడిమానెసే నిర్ణయం పిల్లవాడికి కలలో కూడా అందుబాటులో లేదు. బడిమానేయటం కేవలం తల్లితండ్రుల నిర్ణయం. నిజమైన పరీస్థితులను అందించటం ప్రభుత్వ రంగ పబ్లికేషన్స్ కి కష్టమే. అందుకని సమస్యని ఏ ఉపాధ్యాయులమీదనో తోసేస్తే *ఉపాధ్యాయుల ప్రక్షాళన* అని చెప్పో మరింకో మాటచెప్పో ప్రపంచబ్యాంక్ ఫండ్స్ కొట్టేయచ్చని ప్రభుత్వ పన్నాగం అయిఉండొచ్చుకూడా.

Nov 5, 2009
తెలుగు మాధ్యమ బళ్ళ బోధనలో నాణ్యత లేదా?
కూడలి/బ్లాగులు వ్యాఖ్యల్లో ఎక్కడో ఎవరో ఇలా ఇచ్చన ఒక స్టేట్మెంట్ నా కంటపడింది -
>>ఇప్పటికీ సగర్వంగా తెలుగుమీడియం చదువులు చదువుతూ, బోధనలో నాణ్యత లేక...యాట యాట యాట
ఎక్కడ నాణ్యత ఉందీ?
సందుచివరన ఉన్న ఒక పాకలో కాన్వెంటుపెడితే, కాన్వెంటుపెట్టినోడి బామ్మర్ది పెళ్ళాం తమ్ముడి బామ్మర్ది అక్కని టీచరుగా అప్పాయింటుచేస్కుంటున్నారు. ఆమె ఏమి చెప్తుందీ? అర్హతలు ఏంటి?
అసలు ఒక ఆంగ్ల లేక తెలుగు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల అర్హతని ఎవరు పరీక్షిస్తారు, ఎవరు నిర్దేశిస్తారూ? ఆ ఉపాధ్యాయ స్థానాకి ఎంపిక విధానం ఏంటి?
కూర్చోపెట్టి నాలుగుముక్కలు ఆంగ్లంలోనైనా తెలుగులోనైనా ఓ బెత్తంపుచ్చుకుని రుబ్బించటానికి ఏ అర్హతా అవసరంలేదు. ఇప్పటి పాఠశాలల్లో జరుగుతోంది అదే.
తమతమ బోధనా అంశాల్లో చేతులుతిరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు నాకు కొన్ని వందలమంది తెలుసు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పరీక్షలు పాసై, ఇంటర్వ్యూలలో నెగ్గి బోధనావృత్తిని చేపట్టినవారు.
ఇక్కడ విషయం - క్రేజ్. పక్కనోళ్ళని చూసి వాతలు పెట్టుకొనుట. ఆళ్ళు జేర్పించారు, మనమేం తక్కువా? అని హంగు పొంగు చూపుకోటంకోసం. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ అని రైం పాడుతుంటే అర్ధం కాకపోయినా వచ్చే కిక్కు కోసం.
ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇలా ఆడిపోసుకునే హక్కు ఎవరికీ లేదు, నిజంగా ఆ ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు తప్పుచేస్తే తప్ప.
ఎన్ని ప్రైవేటూ బళ్ళకు కనీస వసతులు ఉన్నాయీ?
ఓ ఆట స్థలం ఉందా?
ఓ ల్యాబ్ ఉందా?
క్రాఫ్ట్స్ పీరియడ్ అంటే ఎంతమంది ప్రైవేటు బడిపిల్లలకు తెలుసూ?
ఎంతమంది ప్రైవేటు బడిపిల్లలు బళ్ళో మొక్కలు నాటతారు?
ఎంతమంది పిల్లలు ఆ మొక్కలకు నీళ్ళు పోస్తారు?
ఉపాధ్యాయ కుటుంబం మాది, తరతరాలుగా. పల్నాడు మొత్తంలో మా నాయన కీర్తిప్రతిష్టలు సంపాదించిన లెక్కల ఉపాధ్యాయుడు. బజారులో నడచి వస్తుంటే లేచి నిల్చునే వాళ్ళు జనాలు, అదీ ఆరోజున ఓ ఉపాధ్యాయుడికి, *ఉపాధ్యాయుడికి మాత్రమే* దక్కిన గౌరవం.
కారణాలు - ఉపాధ్యాయుల మేధస్సు. విషయపరిజ్ఞానం, సాహిత్యావలోకనం, నిరంతర పఠనం, బాధ్యత, విశాల ధృక్పదం, మరియూ ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం అన్నిటికన్నా నేను నలుగురికీ చెప్పాలంటే నేను నిష్టగా ఉండాలి విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉండాలీ అనే డెడికేషన్.
పదోతరగతి వాళ్ళకు పోటీలుపడి మరీ డిశెంబరుకల్లా పాఠ్యాంశాలు బోధించేసి, వారానికో పరీక్షపెట్టి వాళ్ళకు పదునుపెట్టి, పెద్దపరీక్షలు దగ్గరైయ్యేకొద్దీ రోజుకో పరీక్షపెట్టి, సాయంత్రాలు ఎత్తుబళ్ళో చదువుకునే గంటల విధానాలు ప్రవేశపెట్టి ఇలా అనునిత్యం కష్టపడేవాళ్ళు ఉపాధ్యాయులంటే. కొందరు ఉండొచ్చు, సొంతవ్యాపారాల్లో మునిగితెలేవాళ్ళు.
ఎందుకిలా? ఒకానొన రోజున ఉద్యోగం ఏదైనా మహాప్రసాదంలా భావించేవాళ్ళు. ఉపాధ్యాయవృత్తి చేప్పట్టటం అంటే అదో కల మరియూ అవసరం కూడా. పేద లేక మధ్యతరగతి వాళ్ళు మాత్రమే వచ్చే వాళ్ళు ఉపాధ్యాయులుగా. ధనికులైన వాళ్ళు అతితక్కువ. అందుకే వీరికి వేరే వ్యాపారాలు గట్రా ఉండేవి కావు. మరియూ లైఫ్ టైం కమిట్మెంట్. ముఫైయైదు సంవత్సరాలు సర్వీసు కాలం. మరి ప్రైవేటు ఉపాధ్యాయులకో? ఈరోజు వస్తాడు, రేపు, బబాయ్ ఇంతకన్నా ఎక్కువ డబ్బు చిట్ ఫండ్లో వస్తోందీ అని మానేస్తాడు. కొత్త ముఖం వస్తుంది మళ్ళీ, ఈ వచ్చినవాడు, నేనే వేరే వ్యాపారం చేస్కుంటా అని సగం లో నిష్క్రమిస్తాడు.
ఈరోజున శ్రీ చైతన్యా లాంటి కార్పోరేట్ విద్యాసంస్థలు నిజంగానే స్టేట్ ర్యాంకులని కొల్లగొడుతున్నాయా?
ఉత్తి బూటకం, ఉత్తి నాటకం.
తాడికొండ లాంటి ఏపి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఒకప్పుడు ఊపేసాయి. కారణం, అప్పట్లో దానికి అర్హత కేవలం మెరిట్. తర్వాతర్వాత మెరిట్ కన్నా వార్షికదాయపరిమితి ఎక్కువైంది. దాంతో, వాటికి వెళ్ళే విద్యార్ధుల సంఖ్య, స్థాయి పడిపోయాయి, మరియూ రిజర్వేషన్స్ ఎక్కువకావటం కూడా జరిగింది.

Nov 4, 2009
మఱ్ఱిచెట్టు మహాలక్ష్మమ్మగారి ముద్దుల మూడో మనుమరాలు
సు.వీ: మింగినట్లున్నావ్ కొత్తావకాయతో కొండంత బాయ?
రోగి:చిత్తం. ఆహా!! చేయిచూడకుండానే ఎలా చెప్పగలిగారో మహానుభావులు?
సు.వీ:ఆవకాయలో వేడిఉంటుంది. ఆవేడి నాలాంటి వాడికల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా కోడి. ఇదిగో ఈ మాత్రలు తీస్కెళ్ళి రాత్రికి రెండు పొద్దున్నే పది మింగు.
[ఇంతలో సుత్తివేలు వస్తాడు, వచ్చి కుర్చీలో కూలబడతాడు]
సు.వీ:జంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డావేం?
రోగి:నేనాండి?
సు.వీ:నిన్ను కాదు. నువ్వెళ్ళు
రోగి:వత్తాను బాబయ్యా
సు.వీ:కోడలేదిరా?
కోడలేదిరా అంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా ఊడల జుట్టు వెధవ. ఏం అమ్మేసావా?
సుత్తివేలు:నా ఖర్మ. సినిమాకెళ్ళామా!! అందులో ఓ మాంచి ఫైటింగు సీను వచ్చింది. హీరో రౌడీల్ని బాత్తున్నాడు. అదిచూసి నీ కోడలు అమెరికాకి వినిపించేట్టుగా కై మని ఓ ఈలకొట్టింది. దాంతో ముందు సీట్లోని ఒకామెకి గుండేజబ్బు వచ్చి పడిపోయింది.
సు.వీ:హమ్మా హహహ [గుండెమీద చెయ్యి పెట్టుకుని]
సుత్తివేలు:నాన్నా నాన్నా నీక్కూడానా? నాకంత అదృష్టంకూడానా? ఆ ఆపరేటరు ఈలవిని భయపడి సినిమా ఆపేసి లైట్లేసాడు. జనాలంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నే పారిపోయివచ్చా. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా చూపించాల్సిందే అంటూ ఈలేసి గోలచేస్తోందక్కడ.
సు.వీ:ఈ ఈలల గోల మనకేల. ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేనిదే
సుత్తివేలు:అబ్బా తన ఈలతో నే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోల ఏంటినాన్నాతలవాచిపోతోంది.
ఇంతలో శ్రీలక్ష్మి వస్తుంది.
సుత్తివేలు:ఆగు! ఏవిటే, హుం? ఏవిటి ఇందాక నువ్వక్కడ చేసిన పని?
శ్రీలక్ష్మి:కోప్పడకండి. అంత శబ్దం వస్తుందని అనుకోలేదు.
సుత్తివేలు:ని ని నిన్ను, ఈ జన్మలో బయటకి తీస్కెళ్తే చెవిలో ఈలేసి చంపేయవే
శ్రీలక్ష్మి:అంతమాట అనకండి. ఈలవేయటం నాకిమాత్రం ఇష్టమానా? ఏం చేయను చెప్పండి, ఎక్కువ సంతోషం కానీ బాధగానీ కలిగినప్పుడు, వేళ్ళు వాటంతట అవే దగ్గరౌతాయ్, నోటిదగ్గరకి వెళ్ళిపోతాయ్, నోట్లోంచి గాలొస్తుంది, బయటకి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకుతెలియకుండానే జరిగిపోతాయండి.
సుత్తివేలు:నావల్లకాదే. ఈలేసే పెళ్ళాణ్ణి ఏలుకోలేను. ఇవ్వాళ్ళో రేపో వకిలు గారిని కలిసి నీకు విడాకులిచ్చేస్తా.
శ్రీలక్ష్మి:అంటే ఏంటండీ
సుత్తివేలు:కోర్టువారు నీకూ నాకూ ఏ సంబంధం లేదని కాయితం ఇస్తారు. అది
శ్రీలక్ష్మి:కైఈఈఈఈఈఈఈ!! క్షమించండి ఇది బాధ ఈల
సుత్తివేలు:ఓసి నీ బాధ తగలెయ్యా
సు.వీ:గుండిగకిందపడ్డ అప్పడంలా చితికిపోయింది కదమ్మా గుండె. ఒరేయ్ కుంకాక్షి. ఇహనుంచి క్షమించమని నీ ఆవిణ్ణి ఏదీ అడక్కు. ఆసంబరంలో ఈలకొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలౌతుంది. స్వస్తి.
సుత్తివేలు:ప ప లోపలికి ప.
సుత్తివేలు:ఇదిగో ఇదిగో ఇప్పుడేమయ్యిందనే ఈలకొడుతున్నావ్
శ్రీలక్ష్మి:తాతగారు గుర్తుకొచ్చి.
సుత్తివేలు:చూడు, చచ్చిపోయినవారి పట్ల మౌనంపాటించాలే కానీ ఇలా ఈల వేసి చప్పట్లుకొట్టి గోలచేయకూడదు.
శ్రీలక్ష్మి:నాకుతెలియదండి
సుత్తివేలు:నాఖర్మే నా ఖర్మ. మన పెళ్ళి చూపులప్పుడు, సరిగ్గా నిన్ను ఇంట్లోంచి తీసుకునొచ్చేముందు లోపలనుంచి కైఈఈ మని ఈల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్లో పాలేరు వెధవ ఈలేసాడని సర్దిచెప్పాడు మీనాన్న. నిజమే అనుకుని మోసపొయ్యాను.
శ్రీలక్ష్మి:రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూసాను, అంతే!!!!!
సు.వీ అలా కుర్చీలో కూర్చుని ఉంటాడు. సుత్తివేలు టకామనొచ్చి ఇటుపక్క కుర్చీలో కూలబడతాడు. అలవాటుప్రకారం సు.వీ సుత్తివేలు వైపు చూడకుండ ఇంకోవైపు చూస్తూ, పక్కనే ఉన్న మందుల డబ్భలో చేయిపెట్టి
హా ఏవిటయ్యా జబ్బూ, నువ్వా!! ఏరా గస్తీ గుమస్తాలా చంకన సర్టిఫికేట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగొస్తున్నట్టున్నావ్. ఏవైంది? ఉద్యోగం వచ్చిందా?
సుత్తివేలు:హహ రాలేదు నాన్నా, హహహ ఇంకోళ్ళకి ఇచ్చెసారు.
సు.వీ:హా?? ఎవైరానా ఉద్యోగం రాకపోతే బాధపడతారు! నువ్వు సంతోషపడతావేరా అక్కుపక్షి??
సుత్తివేలు:ఏం చేయనూ ఛావనా? నా ఖర్మకలి ఉద్యోగం వచ్చి పట్నంకెళ్ళి కాపరంపెట్టా అనుకో, నీకోడలు నిమిషానికోసారి కైకై అని ఈలకొట్టిందంటే ఇదేదో దొంగలముఠా నాయకురాలనుకుని పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తారు. మొన్నేంజరిగిందో తెలుసా?
సు.వీ:తెలియదే??
సుత్తివేలు:విను. పట్నం తీస్కెళ్ళానా. అక్కడ రైలెక్కబోతూ స్టేషన్లో మావిడి తాండ్ర అమ్మేవాణ్ణి చూసి కూకూ అని ఓ విసురు విసిరింది. అది గార్డు విజిల్ అనుకుని రైలెళ్ళిపోయింది. ఛస్తున్నానుకో దీంతో..
సు.వీ:విధివైపరీత్యం. మంచి మర్యాదలుకల మహామగువ మానవసేవే మాధసేవని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మఱ్ఱిచెట్టు మహాలక్ష్మమ్మగారి ముద్దుల మూడో మనుమరాలుకదా అని మనువు చేస్కుంటే
సుత్తివేలు:నాన్నా! నీప్రాస ఆపు ఛస్తున్నాను. ఈ జన్మలో నువ్వు కధరాయలేవు, రచయితవీ కాలేవు. ఇంకా ఎందుకీ ప్రాసా ప్రయాసానూ
సు.వీ:నోర్మూయ్. మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా, బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా, చదలు కొట్టేసిన చక్కముక్కలా, కుక్కపీకేసిన పిచ్చి మొక్కలా, బిక్కమొహంవేస్కుని, వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ, చుక్కలు లెక్కబెడుతూ, ఇక్కడే ఈ వుక్కలో గుక్కపట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేస్కుని, డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుంటూ, నక్కపీనుగలా చెక్కిలాలు తింటూ, అరటితొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కుజుట్టేస్కుని, ముక్కుపొడిపీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్ళాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులుచేస్తూ, రెక్కలుతెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్కబల్లమీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏపక్కకో ఓ పక్కకెళ్ళి, పిక్కబలంకొద్దీ తిరిగి, నీ డొక్కసుద్ధితో వాళ్ళని ఢక్కాముక్కీలు తినిపించి, నీ లక్కు పరీక్షించుకుని, ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని, ఒక చిక్కటి ఎడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని, తీసుకురావొచ్చుకదరా తిక్క సన్నాసి.
హహ ఇందులో యాభైయారు కాలున్నాయి తెలుసా?
నిన్న తెలుగువన్ లో ఏదో హాస్యపు ఛురకుల్ చూస్తుంటే పట్టేసాను పై హాస్యాన్ని.
సు.వి = సుత్తి వీరభద్రరావు తండ్రిగా , సుత్తివేలు కొడుగ్గా, శ్రీలక్ష్మి సుత్తివేలుకి భార్యగా వేసారు. ఆనందభైరవి అనుకుంటా సినిమా.
ఇక్కడ వినండి ఈ ఆడియో http://nalabhima.posterous.com/6968665.

Nov 3, 2009
మాతృభాష
మాతృభాషని పిల్లలకి నేర్పడం ఓ సామాజిక బాధ్యత అని నా నమ్మకం. భాషని కేవలం తల్లితండ్రులే బతికించగలుగుతారు. బడిని, పిల్లలు తిరిగే ప్రదేశాలని అన్నిటినీ తల్లితండ్రులు మాత్రమే కంట్రోలు చేయగలుగుతారు. ఎలా అంటే మా అబ్బాయి మీ బడికి ఎందుకురావాలి, ఏమి నేర్పుతున్నారూ? ఇవి నేర్పండి. ఇలా ఐతేనే మావాడు మీ బడికి వస్తాడు అని మా అబ్బాయి ఇక్కడ ఆడుకోవాలంటే ఈఈ పరీస్థితులు ఉండాలి అనీ.
ఈ మధ్య మా ఊళ్ళోని కొందరిని గమనిస్తే నాకు పిచ్చి కోపంవస్తోంది. తెలుగు తల్లి తండ్రులే, పిల్లల్తో ఆంగ్లంలో మాట్టాడుతున్నారు. సరే, ఆ తల్లితండ్రుల తల్లితండ్రులు చూట్టానికి వచ్చి, వాళ్ళుకూడా పిల్లల్తో ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. వచ్చీరాని భాషని. ఈ మధ్య మా ఇంటికి ఇలాంటి ఒక తల్లి, ఒక కూతురు, ఒక మనుమరాలు వచ్చారు. మావాడు ఆంగ్లంలో మాట్లాడుతుంటే మావిడ అరేయ్, తెలుగులో ఏడువు అని చెప్పిందట, ఆ ముసలామే, పర్వాలేదు, నేను అర్ధం చేస్కోగలను అలవాటయిపోయింది అని సూరిగాడితో ఆంగ్లంలో మాట్లాడిందట. ఆళ్ళు వెళ్ళిపొయ్యాక మావాడికి ఘట్టి క్లాసు పీకాం. ఇంట్లో ఆంగ్లం వద్దు అని. చక్కగామాట్లాడతాడు మావాడు తెలుగు. మేమేనాడు వాడితో ఆంగ్లం మాట్లాడలేదు.
అంతదాకా ఎందుకు, నేను ఒకటినుండి పదివరకు తెలుగు మీడియంలో, ప్రభుత్వ అభ్యుదయ పాఠశాలలో, ఆం.ప్ర.రా.జి.ప్ర.ప.ఉ.పాఠశాలలోనే చదువుకున్నా. ఆగ్లం భాషలో చదవకపోవటం ఆటంకంగా నాకు ఎక్కడా ఆనిపించలా.
నేను దేశదేశాలు తిరిగాను. హెలనిక్ రిపబ్లిక్ లో పని చెసాను. రోమన్ రాజ్యంలో పని చేసా. నాకు ఇటాలియన్ వచ్చు, గ్రీక్ వచ్చు, కొంచెం రష్యన్ వచ్చు, కొంచెం జెర్మన్ వచ్చు, కొంచెం స్పానిష్ కూడా వచ్చు. భాష తెలుసుకోవటం భావాన్ని వ్యక్తపరచే ప్రక్రియలో ముఖ్యమైనది.
ఆశ్చర్యకరమైన విషయాలేంటంటే - ఐరోపా దేశాల్లో తొంభైశాతం బళ్ళు వాళ్ళ వాళ్ళ మాత్రుభాషల్లోనే భోదిస్తాయి. ఐతే వాడుక భాషలో ఆంగ్లం నేర్చుకోటానికి బడే అవసరంలేదు. *లెరనింగ్ బై ఇమిటేషన్* అని ఒకటుంటుంది. చూసి నేర్చుకో. మాట్లాడి నేర్చుకో. సింపుల్.
అలానే ఎక్కడో దేనికో వెతుకుతుంటే పిల్లలమఱ్ఱి అరవింద మరియూ కూచిమంచి రవి అనే భార్యాభర్తల దగ్గర ఆగింది నా గూగుల్ వెతుకులాట. పిల్లలమఱ్ఱి అరవింద ఈమాట లో ఓ చక్కని వ్యాసాన్ని రాసారు.
తెలుగదేల యన్న … http://www.eemaata.com/em/issues/200509/64.html
ఇలా అంటుంది ఈమె -
"కాని ఈ రోజుల్లో కూడ రెండు మూడేండ్ల వయసున్న పిల్లలు తెలుగు మాట్లాడుతుంటే, “ఇంకెంత కాలం మాట్లాడుతారట్లా?” అని అందరు అనుకుంటారే తప్ప, ఆ వయస్సులో ఉన్న కేపబిలిటీని ఎట్లా నర్చర్ చేయ్యాలి అని ఎక్కువ మంది ఆలోచించరు."
ఇది అక్షరాలా నిజం. మావాడు టీవీలో కైలాన్ అని ఓ జాపనీస్ కార్టూన్ చూస్తాడు. నిహావ్ అంటే అర్ధం తెలుసు వాడికి. అలానే డోరా డియాగో చూస్తాడు ఆయూడమే అంటే తెలుసు వాడికి. కారణం వీళ్ళు ఆంగ్లంతోపాటు ఇతర భాషల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం మన మాతృభాషని చంపేస్తున్నాం. ఎంతతేడా? ఎంత దారుణం? ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే లేత వయసులో పిల్లలు కనీసం ఆరు భాషల్ని నేర్చేస్కోగలరట. అందుకే అరవింద *ఎట్లా నర్చర్ చేయాలి అని ఎందుకాలోచించరూ* అని అంది.
ఏమౌతుంది నేర్పకపోతే? *ఫన్* అనేది పోతుంది. మాడలీకం పోతుంది. దాంట్లోని *మన తనం* పోతుంది. ఈరోజు రేపట్లో నేరాసే పోస్టులు కొన్ని కొంతమందికి భలే నచ్చుతున్నాయి. కారణం? ఆ *మన తనమే*. తెలుగులో ఆలోచించలేని వాళ్ళు పధ్యంది అనే అనుకుంటారు, భాషలోని ఆనందాన్ని పట్టెసినవాళ్ళు పజ్జెంది అంటే కమ్మగా నవ్వుకుంటారు.
*తెలుగు గురించి ఇప్పుడు రాయటానికి బలమైన రెండవ కారణం: రెండు సంవత్సరాల వయస్సు ఉన్న మా అమ్మాయి. తనకి తెలుగు పద్యాలన్నా, పాటలన్నా, కథలన్నా చాలా చాలా ఇష్టం. తను ఇప్పటికే తెలుగు అక్షరాలు గుర్తు పట్టగలుగుతోంది కాని
తను చదవడానికి ఉన్న తెలుగు పుస్తకాలు చాలా తక్కువ. మేము గ్రామాలలో మొదలుపెట్టిన కార్యక్రమాలలో కూడా ఇదే సమస్యని ఎదురుకుంటున్నాం. చిన్న చిన్న గ్రంథాలయాలు స్థాపించి గ్రామాల్లో ఉన్న పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచాలనుకుంటే మాకు తగినన్ని పుస్తకాలు దొరకటం లేదు. చిన్న వయస్సులో తెలుగు నేర్పడానికి కావలసిన పుస్తకాలు, వనరుల కొరత మాకు స్పష్టంగా
తెలుస్తోంది. పిల్లల స్థాయిలో చదువగలిగే తెలుగు పుస్తకాల ముద్రణ ఖచ్చితంగా చాలా అవసరం.*
పిల్లలమఱ్ఱి అరవింద రాసిన పోస్టులో నాకు పై పేరా ఆసక్తి కరంగా అనిపించి ఇక్కడ ఉంచుతున్నా.
చాలా ముఖ్యమైన పాయింటు ఇది. నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటా దీని గురించి. పెద్ద బాలశిక్ష ఉందికదా అనుకోవచ్చు, ఐతే దాన్ని ఆరగించుకోగల ప్రజ్ఞాపాటవాలు ఎందరికి ఉంటాయి? పెద్ద బాలశిక్ష అంమృతాన్ని సక్రమమైన రీతిలో అందించగల ఉపాధ్యాయ దేవుళ్ళు ఎందరు ఉన్నారూ? ఈ రెండు పెద్ద ప్రశ్నలే అని నా అభిప్రాయం.

Nov 2, 2009
విశ్వేశం మాధవం ధుణ్ఢిం
విశ్వేశం మాధవం ధుణ్ఢిం దణ్డపాణించ భైరవం
వన్దే కాశీం గుహాం గణ్గాం భవానీం మణికర్ణికాం
ఉత్తిష్ట కాశి భగవాన్ ప్రభువిశ్వనాధో
గఞ్గోర్మి-సంగతి-శుభైః పరిభూషితొబ్జైః
శ్రీధుణ్డి-భైరవ-ముఖైః సహితాన్నపూర్ణా
మాతా చ వాఞ్ఛతి ముదా తవ సుప్రభాతం
బ్రహ్మమురారిస్త్రిపురాంతకారిః
భానుః శశి భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రః శని-రాహు-కేతవః
కుర్వన్తు సర్వె భువి సుప్రభాతం
వారాణసీ-స్థిత-గజానన-ధుణ్డిరాజ
తాపత్రయాపహరణె ప్రథిత-ప్రభావ
ఆనంద-కందలకుల-ప్రసవైకభూమె
నిత్యం సమస్త-జగతః కురు సుప్రభాతం
బ్రహ్మద్రవొపమిత-గాఞ్గ-పయః-ప్రవాహైః
పుణ్యైహ్ సదైవ పరిచుంబిత-పాదపద్మె
మధ్యెఅఖిలామరగణైః పరిసెవ్యమానె
శ్రీకాశికె కురు సదా భువి సుప్రభాతం
ప్రత్నైరసంఖ్య-మఠ-మందిర-తీర్థ-కుణ్డ
ప్రాసాద-ఘట్ట-నివహైః విదుషాం వరైశ్చ
ఆవర్జయస్యఖిల-విశ్వ-మనాంసి నిత్యం
శ్రీకాశికె కురు సదా భువి సుప్రభాతం
కె వా నరా ను సుధియహ్ కుధియొ.అధియొ వా
వాఞ్ఛంతి నాంతసమయె శరణం భవత్యాః
హె కొటి-కొటి-జన-ముక్తి-విధాన-దక్షె
శ్రీకాశికె కురు సదా భువి సుప్రభాతం
యా దెవైరసురైర్మునీంద్రతనయైర్గంధర్వ-యక్షొరగైః
నాగైర్భూతలవాసిభిర్ద్విజవరస్సంసెవితా సిద్ధయె
యా గణ్గోత్తరవాహినీ-పరిసరె తీర్థైరసంఖ్యైర్వృతా
సా కాశీ త్రిపురారిరాజ-నగరీ దెయాత్ సదా మణ్గళం
తీర్థానాం ప్రవరా మనొరథకరీ సంసార-పారాపరా
నందా-నంది-గణెశ్వరైరుపహితా దెవైరశెషైః-స్తుతా
యా శంభొర్మణి-కుణ్డలైక-కణికా విష్ణొస్తపొ-దీర్ఘికా
సెయం శ్రీమణికర్ణికా భగవతీ దెయాత్ సదా మణ్గళం
అభినవ-బిస-వల్లీ పాద-పద్మస్య విశ్ణొః
మదన-మథన-మౌలెర్మాలతీ పుష్పమాలా
జయతి జయ-పతాకా కాప్యసౌ మొక్షలక్ష్మ్యాః
క్షపిత-కలి-కలణ్కా జాహ్నవీ నః పునాతు
గాణ్గం వారి మనొహారి మురారి-చరణచ్యుతం
త్రిపురారి-శిరశ్చారి పాపహారి పునాతు మాం
విఘ్నావాస-నివాసకారణ-మహాగణ్డస్థలాలంబితః
సిందూరారుణ-పుఞ్జ-చంద్రకిరణ-ప్రచ్ఛాది-నాగచ్ఛవః
శ్రీవిఘ్నెశ్వర-వల్లభొ గిరిజయా సానందమానందితః (పాఠభెద విశ్వెశ్వర)
స్మెరాస్యస్తవ ధుణ్డిరాజ-ముదితొ దెయాత్ సదా మణ్గళం
కణ్ఠె యస్య లసత్కరాల-గరళం గణ్గాజలం మస్తకె
వామాణ్గె గిరిరాజరాజ-తనయా జాయా భవానీ సతీ
నంది-స్కంద-గణాధిరాజ-సహితః శ్రీవిశ్వనాథప్రభుః
కాశీ-మందిర-సంస్థితొఖిలగురుః దెయాత్ సదా మణ్గలం
శ్రీవిశ్వనాథ కరుణామృత-పూర్ణ-సింధొ
శీతాంశు-ఖణ్డ-సమలంకృత-భవ్యచూడ
ఉత్తిష్ఠ విష్వజన-మణ్గళ-సాధనాయ
నిత్యం సర్వజగతః కురు సుప్రభాతం
శ్రీవిశ్వనాథ వృషభ-ధ్వజ విశ్వవంద్య
సృష్టి-స్థితి-ప్రళయ-కారక దెవదెవ
వాచామగొచర మహర్షి-నుతాణ్ఘ్రి-పద్మ
వారాణసీపురపతె కురు సుప్రభాతం
శ్రీవిశ్వనాథ భవభఞ్జన దివ్యభావ
గణ్గాధర ప్రమథ-వందిత సుందరాణ్గ
నాగెంద్ర-హార నత-భక్త-భయాపహార
వారాణసీపురపతె కురు సుప్రభాతం
శ్రీవిశ్వనాథ తవ పాదయుగం నమామి
నిత్యం తవైవ శివ నామ హృదా స్మరామి
వాచం తవైవ యషసానఘ భూషయామి
వారాణసీపురపతె కురు సుప్రభాతం
కాశీ-నివాస-ముని-సేవిత-పాద-పద్మ
గణ్గా-జలౌఘ-పరిషిక్త-జటాకలాప
అస్యాఖిలస్య జగతః సచరాచరస్య
వారాణసీపురపతె కురు సుప్రభాతం
గణ్గాధరాద్రితనయా-ప్రియ శాంతమూర్తె
వెదాంత-వెద్య సకలెశ్వర విశ్వమూర్తె
కూటస్థ నిత్య నిఖిలాగమ-గీత-కీర్తె
వారాణసీపురపతె కురు సుప్రభాతం
విశ్వం సమస్తమిదమద్య ఘనాంధకారె
మొహాత్మకె నిపతితం జడతాముపెతం
భాసా విభాస్య పరయా తదమొఘ-శక్తె
వారాణసీపురపతె కురు సుప్రభాతం
సూనుః సమస్త-జన-విఘ్న-వినాస-దక్షొ
భార్యాన్నదాన-నిరతా-విరతం జనెభ్యః
ఖ్యాతః స్వయం చ శివకృత్ సకలార్థి-భాజాం
వారాణసీపురపతె కురు సుప్రభాతం
యె నొ నమంతి న జపంతి న చామనంతి
నొ వా లపంతి విలపంతి నివేదయంతి
తెషామబొధ-శిషు-తుల్య-ధియాం నరనాం
వారాణసీపురపతె కురు సుప్రభాతం
శ్రీకణ్ఠ కణ్ఠ-ధృత-పన్నగ నీలకణ్ఠ
సొత్కణ్ఠ-భక్త-నివహొపహితొప-కణ్ఠ
భస్మాంరాగ-పరిషొభిత-సర్వదెహ
వారాణసీపురపతె కురు సుప్రభాతం
శ్రీపార్వతీ-హృదయ-వల్లభ పఞ్చ-వక్త్ర
శ్రీనీల-కణ్ఠ నృ-కపాల-కలాప-మాల
శ్రీవిశ్వనాథ మృదు-పన్కజ-మఞ్జు-పాద
వారాణసీపురపతె కురు సుప్రభాతం
దుగ్ధ-ప్రవాహ-కమనీయ-తరంగ-భంగె
పుణ్య-ప్రవాహ-పరిపావిత-భక్త-సంగె
నిత్యం తపస్వి-జన-సేవిత-పాద-పద్మె
గణ్గె శరణ్య-శివదె కురు సుప్రభాతం
సానందమానంద-వనె వసంతం
ఆనంద-కందం హత-పాప-వృందం
వారాణసీ-నాథమనాథ-నాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యె
[శ్రీ కాశీ విశ్వనాధ సుప్రభాతం]
[గమనిక:- ఇది నేను సంస్కృతం నుండి తెలుక్కి మార్చింది. తప్పులున్న సరిదిద్దగలరు. సంస్కృత మూలం - http://sanskritdocuments.org/all_pdf/kAshivishvanAthasuprabhAtam.pdf]
కార్తీక పౌర్ణమి సందర్భంగా యావత్ జనులకూ -
శివతత్వంతో నిండిన పౌర్ణమి వెలుగులు మనలోని అజ్ఞానపు అంధకారాలని రూపుమాపి జ్ఞానం వైపుకి నడిపించుగాక.

Subscribe to:
Posts (Atom)