Apr 7, 2009

మువ్వాగోపాలుడే...

ఆ రోజుల్లో (1991 నాటి మాట), గర్తపురి యందున్న బ్రాడీపేట 5/17 లో మిన్నెకంటి గుర్నాధశర్మ గారింట్లో అద్దెకి ఉండే వాళ్లం. మిన్నెకంటి గుర్నాధశర్మ గారు గత జమానాలో ప్రఖ్యాత వ్యాకరణ పండితులు. మా ఇంటిముందు తంగిరాలవారి ఇల్లు. మా ఇటు పక్కన డా। ఇంగ్. పి. వేమురి రావ్, ఎడ్వైజర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పి.హెహ్.డి సస్ట్రెస్ అనాలిసిస్ వెస్ట్-జెర్మని .. ఈయన మహా పండితుడు భౌతిక శాస్త్రంలో. వీళ్ల ఇంటి ముందు ఎ.వి.వి.పి. ప్రసాదరావ్ గారు. అంటే మా ఇంటికి డైయాగ్నల్గా ఉంటారు వీరు. ఈయన మానాన్నా వాళ్లు హిందూకాలేజిలో చదివే రోజుల్లో (1960-63) లెక్కల డిమాన్ష్ట్రేటర్ గా చేరారట. మేము హిందూ కాలేజీలో చదివే రోజుల్లో ఈయన రిటైర్మెంట్ కి దగ్గర్లో ఉన్నట్టు ఉన్నారు. మొదటి సంవత్సరం మాకు వచ్చారు లెక్కలకి. ఏమండి, డిఫరెంషియల్ ఈక్వేషన్స్ కదండి, బెస్సల్స్ ఈక్వేషన్స్ కదండీ ఇలా చెప్పేవారు. ఇక ఈ నా కధలో ఈయన హీరో తండ్రి. ఈయన పుత్రరత్నం గురించే నే చెప్పబొయ్యేది. వాడిపేరు మారుతి. అప్పట్లో వాడి వయ్యస్సు ఏ పదమూడో పదునాలుగో. మొత్తానికి సార్ధక నామధేయుడు. మహా గోలగాడు. వెయ్యని వేషాల్లేవు. చెయ్యని పనుల్లేవు. మా వీధినుండి రెండువీధుల చివర్లో వాళ్ల బడి. పేరు శ్రీయస్విబీకే అ.క.అ శ్రీ వేంకటేశ్వరా బాల కుటీర్. ఆంగ్ల మాధ్యమ పాఠశాల. ఈ బడి పిల్లల్లు కొంచెం గాల్లో నడిచేవారు. ప్రంపంచ ప్రఖ్యాత గాయని సునీత ఉపద్రష్ట గారు ఇక్కడే సతికారు. ఎందుకింత వ్యగ్యం అంటే ఇక్కడి పిల్లల క్లౌడ్ నైన్ వేషాలు. ఈ పాఠశల విద్యార్ధినులను లోబరుచుకొనుటకు, కొంతమంది రౌడీ షీటర్లు (ఈ పాఠశాలకి దగ్గర్లో కోబాల్ట్పేట అని ఒక చిన్న పేట, అది చాలా ప్రఖ్యాతి గాంచిన పేట రౌడీషీటర్లకి, మన సినిమా నటుడు జీవా ఈ పేటవాడే) ఆ పాఠశాలకి జతచేరు వీధుల్లో తిష్ట వేసేవాళ్లు. మగపిల్లకాయల్ని చేరదీసి రౌడీయిజంను హీరోయిజంలా ప్రొజెక్టు చేసేవారు. మన మారుతేశ్వర్రావ్ వాడి మిత్రబృందం కూడా అలా ఓ రౌడీగాడి చేతికి చిక్కారు. లాగులు పోయి ప్యాంట్లయ్యాయి. ఆ ప్యాంట్ల జేబుల్లో గుట్కా ప్యాకెట్లు చేరుకున్నాయి. నడుముకి సైకిల్ చైన్స్ వచ్చిచేరాయి. పెదాలు నల్లబడటం మొదలైయ్యింది. గుంపుగా రౌడీగాడి చుట్టూ చేరటం, వచ్చేపొయ్యేవాళ్ళని ఆపటం, బెదిరించటం ఇలా.
సరే ఈ మారుతి ఎంత మారుతైనా, వీడిదగ్గర మహా మంచి విద్య ఒకటి ఉంది. అది వేణువు ఊదటం/వాయించటం. పిల్లప్పటినుండే నేర్చుకుంటున్నాడులా ఉంది. అప్పట్లో సాయంత్రాలు ఎనిమిది నుండి తొమ్మిది వరకూ ఒక గంటపాటు విద్యుత్తు నిలిపివేసేవారు (తర్వాత తర్వాత అది పెరిగి ఒక గంట మాత్రమే ఇచ్చేవారనుకోండి - పిల్లాట) సర్కారువారు. అటు విద్యుత్తు పోవుట, మనవాడు మేడపైకి చేరుట, వేణువు వాయించుట. అదేదో సినిమాలోలాగా, అందరం సిద్ధంగా ఎండేవాళ్లం వాడి వేణుగానం వినటానికి.
వాడు ఎక్కువగా వాయించే పాట - సాగర సంగమం సినిమాలోని "మువ్వాగోపాలుడే మా ముద్దూ గోవిందుడే". అత్యంత అత్భుతంగా ఉండేది వాడి ప్రావీణ్యత. వాడు వాయించటం వల్లనో లేక ఆ పాటే అంత మధురమో (ఈ వాయిద్యంలోంచి జాలువారుట). సర్వం మరచి వినేవాళ్ళం. చెవులకు పట్టిన తుప్పు గట్రా దెబ్బకి వదిలేది.
అప్పుడప్పుడూ అనిపిస్తింటుంది, ఇలాంటి పాటలు రాయటం అనేది, రాసిన కవియొక్క పూర్వజన్మ సుకృతం అని. ఈ పాటని రాసింది శ్రీ వేటూరివారు అనుకుంటా.
రాగం - మోహన

వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే....
మా ముద్దూ గోవిందుడే
మువ్వా గోపాలుడే మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల
వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే....
మా ముద్దూ గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే
మా ముద్దూ గోవిందుడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే
మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
ఆ హహహవేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దూ గోవిందుడే

ఎవ్వరికైనా ఎక్కడైనా వేణువుపై ఈ పాట దొరికినచో ఆ లింకును నాతో పంచుకొందురుగాకా!!

16 comments:

  1. ఓహో! మీరూ గుంటూరు వాస్తవ్యులేనా! గాయని సునీత అక్కడే నాగార్జున కళాకేంద్రం లో సంగీతం నేర్చుకునేది.నేను కూదా అక్కడే బండ్లమూడి హనుమాయమ్మ కాలేజీ లొ ఇంటర్ చదివాను.మంచి పాట గుర్తుచేసారు.

    ReplyDelete
  2. కామెంట్ సునీత గురించి రాయాలో, మారుతి గురించి రాయాలో, వేణువు గురించి రాయలో, వేటూరి గురించి రాయలో తేల్చుకోలేక..ఏమీ రాయడం లేదు... :) :)

    ReplyDelete
  3. ఇంతకీ మీ మారుతి గోపాలుడేమయ్యాడో చెప్పనే లేదు మీరు. అంతమంది మహామహుల మధ్యన నివసించారంటే మీక్కూడా కొంత అబ్బే ఉండాలి.. :)

    ReplyDelete
  4. భాస్కర్ గారూ,

    నేనూ మొదట్లో మీరు "సమరసింహారెడ్డి" లెవల్లో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారేమో అనుకున్నా , కొద్దిగా కిందకి వస్తే ఆ "సమరసింహారెడ్డి" కాస్తా "మువ్వగోపాలు"డయి కూర్చున్నాడు.

    ReplyDelete
  5. "నా బ్లాగు" సునీత గారు:) బి.హెచ్ కాలేజీకి కూతవేటు దూరంలో మా ఇల్లు ఇప్పుడు. 2/16.
    భాస్కరా - వకేషన్ నుండి వచ్చాక రిప్లై ఇస్తా మీకు. :)
    మురళి భాయ్ - సునీఅత్ గురించి రాయటానికేముంది ఇప్పుడిక. మారుతి గురించి - ప్రతి సందులో గొందులో ఇలాంటి మారుతీలు ఉంటూనే ఉంటారు. ఐతే వాళ్ల దగ్గర లేనిదీ వీడిదగ్గర ఉన్నదీ - ఈ విద్య ఒక్కటే.
    అరుణ పప్పు గారు - మారుతి ఏమయ్యాడు. ఏమో, మేము కొంతకాలం తర్వాత ఇల్లుమారాం. :):)
    @ఉమా శంకర్ - అదే ఊహించని మలుపు. :):)

    ReplyDelete
  6. వెంకటేశ్వర కుటీర్ కి అంత చరిత్ర! బావుందండి ఏదో థ్రిల్లింగ్ స్టొరీ వినబోతున్నాను అనుకున్నా:)

    ReplyDelete
  7. ఇంగ్. పి. వేమురి రావ్, ఎడ్వైజర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పి.హెహ్.డి సస్ట్రెస్ అనాలిసిస్ వెస్ట్-జెర్మని >> వారు latebloomer-blog రావ్ గారేనాండి?

    ReplyDelete
  8. పైన కామెంట్ నాదే

    ReplyDelete
  9. చిన్ని గారు - యస్విబీకే కి అబ్బో సానా సరిత్ర ఉంది. అది ఎవరిదో తెలుసా, కీ।శే॥ జగ్గయ్య గారి మొదటి భార్యది. ఆమెపేరు గుర్తుకొస్తల్లేదు. ధ్రిల్లింగ్ స్టోరీలా చేద్దాం అనుకున్నా. కానీ ఇలా ..... అయ్యింది సివరాకరికి
    రమ/శ్రావ్య - ఆయన మన లేట్బ్లూమర్ వేమూరి రావ్ గారు ఒకటి కాదు.

    ఈయన పి.హెహ్.డి అదీ ఇదీ, సెక్రెటరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మాహా పండితుడు. ఐతే కొంచెం తెలివి ఎక్కువే. మన కేబుల్ టీవీ ఆపరేటర్లు ఇళ్లపై విచ్చలవిడిగా కేబుళ్లేసి చిందరవందర చేసేసారు. ఈయన ఇంటి కిటికీ ఊచకి ఒక జంక్షన్ పెట్టి ఒక కనెక్షను ఆయనకీ ఒకటీ మా ఇంటి ఓనర్కి ఇచ్చాడు కేబులోడు. ఓ రోజున డా।ఇంగ్.పి. వేమూరి రావ్ గారు కత్తెరతో ఆ కేబుల్ ని కచక్ అని కత్తిరించేసాడు. మా ఇంటి వోనర్ వెంటనే వెళ్లి కేబులోడ్ని కేకేస్కొచ్చి ఏటిలా అని నిలదీస్తే, అతను, సింపుల్గా కుర్చీలోంచి కూడా లేవకుండా, గోళ్లు ఫైలెర్తో రుద్దుకుంటూ, అవును, మా ఇంటి మీదనుండి కేబుల్ వేసారు, కాబట్టి నాకు ఉచితంగా ఇవ్వాలి, నన్ను అడగకుండా నా ఇంట్లోంచి ఎలా వేస్తారసలు అని లా పాయింటు పీకే సరికి కేబులోడు బెమ్మానందంలా కిందపడి గిలా గిలా కొట్టుకున్నాడు పాపం. మా ఓనరు ఓ చెంచాడు నీళ్లు మొహం మీద చికిలించితే కానీ వాడు కోలుకోలేకపొయ్యాడు పాపం పిచ్చి వెధవ.

    ReplyDelete
  10. భాస్కర్ గారండోయ్,
    ఎస్వీబీకే పిల్లల గురించి మీర్రాసింది మంగమ్మ కి తెలిస్తే ఇంతే సంగతులు! అలాగే జగ్గయ్య గారి గురించి రాసిన విషయం కూడా! అమ్మో అమ్మో!
    కోబాల్ట్ పేట రౌడీలు స్కూలు ముందు కాపు కాస్తే అది పిల్లల తప్పెలా అవ్వుద్దీ అంట? అన్నట్లు సునీత వాళ్లమ్మ గారు సుమతి ఇదే స్కూల్లో టీచరుగా పని చేసారు.

    ReplyDelete
  11. సుజాతగారు, తప్పు పిల్లలది కాదు కానీ తప్పెవవరిదైనా నేను నా కళ్ళతో చూస్తుండగానే కనీసం డిగ్రీదాకా కూడా చదవలేక ఆ హీరోయిజం అనబడే రౌడీయిజంలో మునిగిపోయిన కుఱ్ఱాళ్లని ఇంతమందిని చూసా.

    సరే, అసలు మురళి పై మువ్వాగోపాలుడే పాట గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు, పుచ్.

    ReplyDelete
  12. భాస్కరం బెదరూ ఏటి జరుగుతానాది ఇక్కడ?

    ReplyDelete
  13. మీ(మి)ష్టర్ మూర్ఖ : డీ(డి)ష్కషన్

    ReplyDelete
  14. హ అ హ. భలే ట్విష్టు పెట్టావుగా! :)
    మురళిగారి కామెంటు, ఉమాశంకర్ గారు కామెంటు కూడా సూపరు.
    డా. ఇంగ్ వేమూర్రావుగారి కేబులు పిట్టకత ఇంకా సూపరు.
    లేట్ బ్లూమర్ వేమూర్రావుగారి సబ్జక్టు కంప్యూట్ర్ సైన్సు

    ReplyDelete