Apr 5, 2009

మా ఊళ్లో శ్రీ సీతారామ కళ్యాణమహోత్సవం

మా ఊరి కోవెలలో శ్రీ సీతారామ కళ్యాణమహోత్సవం ఏప్రిల్ నాలుగు, రెండువేలా తొమ్మిది, పొద్దున, పదకొండు గంటలకి మొదలుపెట్టాలని నిర్ణయించారు.
మరి మనం సకుటుంబ సపరివార సమేతంగా శ్రీ సీతారామ కళ్యాణం జరిపిద్దాం/పాల్గొందాం అని వేంచేసాం. పోయినేడాదంత వైభవంగా జరుగలేదీ సంవత్సరం. పోయినేడాది లగ్న పత్రిక చదివించారు, ఆడపెళ్ళివారో వైపు మగపెళ్ళివారో వైపు కూర్చుని తాంబూలాలు తీస్కోడం దగ్గర్నుండి అన్నీ వేడుకగా చేసారు. ఈ ఏడాది అవన్నీ లేవు. పోయినేడాది తలంబ్రాలప్పుడుకూడా కళ్యాణానికి విచ్చేసిన అందరినీ భాగస్వాములుగా చేసారు. ఈ ఏడాది అవేమీ లేవు. సరే కళ్యాణం! అమ్మవారినీ, అయ్యవారినీ చూసి తరించటం అనేది ముఖ్యం కాబట్టి, కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించి, రామనామం జపించి, కోవెలవారందజేసిన అన్నపానాదులను స్వీకరించి తరించాం.
కొన్ని ఫోటోలు -

2 comments:

  1. కళ్యాణ వైభోగమే.. బాగున్నాడండి రాముడు.. మరికొన్ని ఫోటోలు ఉంచాల్సింది..

    ReplyDelete