Aug 26, 2008

ఇస్పాట్

నేను ఎవరికీ ఇస్పాట్ పెట్టటమ్లేదు...
ఐతే, నేను నాకళ్ళారా చూసిన నిజమైన ఇస్పాట్ ఇక్కడ రాస్తున్న. జాగర్తగా చదవండి...
మేము అప్పట్లో మోర్జంపాడు అనే ఒక ఊళ్ళో ఉండే వాళ్ళం. మా ఇల్లు ఎత్తు బడికి వెనక ఉండేది. ఎత్తు బడి అంటే ఎంటో అనుకునేరు, ఉన్నత పాఠశాల అని అర్ధవ్. మొదటే బడి ఊరికి ఒక చివరగా ఉండేది. దాని ఎనక అంటే దాదాపు ఊరి పొలాలు కనపడుతుంటయన్నమాట. మా ఇల్లు దాటుకుని ఇంకో రెండు చిన్న చిన్న వీధులు దాటితే ఇంక దొడ్లు ఉంటాయి. అవికూడా దాటితే పొలాలే. మిగతా పల్నాటి ఊర్ల మాదిరే ఈఊళ్ళో కూడా కంది, మిరప, పత్తి గట్రా వేసేవాళ్ళు. పత్తి కట్టెని పొయ్యిలో వాడుకోటనికి వాడతారు. మరి ఒక చేను పత్తి కట్టె ఎక్కడ పెట్టుకోవాలి? దొడ్లలో పెట్టుకుంటరు. వాటితో పాటు గడ్డి వాములు అవి ఇవి కూడా ఉంటాయి ఆ దొడ్లల్లో. ఇవి పావులకి ఇళ్ళు అన్నమాట. కొంచెం పెద్ద దొడ్డి ఐతే ఎండ్లకాలం సినెమాలేస్తరు.
కధకి సంబంధం లేకపోయినా ఒక చిన్నగమ్మత్తైన ఇషయం..
ఒకానొక రోజున మా అన్నయ్య ఎండ్లకాలం సెలవల్కి ఇంటికి వచ్చాడు. సినిమాకి వెల్దాం అని నిర్ణైంచాం. సరె, ఫలాని వెంకట్రెడ్డిగారి దొడ్లో ఫాలాని సినిమా. రూపాయి టిక్కెట్టు. కొన్నాం. వెళ్ళం చూసాం, వచ్చాం, మర్రోజు ఆ టిక్కెట్టు జేబులో ఉంటే చుద్దుముకదా, రూళ్ళ కాయితకం ముక్క, దానిమీద జిల్లా శాఖా గ్రంధాలయం ముద్ర, ముద్ర మద్దెన 1/- అని రాసుంది సేత్తో.
సరే ఇస్పాట్ లోకి వస్థే!!!
పల్లె చాలా తొందరగా మేల్కొంటుంది. అరకలు కట్టుకుని దూరాలు వెళ్ళెవాళ్ళు, బరెగొడ్లని మేతకి వదిలేవాళ్ళు, ఆ వెళ్ళే బరెగొడ్ల పేడ గంపలోఓకి ఎత్తుకునెవాళ్ళు, నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఇలా. పొద్దున్నే 3 నుంచి మొదలవుతుంది పల్లె జీవితం. ఒకానొక రోజున పొద్దున్నే బైలుకెళ్ళె ఒకామె, మా వీధి చివర్లో ఉన్న దొడ్డి దగ్గర కొన్ని చారలు గమ్నించింది. అవి మారుతి కారు టైరంత లావున ఒక పాటెర్న్ లో ఉన్నయి. తర్వాతనుంచి జనం కొంచెం జాగర్తగా ఉండటం మొదలు పెట్టారు. మళ్ళి ఒక వారం దాకా ఆ చారలు కంబళ్ళా. మళ్ళీ ఒకానొక రోజున ఆ చారలు, రొప్పుతున్నట్టు, రోజుతున్నట్టు, ఒక లోతైన బుస వినిపించింది ఒకతనికి. ఈసారి వీధిలో ఉన్న పెద్దోళ్ళు అందరూ వాటిమీద పరిశోధన చేసి అవి పాము పాకుడు చారలుగా గుర్తించారు. కొంచెం అల్జడి మొదలైంది జనాల్లో. పల్లెల్లో పాములు కొత్తకాదు. ఇంట్లో కూడా తిరిగుతుంటై. ఉట్టిమీదకి ఎక్కిన సందర్భాలు, పొయ్యిపక్కన కుండకింద చుట్టేస్కున్న సందర్భాలు, సప్టాబండల్లో ఇరుక్కున్న సందర్భాలు, నీళ్ళ తొట్టి కింద దాక్కున్న సందర్భాలు, ఇంటి చూర్లో చుట్టుకునున్న సందర్భాలు..ఇలాంటివి కోకొల్లల్లు. కాని ఇప్పటి చారలు, కొంచెం భయంకొల్పేవిగా అనిపించినై. ఎందుకంటే అవి మారుతి కారు టైరు సైజులో ఉన్నాయి. అంటే కొంచెం పెద్దపామే. ఇంక జనాలు కఱ్ఱల్తో తిరగటం, దొడ్లకి ఎళ్ళేప్పుడు, బైలుకి పోయేప్పుడు శబ్దం చేసుకుంటా ఎళ్ళటం ఇలా నడిచింది కొన్ని రోజులు. ఇంక మనోళ్ళు మాములుగానే దానిగురించి చెప్పుకోవటం, నేను జూసా అని ఒకడు, నన్ను పాము ఏవిసెయ్యదు నా సేతిలో గద్ద గీత ఉంది అని ఒకడు ఇల కధలు కధలుగా, గుసగుసలాడుకుంటుంటే, మరోవైపు పాము పాకుడు చారలు నెమ్మదిగా ఇండ్లవైపు కుడా కనపడ్డం మొదలుపెట్టినై.
సాధారణంగా పల్నాడ్లో ఇళ్ళకి ప్రహరీ గోడ రాళ్ళాతో పెడతరు. అంటే ఆ గోడలు ఒకరకమైన పోరస్ మెంబ్రేన్లా ఉంటై. చిన్న చిన్న జంతువులు, పాములు, మండ్రగబ్బలు, తేళ్ళు ఆ గోడాలోంచి ఇంట్లోకి క్షేమంగా ఆట్టె కష్టపడకుండా దూరిపోగలవ్ అన్నమాట.
మరి పాము ఇళ్ళ దెగ్గరకి వచ్చిందంటే ఏ ఇంటోకైనా జొరబడగలదు. కొంచెం భయం మొదలైంది ఆ వీధిలో, దానికానుకున్న వీద్ధుల్లో. వీధులు అంటే మన యం.జి రోడ్డు అంత ఉండవ్. ఒక పదో ఇరవయ్యో ఉంటయి ఒకోవీధిలో ఇళ్ళు.
ఈ పాము జాడలు ఉన్న వీధిలో, ఊరివైపుకి ముందు వచ్చేది, ఒకవైపు ఎత్తుబడి బండలగోడ, దాని పక్కన జీడీమళ్ళ కాశెయ్య వాళ్ళ ఇల్లు, దాని కానుకుని వాల్ల బాబాయిల ఇళ్ళు, తర్వాత నరసింహయ్య గారి ఇల్లు. ఇంకోవైపు వెంకయ్య వాళ్ళ ఇల్లు, ఈ వీధిని కలుపుతూ ఇంకో చిన్న వీధి (పాముని గమనించిన వీధికి పర్పెండిక్యులర్గా), తర్వాత వర్సగా ముగ్గురన్నదమ్ముల ఇళ్ళూ, తర్వాత బసివిరెడ్డి వాళ్ళ ఇల్లు, ఇంకో చిన్న సందు (పాముని గమనించిన వీధికి పర్పెండిక్యులర్గా), అది దాటంగనే నిర్మాణమ్లో ఉన్న ఒక చిన్న గుడి, దానినానుకుని మాఇల్లు. అంటే మాది నర్సింహయ్య గారి ఇంటికి కరెక్టుగా ఆపోజిట్టు అన్నమాట. కాబట్టి ఆ పాము మా వీధి అంటే ప్రేమ పెంచుకుని మా ఇళ్ళళ్ళొ ఏ ఇంట్లోకైనా ఎంట్రీ ఇచ్చేయొచ్చు ఏ అర్ధరాత్రో అపరాత్రో. కాశెయ్యా వాళ్ళ బాబాయిల ఇంటికి గోడకి ఆనించి కొన్ని రాళ్ళ దూలాలు (స్టోన్ కార్వ్డ్ పిల్లర్స్) ఉన్నై. అలానే కొన్ని పెద్ద బండలు అవి ఇవి. ఇవి ఆ నిర్మాణమ్లో ఉన్న గుడికోసమని అక్కడ పెట్టారు.
ఒకానొక రోజున ఎవరు చూసారోకాని ఆ పాము ఆ బండల్లో ఒక పెద్ద బండ చాటున ఉన్నట్టు కనిపెట్టారు. ఇంకేముంది ఇస్పాట్ మొదలైంది. కాశెయ్య, బసివిరెడ్డి, బసివిరెడ్డి చిన్న కొడుకు ఎచ్చులు రామి రెడ్డి, కాశెయ్య వాళ్ళ బాబాయి కొడుకులు, బసివిరెడ్డి వాళ్ళ ఇంటి పక్కనున్న వెంకట్రెడ్డి, ఇటు మా ఇంటి పక్కనున్న గొల్లోళ్ళ నూకల శివరావయ్య దుడ్డుకఱ్ఱలు, ముల్లుగఱ్ఱలు సేతబట్టుకుని ఈయ్యాల ఎట్టైనా పావుని సంపాల్సిందే అని బండలదెగ్గరకి జొరబడ్డారు. సంపటాకి, అటైపునుంచి కాశెయ్య అండ్ కో, ఒకైపు గోడ, ఇంకో వైపు శివరావయ్య, ముందైపు బసివిరెడ్డి అండ్ కో, కఱ్ఱలు సేతబ్బట్టుకుని సిద్దంగున్నారు. మఱి పావుని ఎవురు నిద్రలేపాలా? ఒకేళ తప్పించుకుంటే? కాటేస్థే? ఎంతపొడుగుంది? నల్లతాచా? జెఱ్ఱిగొడ్డా? కట్లపావా? ఇన్ని ప్రశ్నలు లేచినై. ఇంతలో చిక్కటి రోజుకున్న శబ్దం.. ఊజ్ ఊజ్ అని. అంటే పాములేచింది. దానికి తరంగాల్లల్లో మార్పు అర్ధం ఐంది. అటు పక్కనున్న కాశెయ్య తమ్ముళ్ళకి కాళ్ళళ్ళో వణుకు మొదలైంది. ఊజ్ ఊజ్ ఊజ్ శబ్దం ఎక్కువైంది. తల బైటికి పెట్టి బుస్ మని బైటకొచ్చింది ఆ పావు. అదిపావా? దానెక్క 15 అడుగులు ఉంది. నేను మాఇంటి పైకి ఎక్కిజూస్తున్న సేఫ్టీగా..కాశెయ్య తమ్ముళ్ళళ్ళో ఒకళ్ళు తప్పుకున్నరు భయంతోటి. పావు కాశెయ్య వైపుజూసి, ఇటు తిరిగింది బసివిరెడ్డి వైపు. ఎయ్యి ఎయ్యి అని అరుస్తున్నడు రామిరెడ్డి, దొరకట్ల పావు. నడుముమీద లేచి నుంచోని ఇంత పడగతో ఊజ్ ఊజ్ మని అటు ఇటు మెలికలు తిరుగుతున్నది. సంప్టానికొచ్చినోళ్ళ ధైర్నం సాలట్లా. ఇషం చిమ్ముతున్నది. సివరావుడు కఱ్ఱ ఇసిరాడు, తప్పింది. శివరావుడు పావుకి రెండు కఱ్ఱల దూరమ్లో ఉన్నాదు. అది శివరావుడిమీదకి దూకేలోపు కాశెయ్య తమ్ముడు ముల్లుగఱ్ఱతో పడగమూద ఒక్కటే దెబ్బేసిండు. అంతే...సచ్చింది...అవునండీ, పావే, సచ్చింది..సచ్చి అట్టా బండమీదపడి సిన్నగా నేలమీనకి జారిపోతాఉంది..పావే!!మరి ఏంపావో? ఎక్కడ్నుంచి వచ్చిందో, దాని పడగ సాటాంత ఉంది. 15 అడుగులపొడుగుంది, అవును పావే!! నిజంగా అది ఇషప్పావే!! మరింక గుడిముంగట పావుని జంపటం ఘోరం, కాని, సంపేయాల్సొచ్చిందంతే!! మరేంజేస్తాం అన్నుకున్నారు ఆ సంపినోళ్ళందరు. దాని ఆత్మకి శంతి జేద్దం అని అన్నారు. నోట్టో రూపాయి బిళ్ళపెట్టి దాన్ని తగలబెట్టారు. తర్వాత ఎవరో ఆ రూపయి బిళ్ళకి బొక్కబెట్టి తాడుకట్టి మెళ్ళొయేసుకున్నారు...

8 comments:

  1. అమ్మో..అంత పెద్ద పామా?మా ఊర్లోనూ చాలా పాములు చూసాము.చాలా పొడవు వుండే పాములు చూసాము కానీ అంత లావు వుండేవి చూడలేదు.మీరు చెప్పింది చదువుతున్నంత సేపూ ఒకలాంటి జలదరింపు కలిగింది.చదవడం అయిపోయాకా కూడా ఆ జలదరింపు వదల్లేదు నన్ను.ఏమిటో కాళ్ళూ చేతులు పట్టు వదిలేస్తున్నట్టు అనిపిస్తుంది.దీనినే భయం అంటారనుకుంటాను.

    ReplyDelete
  2. ispat nate nenu edo murder mystery anukunna kani mee screenplay adirindi murder - suspense - thriller kante ekkuvaga undi...aunu ee pamula gurinchi...deyyala gurinchi evaranna okka story chepparante ...anthe ika..chain of stories modalavuthayi...good narration

    ReplyDelete
  3. nee anubhavalu baga intersting ga vunnai..

    Prasad.Yandapalli

    ReplyDelete
  4. babu bhaskar,

    Palnadu prajalaki bhasha leda...Palnadu lo putti Palnadu lo perigna neevu ila matladam bagaledu..Ippudu telugu cinemala lo vadee bhasha Palnadu bhashee...

    Prasad.Yandapalli

    ReplyDelete
  5. అయ్యా యండపల్లి ప్రసాదం గారు..మీ అడ్రస్సు ఓసారివ్వండి. ఈయ్యాల్టి సినిమాల్లో పల్నాటి భాషే వాడుతున్నారా? రేపు నేను తీయ్యబోయే సినిమాకి మాటలు మీరే రాద్దురుగాని పనాటి భాషలో...

    ReplyDelete
  6. అబ్బా అరిపించేసారు అన్నయ్యా..చాలా బావుంది టపా
    నెమరు వేసినందుకు బజ్ కి నెనర్లు
    ఇస్పాట్ \m/

    ReplyDelete
  7. ఏమిటీ ఈ వేళ మీరు పాముల టపాలే వేసారు రెండునూ. ఏదైనా రిసర్చ్ మొదలు పెట్టారా?
    15 అడుగులు, మారుతి టైరు అంత లావు, చేటంత పడగ, నడుం దగ్గరినుంచి లేచిన పాము, చదవడానికే భయం వేస్తోంది. గరుత్మంతుడి దండకం ఏదైనా ఉందా అని వెతుకుతున్నాను. అది చదివితే తప్ప రాత్రి నిద్ర పట్టేటట్టు లేదు... దహా (దరహాసం)

    ReplyDelete
  8. క్షమించాలి ఇవి ఆగస్ట్ 2008 పోస్ట్స్ అని మరిచి పోయాను, కామెంట్ పెట్టేటప్పుడు. మీ బజ్ నుంచి ఇక్కడకు వచ్చి ఈ పాముల మధ్య మతిపోయింది. దహా

    ReplyDelete