Aug 25, 2008

పల్నాడు పాములకి ప్రసిద్ధి

పల్నాడు పాములకి ప్రసిద్ధి.
ఎన్ని రకాల పాములంటే కట్ల పాములు, పసిరికపాములు, జెర్రి గొడ్డ్లు, నల్ల తాచులు, తెల్ల తాచులు, నాగుబాములు (అంటారు కాని, నేనుప్పుడు చూడలేదు), శిఖండి పాములు, ఒక రకమైన మంచి వాసన వచ్చే పాములు, నీళ్ళపాములు బ్లా బ్లా ఇలా..
మాఊళ్ళల్లో పాముల గురించి జనాలు కధలు కధలుగా చెప్పుకుంటుంటారు..
మేము అప్పుడు కొండమోడు అనే ఒక చిన్న జంక్షన్ లో ఉండేవాళ్ళం. అది పిడుగురాళ్ళ కి 1-2 కి.మి దూరమ్లో ఉండేది. మాఇంటి ముందు పెద్ద మఱ్ఱిచెట్టు దాని పరివృత్తంకి ఆనుకుని ఒక పెద్ద పుట్ట ఉండేది. పుట్ట అంటే అలాంటిలాంటి పుట్టకాదు, ఆరడుగుల ఎత్తు, చిన్న కొండలా ఉండేది. ఎన్ని చీమలు ఎన్నిరోజులు కష్టపడికట్టుకుని ఉంటాయో అనిపిస్తుండేది. దాన్ని కబ్జా చేసింది అలాంటిలాంటోళ్ళు కాదు. మన నల్ల తాచు గారు అండ్ ఫామిలి. మేము ఆ మఱ్ఱిచెట్టు మీద కోతికొమ్మచ్చి గట్రా అడుకునేప్పుడు అడపదడపా ఆ సర్పరాజుని చూసేవాళ్ళం. వెన్నులో వణుకు వచ్చేదనుకోండి.
ఒకానొక రోజున, మా మిత్ర బృదం అందరు, కొంచెం దూరమ్లో ఉన్న లాకుల దెగ్గర బిళ్ళంగోడు, ఈత కొడుతున్నారని తెలిసి నేనూ లగెత్తుకుంటూ వెళ్తున్న..లగెత్తటం ఒక రిధమిక్కగ్గా ఉంటుందికదూ!! కుడిచేయి ముందికిపెట్టి బాడీని లాగి, కాలితో నేలని తన్ని ఊతం తెచ్చుకుని మళ్ళీ ఎడమచేతిని ముందుకి పెట్టి శరీరాన్ని ముందుకిలాగి కాలితో నేలన్ని తన్ని ఊతంతెచ్చుకుని ..అలా..ఆ రిధమ్లో, నా ఎడంకాల్తో నేలని తన్ని ముందుకు వెళ్ళే నేపధ్యమ్లో, ఎడమకాలు ఇంకో అర అడుగులో నేలని తాకుతుంది అనేలోపు ఒక్క సారి కిందకి చూసి స్థాణువైపొయ్ అలానే ఉండిపోయా. రెప్పపాటు కాలం, ఒక్క ఝలక్, ఒక్క సెకండులో వెయ్యోవంతు ఆలస్యం ఐనా నేను ఈ రోజు ఇలా తెలుగులో బ్లాగు రాస్తుండేవాడిని కాదు. మళ్ళీ జన్మ ఎత్తి ఉండుండేవాడ్ని. ఏమైంది ఆక్షణం? నాకాలు కిందకి తాకే చోట, మన నల్లతాచుగారి నడుము. కాలు అలా లాండ్ ఐఉంటే నల్లతాచుగాడు వెనక్కితిరిగి, నడుముమీదలేచి నన్ను ఒక్కటే కొడితే థట్స్ ఇట్!! మనోడు నల్లగా నిగనిగలాడూతూ, కాడిమాను అంతలావుతో, ఒక 10అడుగులు పొడుగుతో, భయానకంగా,చూసేవాడికి వెన్నులోచి చావుభయాన్ని ఉసిగొల్పుతున్నట్టుగా, నిద్రలోచి ఉలిక్కిపడిలేచేంత భయంకరంగా,చిద్విలాసంగా నవ్వుతూ, ఉల్లాసంగా అలా పాక్కుంటూ పాక్కుంటూ, "నన్నుజూసి దడ్సుకుని సావండెహే" అన్నట్టు వెల్తున్నాడు. నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లా ఉండిపోయా. ఉలుకులేదు, పలుకులేదు, నా చుట్టు ఎమైందో తెలియదు, నేను ఏ అవస్థలో ఉన్నానో తెలియదు, ఒలంపిక్స్ లో స్ప్రింటర్ల బొమ్మలా ఎంతసేపు ఉన్నానో నాకెతెలియదు..ఇంతలో నాజబ్బని ఎవరో కుదిపినట్టు, భుజం మీద మన నల్ల తాచుగాడు తోక వేసినట్టు అనిపించి మామూలు లోకమ్లోకొచ్చి భయం భయంగా వెన్నక్కి తిరిగిచూస్తే మా మితృడు.ఏరా ఇంకా ఎళ్ళలేదా ఆడ మనోళ్ళు ఈతకొడున్రు..పదా అని లాకెళ్ళాటంతో...ఆ సంఘటన అలా నా స్మృతిపధమ్లో వెనక్కి వెళ్ళిపోయింది...తర్వాత కొంతకాలానికి, జనావాసమ్లో పుట్ట డేంజరపాయం అని పెద్దలు ఆలోసించి, దాన్ని తవ్వేయ్యాలని నిర్ణయం తీసుకుని, దాన్ని ఒకానొకరోజున తవ్వించెయ్యటం మొదలెట్టారు. నేను మాఇంటి గట్టుమీదనుంచి అలా చూస్తున్న. దాంట్లోంచి 15 నల్ల తాసులు, సిన్న సితక నుంచి, రాజ్జెం ఏలేంతవాటివరకూ ఉన్నయి..కొన్ని నిద్రపోతూ, కొన్ని ముచ్చట్లు సెప్పుకుంటూ, వాటిల్లో పెద్దోళ్ళు "ఎవుడహే పుట్టమీన సేయ్యేశింది" అన్నట్టు..మన జనజెంతువులు వాటినన్నిటినీ సంపేశరనుకోండి...

7 comments:

  1. మీరు రాసింది చదువుతుంటే భానుమతి గారి అత్తగారి కథలు లో ఒక కథ గుర్తొచ్చింది. అందులో పాముల వాళ్లు భానుమతి గారి తోటలో ముందుగానే పాముల్ని వదిలిపెట్టి మర్నాడు పాములవాళ్ళమంటూ వచ్చి పాముకు 50 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. అలా డజన్ల లెక్కలో వెళ్ళే పాముల్ని ఒకే సారి చూసిన భానుమతి గారు 'రెండో ఆట సినిమా చూసి ఇంటికెళ్ళే జనంలాగా ' అని వర్ణిస్తారు హాస్యంగా! అలాగే ఉంది మీరు అన్ని పాముల్ని చూడ్డం!

    ReplyDelete
  2. మీరు పల్నాడు అంటున్నారు...భాష చుస్తుంటే కోస్తా యాస లా వుంది.(మేము వాడే పద ప్రయోగాలు అవి చాలా వున్నాయి.ఎహె,సంపేత్తం...ఇలా).

    ReplyDelete
  3. @సుజాత గారు: మీ వ్యాఖ్య చాలా స్పూర్తినిచ్చేదిగా ఉంది...నా బ్లాగు చదివినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగులో, కులం మీద మీరాసిన టపా కి నేను వ్యాఖ్య రాసాను. మా అమ్మమ్మా వాళ్ళది కూడా నర్సారావు పేటే (పెట కి దగ్గర్లో ఉన్న ఒక చిన్న పల్లె. మా చిన్న అమ్మమ్మ మరియు మేనత్త వాళ్ళది పేట - ప్రకాష్ నగర్)

    @రాధిక గారు: పల్నాటి ప్రజలకి ఒక ప్రత్యేకమైన భాష అంటూ ఏమిలేదండి, అధవా ఉన్నా, ఆ భాష ఇక్కడ రాస్తే నా బ్లాగుకి బూతు బ్లాగు అని పేరొస్తుంది. ఇక నా భాష, మాఇంట్లో "అచ్చ తెలుగు" మాట్లాడే వాళ్ళం. అది కుటుంబనేపధ్యం కావొచ్చు, లేక అలవాటు కావొచ్చు.
    Anyways, Thanks for visiting my blog.

    ReplyDelete
  4. nijame kada.......chala buagunnadi nee anubhavam.........

    ReplyDelete
  5. -:)nijamenandi,okka adugu vatimeda vesivunte,ippudu blogulu rasevallamu kaadu!
    meruchala comedyga rastharu chaduvuthunte baguntundi.
    meku chala bloglu vunnayi,meku antha time,opika....?

    ReplyDelete
  6. సరిగ్గా ఇటువంటి అనుభవం నాకు కూడా అయింది. నేను అస్సాం వెళ్ళిన కొత్తలో, ఇచట పాములు ఉండును అని తెలుసును కానీ మా ఇంటి చుట్టూ విచ్చలవిడిగా సంచరించును అని తెలియదు. ఒకరోజు జీవితం మీద విరక్తి పుట్టి, క్లబ్బు లో కూచుని రాత్రి 10 గంటలకి ఇంటికి బయల్దేరి, ఒక కాలు ఇంటికి, మరో కాలు మరెక్కడికో వెళుతున్న పరిస్థితుల్లో ఒకచోట ఆగి సిగరెట్టు వెలిగిస్తుంటే, అగ్గిపుల్ల వెలుగులో రెండుకాళ్ళ మధ్యన తీరుబడిగా విశ్రాంతి తీసుకుంటున్న అంత లావు పామును చూసి, అలాగే పరుగులంకించుకొని అరకిలోమీటరు పరిగేసి, గస్తీ తిరుగుతున్న చౌకీదారు పట్టుకుంటే ఆగి, వాడిని తోడు తెచ్చుకొని ఇంటిదాకా వచ్చాను.
    ఆ తరువాత వాటితో సహజీవనం అలవాటు అయిపోయింది. అన్నీ రకాల పాములు తిరిగేవి. నేనున్న 30 ఏళ్ల లో మా కాలనీ లో ఎవరినీ కరవగా వినలేదు.

    ReplyDelete
  7. పల్నాడు పాములకి ప్రసిద్ధి
    ఎవరు కాదన్నది
    చెప్పండి గోడకుర్చీ వేయిన్చేద్దాం
    ఇన్నాళ్ళు ఇంత మంచి టపా మిస్ అయ్యానే ..:)

    ReplyDelete