ఈ దేశంలో క్రాక్ కొట్టిన అద్దాలతో కార్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎందరో.
ఈ దేశంలో ప్రతీదానికి బీమా ఉండాలి. ఇండి తీరాలి. బీమా సర్వ రక్ష అనుకుంటాం. కానీ కాదు. బీమా ప్రతినిధి కాలికేస్తే ఏలుకేస్తాడు. ఏలికేస్తే కాలికేస్తాడు. చివరాకరికి డిడక్టబుల్ అంటాడు. అక్కడే మనకి గొళ్ళెం పడుతుందని తెలియని బీమా గొర్రెలం మనం.
వెంటనే బీమావారికి కాలు చేస్నినాను. అమ్మా అయ్యా ఇదీ పరీస్థితి అని. అయ్యోపాపం ఔనా! అరె! అలా అయ్యిందా? సారీనే! బాధపడకు మరి. ఇవన్నీ సహజం...ఎన్నిమాటలు చెప్పిందో ఆమె. మా పెదనాన్నగారి బాబాయి కూతురు కూడా అంత ఇదిగా మాట్టాడుండదు.
అక్కా! సరేకానీ, ఏవన్నా సహాయం చేస్తావా? అన్నాను చివరికి ఆశతో దింపుడు కళ్ళతో.
తమ్మీ! హనీ! నేనిక్కడుంది ఎందుకనుకున్నా! భలేవాడివే! సేఫ్లైట్ అని ఓ కంపెనీతో మనకి మాంచి రిలేషన్ ఉంది. వాడికి చెప్పి నీ అద్దం బిగించేయిస్తా. అయితే నీ డిడక్టబుల్ #$500 కదా! ఏటి? అలా బేలగా చూడకు. అద్దం ఖరీదు #$299 అవుతుంది. వాడొస్తాడు. ఆడబ్బులిచ్చి చక్కగా వేయించుకో అంది ఆమె హుందాగా గొప్పగా పెద్దగా ఓ అక్కలా ఓదార్చుతూ.
కర్మరా బాబూ అనుకుని వాడితో అపాయింటుమెంటు తీస్కుని నిట్టూర్చాను.
ఓ సాయంత్రం వాడొచ్చాడు, సేఫ్లైట్ అని వ్యాన్ వెస్కుని. హహహ! ఏవిటి! హహహ అద్దం పగిలిందే హహహ అంటాడు. అన్నాయ్! నవ్వకు! నీ డబ్బు నాజేబుకి చిల్లు. ఏంచేస్తాం అని వాడికి కారు అప్పగించాను.
కానీ వాడు బాగనే చేసాడని నా అభిప్రాయం.
No comments:
Post a Comment