Jun 9, 2021

ఈ రాజు లెవరో పేర్లు రాయండి


మొన్నెప్పుడో వాట్స్ యాప్ లో ఓ మిత్రుడు ఇది పంపించాడు. అంత పెద్ద కఠినమైన పరీక్ష కాకపోయినా బాగుందని ఇక్కడ పెడుతున్నా.


1. పది తలల రాజు ఎవరు?

2.  దిన రాజు ఎవరు?

3.  రారాజు ఎవరు?

4. వలరాజు ఎవరు?

5. నగరాజు ఎవరు?

6. ఖగరాజు ఎవరు?

7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు? 

8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు?

9. నెలరాజు ఎవరు?

10. మృగరాజు ఎవరు?

11. దేవతల రాజు ఎవరు?

12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు?

13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు?

14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు?

15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు?

16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు?

17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు?

18. అష్టదిగ్గజాలనేలిన రాజు ఎవరు?

19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు?

20.  ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు?

Mar 5, 2021

ప్రతాపరుద్రీయం, కవిగారి వాంతులూ

ఇది కేవలం బ్రాహ్మణ ద్వేషం కాక మరేవిటీ?
ఈయన గొప్పవాడై ఉండచ్చుగాక!

తెలిసికోర యుగంధరుం డను
తెలుఁగుబ్రాహ్మణమంత్రి లేఁడుర
తెలిసికోర జనార్దనుండను
తెలుఁగుబ్రాహ్మణమంత్రి లేఁడుర
వినర వేంకటరాయశాస్త్రుల
పిచ్చివాఁడునుగూడ లేఁడుర
పేరిగాఁ డను పెద్దచాఁకలి
వెధవ యంతకుమున్నె లేఁడుర
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ఢిల్లికేగినమాట యుత్తది
ఢిల్లిసుల్తాన్‌ బట్టు టుత్తది,
ఓరుగంటి ప్రతాపరుద్రుని
నోరుగంటిని జేర్చుటుత్తది
ఆ యుగంధరమంత్రి దీనిని
నంతచేసెను ననుట యుత్తది,
ఔర! ఔర!! ప్రతాపరుద్రుని
నాటకం బదె బూటకంబుర
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ఢిల్లిదగ్గర గంగయుండెనొ?
గంగయొడ్డున ఢిల్లియుండెనొ?
గంగమీఁదను బడవయెక్కిన
ఓరుగంటిని జేరఁగలఁడే?
ఔర! వేంకటరాయశాస్త్రీ!
ఔర! వేంకటరాయశాస్త్రీ!!
ఎంత బొంకును బొంకి పోతివి
చచ్చి యెచ్చట నుంటివోకద
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ఓరుగంటి ప్రతాపరుద్రుని
యొద్ద బ్రాహ్మణమంత్రియొక్కఁడె;
ఊరు పేరును లేదు వానికి
నూర కాతఁడు మాసిపోయెను;
బ్రాహ్మణేతరమంత్రు లుండిరి,
వారు తీర్చిరి రాచకార్యము,
కార్యఖడ్గములందు చతురులు,
కాని వారల నెఱుఁగ రెవ్వరు!
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ముక్కుత్రాళ్ళను బోసి రిపులకు
ముప్పదేడులు రాజ్యమేలెను
సాహసాంకుఁడు చటులవిక్రమ
శాలి మా ముసునూరి కాపయ
ఓరుగంటిని తొలఁగిపోయిన
తెలుఁగువారల ప్రతిభ నిల్పెను
తెలుఁగువారల కత్తిదెబ్బలు
దిక్తటంబుల మరల మ్రోగెను
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ఓరుగంటి ప్రతాపరుద్రుఁడు
బందెపోవుట వాస్తవంబే,
బందెతీర్చిన మాసటీఁడొక
బ్రాహ్మణేతర దండనాథుఁడు
"రాయబంది విమోచకుం"డను
రాయబిరుదముదాల్చె నాతఁడు
ప్రజలు నేఁటికి మఱచిపోయిరి
వాని మాటను జెప్ప రొక్కరు
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

బందె వదలిన పిదప రాజ్యము
నేలలేదు ప్రతాపరుద్రుఁడు,
సిగ్గుచేతను గౌతమీనది
చెంతఁ జేరుచుఁ దపముచేయుచు
బందెవీడెను - బొందె వీడుచు
భూతలేశ్వరుఁ డంతెగానీ
ఓరుగంటిని మరలఁ గంటను
నొక్కనాఁడునుఁ జూడలేదుర
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

తప్పుపాటలు పాడఁబోకుము
తప్పుమాటలు చెప్పఁబోకుము
తప్పుకథలను జదువఁబోకుము
తప్పుదారులఁ ద్రొక్కఁబోకుము
ప్రాఁతకథలను దెలిసిచదువుచు
పాటఁబాడుము పరులు మెచ్చఁగ
కల్లవ్రాఁతలు తొలఁగ బుచ్చుము
కల్లకథలనుఁ బులిమి పుచ్చుము
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

-'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి


ఏం చెప్పదలచాడు కవి ఇందులో?
తప్పు పాట పాడకురా తెలుగువాడా. ఏదిటా తప్పు పాటా?
పలానీ యుగంధరుడు అనే వాడు లేడు. అది ఉత్తుత్తి కబురు.
ఎవరీ యుగంధరుడూ?

ప్రతాపరుద్రీయం అని ఒక నాటకం. ఎవరు రాశారూ? వేదం వేంకటరాయ శాస్త్రి. ఆయన కర్మ ఏవిట్టా? బ్రాహ్మడుగా పుట్టుట. ప్రతాపరుద్రుడు ఎవరటా? ఓరుగల్లు సంస్థానానికి రెండవ ప్రభువుట.  సదరు ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక, యధార్థ సంఘటనల ఆధారంగా వ్రాసిన తెలుగు నాటకం ప్రతాపరుద్రీయం. వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు వారు 1992 సంవత్సరంలో ముద్రించారుట.

యుగంధరుడు అనేవాడు ప్రతాపరుద్రుడికి మంత్రి అని వేంకటరాయ శాస్త్రి రచన.

అయితే? ఏవిట్టా?
ఇందులో వేదం వేంకటరాయ శాస్త్రి పైత్యం ఉండుండవచ్చు. వుండకనూ పోవచ్చు. దానికి కవిరాజుగారి వాంతులు ఎందుకుటా?

రెండు కోణాలు -
వేదం వేంకటరాయ శాస్త్రి రాసింది నాటకం. ఇది కొన్ని కల్పితాలు కొన్ని యదార్థ సంఘటనలూ కలిపిన రచన. ప్రతీనాటకం యదార్థం కాదు. ఆమాటకొస్తే మనం చదివే చరిత్ర యదార్థం కాదు. ఎందుకూ? అని అడగొచ్చు. చరిత్ర వ్రాయబడింది. ఎవరిచేతా? - చెప్పినవాడి తరపునించి రాయంబడింది. అంటే చరిత్ర కూడ ఇజానికి బందీ.కాంగ్రేసు పలకులు చరిత్రను తమవైపుకి రాయించుకున్నారు. తర్వాతి భాజపాలు తమ వైపుకి తిప్పుకున్నారు. రేపొద్దున్న ఎల్లదొరలు తమ ఇచ్ఛకి అనుసారం రాయించుకుంటారు. అది అలా వదిలేస్తే, కవిరాజు గారి ఈ దాడికి నేపథ్యం కేవలం కులమే. 
మహాంధ్ర సామ్రాజ్య పతనము అని మరొక రచన, రాసింది త్రిపురనేని వెంకటేశ్వరరావు. ఈయన మొదటి పేజీలోనే చెప్పుకున్నాడు అతని ఇజాన్ని. కవిరాజు రాసినదాన్నే నెమరు వేశాడు - తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!! అన్నాడు.

ఏది నిజం? ఏది అబద్ధం. వీళ్ళెవరూ నిర్ణయించటానికీ? 



Jan 13, 2021

భోగభాగ్యాల భోగి

భోగభాగ్యాల భోగి
ఈదేశం వచ్చాక భోగమూ లేదు భాగ్యము లేదు అని గునిసేవాళ్ళు ఉన్నా
భోగం అంటే మానసిక వై-భోగం అనుకుంటే
అదే మహాభోగం వైభోగం భాగ్యం
ఈవేళ్ళటి రోజున అన్నిటి కన్నా బాగ్యం వైభోగం - ఆరోగ్యం
మీరు ఆరోగ్యంగా ఉండండి
మీ చుట్టుపక్కల వాళ్ళని ఆరోగ్యంగా ఉండనివ్వండి
మిత్రులందరికీ భోగి మేలుతలపులు శుభాకాంక్షలు
కళ్ళం కాడినుంచి బండి నిండా కొత్త బియ్యాన్ని ముందిట్లోకి దింపి
వచ్చే దారిలో కనిపించిన చెఱుకు గడలు నాలుగు కొట్టుకొచ్చి
పొద్దున్నే అడవికి వెళ్ళి అడవిరేగి పండ్ల చెట్టుని దులిపి
రాలిన పండు రేగులు తెచ్చి
అంతలో పనికిరాని చెత్తని ఏరుకొచ్చి
ముంగిట మంటవేసి
అంతలో చిక్కుడు ఆకులతో రెండు బొక్కెనలు నెత్తికి పోసుకుని
అప్పుడే పేడతో అలికిన పొయ్యి మీద
దొడ్లోని గొడ్డుపాలతో పరమాన్నం చేసుకుని
నివేదనలు కరపి
మూడురోజుల సంక్రాంతిని ఆహ్వానించటానికీ
మనమేమీ పల్లెలోనో లేము
ఆసామి తనమూ లేదు
చేయతగ్గదల్లా
సంక్రాంతి లక్ష్మికి చేతనైనకాడికి దండమెట్టుకిని
ఎవురి ల్యాపుటపుల్లోకి ఆళ్ళు తలలు కాళ్ళు చేతులు దూర్చేసి
పనిచేస్కోటమే

Jan 6, 2021

ఓ జాత్యహంకారీ

 



ఓ జాత్యహంకారీ -

ఎటూ నీ పయనం?

నేటి నలగగొట్టబడ్డ నల్ల బిడ్డడు

రేపు ఎల్లదొరై నీ దేశాన్ని పాలించవచ్చు

ఒక్కసారి నీ కర్మ ఎలా కాలుతుందో ఆలోచించు ఆనాడు


ఎవరి రోడ్డులూ

ఎవరి దేశం అంటూ విర్రవీగుతున్నావు

ఈ దేశం నీయబ్బ సొమ్ము కాదని నీ అంతరాత్మకు తెలుసు


ఓ జాత్యహంకార-ఇజానికి బానిసా

నీ ఆత్మని అమ్ముకొకిలా

నిజాన్ని తెలుసుకుని బతుకు మనిషిలా

బతకనివ్వు మానవజీతినిలా 

తెలుగు పాటలు Open Project ఆలోచన/అవకాశం

 ఆ మధ్యకాలంలో హిందీ లిరిక్ కోసం smriti.com అనే ఒక వెబ్సైట్ కి వెళ్ళేవాడిని. ఎందుచేతనో ఆ సైట్ మూతపడింది.


ఆ సైట్ తయ్యారు చేసినవారు ఒక మంచి ఆలోచనతో చేశారు.

పాట వెతుక్కోటానికి - మొదటి అక్షరంతో వెతుక్కునేలా లిస్ట్ చేశారు.

పాడిన వారి ద్వార వెతుక్కునే విధమూ ఉంది.

కథానాయకుడి పరంగా వెతుక్కునే విధమూ ఉంది.

సంగీతదర్శకుడి పరంగా వెతుక్కునే విధమూ ఇచ్చారు.


తెలుగులో అలాంటి సైట్ ఉన్నట్లు నాకు ఎక్కడా తగల్లేదు.


అలాంటి సైట్ తయ్యారు చేయటానికి కావాల్సిన ముడి పదార్థాలు నేను స్పాన్సర్ చెస్తాను. ఓపిగ్గా కూర్చుని కోడింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకి రండి.


సోదరుడు వేణు శ్రీకాంత్ ఎన్నో పాటలు తన బ్లాగులోకి ఎక్కించాడు. సోదరుడి సహాయం తీసుకోవచ్చు పాటల కోసం.

Jan 5, 2021

వెన్నెలకంటి

 రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్నీ పాడగా జాజిపూల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము
మేని వీణలోన పలికే సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమాని
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువ నీదు
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
రాసలీలవేళ రాయబారమేల
-వెన్నెలకంటి


మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
గానమిది నా ధ్యానమిది 
ధ్యానములొ నా ప్రాణమిది 
ప్రాణమైన మూగగుండె రాగమిది

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది

ముత్యాలపాటల్లొ కోయిలమ్మా 
ముద్దారపోసేది ఎప్పుడమ్మా
ఆ పాలనవ్వుల్లొ వెన్నెలమ్మా
దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌనరాగాల ప్రేమావేశం 
ఏనాడో ఒకరి సొంతం
ఆకాశదీపాలు జాబిలి కోసం 
నీకేల ఇంత పంతం
నింగి నేల కూడేవేళ 
నీకు నాకు దూరాలేలా 
అందరాని కొమ్మ ఇది 
కొమ్మచాటు అందమిది 

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా 
గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నేలమ్మా 
నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం 
కోరింది ప్రణయ వేదం
వేశారు గుండెల్లొ రేగే గాయం 
పాడింది మధురగేయం
ఆకాశానా తారాతీరం 
అంతేలేనీ ఎంతో దూరం

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది 
కొమ్మచాటు అందమిది..
కూడనిదీ జతకూడనిదీ 
చూడనిదీ మదిపాడనిదీ 
చెప్పరాని చిక్కుముడి వీడనిదీ

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది
కొమ్మచాటు అందమిది
-వెన్నెలకంటి

అందిస్తున్నా వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్నా ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే
కలకలమని కులుకుల అలసులుగని చిలికిన సుధలివిలే
చెలువనిగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలనుగని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
-వెన్నెలకంటి

గొప్ప భావుకత
కవికి మరణం ఉండదు అని నా ప్రగాఢ విశ్వాసం.

మూర్తుల విధ్వంసం

మూర్తుల విధ్వంసం కొత్తేమీ కాదు. సూటిగా ఒక మాట చెప్పుకుందాం. మా ఊళ్ళవైపు అనగా పల్నాటి వైపు ఎన్నో దేవాలయాలు శతాబ్దాల చరిత్ర కలవి - విధ్వంసం అయిపోయాయి. నా కళ్ళ ముందు - మా ఊరికి దగ్గర్లో ఉన్న బుగ్గ మల్లయ్య దేవాలయం, మూడు వేల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. మల్లయ్య నిల్చుని ఉంటాడు పంచలోహంతో చేయబడి. కాళ్ళ వరకు విరగ్గొట్టబడ్డాడు. విగ్రహం మాయం. ఇలాంటివి ఎన్నో. మా ఉరికి దగ్గర్లోని రేగులగడ్డ దగ్గర్లో కల ఒక కోటలో దేవాలయంలో మూర్తులు మాయం, మూర్తులని ప్రతిస్థాపించిన గద్దెలు తొవ్వబడ్డాయి.


కారణాలు? మంచలోహ విగ్రహాలు అవటం ఒకకారణం. విగ్రహప్రతిష్ఠలో నవరత్నాలను వాడతారనేది ఇంకోకారణం.


ప్రస్తుతంలోకొస్తే - జగన్ వచ్చాక హిందూమతం మీద, గుళ్ళమీద దాడులు ఎక్కువయ్యయనేది వార్త.


క్రైస్తవీకరణ ఎక్కువైంది - ఇందులో ఏమాత్రమూ సంశయం లేదు.


ప్రభుత్వం ఈరకంగా మెజారిటీల మనోభావాలని దెబ్బతీస్తుందని నేననుకోవట్లేదు. హిందువుల ఓట్లను కోల్పోయే ఆలోచన ఏ పార్టీ కూడా చేయదు అని నా అభిప్రాయం.


ఇది రాజకీయ లబ్ది కోసం చేస్తున్నదే అని నా అభిప్రాయం.


ఏవైనా - ఈ సంఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. అలాగే ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఖండించి తీరాలి.

పొంత లేని స్టేట్మెంట్స్ మానేయాలి