Jan 5, 2021

వెన్నెలకంటి

 రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్నీ పాడగా జాజిపూల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము
మేని వీణలోన పలికే సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమాని
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువ నీదు
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
రాసలీలవేళ రాయబారమేల
-వెన్నెలకంటి


మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
గానమిది నా ధ్యానమిది 
ధ్యానములొ నా ప్రాణమిది 
ప్రాణమైన మూగగుండె రాగమిది

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది

ముత్యాలపాటల్లొ కోయిలమ్మా 
ముద్దారపోసేది ఎప్పుడమ్మా
ఆ పాలనవ్వుల్లొ వెన్నెలమ్మా
దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌనరాగాల ప్రేమావేశం 
ఏనాడో ఒకరి సొంతం
ఆకాశదీపాలు జాబిలి కోసం 
నీకేల ఇంత పంతం
నింగి నేల కూడేవేళ 
నీకు నాకు దూరాలేలా 
అందరాని కొమ్మ ఇది 
కొమ్మచాటు అందమిది 

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా 
గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నేలమ్మా 
నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం 
కోరింది ప్రణయ వేదం
వేశారు గుండెల్లొ రేగే గాయం 
పాడింది మధురగేయం
ఆకాశానా తారాతీరం 
అంతేలేనీ ఎంతో దూరం

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది 
కొమ్మచాటు అందమిది..
కూడనిదీ జతకూడనిదీ 
చూడనిదీ మదిపాడనిదీ 
చెప్పరాని చిక్కుముడి వీడనిదీ

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది
కొమ్మచాటు అందమిది
-వెన్నెలకంటి

అందిస్తున్నా వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్నా ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే
కలకలమని కులుకుల అలసులుగని చిలికిన సుధలివిలే
చెలువనిగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలనుగని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
-వెన్నెలకంటి

గొప్ప భావుకత
కవికి మరణం ఉండదు అని నా ప్రగాఢ విశ్వాసం.

1 comment:

  1. "కవికి మరణం ఉండదు అని నా ప్రగాఢ విశ్వాసం."
    కరెక్ట్ సోదరా మంచి మాట చెప్పారు.

    ReplyDelete