మొన్నెప్పుడో వాట్స్ యాప్ లో ఓ మిత్రుడు ఇది పంపించాడు. అంత పెద్ద కఠినమైన పరీక్ష కాకపోయినా బాగుందని ఇక్కడ పెడుతున్నా.
1. పది తలల రాజు ఎవరు?
2. దిన రాజు ఎవరు?
3. రారాజు ఎవరు?
4. వలరాజు ఎవరు?
5. నగరాజు ఎవరు?
6. ఖగరాజు ఎవరు?
7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు?
8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు?
9. నెలరాజు ఎవరు?
10. మృగరాజు ఎవరు?
11. దేవతల రాజు ఎవరు?
12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు?
13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు?
14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు?
15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు?
16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు?
17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు?
18. అష్టదిగ్గజాలనేలిన రాజు ఎవరు?
19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు?
20. ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు?
మీ వాట్సాప్ మిత్రుణ్ణి ఇది అడగండి - ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదని చాలా పరిశోధన చేసి ప్రఖ్యాతి పొందిన తెలుగు రాజెవరు?
ReplyDeleteలోల్! రామరాజు అయితే మాత్రం కాదు. RRR కూడ కాదు.
Delete*ఈ రాజు లెవరో పేర్లు రాయండి*
ReplyDelete==================
1. పది తలల రాజు ఎవరు? = రావణుడు
——————————-
2. దిన రాజు ఎవరు? = సూర్యుడు
——————————
3. రారాజు ఎవరు? = దుర్యోధనుడు
——————————
4. వలరాజు ఎవరు? = మన్మథుడు
——————————
5. నగరాజు ఎవరు? = హిమవంతుడు
——————————
6. ఖగరాజు ఎవరు? = గరుత్మంతుడు
——————————
7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు? = దిలీపుడు
—————————-
8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు? = దశరథుడు
—————————
9. నెలరాజు ఎవరు? = చంద్రుడు
—————————
10. మృగరాజు ఎవరు? = సింహం
—————————
11. దేవతల రాజు ఎవరు? = ఇంద్రుడు
—————————
12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు? = త్రిశంకుడు
—————————
13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు? =
సత్య హరిశ్చంద్రుడు
—————————-
14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు? = ధర్మరాజు
——————-
15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు? = ధృతరాష్టుడు
———————
16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు? = పరీక్షిత్తు
———————
17. భార్యకు ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు? = శంతనుడు (భీష్ముడి తండ్రి)
———————
18. అష్టదిగ్గజాలనేలిన
రాజు ఎవరు? = శ్రీకృష్ణదేవరాయలు
———————
19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు? = రాజరాజ నరేంద్రుడు
———————
20. ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు? = రాముడు
====================
Nice
DeleteThis comment has been removed by the author.
ReplyDelete1. పది తలల రాజు ఎవరు?
ReplyDeleteరావణుడు
2. దిన రాజు ఎవరు?
సూర్యుడు
3. రారాజు ఎవరు?
దుర్యోధనుడు
4. వలరాజు ఎవరు?
మన్మథుడు
5. నగరాజు ఎవరు?
నగము - పర్వతము
నగరాజు - పర్వతరాజు - హిమవంతుడు
6. ఖగరాజు ఎవరు?
ఖగము - పక్షి
పక్షులకు రాజు గరుత్మంతుడు
7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు?
దిలీపుడు
8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు?
దశరథుడు
9. నెలరాజు ఎవరు?
చంద్రుడు
10. మృగరాజు ఎవరు?
సిమ్హము
11. దేవతల రాజు ఎవరు?
ఇంద్రుడు
12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు?
త్రిశంకుడు
13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు?
హరిశ్చంద్రుడు
14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు?
ధర్మరాజు
15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు?
ధృతరాష్ట్రుడు
16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు?
పరీక్షిత్తు
17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు?
శంతనుడు
18. అష్టదిగ్గజాలనేలిన
రాజు ఎవరు?
శ్రీకృష్ణదేవరాయలు
19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు?
రాజరాజనరేంద్రడు
20. ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు?
శ్రీ రాముడు