ఆ మధ్యకాలంలో హిందీ లిరిక్ కోసం smriti.com అనే ఒక వెబ్సైట్ కి వెళ్ళేవాడిని. ఎందుచేతనో ఆ సైట్ మూతపడింది.
ఆ సైట్ తయ్యారు చేసినవారు ఒక మంచి ఆలోచనతో చేశారు.
పాట వెతుక్కోటానికి - మొదటి అక్షరంతో వెతుక్కునేలా లిస్ట్ చేశారు.
పాడిన వారి ద్వార వెతుక్కునే విధమూ ఉంది.
కథానాయకుడి పరంగా వెతుక్కునే విధమూ ఉంది.
సంగీతదర్శకుడి పరంగా వెతుక్కునే విధమూ ఇచ్చారు.
తెలుగులో అలాంటి సైట్ ఉన్నట్లు నాకు ఎక్కడా తగల్లేదు.
అలాంటి సైట్ తయ్యారు చేయటానికి కావాల్సిన ముడి పదార్థాలు నేను స్పాన్సర్ చెస్తాను. ఓపిగ్గా కూర్చుని కోడింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకి రండి.
సోదరుడు వేణు శ్రీకాంత్ ఎన్నో పాటలు తన బ్లాగులోకి ఎక్కించాడు. సోదరుడి సహాయం తీసుకోవచ్చు పాటల కోసం.
మంచి ఆలోచన సోదరా.. తప్పకుండా నేను ఎప్పుడు కావాలన్నా సహాయం అందించడానికి సిద్ధం. నా బ్లాగ్ లో పాటలకు కాపీ ప్రొటెక్షన్ కూడా ఉండదు.. స్వేచ్ఛగా కాపీ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. బ్లాగ్ మొదలు పెట్టిన రొజుల్లో నేనూ కాస్త అలా ట్రై చేశాను కానీ బ్లాగర్ లో లేబుల్స్ లిమిట్ ఉండడంతో అన్ని యాడ్ చేయలేకపోయాను.
ReplyDeleteమీరు చెప్పిన శాంపుల్ సైట్ ఇదే కదా.. https://web.archive.org/web/20180513043048/http://www.smriti.com/hindi-songs/main-index