May 31, 2019

ఆం.ప్ర ఖజానాలో కేవలం 100 కోట్లు

నిన్న ఒక వార్త చూశాం. ఆం.ప్ర ఖజానాలో కేవలం 100 కోట్లే ఉన్నాయంటూ.

ఈ పత్రిక ఎన్నికల ముందు ఏంచేసిందీ? ఎన్నికల ముందు ఈ నిజాన్ని ప్రచురించి ఉండచ్చుగా?

భలేవాడివే! ఎన్నికల ముందు 100 కోట్లకు పైగా ఉంది ఖజానా అని అనొచ్చు.

ఈ పత్రిక నిజంగా ప్రజా పక్షాన ఉంటే, వీళ్ళ జర్నలిజంలో నిజమైన విలువలే ఉంటే

ఎన్నికల ముందు ఇంత, అయ్యాక ఇంత, కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి ఇంత అనే లెక్కలు ప్రచురించుంటే నా జీవితంతం వీరి పత్రికకి సబ్స్క్రైబ్ చేస్కోనుండేవాడ్ని

May 30, 2019

మీడియా కుక్క తోక

గత వారం పది రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు. ఇక జరగబోయే రాజకీయ తంతు. బాగా దగ్గరుండి ఇవాళ్టి  రాజకీయాలను గమనించాల్సిన సమయం.
ఈ గందరగోళంలో గమనించాల్సింది మీడియా పోకడని
మింగలేక కక్కలేక
జగన్ అనలేక అనకుండా ఉండలేకా
తెగ బాధపడిపోవటం.

ఒబామా మొదటిదఫా పాలన సగానపడేలోపు నేను న్యూయార్క్ నుంచి కేన్సాసుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పట్లో KMBZ అనే రేడియో వింటం జరిగింది. దాంట్లో మధ్యాహ్నం రెండు మూడు గంటలపాటు Rush Limbaugh అనేతని టక్ షో వచ్చేది. దాన్ని రిపబ్లికనులు అదొక మహత్తర కావ్యంలా ఇతిహాస పురాణాలకన్నా దేవుని వాక్యంలా చెవులు రిక్కించి మరీ వినేవారు.
ఇతను ఎంత గొప్ప వ్యక్తి అంటే బారాక్ హుస్సేన్ ఒబామా అని ఉచ్ఛరించటనికి ఇష్టపడేవాడు కాదు, ఉచ్ఛరించే పాపం చేసేవాడు కాదు. రిపబ్లికనులు ఆ పేరు వినేప్పుడు ఎంతో పాపం చేసినవారిలా ఊగిపోయేవారు. బాధపడేవారు. చర్చీలకి వెళ్ళి నాలికని నేలకేసి రాసుకునేవారు. Rush Limbaugh బారాక్ హుస్సేన్ ఒబామా అనాల్సి వచ్చినప్పుడు బారాక్ ఆఆఆ  ఒబామా అనేవాడు.

ఒక వ్యక్తిని వ్యతిరేకించవచ్చు
ఒక వ్యక్తిని ద్వేషించవచ్చు
కానీ ఈస్థాయికి ద్వేషించటం వాళ్ళ విచక్షణకి తార్కాణం
మానసిక స్థితికి నిలువెత్తు అద్దం

అదేస్థాయికి ఇవ్వాళ్ళ మీడియా దిగజారింది. నిన్నటిదాకా విషప్రచారం చేసింది. A1 అంటూ జైలు పక్షి అంటూ ఎన్ని విధాలుగా దిగజారాలో అన్ని విధాలుగా పాకుడు మెట్ల మీదనే నిల్చుంది.

చివరికి తాము ఎవ్వరి గెలుపుకోసం పాటుపడుతున్నాము అని భ్రమించాయో, ఆ సంకల్పాన్నే పాకుడురాళ్ళ మీద నిలబెట్టి అధోపాతాళానికి నెట్టి తామూ అధోపాతాళానికి జారిపోయాయి.


ఇవ్వాళ్ళ కొదరు పచ్చలయ్యలు "వార్తా సమీక్ష" లకు జగన్ పార్టీ నుంచి ఎవ్వరూ రాకుండానే చర్చిస్తున్నారు.
ప్రజలచేత ప్రజలకొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటు అయే సందర్భంలో, 50% మెజారిటీ సాధించుకున్న పార్టీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేకుండా గెలుపోటముల చర్చలు *తల లేని మొండెం*లా అనిపిస్తున్నాయి.

ఇక భజన పత్రికలు తమ భక్తిని ఇలా చాటుకున్నాయి -
ఎవరన్నా ఫలితాలు రాసేప్పుడు క్రొనొలోజికల్ ఆర్డర్లో రాస్తారు. ఎక్కువ సీట్ల నుంచి తక్కువ సీట్లు వచ్చిన ఆర్డరులో లేక ఆల్ఫాబెటికల్ ఆర్డరులో.
కానీ రామోజీ తాత
TDP           23
YSCRCP 151
JSP              1

అంటూ లిస్టింగ్ ఇచ్చాడు.

మీడియా కుక్క తోక వంకర అని నిరూపించాడు

కీర్తి



ఈప్రపంచంలో ప్రతోడు నీతిమంతుడే - బయట ప్రపంచానికి.
కొత్త తరంలో ప్రపంచం కళ్ళు తనమీదపడాలనీ ప్రతోడి ఆరాటం. కళ్ళు తనమీద పడాలంటే సుళువైన మార్గం ఒకటుందని కాకిరిగుమ్మ గగ్గరనుండి సందులో పనికిరాని *నటుడి* దాకా ప్రతోడు కనుక్కున్నాడు.
ఈ మార్గం చాలా సులభమైనది. ఆట్టే కష్టపడాల్సిన పనిలేదు.
ఈమార్గాన్ని ఆలింగనం చేస్కోవాలంటే మాత్రం కొన్ని మౌళిక సూతాలున్నాయి. వాటిల్లో కొన్ని
సిగ్గు లజ్జ మానం అభిమానం ఇత్యాదివి వదిలేయాలి.
కులదూషణ తారాస్తాయికి చేయాలి.
పక్క కులాన్ని ద్వేషించాలి.
ద్వేషించటనికి భయమైతే కనీసం బ్రాహ్మణ ద్వేషం ఉండలి, మాటల మధ్యలో బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అంటూ పదజాలాన్ని వాడగలగాలి.
ఫేసుబుక్కు/బ్లాగుల నిండా/ట్విట్టరు నిండా సూక్తులను కుమ్మరించాలి.
బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి.
జెనరలీజేషన్స్ చెయ్యాలి.
తాను తప్ప మిగతా సమాజం అంతా తాలు సరుకు అని డప్పా కొట్టాలి, సొంత బాకా ఊదుకోవాలి.
పొద్దున్నే సూక్తులు - సాయంత్రం వ్యభిచారం చేయగలగాలి.
రాజ్యాంగం/హక్కులు అంటూ మాట్లాడాలి (లీగల్ గా కేక గురూ అనిపించుకోవాలి).
పాకిస్థాన్ భజన చేయాలి.
వ్యక్తిపూజని వ్యతిరేకిస్తూ సాయంత్రానికి సొంతపూజ చేస్కోవాలి.
అందరూ తనను పూజించాలని కలలు గనాలి.
వాటిని పక్కనోడిమీద రుద్దాలి.
నా మీద కుట్ర జరుగుతుంది అంటూ కనిపించిన చోటల్లా వాపోవాలి అవసరం ఉన్నా లేకున్నా.

ఇవన్నీ ఒక ఎత్తైతే
ముఖ్యంగా చేయాల్సినవి మాత్రం ఇవి
కనిపించిన పోష్టరు మీదల్లా బురద పేడ కొట్టాలి అనగా - మోడి మీద, అమిత్ షా మీద లేక తన దగ్గర్లో ఉన్న కొండకచో సెలబ్రిటీస్ మీద అనగా ఉదాహరణకి - సే - పవన్ కళ్యాన్ మీద, కె విశ్వనాథ్ మీద, నాగబాబు మీద, నానీ మీద, సే జగన్ మీద, షర్మిల మీద, కెసీఆర్ మీద ఇలా.
ప్రధాని దొంగ అనటం.
మతాన్ని ద్వేషించటం.
మతాన్ని దూషించటం.
హిందూ తీవ్రవాదం అనటం.
మత పెద్దల్ని దూషించాలి.


ఇలా చెప్పుకుంటూ పోతే బ్లాగు చాలదు!

అన్నీ బాగనే ఉన్నాయోయ్ కానీ ఇలా ఎవరు చేస్తున్నారో ఉదాహరణకు మచ్చుకి నాలుగుగైదారేడెంది పేర్లు చెప్పు అనడగొచ్చు -
ప్రకాశ్ రాజ్ చేయట్లేదా?
హీరో సిద్ధార్థ్ చేయటంలేదా?

మత్తి కహేశ్ చేయట్లేదా?
లోకేశ్ చేయట్లేదా?
శ్రీబెడ్డి చేయట్లేదా?
ఆమాటకొస్తే తన స్థాయిలో మీకాహిరా చేయట్లేదా?

ప్రతోడు కోర్తికోసం ఖ్యాతి కోసం పాకులాడేవాడే/దే

May 25, 2019

వార్తా పుత్రికల పైత్యంపై ఓ వ్యాసం

ఈరోజు సాక్షిలో ఈ రచన నన్నాకట్టుకుంది


శ్రీ నారా లోకేశ్


ఆకలేసి అన్నమడిగితే -

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం.
ఎటు చూసినా చిక్కులే.
ఎటు చూసినా సమస్యలే.
పిరికిటి నిండా చిల్లర లేదు.
జేబుల నిండా నోట్లు లేవు.
ఇంతలోనే అహంకారం
ఇంతలోనే అతివాద ప్రకోపం.
ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మిస్తాం అని ఎవరెస్టు శిఖరానికి దారం వేయటం

ఒక కొత్త ఊరికి బదిలీ కాబడ్డ బడుగు ఉపాధ్యాయుడిలా ఉన్న ప్రభుత్వం. చిన్న గది తీసుకుని సంసారాన్ని కుదుట పరిచి, తననితాను సంభాళించుకుని కాలూచేయీ తీసుకుని అడుగు ముందుకేద్దామనే మధ్యతరగతి ఆలోచన చేయని ఆలోచనరాని ఆలోచన రానివ్వని ఆ మనిషి

రోజులు దొర్లాయి.
సామాన్యుడి జీవితంలో మార్పు లేదు.
అదిగో నవలోకం అంటూ గోడమీద "రేపు" అని రాసి ఊరిస్తూ వంచిస్తూ

ఒకవైపు ఏడాదికి నాలుగు పంటలు పండే బంగారు డెల్టాని సిమెంటూవనంలా మారుస్తూ

వెరసి రైతుల కష్టాలు కన్నీళ్ళు

ఇలాంటి సందర్భంలో చినరాజావారు శ్రీశ్రీశ్రీ నారా లోకేశ్

జాలితో
దయతో
కరిగిపోయి
కన్నీరులో కన్నీరై
మున్నీరులో మున్నీరై
యావత్ జాతిని మేల్కొల్పేలా
జనాలకోసమే
తానంటూ
ముందుకొచ్చాడు

గొప్ప నేత. దూరదృష్టి. తెలివి. ఆలోచన. సేవ.
ఇన్ని గుణాలు కలపోసి పోతపోసిన మనిషి లోకేశ్.

సాధారణ స్థాయిలో మనిషి ఇలాంటప్పుడు రైతులకు సరసమైన్ ధరలు ఇద్దాం ఏవోకొన్ని సబ్సీడీలు ఇద్దాం ఋణం ఇద్దాం పోనీ ఉన్నదాన్ని మరికొంత మాఫీ చేద్దాం అని అనుకుంటాడు

కానీ లోకేశ్ అలా ఆలోచించలేడు.
గొప్ప మహానుభావుడికి మాత్రమే మార్గదర్శకుడికి మాత్రమే ఇంద్రుడికి మాత్రమే చంద్రుడికి మాత్రమే వచ్చే ఆలోచన చేశాదు.

ఆకలేసి వచ్చిన రైతుకోసం
5000 వేల కోట్లతో ఫైబర్ కేబుల్ వెయించి
అందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోణులు ఇప్పించి
అందులో
కే.యఫ్.సి అప్లికేషనో
మ్యాక్.డోనాల్డ్ అప్లికేషనో వేసి
ఫోను ద్వారా ఆర్డర్ చేస్కునేలా ఏర్పాటూ చేశాడు.

దార్శనికతకు నిలువెత్తు ఉదాహరణ.

అందుకే మందలగిరికి పంపించారు జనాలు గౌరవంగా

చింతమనేని ప్రభాకర్

ఒక దుర్మార్గుడు దగ్గరుండి తన మనుషుల చేత యధేచ్ఛగా పట్టపగలు మిట్టమధ్యానం అందినకాడికి అందరూ చూస్తుండగా నిర్లజ్జగా నిర్భీతిగా వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ చట్టాన్ని కుళ్ళబొడుస్తూ న్యాయాన్ని కాలరాస్తూ దేశ సహజ సంపదని దోచుకుంటున్నాడు.
అతను ఓ రాజికీయ అతివాది. రాజకీయ మితవాదుల కాలం నుంచి దేశం పరిణితి చెందుతూ ఈనాటికి రాజకీయ అతివాదుల చేతిలోకి పోబడిందని వేరే చెప్పక్కర్లేదు. రోజుకి కొన్ని వందల సంఘటనల్లో చూస్తూనే ఉన్నాం, ఆట్టే వెతుక్కోవాల్సిన పనికూడా లేదు.
ఇతను ఆంధ్రప్రదేశ్ అనే దేశాన్నికి పేరు ప్రఖ్యాతులతో పాటు అనితరసాధ్యంకాని అనుభవపాటవాలతో పరిపాలిస్తున్న రాజువద్ద ఓ పేద్ద అమాత్యుడు.
దోపిడీలు చేయించటం, సహజ సంపదలని దగ్గరుండి దోపిడీ చేయించటంలో సిద్ధహస్తుడు.
కనిపించిన వారిని అమ్మనానబూతులు తిట్టిటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.

ఆరోజు ఆ మధ్యాహ్నం అలా దోపిడీ ఛెస్తుండగా తన జీవితంలో చేయకూడని తప్పు చేస్తున్నాను అని తెలియని ఓ ప్రభుత్వ ఉద్యోగిని అటుగా వెళ్ళటం తారసిల్లింది. ఆమె తెలిసే వెళ్ళిందో లేక విధి ఆమెతో ఆడించిన వింత నాటకమో - ఆమె అటుగా వెళ్ళటం దోపిడీ అంతా ఆమెకు అవగతం కావటం క్షణంలో జరిగిపోయాయి.
విధి బలీయం ఆమె సదరు ఆమాత్యుడిని నిలదీయటం చకచకా జరిగిపోయాయి. ఆమె అధికార్ణిగా అతన్ని ప్రశ్నించింది.
ఏవిటి జరుగుతోందీ? ఏవిటీ ఈ దోపిడీ? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ప్రముఖ అమాత్యుడి కనుసన్నల్లో ఇలా దోపిడీ చేయటానికి సిగ్గుగా లేదా అని ఆక్రోసించింది.

సదరు అమాత్యుడు జూలు విదిలించి తాన ధికార దర్పాన్ని ఆసాంతం ప్రోగుచేసి ఆమెని కాల రాసే ప్రయత్నంలో ఆమెని ఘాట్టిగా ఒక్కటి పీకనే పీకాడు.

ఈ సంఘటనని సిగ్గున్న సమాజం ఏంచేయాలీ? గర్హించాలి.
ఒక పోలీసుమీద డ్యూటీలో ఉండగా చేయిచేసుకుంటే ఓ పేద్ద నేరం అవుతుంది
ఓ ప్రభుత్వోద్యోగిని డ్యూటీలో ఉండాగా చేయి చేసుకుంటే అంతే పెద్ద నేరం అవుతుందా కాదా?
ఇలాంటి సమయంలో సదరు ప్రభుత్వం తన ఉనికిని ప్రజలవద్ద కాపాడుకునేందుకూ కనీస ధర్మంగా ఏంచేయాలీ?

ప్రభుత్వం ఆట్టే పెద్దగా ఉలిక్కి పడలేదు. నెగడు వద్ద కూర్చుని బీడీ వెలిగుంచుకునే తరహాలో ముట్టీ ముట్టనట్టుగా ఉంటమే కాకుండా
ఆమెని ప్రశించింది. అసలు పట్టపగలు మిట్టమధ్యాహ్నం నువ్వు అటు ఎందుకెళ్ళావని ఆమె అవాక్కైయ్యేలా ప్రశ్నించింది.

ఆమె తన సరిహద్దులు దాటి వెళ్ళిందని ఆరోపణ
సదరు అమాత్యుడు సరైన తీరులోనే ప్రవర్తించాడని అతనికి మెడలోంచి హారం తీసి మరీ బహుకరణ

అమాత్యుడు - చింతమనేని ప్రభాకర్
ప్రభుత్వోద్యోగి - వనజాక్షి
ప్రభువు - శ్రీ నారా చంద్రబాబు

no one respects women more than me అన్నాడు Donald Trump. అనీఅనగానే నిండు సభలో Hillary Clinton ని Nasty Woman అన్నాడు. ప్రజలు అతనికి పట్టం కట్టారు.

చింతమనేని ప్రభాకర్ ఆగడాలను వెనుకేసుకొచ్చిన చంద్రబాబుని ఇంటిముఖం పట్టించారు ఓటరులు.
చింతమనేని ప్రభాకరుని దారుణంగా ఓడగొట్టారు.

రేపొద్దున Donald Trump కైనా ఇదేగతి.
ఆమె ఆడది కావచ్చు మగాడు కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగికి ఆమాటకొస్తే మనిషికి విలువ ఇవ్వగలిగేది కేవలం మనిషి మాత్రమే

లంకా దినకర్

ఈనాడు పత్రికని వార్తల్నీ బ్యాన్ చేసి చాలా కాలం అయ్యింది. ఆంధ్రజ్యోతి చూసే అలవాటు ఎప్పుడూ లేదు. ఆర్కె తో ముఖాముఖీ లాంటివి అసలు పడవు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక అలవాట్లు ఉన్ననాకు వార్తల్ల్ని వండి వార్చే పుత్రికలు రెండే మిగిలాయి. ఒకటి టీవి 5 రెండు సాక్షి.
టీవి 5 లో పొద్దున్నే వార్తల సమీక్షని చూట్టం అవసరం అయ్యింది. ఒక కారణం రావిపాటి విజయ్.
ఇతను కొంత పరిణితితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాడాని నా అభిప్రాయం. కానీ ఇతనికీ పచ్చ కామెర్ల వ్యాధి ఉందని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. జగన్ పార్టీని హేళాన చేస్తూ మాట్టాడటం భాజపాని చులకన చేస్తూ మాట్టాడటం గమనించినా అంతగా నేను పట్టించుకోలేదు. ఓరోజు పచ్చకామెర్లు ముదరటం - జగన్ పార్టీ టీవి5 ని వెలివేయటం జరగనే జరిగింది.
ఇక టీవి5 ని తగ్గించేశను. వార్తావిశ్లేషణ సాక్షీలో చూట్టానికి అలవాటు పడ్డాను.
మధ్యలో ఓ రోజు టీవి5 పెట్టాను. లంకా దినకర్ అనే అతివ్యాధిగ్రస్తుడు ఆరోజు వార్తా విశ్లేషణకి వచ్చాడు. విశ్లేషణో లేక ఏడుపో లేక ఆర్తనాదమో మొదలైంది. లంకా దినకర్ గారి వితండవాదం జోరుగా కొనసాగుతున్నది. అంశం - ఈవీయం ట్యాంపరింగ్.

లంకా దినకర్ గారి ఉధృత ప్రవాహం కొనసాగింపులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది గురించి ఒక వింత స్టేట్మెంట్ పలికాడు.

గోపాలకృష్ణ ద్వివేది ఆర్.యస్.యస్ భావజాలం కల వ్యక్తి అని. అదేదో దేశ ద్రోహం అయినట్టు.

ఇది ఎంత వరకూ సమజంసం


లంకా దినకర్ గారు గ్రామసింహంవలే ఎలా వాక్ప్రవాహాన్ని స్రవింపచేస్తారో. అనేక ఉదాహరణలు. ఒక చిన్న ఉదాహరణ ఈ వీడియో


May 17, 2019

బలవంతపు గాంధీఇజం



గాంధీ గొప్పవాడు అయుండచ్చు. గాంధీఇజాన్ని కాంగ్రేస్ జనాల నరనరాల్లోకి ఇంకింపజేసి ఉండచ్చు.
ఎక్కడో ఓ మూల ఎవడోకడు దాన్ని వ్యతిరేకించే తిరుగుబాటు చేసే ఇజంతో ఉండడా?

గాంధీ అనే ఓ మనిషి తీసుకున్న కొన్ని నిర్ణయాలు సదరు విప్లవకారుడికి నచ్చలేదు. అతను గాంధీని అంతం చేశాడు.

గాంధీని హత్య చేయడం నేరం. నేరానికి ఖచ్చితంగా శిక్ష వేసింది న్యాయస్థానం. కాటాలో నేరమూ-శిక్ష సమం అయ్యింది వ్యవస్థకి.

అయితే గాంధీ అనే వ్యక్తిని హతమార్చటం దేశద్రోహమా? దేశవ్యతిరేకమా?

అభివృద్ధి పేరుతో దేశాన్ని అమ్ముకుంటున్న ఈతరం రాజకీయనాయకులు దేశభక్తులా?

May 11, 2019

ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకటం ఎలా

బ్రౌజర్లలో ఒక ఫీచర్ ఏవిటంటే - బ్రౌజింగ్ హిస్టరీని బట్టి *రెకమెండేషన్స్* ఇవ్వటం.
అలాంటి ఒక రికమెండెడ్ లింక్ ఒకటి *ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకటం ఎలా* అని
లింకులోకెళితే - ఎక్కువకాలం ఆరోఘ్యంగా బతకటనికి 8 చిన్న చిన్న అడుగులు అంటూ ఏదోరాసుకొచ్చాడు
1. లే! పదా!
2. నిజమైన ఆహారం తిను
3. నీ మిత్రుల్ని పిలువ్
4. సప్లిమెంట్స్ ఆపు
5. 8 గంటలు నిద్రపో
6. ప్రకృతితో ప్రకృతిలో ప్రకృతిగా - ప్రకృతికి దగ్గరగా బతుకు
7. బీడి తాగటం మానేయ్
8. అతిగా తాగిన మగాడు అస్సలు తాగని ఏనుగు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు

ఈ 8 పాయొంట్లూ ఆలోచింపజేసేవిలాగనే ఉన్నాయి.
లే పదా! స్థబ్దత నుంచి మేలుకో. కూర్చుంటె పొట్ట పెరగటం తప్ప ఏమీ కాదు. రోజుకో గంట నడవటం గొప్ప కాదు. గంటగంటకోసారి లేవటం పది నిమిషాలు తిరగటం గొప్ప.
నిజమైన ఆహారం తిను అన్నాడు. నిజవే! చిప్స్ గడ్డి కంప తినే సంస్కృతి నుండి బయటపడు. భారతీయ భోజనం భేషైన భోజనం అని గుర్తించాలి.
ఇక సంఘ జీవితం. ఈరోజు రేపట్లో ఫేసుబుక్కో ఫేసుబుక్కో ఫేసుబుక్కో. ఎంతసేపూ అదేగోల. ఏందయ్యా అంటే సామాజిక మాధ్యమాలు. కేవలం మిధ్య. నిజమైన మితృడు ఒక్కడు - సాయంత్రం పూట అలా కూర్చుని కబుర్లతో మునిగిపోయి. నిజమైన మితృలు ఎందరు?
సప్లిమెంట్స్ ఆపేయంటాడు. బహుశా నిజమే. ఏడాదికి రమారమి 30 బిలియన్ డాలర్లు సప్లిమెంట్స్ మీద ఖర్చుపెడతారట.
ఈ దౌభాగ్యానికి కారణం?
గూగుల్
కానీ 8 గంటల నిద్ర మాత్రం కష్టం అనిపిస్తుంది.