May 4, 2011

ఏవిటో ఈ వార్తలు, వార్తాపత్రికలు

నిన్న ఈనాడులో ఈవార్త నన్నాశ్చర్యపరిచింది. లాడేన్ని మట్టుబెట్టారన్న వార్తాపరంపరలో, అమెరికాలోని అందరూ పాకిస్థాన్నీ, పాకిస్థాన్లో లాడెన్ దొరకటాన్నీ ప్రశ్నిస్తుంటే, అలానే ఫరీద్ జకారియాని కూడా డిస్కషన్ లోకి లాగి ప్రశ్నిస్తుంటే ఈనాడు వాడేవిట్రా ఇలా రాసాడు అనుకున్నాను.

ఇక ఈరోజు వార్త
ల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్‌లాడెన్‌ పాకిస్థాన్‌ గడ్డపై హతమవడంతో ఇప్పుడు అందరి చూపులూ ఆ దేశంపైకే మరలాయి. అమెరికా సైతం అనుమానంగానే చూస్తోంది


ఏవిటీ ఈ వార్తాశ్రవంతులు? ఏవిటీ వీరి లక్ష్యాలు?
మొన్నటికి మొన్న ఇలా వేసాడు
అక్బరుద్దీన్‌ దాడిని ఖండించిన చంద్రబాబు
కడప: ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న అక్బరుద్దీన్‌పై దుండగులు దాడి జరపడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఒవైసీపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

రెండు విభిన్న అర్థాలు ఒకే వార్తలో
From May 1, 2011

5 comments:

 1. :-)) ఇ౦డియాలో ఉన్నప్పుడు అ౦తగా తెలీలేదు కానీ, అమెరికాకొచ్చాక, తెలుగు పేపర్లలో నోటీస్ చేసిన "పచ్చి అబద్దపు "వార్తలు" కోకొల్లలు. మొదట్లో వార్త పేపర్ చూసేవాణ్ణి, నెట్ లో, ఇహా ఆ పేపర్ ని౦డా ఘోరమయిన అబద్దాలు, అ౦తర్జాతీయ వార్తల్ని కవర్ చేసేప్పుడు. ఒకసారి ఆవేశాన్ని ఆపుకోలేక్ ఓరి పి౦డాకోర్ వెధవల్లారా, ఇది వార్త కాదు, నీ అభిప్రాయమ్, అది కూడా you pulled out of your ass అని రాసా. ఆ కాలమ్ పైనెక్కడయినా Op-Ed అని మెన్షన్ చేయ౦డ్రా నెల తక్కువ వెధవల్లారా అని.
  తర్వాత, అన్ని పేపర్ల లోను అదే త౦తు గమని౦చి, నేను పెరుగుతున్నప్పుడు చదివిన దా౦తో నాకు ఎన్ని తప్పుడు అభిప్రాయాలు కలిగాయో అని చి౦తి౦చి ఊరుకున్నా.
  ఇక్కడా అ౦తే, ఇప్పుడు ఏ పేపర్ చదివినా, ము౦దే తెలిసిపోతు౦ది నాకు, వాడెటువైపు వాడో, Op-Eds, లేక "వార్త, విశ్లేషణా" అనే ముసుగులో రాసిన వాటిని కూడా, ఎవరు రాసారా అని పేరు చూడగానే నాకు ము౦దే తెలిసిపోతు౦ది, ఆ ఆర్టికల్ ఎటువైపు వెళ్ళబోతో౦దో అని.
  Vast majority of them are predictable. There are very few exceptions.
  కాకపోతే, నాకిక్కడ నచ్చేదోకటి. ఎవర్రాసారో పైన పేరు ప్రచురిస్తారు, అదొక్కటీ నచ్చుతు౦ది నాకు.

  ReplyDelete
 2. బాబూ క్రిష్ణ
  నేనిమ్త క్షష్టపడి పేజీ మా౨టర్ రాస్తే నువ్వొచ్చి ఓ స్మైలీ కొట్టి వెళ్తావా? నెనొప్పుకోను. ఐ డిమాం౨డ్ ఎక్సుప్లనేషన్ అద్దెచ్చా

  ReplyDelete
 3. ఇంకా చాలా ఉన్నాయండి బాబూ(ఈనాడులోనే)...

  'అమెరికా ఆగర్భశత్రువు లాడెన్' అని రాశారు. ఇది కూడా బ్లండర్. ఆగర్భశత్రువు అంటే పుట్టుకతోనే శత్రుత్వం ఉన్నట్లు(ఆగర్భ శ్రీమంతుడు అంటే పుట్టుకతోనే శ్రీమంతుడు). కానీ, అమెరికాకు, లాడెన్ కు శత్రుత్వం కేవలం 10-15సంవత్సరాలనాటిదేకదా.

  ReplyDelete
 4. @భాస్కర్, :))

  నవ్వక ఇంకేమి పెట్టమంటారు, మన చిన్నప్పుడు ఇలాంటి తప్పులు చూసిన గుర్తు అయితే లేదు, ఏ పత్రికలో అయినా.

  ప్రస్తుతం జర్నలిస్ట్లు జనాలను బ్లాక్మైల్ చేయటం లోనో, పాత (ఉద్యోగ) పత్రికా యాజమాన్యాలను బూతులు తిట్టడం లోనో చూపే శ్రద్ద లో కాస్త వార్తలు "రా"యటం లో పెడితే బాగుంటుందేమో :).

  సరే "రా"సే వాడు వ్రాస్తే, వాటిని చూసుకోవాల్సిన సబ్ ఎడిటర్ లు గట్రా ఏమి చేస్తున్నట్లో అర్ధం కాదు :((

  జర్నలిస్ట్ లను అంటున్నాను అని ఇప్పుడు నా మీద కేసేమయినా పెడతానికి వస్తాడేమో చూడాలి :))

  ReplyDelete