ఏ మాత్రం తగ్గని భ్రూణ హత్యలు
గర్భస్రావాలతో కడతేరుస్తున్న వైనం..
సంపన్నులు, విద్యావంతుల్లోనే ఎక్కువ
2011 లెక్కల్లో తగ్గిన బాలికలు
న్యూఢిల్లీ
అమెరికాలోనూ మారని మనవాళ్లు..
బోస్టన్: అమెరికాలో ప్రవాస భారతీయ మహిళలు సైతం.. కడుపులో ఆడపిల్ల ఉన్నట్లు తేలితే గర్భస్రావాలు చేయించుకుంటున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. కుటుంబ ఒత్తిడుల కారణంగానే ఈ పనికి ఒడిగడుతున్నట్లు తేలింది. భారత్‌లో మాదిరిగా కాకుండా లింగనిర్ధరణ పరీక్షలు అమెరికాలో చట్టబద్ధం కావడంతో ఈ పని మరింత తేలికవుతోంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 2004 నుంచి 2009 వరకు ఈ పరిశీలన చేపట్టారు. గర్భంలో ఆడబిడ్డ ఉన్నట్లు నిర్ధరణ జరిగినప్పుడు 40 శాతం మంది మహిళలు గర్భస్రావం చేయించుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ మహిళల్లో సగం మందికి ఉద్యోగాలు ఉండగా, చాలామంది ఉన్నత విద్యావంతులేనని తేలింది. గర్భంలో ఆడపిల్లను మోసే మహిళలు ఇళ్లలో తిట్లు, దెబ్బలకు గురవుతున్నట్లు గుర్తించారు. అత్త, భర్తల నుంచే ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. ఈ అధ్యయనంలో పరిశీలించిన మహిళల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినవారూ ఉన్నారు.