ఓ రోజు అర్థరాత్రి మా నాయన రేడియోపెట్టుకుని తెగ ఉద్రేకపడుతూ మొఖం తీవ్రమైన ఏకాగ్రతగా పెట్టి అంతలోనే ఆవేశపడుతూ అంతలోనే ఎగిసిపడుతూ ఓ విచిత్రమైన వాలకంతో మమేకమై విటూ ఉంటాన్ని గమనించా. ఏట్రా బగమంతుడా అనుకున్న. మా నాయనకు అప్పుడు నలభై ఏళ్ళే. ఇది జరిగిన మర్రోజు బళ్ళో నాయనా, తె.మా, డ్రి.మా, హె.మా, సై.మా అందరూ ఓసోట రచ్చబండకాడ సెర్చ మొదలెట్టారు. బళ్ళో రచ్చబండ = స్టేఫ్ రూం అన్నమాట. ఇక సాయంత్రం ఉండబట్టలేక, ఏటి గురూ ఏటి సంగతీ అని అడిగా. డియేగో మారిడోనా అని చెప్పి ఓ చిరునవ్వు సిలికించాడు. మనకి అప్పుడు వర్ధం అవ్వలా. తర్వాత్తర్వత వర్ధం కావటం మొదలైంది. డియేగో మారడోనా. హ్మ్!! ఏం ఆటగాడు. ఎన్నిసార్లు చూసినా అదే ఉద్వేగానికి లోను చేస్తాడు. ఎలా ఆడతారు అలా అనుకుంటూ ఉండేవాణ్ణి. ఒకడు బంతిని ఇటు తంతే కరెక్టుగా వాడి వైపు వాడికే ఎలా అందుతుందీ అని తెగ ఆశ్చర్యపోయేవాణ్ణి. ఇలాంటివి ఏ ఆటలోనైనా ఆటగాళ్ళకి నేర్పే సంగతులు అబ్బే గుణాలు అని మన మట్టి బుఱ్ఱకు పెద్దోణ్ణైయ్యాక అంటే ఇప్పుడిప్పుడే వర్ధం అవుతూ వస్తోంది. మరి అట్టా ఐతే ప్రతీ కాలిబంతి ఆటగాడూ డియేగో మారడోనా కావాలిగా? ప్రతీ క్రికెట్ట్ ఆటగాడూ సచిన్ టెన్డూల్కర్ కావాలిగా? కాడు. ఎలా అవుతాడు? కేవలం సచిన్ మాత్రమే సచిన్ లాగా ఆలోచింప గలుగుతాడు. మారడోనా మాత్రమే మారడోనాలా ఆలోచింప గలుగుతాడు. అది అంతే. ఆ వాళ్టి మానాయన సంఘటన నాకు సాకర్ ని పరిచయం చేసింది. తర్వాత కొన్నాళ్ళకు నే ఏదో దేశం వెళ్ళినప్పుడు, ఓ టీషర్ట్ కొందామని ఓ స్పోర్టింగ్ స్టోర్ కి వెళ్ళా. ఓ వైపు మొత్తం ఓ ఆటగాడి బొమ్మలతో ఉన్న టీ షర్టులు చూసి ఆశ్చర్యపొయ్యా. నైకీ టీ షర్ట్, ముందు పౌలో మాల్దిని, వెనక 3 అంకె వేసున్నది కొన్నా. నాకు పౌలో మాల్దిని అంటే ఇష్టం. ఈ.యస్.పి.యన్ లో యుఫా లీగ్ మ్యాచులు బాగనే చూసేవాణ్ణి. ఏసీ మిలాన్, జువెన్టస్, లివర్పూల్, మాన్చెస్టర్ యునైటెడ్, రియల్ మాద్రిద్ లాంటి టీములంటే బాగా ఇష్టంగా ఉండేది. ఏసీ మిలాన్ అంటే బాగా ఇష్టం. పానుచ్చి, తొత్తి, బాగ్గియో లాంటి వాళ్ళు ఆడేవాళ్ళు కదా. తర్వాత్తర్వాత ౨౦౦౨, ౨౦౦౬ ప్రపంచకప్పులను టీవీయందు వీక్షించా. అత్భుతమైన ఆనందం అది. ౨౦౦౨ ఫైనల్ ఇంకా కళ్ళముందు మెదుల్తూనే ఉంది. బ్రజిలియన్ టీం లోని ఆర్ త్రయం అత్భుతంగా రాణించారు. ఆర్ త్రయం అనగా రోనాల్డో, రోనాల్డినో, రివాల్డో. వాళ్ళ టీంలో మార్కోస్, కాఫు, రొబెర్తో కార్లోస్, దిదా, కాకా అందరూ నచ్చిన వాళ్ళే నాకు. ఆ ఏటి బెస్ట్ గోల్ కీపర్ ఆలివర్ కహ్న్ (జెర్మని). నాకెందుకో జెర్మనీ వాళ్ళ ఆట చాలా డిస్ట్రక్టివ్ గా అనిపిస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళలా అనిపిస్తారు. ఏది చేసైనా గెలవాలి అనేలా ఉంటుంది వాళ్ళ స్వభావం. ఆ ఏడాది జెర్మనీ కోచ్, ౧౯౮౬ వెస్ట్ జెర్మనీ టీం లోని ఆటగాడు. వాడి పేరు Rudi Völler. వీడు ౧౯౯౦ నాటి ఫైనల్లో మారడోనా కాళ్ళు విరచటానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ౨౦౦౨ ప్రపంచకప్పులో కొరియా ఆశ్చర్యంగా చాలా బాగా రాణించింది. టర్కి సెమీస్ కి వెళ్ళింది. క్రియేషియా, పోర్చుగల్, కోస్టారికా, సెనెగల్ ఇత్యాది దేశాల టీములు బాగా ఆడాయి, ఆకట్టుకున్నాయి.
ఇక ఈ ఏడాది జూన్ ౧౧ నుండి జూలై ౧౧ వరకు మరోసారి ప్రపంచాన్నంతటినీ కాలిబంతి ప్రపంచ పోరాటం ఊపేయనుంది, కనువిందు చేయనుంది, ప్రేక్షకవీక్షకులకు ఆనందావేశాలతో పాటు నిరాశా నిస్పృహలకు గురిచేయనుంది.
సౌత్ ఆఫ్రికా ఈ పోరాటానికి వేదిక.ఇవీ ఈ సారి గుంపులు.
నాకు ఇలా అనిపిస్తోంది -
గుంపు ఏ నుండి ఫ్రాన్స్ మెక్సికో గెలవచ్చు
గుంపు బి నుండి అర్జెంటీనా, కొరియా. గ్రీకులను తక్కువ అంచనా వేయకూడదు.
గుంపు సి నుండి బ్రిట్ మరియూ అమ్రెకా
గుంపు డి నుండి జెర్మని, మిగతా టీములు కూడా గట్టివే
గుంపు ఈ నుండి జపాన్, రెండోది చెప్పలేను
గుంపు ఎఫ్ నుండి ఇటలి, రెండోది చెప్పలేను
గుంపు జి నుండి బ్రసిల్ అ.క.అ బ్రజిల్, పోర్చుగల్
గుంపు ఎచ్ లేక హెచ్ నుండి స్పెయిన్, స్విస్
ఇప్పటికే హాట్ ఫేవరేట్లు జనాలకి స్పెయిన్ మరియూ బ్రజిల్.
హోగా బొనీతో
ఏటి ఈ అన్నాయం ?మరి మా ఆరంజ్ టీము ? ( నెదర్ లాండ్స్)
ReplyDeleteonly two teams won all the group matches . Spain and netherlands ...
Lets see :-)
హోగా బొనీతో >> అంటే ఏమిటి?
ReplyDeleteఇప్పుడున్న పెద్ద రూమర్ ఎమిటంటే.. రష్యా ఎంపైర్లు స్పెయిన్ కి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారట.. అందుకు ప్రతిఫలం గా 2018 వరల్డ్ కప్ ఆథిద్యం స్పెయిన్ వదులుకుని రష్యాకిస్తుందట .. అంపైర్ల మాచ్ ఫిక్సింగ్ అన్నమాట :-))
ReplyDeleteగ్రూప్ ఈ లొ జపాన్ లాస్ట్ వుండొచ్చు.. నెదర్లాండ్స్ , డెన్మార్క్ అనుకుంటున్నా .. లేకపొతే నెదర్లాండ్స్, కెమరూన్
ReplyDeleteగ్రూప్ ఎఫ్ ఇటలీ తొ పాటు పరాగ్వే.. క్వాలిఫైయింగ్ లొ స్లొవేకియా బాగా అడిందట
Joga bonito = play beautiful
ReplyDeleteMy bet is on Miroslav Klose. He is so close to legend status
ReplyDeletenice post
ReplyDelete70% england players injured already