Jan 28, 2010

ఐ.ప్యాడ్

ముందుగా,
పొద్దున తెలుగువన్ లో రోజువారీ సినిమాలు ఏమున్నాయా అని చూస్తే పెళ్ళిపుస్తకం కనిపించింది. చూద్దాం అని నొక్కా, గుమ్మడి గురించి ముందు నాలుగు మాటలు వచ్చాయి. అదేంట్రా బాబూ అని ఈనాడు చూస్తే గుమ్మడి స్వర్గస్తులయ్యారనే వార్త. చాలా బాధేసింది. రామారావు నాగేశ్వర్రావు రంగారావు లాంటి మహామహులతో సరితూగగల నటడు.
నా దృష్టిలో అలాంటి నటులకు చావులేదు. తెలుగు సినిమా బతుకున్నంతకాలం వాళ్ళు బతికే ఉంటారు. కేవలం భౌతికంగా మనమధ్యన లేరు. అంతే.

నిన్న సీరియస్ గా దేనిగురించో ఆలోచిస్తూ నా ఐఫోన్ లో గెలుకి సమాధానం రాబడుతుంటే ఇలా అనిపించింది. వాహ్, ఎంత ఫెసిలిటీ ఈ ఐఫోన్ లో, ఇలాంటిదే కొంచెం పెద్దది వస్తే ఇక ల్యాప్టాప్ తో పనేంటి అని.

సాధారణంగా మనకి రోజువారీ పనులకి కావాల్సింది, వై-ఫై కనెక్టివిటీ, ఓ బ్రౌజర్, మెస్సెంజర్, ఫైల్స్ ని దింపుకునేమ్దుకు ఒక టూల్, స్టోరేజి ఆటిని దాచేస్కోటానికి, ఓ డాక్ ఎడిటర్, యాట యాట యాట. ఇక అంతకన్నా ఏంకావాలీ?
ఈరోజూ రేపట్లో గూగుల్ వాడు అన్నీ ఇస్తున్నాడు. గూగుల్ డాక్స్లో వర్డ్ డాక్స్ని తెరవచ్చు, కొత్తది నిర్మించవచ్చు ఏమైన్ చేయవచ్చు. అలానే పోర్టబుల్ డాక్ ఫార్మాట్ ని గూగుల్ డాక్స్ ద్వారా తెరవ వచ్చు. ఎక్సెల్ ఫైల్స్ ని కూడా. కావాల్సిందల్లా వీటిని యాక్సెస్ చేయటానికి ఓ బ్రౌజర్.

ఇలాంటి వసతులు కలిగి, పోర్టబుల్గా ఉన్న కాన్సోల్తో వచ్చిందే ఈ ఐప్యాడ్. దీన్ని టచ్ స్మార్ట్ కంప్యూటర్ అనికూడా అనుకోవచ్చు.

ఐతే, దీని రహస్యం ఏంటంటే, యాపిల్ వాడి ఐట్యూన్స్ స్టోర్, వైడ్ రేజ్ ఆఫ్ అప్లికేషన్స్. ఈరోజున యాపిల్ వాడి స్టోర్లో లక్షల అప్లికేషన్స్ ఉన్నాయ్.

ఉదాహరణ -
నాకు గూగుల్ టాక్, యాహూ, యం.యస్.యన్ లాంటి ఐయంస్లో ఒకోదాంట్లో మూడు ఐడీలతో ఎకౌంట్లున్నాయనుకుందాం.
ఐఫోన్లో ఫ్రింజ్ అని ఒక అప్లికేషన్. ఉచితం. దీతో అన్నీ ఐ.యంస్ ని అనుసంధానించుకోవచ్చు. తర్వాత, సే నా లిస్టులో సూర్య అనే పేరుందనుకుందాం. ఈ అప్లికేషన్లోకి లాగిన్ అయి, సూరిగాడు అన్లైన్లో ఉంటే, నేను వాడికి కాల్ చేయవచ్చు (ఐ.యం టు ఐ.యం - ఫోన్ కాదు) లేక మెసేజీ పెట్టవచ్చు (ఛాట్) లేక ఐఫోన్ ౩-జి యస్ ఐతే వీడియో ఛాట్ చేయవచ్చు.

ఇంకో ఉదాహరణ -
స్కైప్ వాడిది ఉచిత అప్లికేషన్. నేను నా ఐఫోన్లో స్కైప్ లోకి లాగిన్ అయి, ఎక్కడో గుంటూర్లో ఆన్లైన్లో ఉన్న మా బామ్మర్దితో ఛాట్ చేయవచ్చు, కాల్ చేయవచ్చు (స్కైప్ టు స్కైప్) లేక ౩జి యస్ ఫోన్ ఐతే వీడియో కాల్ చేయవచ్చు.

ఇంకో ఉదాహరణ -
ఐపాడ్ టచ్ ఉంటే, సే, నిక్ జూనియర్ అప్లికేషన్ ఉచితంగా దింపుకుంటే, నిక్ జూనియర్ ఛానెల్ చూడవచ్చు. కావాల్సింది వై-ఫై.

చేతిలో కంప్యూటర్ ఉన్నట్టే కదా.
ఐప్యాడ్ అనేది ఇలాంటి ఒక పరికరం అన్నమాట. ఇది ఐపోడ్కి ఎక్స్టెన్షన్ అన్నమాట.

6 comments:

  1. అయ్యో నాగేశ్వర రావు గారు బతికే వున్నారండి ఏంటి రామారావు గారు ఎస్.వీ రంగారావు గారి తో జత కట్టించేసేరు.
    ఐపాడ్ లో టీవీ లు కూడా చూస్తే, ఐ పాడు పాడే..

    ReplyDelete
  2. చాలా రోజులకు కనిపించారు. ఐతే ఐపాడ్ కొనుక్కోమంటారా? మా పెద్దమ్మాయి ఆక్రోశిస్తూనే ఉంది కానీ మేమే లక్ష్యపెట్టలేదు.

    ReplyDelete
  3. నిజమే కానీ, ఇంకా అది ఐఫోన్ ఓఎస్ తోనే నడుస్తుంది, ఇంతవరకు ఫ్లాష్ ఉన్నట్టు ధ్రువీకరించలేదు, జిప్ మరియు రార్ సపోర్ట్ ఉండకపోవచ్చు, ఒకటికి మించి అప్లికేషన్లు రన్ చేయలేము. ఒక్క పుస్తకాలు చదవడం, మరియు ధర దీని ఆకర్షణలు.
    $499 చాలా తక్కువ

    ReplyDelete
  4. parallel processing చేయవచ్చు. ఐపోడ్లో/ఐఫోన్లో పాటలు వింటూ బ్రౌజింగ్ చేయవచ్చు.
    ఐప్యాడ్ లాంటివాటిల్లో పి.పి లేకపోతే కష్టం.

    ఫైల్ కంప్రెషన్ సదుపాయం, హ్మ్!!!

    ఇప్యాడ్ కి కొత్త డెవలప్మెంట్ కిట్ వచ్చింది. మరి కొత్త కొత్త అప్లికేషన్స్ రావచ్చేమో. ఫైల్ సిస్టం యాకెసెస్ ఉండచ్చేమో.

    సూరిగాడికి ఐపోడ్ కొన్నానండి సునీతగారూ. ఐతే, వై-ఫై ఉంటే బాగుంటుంది. మన బ్యాండ్విడ్త్ కి మరి అది పనిచేస్తుందో లేదో...(256kbps కన్నా తక్కువ విడ్త్)
    భావన గారూ అలనాటి నటులని నా అభిప్రాయం ఉన్నా లేకున్నా.
    జీవని -
    వావ్ వెబ్సైట్ బాగుంది. ఇండెక్స్ పేజీలో తెలుగమ్మాయి బొమ్మ ఉంటే బాగుంటుంది. ఐతే మ్లేఛ్చ భాషలో మాత్రమే ఉంటం నన్ను నిరాశపరిచింది.

    ReplyDelete
  5. భాస్కర్ గారు :

    ఈ ఆప్స్ ఇంకా బావుంటాయి :

    icall-
    skype alternative and more powerful and free

    newshunt -
    Telugu News papers normal apps will not display telugu font properly this app does

    touchmouse -
    iphone works as cardless mouse and keyboard .

    shoutcast -
    all radio channels including telugu

    Humma radio -
    telugu tamil hindi songs depending on your mood

    TVU lite -
    watch telugu news channels and some other channels works only with WIFI

    ReplyDelete
  6. newshunt - ఇలాంటి అప్లికేషన్ తయ్యారు చేయాలని నకేప్పంనుమ్చో ఆలోచన కానీ నాదగ్గర మ్యాక్ లేదు.
    మంచి అప్లికేషన్స్ అందించారు. ధన్యవాద్

    ReplyDelete