Jan 14, 2010

*ధరల నియంత్రణ* చర్చిద్దాం రండి -

ఇప్పటివరకూ అన్ని పార్టీలూ చాలా విషయాల్లో మద్దెల దరువు వేసారు, మనం చూసాం. అలాంటివాటిల్లో ఒక ముఖ్యమైనది - *ఆకాశాన్నంటుతున్న ధరలు*.
ట్రాన్స్పోర్టేషన్ ధర పెరిగింది, గిడ్డంగుల అద్దె పెరిగింది, కూలీ ధర పెరిగింది, డ్రైవర్కిచ్చే బేటా పెరిగింది, ఇలా ప్రతీ ఎండ్పాయింట్లో, ఒక డామినో ఎఫెక్టు వల్లా అన్నీ *పుష్* కాబడుతున్నాయి.
ధరలు తగ్గించటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందీ అని ప్రతిపక్షాలు ఒక రాయి వేస్తాయ్, వేస్తున్నాయి ప్రతీసారీ. కావచ్చు. అయిఉండవచ్చు కూడా. మొత్తం సిస్టంని దృష్టిలో ఉంచుకుని, ఊకదంపుడు వ్యాఖ్యలు చేసే రాజకీయనాయకులకు, వినాయకులకు, చేతకాని దద్దమ్మల విదేశీనీడన పరిపాలన చేస్తున్న వెన్నెముకలేని ప్రభుత్వాలకు, మనలో ఎవరైనా *ఇదీ ధరలనియంత్రణా విధానం* అని కనీసం బ్లాగులోనైనా ప్రచురించగలిగితే!! అనే ధృక్పదంనుండి -
ధరల నియంత్రణ ఎలా చేయవచ్చి మీరనుకుంటున్నారూ?

5 comments:

  1. హ!? ఏందన్నా, ఈ టాపిక్ మీద పడ్దవూ, ఆరోగ్యం బాగుందానే!

    ReplyDelete
  2. Sarat Broder...Me doing awesome. Lets see how our people are thinking about.

    Mocha Grasias.

    ReplyDelete
  3. ముందు ధరల నియంత్రణ చేయాలంటే ముందు ప్రబుత్వం
    1. ఉత్పత్తి అయిన వస్తువులు కాని, తిండి గింజలు ఎక్కడెక్కడ ఉన్నాయో maintain చేయగలగాలి
    2. ఆయా వస్తువులు కాని, తిండి గింజలు ఎక్కడెక్కడకు తరలింపబడుతున్నాయో నూటికి నూరు శాతం కాకపోయినా, చాలావరకు information maintain చేయగలగాలి.
    3. ఆ తరువాత వినియోగం data, maintain చేయగలిగితే ధరలు నియంత్రణ అంత కష్టం కాదు.

    ఓ చిన్న ముక్కలో చెప్పాలంటే public supply chain management అన్నమాట. అలాంటి information ఇప్పటికే gather చేయటానికి ప్రబుత్వానికి అవసరంలేనంత మంది యంత్రాంగం ఉంది, కావాల్సింది, చిత్తశుద్ది, ఆ information ను కేంద్రీకన్రించటం central మరియు state లెవెల్స్ లో.

    మన దేశం లో ధరలకు మాత్రం, ముఖ్యం గా కాంగీ ప్రబుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే సరుకులు పప్పు ధాన్యాలు కాని, మిగతావికాని జరగటానికి మాత్రం, వ్యాపారస్తులతో కుమ్మక్కు అయ్యి, నిల్వ అక్రంగా పెట్టేసి, ధరలు పెరిగినాక, వాటిని విడుదలచేయటం, ఇందులో వాటాలు కాంగీ అధిష్టానానికి చేరటం బహిరంగ రహస్యమే.
    గత అయుదు సంవత్సరాలుగా మన ధాన్యం మిల్లుల వ్యాపారుల సిరులు పండటానికి, చచ్చిన దేముడితో, రైస్ మిల్లర్ల సంఘం కుమ్మక్కు అవ్వటమే అని అందరకు తెలుసిందే, ఇది ఓ ఉదాహరణ మాత్రమే.
    పల్లేటూర్లలో చిన్న గేద దూడను అమ్మినా, దానిని తీసుకొని పక్కవూరికి తోలుల్కు పోవాలన్నా, మునసబో, V.A. దగ్గరో ప్రమాణ పత్రం తీసుకోవాలి, అలాంటిది పండిన పంటా అంతా ఎక్కడ ఉందో అర్ధం కాని పరిస్తితులే దీనికి కారణం.

    ఏతా వాతా చేప్పేది ఏమిటీయ్యా అంటే మంచి supply chain system కావాలి అని. నేను SAP consultant నని ఇప్పటికీ మీకు అర్ధం కాకపోతే నేను ఏమీ చేయలేను :)

    ReplyDelete
  4. Vote Chandrababu to power. He will work out Raitu Bazars afresh.

    ReplyDelete
  5. సుజాతగారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మధ్యవర్తుల విధానం సమూలంగా అంతరించాలి. అటు రక రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని పంటని కాపాడుకున్న రైతులకీ, ఇటు రెక్కాడితేగానీ డొక్కాడని సామాన్య వినియోగదారునికీ కూడా అన్యాయం చేసే మధ్యవర్తి విధానన్ని నాశనం చేయాలి. పంట సరాసరి రైతులనుంచి వినియోగదారులకి చేరేందుకు ప్రభుత్వం సరయిన ఏర్పాట్లు చేయాలి. ఇందుకు రైతుబజార్ అత్యంత ఉత్తమమైన పద్ధతి. అవకతవకలను సరి చేసుకుని రైతుబజార్లను ఉద్ధరిస్తే అందరికీ మంచి జరుగుతుంది. సామాన్యుడు కనీసం ఒక్కపూటైనా కడుపునిండా భోజనం చేయగల్గుతాడు. రైతులు పునర్వైభవం పొందుతారు.

    ReplyDelete