Jun 6, 2018

రాజకీయ బురద

అమెరికా లాంటి దేశాల్లో రాజకీయ (వి)నాయకుల చేతిలో అత్యంత ప్రధానమైన పెంపుడు జంతువు *మీడియా*. వీళ్ళు ఆడే పావుల ఆటలో ప్రధానమైన ఎత్తుగడ - ఏంచేసైనా పేపర్లో పెద్దక్షరాలతో మొదటిపేజీలో పడాలి.

అదే సమీకరణాన్ని అనుకరిస్తున్నాడు బాబు.
జనాలు మర్చిపోకూడదని రోజుకోసారి "భా.జ.పా నమ్మక ద్రోహం" అంటాడు. దాన్ని బాజాభజంత్రీల మీడియా పెద్దక్షరాలతో ప్రచురిస్తుంది.

మొన్న జరిగిన ఒక వార్తావి-శ్లే-షణలో తెదేపా నాయకుడు శ్రీ లంక దివాకర్ పాపం ఆవేశ-పడి ఆయాస-పడి విలవిల్లాడితే, సదరు కార్యక్రమం నడిపిన వ్యక్తి విజయ్ అతన్నికి సీరియస్గా చెప్పేడు. మీరు విషయం మాట్టాడండి అని. ఆసందర్భంలో ఓ ప్రశ్న పడింది. మీడియాగానీ మిగతా పక్షాలుగానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేశాయి.

భారతదేశలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యంత సీనియర్, నటుడు కాదు కాదు క్షమించాలి, రాజకీయ నాయకుడు చంద్రబాబు అని గుండెలు చరుచుకుని చెప్పుకుంటారే, అట్లాంటిది, ఆయనకి ఒక పార్టీ టోకరావేసిందని తెలియటానికి 4 ఏళ్ళు పట్టిందా?

మోసం దగా కుట్రా బాబుని ఎదగనీయకుండా ప్లాను అదీ ఇదీ అంటూ యాగీ చేసేబదులు - #పిల్ వేయొచ్చుగా సుప్రీం కోర్టులో
ఇదీ చట్టం, ఇలా చేశారు చట్టం, ఇంత రావాలి, రాలేదు. ఇంత ఇవ్వాలి, ఇవ్వలేదు. మరి ఆడబ్బు ఏవనట్టూ? విభజన చట్టం ప్రకారం ఇవి రాలేదు అని కోర్టునాశ్రయించొచ్చుగా?

రాజకీయాలంటే ట్రంపులాగా పొద్దస్తమానం ఒబామా ఓబామా అనటం లేకపోతే పొద్దున్నే మూడుకి లేచి పలానోడు అబ్బో మంచోడనటం రాత్తిరికి అతన్ని తిట్టటం కాదు.
భాజపా మీద తెదేపా, తెదేపా మీద జగన్ పార్టీ, జగన్ మాట లేకుండా ఏవీ మాట్టాడకుండా తెదేపా - చూట్టానికి వినటానికి కంపరంగా అసహ్యంగా ఉంది.

అయ్యా రాజకీయ రాక్షసుల్లరా - రాష్ట్రానికి ఏంకావాలో అది చేయండి. గుంటూరులో కలిసి కాట్ల కుస్తీ పోటీ పెట్టుకోండి. దిల్లీలో కలిసి పోరాడండి.

9 comments:

 1. బాగుంది బాగుంది. రాజకీయ దేవతాపార్టీ అనుచరుడా చాలా బాగుంది. అత్యంత నమ్మకస్తుడైన మోదీ గారిని నమ్మి దగా పడ్డ తెలుగువాళ్ళంతా చదివి తరించాల్సిన మాటలు చెప్పారు. ఇది చదివి మేము మోదీ కారణంగానే ఇంకా బ్రతికున్నామూ లేకుంటే ఏదో పార్టీ చేతిలో అన్యాయం ఐపోయేవాళ్ళమూ అన్న విజ్ఞానం కలిగింది, ధన్యవాదశతం అందుకొన ప్రార్థన.

  ReplyDelete
  Replies
  1. దగా పడ్డది ఎవరివల్లా?
   మోడీవల్లనా? లేక బాబు వల్లనా?
   మొదటిరోజునుంచీ ప్రత్యేక హోదా లేదు అన్నాడు మోడి.
   ప్రత్యేక హోదా ఏవన్నా సంజీవనా అన్నాడు బాబు.

   దగా పడ్డాం అన్నప్పుడు - కోర్టునాశ్రయించొచ్చుగా అనేది నా పాయింటు, శ్లేషలు పక్కనపెడితే!

   Delete
  2. >>రాజకీయ దేవతాపార్టీ అనుచరుడా చాలా బాగుంది<<
   యండమూరి అన్నట్టు - ప్రతీమనిషీ తనస్థాయిలో ఆత్మవంచన చేస్కుంటూ బతుకుతాడు.
   దాదాపు ప్రతీ మనిషీ ఏదోక పార్టీని నెత్తినపెట్టుకు తరిస్తాడు.

   Delete
  3. ఒకళ్ళు దేవతా వస్త్రాలు నేస్తే ఇంకొకళ్ళు దాన్ని మార్కెటింగు చేస్తారు. కలిధర్మం

   Delete
 2. భాస్కర రామరాజు గారూ,

  అమెరికా మీడియా నిట్టనిలువునా చీలిపోయి ఉంది. ఈ పరిస్థితి దాదాపు అదే నిష్పత్తిలో ప్రజలలో ఉన్న చీలికకి ప్రతిబింబం.

  ఆంద్ర పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. టీడీపీ వారికి మీడియా పైన, అలాగే మీడియాను ప్రభావ పరిచే వర్గాల పైన ~90% పట్టు ఉంది. ఈ వైరుధ్యాన్ని (deep state?) బెదించలేకపొతే జగన్ గెలిచినా నిలదొక్కుకురావడం కష్టం.

  ReplyDelete
  Replies
  1. >>>ఆంద్ర పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. టీడీపీ వారికి మీడియా పైన, అలాగే మీడియాను ప్రభావ పరిచే వర్గాల పైన ~90% పట్టు ఉంది. ఈ వైరుధ్యాన్ని (deep state?) బెదించలేకపొతే జగన్ గెలిచినా నిలదొక్కుకురావడం కష్టం>>>>
   అమెరికాలో కూర్చుని నెట్ లో తెలుగు పేపర్లు,న్యూస్ డిబేట్లు వింటుంటే అలాగే ఉంటుంది.నేను హైదరాబాద్ లో ఈనాడు మాత్రమే చదువుతున్నాను.చంద్రబాబు గారి వ్యాక్యలు మధ్యపేజీల్లో మాత్రమే వస్తున్నాయి.ఆయన మీడియాని ప్రజలని ప్రభావితం చేయగలిగితే ఆంధ్రా ప్రజలు ఇంత ప్రశాంతంగా టీవీ సీరియళ్ళు చూస్తూ కూర్చోరు.

   Delete
  2. టీవీలలో, వెబ్ సైటులలో "అభిప్రాయ సేకరణలు" (e.g. SMS polls) జరుగుతాయి. అవి చూడండి: ఎన్నికలలో పడే ఓట్లు ఇదే నిష్పత్తిలో ఉంటాయంటారా?

   Delete
 3. హైదరాబాదులో కూర్చొని ఆంధ్రా వార్తలు అందునా ఈనాడులో మాత్రమే చదివితే ఏమౌతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

  అమెరికా మీడియా 50-50 అవలేదు కానీ దాదాపుగా అయ్యింది. కానీ మీరన్నట్టు ఆంధ్రా మీడియా 90% ఒక వర్గం చేతిలోకి వెళ్ళింది లేక ఉన్నది.

  జగన్ నెగ్గుకురావటం కూడ కష్టమే.

  ఇది ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న దౌర్భాగ్యం!

  జనాలకి నిజాన్ని తెలియనివ్వరు. ఎక్కడో ఓ మూల ఓ చోటా ఓ నిజాన్ని రాస్తారు. దాని చుట్టూ అమ్మాయి బొమ్మలు వేస్తారు. ఎవడు చూస్తాడూ.  ఎవడికి పట్టిందీ?

  ReplyDelete
 4. nice content
  https://youtu.be/2uZRoa1eziA
  plz watch our channel

  ReplyDelete