Jun 21, 2018

అక్రమ వలసదారులు/అగ్రదేశాలు/అధికారులు మధ్య పిల్లలు

కాందిశీకులు/చొరబాటుదారులు/అక్రమ వలసదారులు/అగ్రదేశాలు/అధికారులు మధ్య పిల్లలు

అబ్బో అమెరికా అహా అమెరికా We want better life గుడ్డూ గూసూ అని చాలా దేశాల ప్రజలు భారతీఉలతో సహా అనుకుంటారు. నేనూ అలా వచ్చినవాణ్ణే.
అమెరికా దేశంలో ఉద్యోగావకాశాలు మెండు అనుకుంటాం.
ఇక్కడ జీతాలు మెండు అనుకుంటాం.
ఇక్కడ జీవితం బాగుంటుంది అనుకుంటాం.
ఇక్కడ అంతా గొప్పే అనుకుంటాం.

నిజంగానేనా? అని గట్టిగా కళ్ళలో కళ్ళు పెట్టి నిలదీస్తే సమాధానం చెప్పటం కష్టమేమో అనిపిస్తుంది. లేక ఎవరి అనుభవం అభిప్రాయం వారిదీ అనిపిస్తుంది.

కానీ పిల్లల్తో సహా దేశంలో చొరబడటం అనేది తల్లితండ్రుల తప్పే. వాళ్ళు అధికారుల చేతిలో చిక్కారే అనుకుందాం, పిల్లల్ని ఇరికించటం ఎంతవరకు సబబు? పిల్లల్ని తీసుకురాకుండా ఎక్కడ వదిలేసి రాగలరూ? ఇవన్ని ఒకదానికి ఒకటి ముడిపడ్డ ప్రశ్నలు.

అమెరికా దేశాన్ని ఆ దేశపు రాష్ట్రపతి రక్షించుకోవాల్సిందే. సరిహద్దుల్లో మెత్తగా ఉంటే లాభంలేదన్న అతని పిలుపు గొప్పదే కావచ్చు. మెత్తగా ఉంటే సరిహద్దుల్ని వదులుకోవాల్సిందే అన్న అతని పిలుపులోనూ నిజం ఉంది.

కానీ తలితండ్రులనుండి పిల్లల్ని వేరు చేయటం, గిడ్డంగులలో వాళ్ళని బంధించటం, పిల్లల ఆలనా పాలనా చూసే సిబ్బంది కొరత, లోపలి పరీస్థితులు, భాషాబేధాలు వెరసి - నరకప్రాయం చేసేసారు మొత్తాన్ని.

తిలా పాపం తలా పిరికెడులో అధికార యంత్రాంగం చేసే భయంకరమైన పనులు అనగా అసాల్ట్స్. సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్స్ అవి ఇవి.

మొత్తానికి అమెరికాలోనే రాష్ట్రపతి వైఖరిపై జనాలకు అసహ్యం వేసేస్తాయికి దిగజారింది ట్రంప్ పరీస్థితి.
ఎక్జిక్యూటివ్ ఆర్డరుతో పాపాన్ని కడుక్కోవాలని చూస్తున్నాడు ట్రంప్.

అమెరికా జీవితం - దూరపు కొండలు నునుపు అనే సామెతకి నిలువెత్తు సాఖ్యం అని జనాలు అర్థం చేస్కోరు.

ఏవైనా ఈ మంట తొందరగా చల్లారదు అని నా అభిప్రాయం.

కాని, ఒక పశువుల కొష్టంలో బంధింపబడిన పశువుల్లాగా వేరుహౌసుల్లో ఉన్న పిల్లల రేపు తల్లితండ్రుల్ని కలుసుకున్నా వాళ్ళ మనసుల్లో ఈ బంధికానా రోజులు ఎలాంటి భావాలని ముద్రవేస్తుందో?

ఒక పీడియాట్రీషియన్ పిల్లల్ని ఉంచిన స్థలానికి వెళ్ళాట్ట. పొద్దున వార్తల్లో విన్నాను ఈ కథనాన్ని. అతను గత పాతికేళ్ళుగా పిల్లవైద్యుడిగా సేవలందిస్తున్నాడు. అతను పిల్లల ఏడుపుని బట్టి ఆ ఏడుపు ఏంటో చెప్పగలడట. ఆకలేసినప్పుడు ఏడుపు, మొడి చేసినప్పుడు ఏడుపు, నిద్రలో ఉలిక్కిపడ్డప్పటి ఏడుపు ఇత్యాదివి. అతను చెప్పింది - అక్కడి పిల్లల ఏడుపు పైవాటిల్లో ఏదీ కాదు, అది టెర్రర్తో నిడిపోయున్న ఏడుపు అని.

ఒక జర్నలిస్టు చెప్పుకొచ్చిన కథనం - ముగ్గురు పిల్లలు. పెద్దోడికి 16 ఏళ్ళు, చెల్లికి 10, చిన్న తమ్ముడికి 6. ముగ్గురూ బ్రజిల్ దేశస్తులు. చెల్లి తమ్ముడు అన్నని వాటెస్కుని వదలకుండా ఏడుస్తున్నారు. అధికారులు వచ్చి, స్పానిషులో అలా వాటేస్కోకూడదు ఇక్కడ రూల్ అని చెప్పటం, వాళ్ళకి అర్థంకాకపోవటం. ఒక అధికారిణి సదరు జర్నలిస్టుని పోర్చుగీసులో చెప్పవయ్యా అని అడిందట. అతను పిల్లల్లోని పెద్దోడికి "నువ్వు ధైర్యంగా ఉండాలి ఇలాంటి పరీస్థితుల్లో" అని చెప్తే ఆ పిల్లాడు "ఎలా ధైర్యంగా ఉండమంటారూ" అని సూటిగా అడిగాట్ట. ఇంతలో అధికారిణి కల్పించుకుని "వాటేస్కోకుండా ఉండమని" చెప్పమంటే ఆ జర్నలిస్టు "నేను చెప్పలేకపోతున్నా" అన్నాట్ట.

ఈ పరీస్థితి నుంచి పిల్లలు బయటపడి తొందరగా తల్లితండ్రుల్ని కలుసుకోవాలని ప్రార్థిస్తున్నా!

No comments:

Post a Comment