Jun 21, 2018

అక్రమ వలసదారులు/అగ్రదేశాలు/అధికారులు మధ్య పిల్లలు

కాందిశీకులు/చొరబాటుదారులు/అక్రమ వలసదారులు/అగ్రదేశాలు/అధికారులు మధ్య పిల్లలు

అబ్బో అమెరికా అహా అమెరికా We want better life గుడ్డూ గూసూ అని చాలా దేశాల ప్రజలు భారతీఉలతో సహా అనుకుంటారు. నేనూ అలా వచ్చినవాణ్ణే.
అమెరికా దేశంలో ఉద్యోగావకాశాలు మెండు అనుకుంటాం.
ఇక్కడ జీతాలు మెండు అనుకుంటాం.
ఇక్కడ జీవితం బాగుంటుంది అనుకుంటాం.
ఇక్కడ అంతా గొప్పే అనుకుంటాం.

నిజంగానేనా? అని గట్టిగా కళ్ళలో కళ్ళు పెట్టి నిలదీస్తే సమాధానం చెప్పటం కష్టమేమో అనిపిస్తుంది. లేక ఎవరి అనుభవం అభిప్రాయం వారిదీ అనిపిస్తుంది.

కానీ పిల్లల్తో సహా దేశంలో చొరబడటం అనేది తల్లితండ్రుల తప్పే. వాళ్ళు అధికారుల చేతిలో చిక్కారే అనుకుందాం, పిల్లల్ని ఇరికించటం ఎంతవరకు సబబు? పిల్లల్ని తీసుకురాకుండా ఎక్కడ వదిలేసి రాగలరూ? ఇవన్ని ఒకదానికి ఒకటి ముడిపడ్డ ప్రశ్నలు.

అమెరికా దేశాన్ని ఆ దేశపు రాష్ట్రపతి రక్షించుకోవాల్సిందే. సరిహద్దుల్లో మెత్తగా ఉంటే లాభంలేదన్న అతని పిలుపు గొప్పదే కావచ్చు. మెత్తగా ఉంటే సరిహద్దుల్ని వదులుకోవాల్సిందే అన్న అతని పిలుపులోనూ నిజం ఉంది.

కానీ తలితండ్రులనుండి పిల్లల్ని వేరు చేయటం, గిడ్డంగులలో వాళ్ళని బంధించటం, పిల్లల ఆలనా పాలనా చూసే సిబ్బంది కొరత, లోపలి పరీస్థితులు, భాషాబేధాలు వెరసి - నరకప్రాయం చేసేసారు మొత్తాన్ని.

తిలా పాపం తలా పిరికెడులో అధికార యంత్రాంగం చేసే భయంకరమైన పనులు అనగా అసాల్ట్స్. సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్స్ అవి ఇవి.

మొత్తానికి అమెరికాలోనే రాష్ట్రపతి వైఖరిపై జనాలకు అసహ్యం వేసేస్తాయికి దిగజారింది ట్రంప్ పరీస్థితి.
ఎక్జిక్యూటివ్ ఆర్డరుతో పాపాన్ని కడుక్కోవాలని చూస్తున్నాడు ట్రంప్.

అమెరికా జీవితం - దూరపు కొండలు నునుపు అనే సామెతకి నిలువెత్తు సాఖ్యం అని జనాలు అర్థం చేస్కోరు.

ఏవైనా ఈ మంట తొందరగా చల్లారదు అని నా అభిప్రాయం.

కాని, ఒక పశువుల కొష్టంలో బంధింపబడిన పశువుల్లాగా వేరుహౌసుల్లో ఉన్న పిల్లల రేపు తల్లితండ్రుల్ని కలుసుకున్నా వాళ్ళ మనసుల్లో ఈ బంధికానా రోజులు ఎలాంటి భావాలని ముద్రవేస్తుందో?

ఒక పీడియాట్రీషియన్ పిల్లల్ని ఉంచిన స్థలానికి వెళ్ళాట్ట. పొద్దున వార్తల్లో విన్నాను ఈ కథనాన్ని. అతను గత పాతికేళ్ళుగా పిల్లవైద్యుడిగా సేవలందిస్తున్నాడు. అతను పిల్లల ఏడుపుని బట్టి ఆ ఏడుపు ఏంటో చెప్పగలడట. ఆకలేసినప్పుడు ఏడుపు, మొడి చేసినప్పుడు ఏడుపు, నిద్రలో ఉలిక్కిపడ్డప్పటి ఏడుపు ఇత్యాదివి. అతను చెప్పింది - అక్కడి పిల్లల ఏడుపు పైవాటిల్లో ఏదీ కాదు, అది టెర్రర్తో నిడిపోయున్న ఏడుపు అని.

ఒక జర్నలిస్టు చెప్పుకొచ్చిన కథనం - ముగ్గురు పిల్లలు. పెద్దోడికి 16 ఏళ్ళు, చెల్లికి 10, చిన్న తమ్ముడికి 6. ముగ్గురూ బ్రజిల్ దేశస్తులు. చెల్లి తమ్ముడు అన్నని వాటెస్కుని వదలకుండా ఏడుస్తున్నారు. అధికారులు వచ్చి, స్పానిషులో అలా వాటేస్కోకూడదు ఇక్కడ రూల్ అని చెప్పటం, వాళ్ళకి అర్థంకాకపోవటం. ఒక అధికారిణి సదరు జర్నలిస్టుని పోర్చుగీసులో చెప్పవయ్యా అని అడిందట. అతను పిల్లల్లోని పెద్దోడికి "నువ్వు ధైర్యంగా ఉండాలి ఇలాంటి పరీస్థితుల్లో" అని చెప్తే ఆ పిల్లాడు "ఎలా ధైర్యంగా ఉండమంటారూ" అని సూటిగా అడిగాట్ట. ఇంతలో అధికారిణి కల్పించుకుని "వాటేస్కోకుండా ఉండమని" చెప్పమంటే ఆ జర్నలిస్టు "నేను చెప్పలేకపోతున్నా" అన్నాట్ట.

ఈ పరీస్థితి నుంచి పిల్లలు బయటపడి తొందరగా తల్లితండ్రుల్ని కలుసుకోవాలని ప్రార్థిస్తున్నా!

Jun 18, 2018

ఈనాడు అమెరికా వీసా యూనివర్సిటి


ఈనాడులో ఓ ప్రధాన వార్త -
గ్రీన్‌ కార్డు కోసం ఈబీ-2 కేటగిరి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అమెరికా నిబంధనల ప్రకారం వీరికి గ్రీన్‌ కార్డ్‌ రావడానికి కనీసం 150 సంవత్సరాలు పట్టే అవకాశముంది. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ అర్హతతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కూడా దీనికి ఒక కారణం. యూఎస్‌సీఐఎస్‌ గణన ప్రకారం ఈ కేటగిరి కింద గ్రీన్‌ కార్డ్‌ పొందాలనుకునే వాళ్ల సంఖ్య 2,16,681. వారి భార్యపిల్లలతో కలిపి 4.33,368 మంది గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఏమిరాస్తున్నారా నాయనా? ఎందుకిలాంటి పిచ్చిరాతలూ?
గ్రీంకార్డ్ ప్రాసెసింగ్ అనేది రాజకీయాలకు లోబడి నడుస్తుంది.
ప్రస్తుతానికి ప్రోసెసింగ్ సెంటర్లలో పనివేసే జనాభాని తగ్గించారు. అందువల్ల నింపాదిగా నడుస్తున్నది.
ఎప్పటికీ ఇదే తరహా ఉండదు.
రేపొద్దున్న వీసా నెంబర్లను నాలాలోకి విడిచిపెట్టరు. వాటిని వాడుకుని తీరాలి.
ఎన్నో సాంకేతిక విషయాలు ఇందులో ముడిపడి ఉన్నాయి.
ఊరకే జనాకర్షణ వార్తలు రాకయకండి.

Jun 17, 2018

ఈనాడు ప్రభు భక్తి

ఈనాడు ప్రభు భక్తి

*ముగిసిన నీతిఆయోగ్‌ భేటీ: ఏమేం చర్చించారంటే..?* అంటూ ఓ పేజీడు వార్త రాసుకొచ్చాడు రామోజీ తాత. అందులో *
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న చంద్రబాబు* అని ఒక ఉప శీర్షిక. తన గోడు వెళబోశుకున్నాడు బాబు. తప్పులేదు. చెప్పి మాట్టాడాల్సిన విషయాలు అతని పర్స్పెక్టివ్ నుంచి.

తర్వాతి ఉపశీర్షిక
*జాతీయ అంశాలపైనా చంద్రబాబు సూచనలు

ప్రత్యేక హోదా తాము కొత్తగా అడుగుతున్నది కాదని, విభజన చట్టంలో పేర్కొన్నదేనన్నారు. పోలవరం నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందన్నారు. 2019 లోపు పూర్తి చేయాలంటే కేంద్రం నిధులు ఇవ్వాలన్నారు. కడపలో ఏర్పాటు చేస్తామన్న ఉక్కు కర్మాగారం, విశాఖలో రైల్వేజోన్‌ అంశాలను కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చి వాటిని వెనక్కి తీసుకోవడాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించినట్టు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తూనే.. జాతీయ స్థాయి ప్రాధాన్యతాంశాలైన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం, ఆరోగ్యానికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన మిషన్‌ ఇంద్రధనస్సు పథకాన్ని ఎలా సమర్థంగా అమలుచేయాలనే దానిపైనా పలు సూచనలు చేశారు. స్వాతంత్య్రపోరాటానికి సంబంధించిన విషయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై సూచనలు చేశారు. మహాత్మాగాంధీ ఆశయాలను, ఆయన స్వచ్ఛభారత్‌ కలను సాకారం చేసేందుకు దేశంలో అందరికన్నా ముందుభాగాన ఏపీ ఉంటుందని స్పష్టంచేశారు. స్వచ్ఛభారత్‌ కలను సాకారం చేయడం ద్వారా గాంధీజీకి ఘన నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌లతో పాటు పలువురు సీఎంలు చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఆయన చేసిన సూచనల్ని సమర్ధించారు.*

దీంట్లో తాత హైలైట్ ఏంటయ్యా అంటే బాబు దేశస్థాయి నాయకుడు, ఆయన కేంద్రప్రభుత్వానికే సూచనలు ఇచ్చాడు అని. తర్వాతి ఉపశీర్షికల్లో బాబు సూచనలని మోదీ అనుసరిస్తున్నట్టుగా రాసుకొచ్చాడు.

చివర్లో కెసీఆర్ కూడా మాట్టాడినట్టు రాసిన తాత, మరి కేసీఆర్ ఏవీ సూచనలు ఇచ్చినట్టుగానీ వాటిని ప్రధాని విన్నట్టుగానీ విని ఆచరించినట్టుగానీ ఎక్కడా రాయలేదు మరి.

Jun 10, 2018

వంగ తోట

వంగతోట కాడ ఒళ్ళు జాగర్త
వంగతోట కాడ ఒళ్ళు జాగర్త 


నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్
నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్
నాటుకుంటే తీయాలంటే నా తరమా నీ తరమా


కందతోట కాడ కాళ్ళు జాగర్త
కందతోట కాడ కాళ్ళు జాగర్త 

చీలిఉన్న దుంప కాలికంటుకుంటే
చీలిఉన్న దుంప కాలికంటుకుంటే
దురద ఆపాలంటే నీ తరమా నా తరమా
కందతోట కాడ కాళ్ళు జాగర్త

అన్నాడు సినారే 

వంగ మడిలో నిన్న గమనించాను. నిజమే సుమా అనిపించింద్.
వంగ ముల్లు కోపుగాను ఉందీ పొరపాటున తగిలితే కస్సున దిగేదిలాగనూ ఉంది

ఓ రమా రమణ O rama ramana

Jun 9, 2018

Anthony Bourdain

Anthony Bourdain అనే అతను మట్టిలో కలిసిపోయాడనే వార్త నన్ను కాస్త బాధపెట్టింది. నా దృష్టిలో Anthony Bourdain ఒక food philosopher. ఇతను ఒక ఫుడ్ ప్రజెంటరుగా ఖ్యాతిని గాంచాడు. food netwrok లో ఈయన ప్రోగ్రాములు అనేకమార్లు చూశాను.
అన్నిటికన్నా నాకు బానచ్చిన ఇతని కార్యక్రమం Parts Unknown. ఇతని ఇంకో కార్యక్రమం నాకు బాగా నచ్చింది, ఎక్కువగా చూసింది - No Reservations. తిండి మీద ఇంత గొప్పగా ఓ కార్యక్రమాన్ని డిజైన్ చేయటం, తిండి ద్వారా ఓ ప్రాంతపు సాంప్రదాయాలని/ధోరణిని ఆవిష్కరించటం గొప్పవిషయం. ఆరకంగా ఇతను గొప్ప విజయాన్ని సాధించినట్టే.
ఎవరూ వెళ్ళని దేశాలకి, ఎవరూ చూడని వినని సందులు గొందుల్లోకి వెళ్ళి లోకల్ ఫుడ్ ని తెరకెక్కించటం సామాన్యమైన విషయం కాదు.

The show has won 5 Emmy Awards, garnered 11 nominations for writing, sound mixing, editing and cinematography, as well as a 2013 Peabody Award.

Bourdain was working on an episode of the show in Strasbourg, France at the time of his death on June 8, 2018.

Parts Unknown twitter handle

@PartsUnknownCNN

Jun 6, 2018

రాజకీయ బురద

అమెరికా లాంటి దేశాల్లో రాజకీయ (వి)నాయకుల చేతిలో అత్యంత ప్రధానమైన పెంపుడు జంతువు *మీడియా*. వీళ్ళు ఆడే పావుల ఆటలో ప్రధానమైన ఎత్తుగడ - ఏంచేసైనా పేపర్లో పెద్దక్షరాలతో మొదటిపేజీలో పడాలి.

అదే సమీకరణాన్ని అనుకరిస్తున్నాడు బాబు.
జనాలు మర్చిపోకూడదని రోజుకోసారి "భా.జ.పా నమ్మక ద్రోహం" అంటాడు. దాన్ని బాజాభజంత్రీల మీడియా పెద్దక్షరాలతో ప్రచురిస్తుంది.

మొన్న జరిగిన ఒక వార్తావి-శ్లే-షణలో తెదేపా నాయకుడు శ్రీ లంక దివాకర్ పాపం ఆవేశ-పడి ఆయాస-పడి విలవిల్లాడితే, సదరు కార్యక్రమం నడిపిన వ్యక్తి విజయ్ అతన్నికి సీరియస్గా చెప్పేడు. మీరు విషయం మాట్టాడండి అని. ఆసందర్భంలో ఓ ప్రశ్న పడింది. మీడియాగానీ మిగతా పక్షాలుగానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేశాయి.

భారతదేశలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యంత సీనియర్, నటుడు కాదు కాదు క్షమించాలి, రాజకీయ నాయకుడు చంద్రబాబు అని గుండెలు చరుచుకుని చెప్పుకుంటారే, అట్లాంటిది, ఆయనకి ఒక పార్టీ టోకరావేసిందని తెలియటానికి 4 ఏళ్ళు పట్టిందా?

మోసం దగా కుట్రా బాబుని ఎదగనీయకుండా ప్లాను అదీ ఇదీ అంటూ యాగీ చేసేబదులు - #పిల్ వేయొచ్చుగా సుప్రీం కోర్టులో
ఇదీ చట్టం, ఇలా చేశారు చట్టం, ఇంత రావాలి, రాలేదు. ఇంత ఇవ్వాలి, ఇవ్వలేదు. మరి ఆడబ్బు ఏవనట్టూ? విభజన చట్టం ప్రకారం ఇవి రాలేదు అని కోర్టునాశ్రయించొచ్చుగా?

రాజకీయాలంటే ట్రంపులాగా పొద్దస్తమానం ఒబామా ఓబామా అనటం లేకపోతే పొద్దున్నే మూడుకి లేచి పలానోడు అబ్బో మంచోడనటం రాత్తిరికి అతన్ని తిట్టటం కాదు.
భాజపా మీద తెదేపా, తెదేపా మీద జగన్ పార్టీ, జగన్ మాట లేకుండా ఏవీ మాట్టాడకుండా తెదేపా - చూట్టానికి వినటానికి కంపరంగా అసహ్యంగా ఉంది.

అయ్యా రాజకీయ రాక్షసుల్లరా - రాష్ట్రానికి ఏంకావాలో అది చేయండి. గుంటూరులో కలిసి కాట్ల కుస్తీ పోటీ పెట్టుకోండి. దిల్లీలో కలిసి పోరాడండి.

Jun 1, 2018

T-Bone Collision 90 డిగ్రీల కోణంలో యాక్సిడెంట్



Broadside or T-bone collision

Broadside collisions are where the side of one vehicle is impacted by the front or rear of another vehicle, forming a "T". In the United States and Canada this collision type is also known as right-angle collision or T-bone collision; it is also sometimes referred to by the abbreviation "AABS" for "auto accident, broadside".[1] Vehicle damage and occupant injury are more likely to be severe, but severity varies based on the part of the vehicle that is struck, safety features present, the speeds of both vehicles, and vehicle weight and construction.

 90 డిగ్రీల కోణంలో యాక్సిడెంట్
మొన్నీమధ్య ఓ రోజు సూరిగాణ్ణి క్లాసులో దింపి ఎటో వెళ్తూ ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాను రెడ్ పడిందని. అది ఓ నిమిషానికి గ్రీన్ అయ్యింది, స్లోగా స్టార్ట్ అయ్యాను. ఇంతలో ఒకామె నాకు 90 డిగ్రీల కోణంలో సూపర్ ఫాస్టుగా వెళ్ళనే వెళ్ళింది, నేను ఆమె డ్రైవర్ సైడ్ పాసింజర్ డోరుని హిట్ చేయనే చేసేశాను. ఆమె కంట్రోల్ తప్పింది, కారు ఓ డోనట్ వేసింది, రోడ్డెమ్మటే ఉన్న ఓ కాంక్త్రీట్ దిమ్మెని గుద్దేసింది. ఆమెకి డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్ అయ్యింది. నేను కారాపేసి, ఆమెని రిస్క్యూ చేయటానికి వెళ్ళాను. ఆమె పాపం వణికిపోతున్నది. ఆమె పక్కనే ఓ పిల్లాడు బహుశా 15 ఏళ్ళు అనుకుంటా ఉన్నాడు. వాడికి ఏమీ కాలేదు. 911 కి కాల్ చేశాను నేనే. నిమిషంలో వచ్చారు నలుగురు పోలీసులు రెండు ఫైర్ ట్రక్కులు ఓ ఫైర్ సూపర్వైజరు.

ఎవరిది తప్పు ఇత్యాది తంతు షరా మామూలే. ఇన్స్యూరెన్స్ మార్పిడులు మామూలే.

నాకారుకి మాత్రం పెద్ద దెబ్బే తగిలింది.

నా అనుభవం:
కారుకి దెబ్బ తగిలితే, చచ్చిన జంతువు కళేబరం దగ్గర వాలి పీక్కు తిందాంఅని ఆశగా దింపుడు కళ్ళతో దిగే రాబందుల్లా, వెంటనే వచ్చి వాలతారు టో ట్రక్కర్లు. వాళ్ళని వదిలించుకుని ఇన్స్యూరెన్స్ వాడి చేతుల్లోకి వెళితే త్రిశంఖు లోకంలోకి నెట్టబడతాం.
ముందు ఎంత డ్యామేజీ అయ్యిందో చూట్టానికి ఒకడొస్తాడు.
వాడు ఇదిగిగి ఇంత, అల్లది అంత మొత్తానికి ఇంత అంటాడు. వాడు ఎంత చూసిన భూతద్దం పెట్టి వెతికినా, సముద్రంలోంచి పైకి కనిపించే కొండే, సముద్రంలో ఎంతలోతో వాడేం చెప్తాడూ? ఉజ్జాయింపుగా ఓ లెక్క వేసి ఇన్స్యూరెన్సోడికిస్తే వాడు, అబ్బాయి ఇంతైతుంది అని ఓ నెంబరేసి పంపిస్తాడు బాగుచేయటనికి అయ్యే ఖర్చుని. ఎక్కడ చేయిస్తా? నువ్వే చేయించుకుంటవా? మేము చెప్పిన ఆటో గ్యారేజుకి వెళ్టావా అంటాడు. నా అనుభవంలో - వాళ్ళు వెళ్ళమని చెప్పే గ్యారేజికి వెళ్ళటమే మంచిది.

నేను ఇన్స్యూరెన్స్ వాడు సజెస్ట్ చేసిన గ్యారేజుకే వెళ్ళాను. వాడు మొత్తానికి అవి ఇవి అవి కొత్త పార్ట్ వేసి బాగుచేశాడు.