Jan 2, 2016

మేధావులు స్పందించాల్సిన సమయం

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: దేశరాజధాని నగరం దిల్లీలో సరి-బేసి సంఖ్య వాహన విధానం నేడు అమలు చేసినప్పటికీ కాలుష్య స్థాయి అధికంగానే ఉందని అధికారులు వెల్లడించారు. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈరోజు దిల్లీలో సరి-బేసి వాహన రిజిస్ట్రేషన్‌ సంఖ్య వాహనాలు రోజు మార్చి రోజు తిరగాలనే నిబంధన అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈరోజు కూడా నగరంలో గాలి నాణ్యత చాలా ప్రమాదకర స్థాయిలోనే ఉందని సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(సఫార్‌) వెల్లడించింది. గాలిలో పర్టిక్యులేట్‌ మాటర్‌ స్థాయి ఎక్కువగా ఉండడం కాలుష్యం తగ్గలేదని చెబుతున్నారు.నిన్నటి నుంచి చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదని తెలిపారు.
అయితే సరి-బేసి విధానంతో సంబంధం లేకుండా సఫార్‌ డిసెంబరు 31న దిల్లీ నగరంలో కాలుష్యంగా అధికంగా పెరిగిందని వెల్లడించింది.నూతన సంవత్సర వేడుకల సంబరాలతో పాటు వాతావరణ పరస్థితుల వల్ల కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న కారణంగా గాలిలో కదలిక లేకపోవడంతో గాలిలో పర్టిక్యులేట్‌ మాటర్‌ స్థాయి పెరుగుతోందని దీని వల్ల మరికొద్ది రోజులో నగరంలో కాలుష్య స్థాయి పెరుగుతుందని అధికారులు గురువారం తెలిపారు.
కాలుష్యం తగ్గాలంటే వాహనాల సంఖ్య తగ్గడంతో పాటు వాతావరణం కూడా సహకరించాల్సి ఉంటుంది. ఈరోజు దిల్లీలో కేవలం బేసి సంఖ్య కార్లకు అనుమతి ఇస్తూ నిబంధనలు అమలు చేయడం వల్ల కాలుష్యం మాట అటుంచితే నగరంలో ట్రాఫిక్‌ సమస్య కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అధిక సంఖ్యలో ప్రజలు ప్రజారవాణాపై ఆధారపడుతున్నారు. అలాగే కార్‌పూలింగ్‌ (తాము వెళ్లే దారిలో కారులో ఇతరులను ఎక్కించుకోవడం)కు కూడా డిమాండ్‌ పెరిగింది. కార్‌పూలింగ్‌ యాప్స్‌ను అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విధానానికి దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూడా మద్దతు ఇచ్చింది.
>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<

మేధావులు స్పందించాల్సిన సమయం. కాలుష్యరహిత నగరాలను చూడాలని నేను అనటంలేదు. కానీ, రాజధాని ప్రజలలో స్పూర్తి నింపాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉన్నదనటంలో ఏమాత్రమూ సందేహంలేదు. అటు ప్రభుత్వం ఇటు మేధావి వర్గం కలసి పనిచేసి దేశ రాజధానిని రక్షించాలని కోరుకుంటున్నాను

No comments:

Post a Comment