వెయ్యిమైళ్ళ నడక
జస్ట్ టు ఇన్స్పైర్!
నేను వెయ్యి మైళ్ళు నడిచినానని గొప్పగా చెప్పటంలేదు కానీ, ఆనందంగా చెప్పుకుంటున్నా. ఈ వెయ్యిమైళ్ళ నడక కేవలం బయట నడుస్తూ రికార్డ్ చేసినవి మాత్రమే. మధ్యలో అనేకం ట్రెడ్ మిల్ మీద నడిచినవి ఉన్నాయి.
ఈ సొద ఎందుకంటే, నడవండి!
నడక మంచిది!!
congrats. That's very inspiring!
ReplyDeleteవెయ్యిమైళ్ళే, భలే!! అభినందనల్సార్.
ReplyDeleteనేనూ ఆమధ్య మొదలెట్టా. ఏంటో ఎంత నడిచినా చుట్టుకొలతలో తేడా కనబట్లేదండి. నా ఒంట్లో క్యాలరీల ఊట ఏమైనా ఉందేమోనని డౌట్నాకు. 56 వర్కౌట్లు, రెండొందల పాతిక కిమీల నడకా ఇప్పటికి నా రికార్డు. మీ రికార్డు చేరాలంటే నాకు నూటడెబ్భై చాలవు ఇంకో నూట్డెబ్భై కావాల్సుంటది. అయినా సరే.., ఇప్పుడు నాకో బెంచిమార్కు దొరికిందిగా, ఇహ మీ సంగజ్జెబుతానుండండి.
చదువరి గారూ!
Deleteబహుకాల దర్శనం!!
రోజుకి మూడుమైళ్ళు అనే టర్గెట్ పెట్టుకుంటే నెలకి తొంభై మైళ్ళు అవుతుంది. ఒక్క ఏడాదిలోనే వెయ్యిమైళ్ళు నడవవచ్చు.
కేలరీల కొలత కొంచెం వివరంగా ఉండదండీ! దాన్ని మనం కాస్త పరీక్షించి చూడాలి, కొలవాలి.
ఒక మనిషికి, పలానీ ఎత్తు పలానీ ఒడ్డుపొడుగు లాంటివి సమీకరించి కొలిస్తే దాదాపు రెండువేల కేలరీలు ఏంచెసినా చేయకపోయినా అవసరం పడుతుంది. దానిపైన మీ యాక్టివిటీని లెక్కలోకి తీస్కుంటే యాక్టివిటీనిబట్టి రెండువేలకేలరీలు+యాక్టివిటీకి మీరు ఖర్చుపెట్టే కేలరీలు ప్రతీరోజూ మీకు అవసరంపడుతుంది.
ఐతే! రోజుకి అన్ని కేలరీలు తీస్కోకపోతే శరీరం ఏవనుకుంటుందటే, పాపం పిల్కాయ కష్టపడతాఉన్యాడు, నీరసించిపోతాఉన్యాడు అని బరువు తగ్గనీకుండా ఆగిపోతుంది.
కాబట్టి, మీరు లెక్కకట్టాల్సింది
౧. ఎంత నడుస్తున్నారు
౨. ఎంత వేంగగా నడుస్తున్నారు
౩. ఎంత తింటున్నారు
౪. ఏమి తింటున్నారు
అనేవి!
ఏవైనా! *బెంచిమార్కు* అన్నారు చూశారూ! గర్వంగా ఉందండోయ్!! ఈవేళ పదికిలోమీటర్లు నడిచి మీకే అంకితమిస్తానుండండి