మొన్న నా కారులో మరోమారు రఫి గారి పాటల సిడీ పెట్టి వినటం మొదలుపెట్టినాను. ఒక్కోపాటా ఒక్కోపాటా విన్నాక వచ్చిందీ పాట
బహారోఁ ఫూల్ బరసావో
మేరా మెహబూబ్ ఆయాహై
నోరు దానంతటదే హమ్ చేయటం మొదలెట్టిందని చెప్పాల్సిన పనిలేదు.
ओ लाली फूल की मेंहँदी लगा इन गोरे हाथों में
उतर आ ऐ घटा काजल, लगा इन प्यारी आँखों में
ఓ లాలీ ఫూల్ కి మెహింది లగా ఇన్ గొరె హాథోం మేఁ
ఉతర్ ఆ యె ఘటా కాజల్, లగా ఇన్ ప్యారీ ఆంఖోఁ మేఁ
ఈ చరణాలదగ్గర సమస్యసిచ్చిపడింది. ఇదేంటిది, ఎక్కడో ఇలాంటి సేం టు సేం వరస అనగా గమకం విన్నట్టుందే అనుకుని మనసుని గూగిలిస్తే,
మధుమాసం చెలి మోవిని దరహాసం చేసే
తెలిజాబిలి చెలిమోమున కళలారబోసే
అని వచ్చింది.
ఔను రెంటి వరసా ఒక్కటే అనుకున్నాను.
ఇక ఇప్పుడు గూగులిస్తే,
మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక
అనేపాటకి స్పూర్తి(అనవచ్చా??) మేరా మెహబూబ్ ఆయాహై అని తెలిసింది.బహారోఁ ఫూల్ బరసావో
మేరా మెహబూబ్ ఆయాహై
నోరు దానంతటదే హమ్ చేయటం మొదలెట్టిందని చెప్పాల్సిన పనిలేదు.
ओ लाली फूल की मेंहँदी लगा इन गोरे हाथों में
उतर आ ऐ घटा काजल, लगा इन प्यारी आँखों में
ఓ లాలీ ఫూల్ కి మెహింది లగా ఇన్ గొరె హాథోం మేఁ
ఉతర్ ఆ యె ఘటా కాజల్, లగా ఇన్ ప్యారీ ఆంఖోఁ మేఁ
ఈ చరణాలదగ్గర సమస్యసిచ్చిపడింది. ఇదేంటిది, ఎక్కడో ఇలాంటి సేం టు సేం వరస అనగా గమకం విన్నట్టుందే అనుకుని మనసుని గూగిలిస్తే,
మధుమాసం చెలి మోవిని దరహాసం చేసే
తెలిజాబిలి చెలిమోమున కళలారబోసే
అని వచ్చింది.
ఔను రెంటి వరసా ఒక్కటే అనుకున్నాను.
ఇక ఇప్పుడు గూగులిస్తే,
మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక
రచయిత - శ్రీ సినారె.
మహమ్మద్ రఫీ గారి అతి గొప్ప పాటల్లో మెరా మెహబూబ్ ఆయాహై ఒకటి.మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక
చెలితో మాటలాడని వలపే పాట పాడని
వలపే పాట పాడనీ
మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక
కమలాలే నా రమణి నయనాలై విరిసే
అద్దాలే నా చెలియ చెక్కిళ్లై మెరిసే
ఆ నయనాల కమలాలలోనా
నా జిలుగు కలలు చూసుకోని
ఆ అద్దాల చెక్కిళ్ళలోన నా ముద్దులే దాచుకోనీ
మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక
మధుమాసం చెలి మోవిని దరహాసం చేసే
తెలిజాబిలి చెలిమోమున కళలారబోసే
ఆ దరహాస కిరణాలలోన
నను కలకాలం కరిగిపోని
ఆ కళల పండువెన్నెలలోనా
నా వలపులన్ని వెలిగిపోనీ
మెరిసే మేఘమాలికా...
[ఓరి తింగరోడా! ఈ విషయం ఇప్పటిదాకా తెలియదా? అనుకోచ్చు ఎవరైనా. నిజంగానే గమనించలేదింత వరకు]
నాకూ తెలీదు. హిందీ పాట ఇష్టమైనది. తెలుగు పాట కూడా బాగుందనుకోవడం వరకే కానీ పోలిక ఉందనుకోలేదు.
ReplyDeleteబాగుంది. మంచి విషయం కనిపెట్టినారు.:)
మీ 'గూగులిస్తే' ప్రయోగం బాగుంది.
ReplyDelete