Jun 25, 2013

సూరిగాడి పిచ్చి

సూరిగాడికి అనేక పిచ్చులు ఉన్నాయి. వాటిల్లో అత్యంత గొప్ప పిచ్చి పజిల్స్! చిన్నప్పుడు మూడేళ్ళ వయసప్పుడనుకుంటా, మికీ మౌస్ పజిల్ తెచ్చిచ్చాను. ఇరువదినాలుగు పీసులు ఉండే పజిల్ అన్నమాట. మొదలెట్టాడు ఏకాగ్రతతో! మొత్తానికి సాధించినాడు. వాడి ఇంటరెస్ట్ చూసి, వాడి ఇంటరెస్టుని ఉత్సాహపరుద్దాం అనిపించింది. ఓరోజు టాయిస్-స-రస్ కి వెళ్తే మెలీసా అండ్ డగ్ వాళ్ళ పజిల్స్ సేల్లో ఉంటే కొన్నా ఈ బొమ్మలో పజిల్. రెండడుగుల వెడల్పు, మూడడుగుల పొడవు ఉండే అండర్ వాటర్ పజిల్, వంద పీసులు ఉండేది. ఆరు డాలర్లకో ఏమో సేల్లో ఉంటే కొన్నాను.
ఈపజిల్ని ఏ వెయ్యిసార్లు పెట్టుంటాడో! భారత్ వెళ్ళేప్పుడు తీసుకెళ్ళి అక్కడా పెట్టినాడు. ఎంత పిచ్చి అంటే, అదే పని. ఇటు పెట్టను, పీకి మళ్ళీ మరోవైపు పెట్టను.
అప్పుడు పట్టిన పజిల్ పీసెస్ పిచ్చి ఇప్పటికీ వదల్లేదు. మొన్న ఇండియా వెళ్ళేప్పుడు అయిదువందల పీసెస్ ఉన్న పజిల్స్ తీసుకెళ్ళాడు, కాలక్షేపానికి.

8 comments:

  1. Wow...very nice...my daughter is nearing 3 now but end up throwing in frustration jus in case if the doesn't fit..obviously she puts in wrong place and we end up in a mess !!!!...

    ReplyDelete
    Replies
    1. తక్కువ పీసెస్ ఉన్నవాటితో మొదలుపెట్టండి!

      Delete
  2. పిల్లకాయ ప్రహేళికా సృజనాత్మకతను నలుగురితో పంచుకొని ఇతర బాలబాలికలకు ప్రోత్సాహాన్నిచ్చేదిగా మీ చిరు చిరు రచన సాగింది!

    ReplyDelete
  3. మంచి అలవాటు.

    నా చిన్నప్పుడు పదిహేను ముక్కల పజిల్స్ చేసేవాడిని. మొన్న ఒక పజిల్ మాఅమ్మాయి, మా అన్నయ్య కూతురి ఫోటో తో చేయించేను. పెట్టడానికి నాలుగురోజులు పట్తింది, కానీ మళ్ళి ఆ రోజులు గుర్తొచ్చేయి.

    ReplyDelete
  4. మంచి అలవాటు. చూస్తూంటే ముచ్చటేస్తోంది.

    ReplyDelete
  5. కామెంటిన మిత్రులందరికీ ధన్యవాదాలు సూరిగాడి తరఫున!

    ReplyDelete