Oct 16, 2011

ఫాల్ పండగ

సూరిగాడి బళ్ళో ఆకురాలు కాలం సందర్భంగా *రాలే పండగ* అనగా ఫాల్ ఫెస్టివల్ జరిగింది.
హూలా హూప్, గోతాల్లో నడుముదాకా మునుగి గెంతటం అనగా సాక్ రేస్, బక్కెట్లో బంతులు వేయటం, గురిచూసి కొట్టటం, కాలి బంతి, వాలీబాలు ఇత్యాదివి ఎన్నో ఆటలపోటీలు పెట్టారు.
ముఖంపై బొమ్మలు వేయించుకునే వారికి ఒక షామియానా పెట్టారు.
గుమ్మడికాయలకు రంగులద్దే బల్ల ఒకటి వేసారు.
అనఘ సూర్యా తమ తమ గుమ్మళ్ళకు రంగులు పులిమారు
From 2011-10-15

పైది సూరిగాడు రంగు పులిమిన గుమ్మడి
ఈ కిందది అనఘ రంగులద్దిన గుమ్మడి
From 2011-10-15

అలా రంగులద్దినాక గోడామీద పెట్టారు.
కొన్ని ఫోటోలు -
From 2011-10-15


From 2011-10-15


From 2011-10-15


From 2011-10-15

12 comments:

  1. ఇలా గుమ్మడి కి రంగు పూసే కాంపిటీషన్ కూడా ఉంటుందా , భలే ఉన్నాయి :)) ఇంతకీ అనఘ కూడా స్కూల్ కి వెళుతుందా అప్పుడే హ్మ్ !

    ReplyDelete
  2. భాస్కర్ గారూ, అర్జంట్ గా నాకు విసిట్ వీసా పేపర్లు పంపండి. అటార్నీ ఎక్స్పెన్స్ నేనిస్తాను (అంటే అనవసరంగా మీకు ఖర్చెందుకు అనీ, కోప్పడకండి), ఇలాంటి ఫన్ అంతా మిస్స్ ఐపోయా . పిల్ల సైన్యం కూడా కొంచం పెద్ద ఐపోయారు కదా:((. బాగుంది ఫాల్ పందగ.

    ReplyDelete
  3. రంగుల గుమ్మడి కాయలు బాగున్నాయి. పండగానంతరం ఈ గుమ్మడి కాయల్ని ఏం చేస్తారు?

    ReplyDelete
  4. బాగుంది. హాలోవీన్ కూడా దగ్గరకి వస్తున్నట్టుంది..

    ReplyDelete
  5. అబ్బే సూరిగాడి కలర్స్ అనఘ వేసిన కలర్స్ ముందు వెలవెలబోతున్నాయి. ఆ మూడో ఫోటోలో క్లియర్ గా తెలుస్తోంది. ఏమన్నా ప్యూర్ బ్లూ కలర్ లో అందమే వేరు.

    ReplyDelete
  6. భలే ఉన్నాయ్ గుమ్మెళ్ళకి రంగులా? కొత్తగా ఉంది. పిల్లలిద్దరూ మంచిరంగులు పూసేరు కానీ అనఘ మాత్రం కుసింత ఎక్కువ కలాపోషన చేసినట్టుంది.
    క్రిష్ణవేణి

    ReplyDelete
  7. భలేగా ఉన్నాయి! ఈ గుమ్మడికాయలని తరువాత ఏం చేస్తారు చెప్మా????

    ReplyDelete
  8. హ్మ్! ఏంటోనమ్మా! పిదపకాలం పిదప బుద్ధులు....మా రోజుల్లో ఎఱగం ఇట్టాంటివన్నీ! "కూష్మాండం విష్ణు రూపం" అని దణ్ణవెట్టుకుని ఎత్తి పగలేసి, శేరుడు బెల్లం పోసి ఉడకబెట్టి బద్దలు వండుకు తింటమో, లేకపోతే మరికాసిని కూరముక్కలు, చింతపండు పులుసూ పోసి ఓ గంట మరగబెట్టి, దించి ఘుమాయించుకుంటూ నెయ్యీ, ఇంగువా పోపెట్టి "దప్పళం" చేసుకుని సన్నన్నంలో ముద్దపప్పుతో కలిపి లాగించి అట్టా సొర్గం దాకా వెళ్ళి రావటమో తెలుసు కానీ, ఏంటీ ఈ విడ్డూరం... రంగులు పూసి గోడకెక్కించటం...హవ్వ! హవ్వ! అంతగా తింటానికి మనసొప్పకపోతే బాపనాయనకి దానమిచ్చి కాళ్ళకి దణ్ణవెట్టుకుంటే సరిపోద్ది. "కూష్మాండదానం కోటిసంపత్ప్రదాతారమూ,అక్షయమూ" ఆయె మరి! తెలుసుకోరూ.....ః)..ః))))

    ReplyDelete
  9. అనఘ స్కూలుకి అప్పుడే వెళ్ళటంలేదు శ్రావ్యా
    ఫాల్ ఫెస్టివలుకి కుటుంబంతో రమ్మని ఆహ్వానం. చిన్నపిల్లలకు ఇస్తారు మీరూ వేయండీ అని.
    పండగానంతరం గుమ్మడిపండ్లను ఏంచేస్తారు భాస్కర్? పారేస్తారు. నాచురల్ రంగులు, నాచురల్ పండ్లే కాబట్టి, అవే రిసైకిల్ అవుతాయ్.
    సునీత గారూ! ఇదిగో ఇప్పుడే పంపిస్తున్నా, వచ్చేయండి. హాలోవీన్ కాస్ట్యూమ్స్ కూడా కొని పెట్టుంచనా?
    కృష్ణప్రియ గారూ, అవునండీ. వస్తున్నది హాలోవీన్. కానీ మేము అపార్టుమెంటుల్లో ఉంటంవల్ల నో ట్రిక్ ఆర్ ట్రీటింగ్
    శంకరం - అంతేలే గురూ. అభిమానసంఘాలు మరి ఆమాత్రం సపోర్టు చేయకుంటే ఎలా?
    కృవేచా గారూ - మీరూ అనఘ అభిమాన సంఘంలో చేరినట్లున్నారు :)
    రసజ్ఞ - గుత్తి గుమ్మడికాయ కూర చేస్తారండీ. :):) [పిల్లాట]
    ఇదేంకూరా అనుకుంటున్నారా? ఇక్కడ నొక్కండి
    http://nalabhima.blogspot.com/2008/11/ondemand-tm.html

    ReplyDelete
  10. అమెరికాలో కూష్మాండం ఏవిటయ్యా శాస్త్రీ?
    ఇక్కడా కూష్మాండం అంటే బ్రహ్మాండం బద్దలౌతుంది.

    ReplyDelete
  11. భలే ఉన్నాయండీ రాజుగోరూ..

    ReplyDelete