మొన్నెప్పుడో ఆఫీసునుండి ఇంటికి చేరంగనే సూరిగాడికీ నాకూ మధ్యన సంభాషణ
సూరి: నాన్నా! డూ యూ డూ దోజ్ థింగ్స్?
నేను: ఏవిట్రా అదీ?
సూరి: అదే నాన్నా! తెల్లగా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటారు, పొగ బ్లో చేస్తారూ
సూరి: ఏవంటారు నాన్నా దాన్నీ?
నేను: సిగరెట్టు
సూరి: అదే అదే!! డు యూ డూ దోజ్ థింగ్స్?
నేను: లేదురా.
హ్మ్! ఇలాంటి రోజు వస్తుందని నాకు నిజంగా తెలియదు. మానేసాను కాబట్టి, వాడి కళ్ళలోకి సూటిగా చూసి చెప్పగలిగాను. అసలు వీడికి ఇవెలా తెలిసాయీ? అనుకునేంతలో సూరీ కీ మా చెప్పుకొచ్చింది, వాళ్ళ బళ్ళో బాడ్ థింగ్స్ గురించి చెప్తున్నారట. రెడ్ రిబ్బన్ వీక్ అట.
నాన్న ఆల్కాహాల్ తాగుతాడా అని అడిగాట్ట వాళ్ళ అమ్మని.
రెడ్ రిబ్బన్ వీక్ - అక్టోబర్ చివరి వారాన్ని డ్రగ్ ఫ్రీ వీక్ గా జరుపుకుంటారట. దాన్నే రెడ్ రిబ్బన్ వీక్ అంటారట.
పిల్లల్లో ఎవేర్నెస్ తేవటం బాగుంది.
ఐతే ఎందరు వీటిని పట్టించుకుంటారూ?
అనేకసార్లు ఇలా గమనించాను -
ఓ తల్లి, వెనక సీట్లో చంటి పిల్లల్ని పెట్టుకుని, చలిలో, విండో కొంచెం కిందకు తీసి, పొగ ఊదటం. ఆ పిల్లల ఊపిరితిత్తులు ఏమౌతాయో అనే ఆలోచన లేక పోవటాన్ని చదువులేని తనం అందామా? కేర్లెస్నెస్ అందామా?
ఆలోచించాలి....................
Oct 24, 2011
Subscribe to:
Post Comments (Atom)
ఇది తెలియని పిల్లలకు కొత్తగా నేర్పుతున్నట్లుందికదా !
ReplyDeleteదుర్గేశ్వరరావు గారూ,
ReplyDeleteపిల్లలకు తెలవనివి చెప్పకూడదంటే తెలియకపోదు కదండీ. వాళ్లుగా ఇవి తెలుసుకునేలోపు అవి మంచివి కాదని చెప్పడం మంచిదేమోగదండీ.
మానేసాను కాబట్టి, వాడి కళ్ళలోకి సూటిగా చూసి చెప్పగలిగాను.
ReplyDeleteమీరు ఈ మాట హానెస్ట్ గా చెప్పడం నచ్చిందండి.