శ్రీశ్రీ గారికి రష్యా అంటే ఎంత ప్రేమో చెప్పలేంది. ఆయన కవితల్లో రష్యాని ఎవరెస్ట్ శిఖరం మీద కాదు కాదు ఇంకా పైన కూర్చూబెట్టాడు
తన కళ్ళద్దాలని ఎఱ్ఱ కళ్ళద్దాలుగా మార్చుకునేంత ప్రేమించడు
గర్జించు రష్యా
గాండ్రించు రష్యా
రష్యాలో గని కార్మికుడు
రష్యాలో రిక్షావాలా
రష్యాలో పొగ గొట్టపు ధ్వని
రష్యాలో బందరు లడ్డు
రష్యాలో గాడిద గుడ్డు
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రష్యా మీద ప్రేమ కవితలు
రష్యా వాసన!
ఖడ్గసృష్టి చివర్న ఫుట్ నోట్స్ సెక్షన్ లో "మళ్ళీ రష్యా వెళ్తున్నాను" అని ఒక నోట్.
1954 లో శ్రీశ్రీ మొదటిసారి రష్యా వెళ్ళాట్ట. తిరిగి రాలేక రాలేక వచ్చాక ఒక ఇష్టాగోష్ఠి సమావేశం జరిగిందట. అందులో మాస్కో విశ్వవిద్యాలయం గురించి ముచ్చటిస్తూ (అంటే కీర్తిస్తూ) "అప్పుడే జన్మించిన శిశువును రోజుకొక గదిలో నిద్రబుచ్చితే, అన్నీ గదులు పూర్తయ్యేప్పటికి శిశువుకి వందేళ్ళు వస్తాయి" అని కవితాత్మకంగా వాక్రుచ్చారట. 100*360=36500 రోజులు. సదరు మాస్కో విశ్వవిద్యాలంలో ఎన్ని రూములున్నాయో మరి. గూగుల్ గారిని అడిగాను, వారి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్సు గారు ఇలా చెప్పుకొచ్చారు The central tower of Moscow State University's main building has over 5,000 rooms. The tower is 36 stories high and 240 meters tall, and it contains 33 kilometers of corridors.
Moscow State University is Russia's largest and oldest university. It has a complex campus with 1,000 buildings and structures, and it also has eight dormitories that house more than 12,000 students.
నిజం చెప్పాలంటే 1954 నాటికి ఒక విశ్వవియాలయంలో 5000 గదులు ఉండటం గొప్పవిషయమే అయుండచ్చు.
విషయంలోకి వస్తే
ఈ ఇష్టాగోస్ఠిని వక్రీకరిస్తూ ఆంధ్రపత్రికలో ఒక వ్యాసం వచ్చిందట, “ఆంధ్ర రచయితల గురుతర బాధ్యత” వ్యాసం శీర్షిక, 04/01/1955 న ముద్రింపబడింది.
ఇందులో మాస్కో విశ్వవిద్యాలయం జార్ చక్రవర్తుల కాలంలో కడితే ఆ కీర్తిని కమ్యూనిష్టు రష్యాకి శ్రీశ్రీ ఆపాదించాడని సారాంశం
శ్రీశ్రీ 04/01/1955 న ఈ వ్యాసాన్ని కువ్యాఖ్యానం అంటూ ప్రతిగా ఒక లేఖ రాశాట్ట, అది 07/01/1955 న అచ్చైయిందట. తాను చెప్పింది మాస్కో విశ్వవిద్యాలయం స్థాపన 1755, పునరుద్ధరణ 1954 గురించి అని.
ఆంధ్రపత్రిక కువ్యాఖ్యానానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో మధ్యంతర ఎన్నికలు ఫిబ్రవరి 1955 జరగవలి ఉంది.
కాంగ్రేస్ కమ్యూనిష్టుల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఘాట్టి పోటీ ఉంది.
ఎన్నికల ప్రచారం అప్పటికే ఊపండుకుంది.
సహజంగానే అంధ్రపత్రిక కాంగ్రేసుకి కొమ్ము కాసేది. కాంగ్రేస్ మరియూ ప్రెస్ కమ్యూనిష్టుల మీద అక్కసు వెళ్ళగక్కటమే పై వ్యాసం లక్ష్యం. అందులో భాగంగానే తన మీద నిందారోపణకి ఒడిగట్టాయంటూ శ్రీశ్రీ భావోద్వేగం.
నిజం చెప్పాలంటే ఆంధ్రా కమ్యూనిష్టులు రాష్ట్రం ఏర్పడ్డప్పటినుండి తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. MLC దగ్గ్రనుండి MLA లదాకా తమ ప్రభావం చూపించారు.
ఫిబ్రవరి 11 1955 శాసనసభ ఎన్నికలు జరిగాయి. 167 స్థానాలకు 581 మంది పోటీ చేశారు. భారత జాతీయ కాంగ్రేసు 119 స్థానాలు గెల్చుకుంటే భారతీయ కమ్యూనిష్టు పార్టీ 15 స్థానాలు గెలుపొందింది.
31.13% ఓటు శాతం. కమ్యూనిస్టు గాలి బాగనే వీచినట్టు లెక్క
ఇక్కడి అసలు విషయం ఎలక్షన్లు కాదు
శ్రీశ్రీ గారి నైజం
అంతగొప్ప అభ్యుదయ వాది
అభ్యుదయ రచయితల సంఘం విప్లవరచయితల సంఘం అది ఇదీ.
ఒక చిన్న బావిలోని కప్ప ఓ రోజు ఓ పెద్ద చెఱువులోకి దూకిందట. అంత పెద్ద చెఱువు దానికి ఆశ్చర్యాన్ని కలిగించిందట. తామరాకులు ఒడ్డెమ్మటి బొక్కలు ఆహా ఓహో..అలా ఉంది శ్రీశ్రీ ధోరణి.
1000 ఏళ్ళ పరాయి పాలనలో మన వనరుల మీద మన సంపద మీద దాడి జరిపి నిష్క్రమిచాడు తురుష్కుడు, మిగిలిందాన్ని పీల్చి పిప్పి అయ్యాక స్వాతంత్రం అనే చిరిగిపోయిన చీకిపోయిన గోచీని దిశమొలమీద లాగి చుట్టి వెళ్ళాడు బ్రిటీషుడు.
కమ్యూనిష్టులు ఈ దోపిడీని గుర్తించారా?
భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రష్యా దేశానికి జార్ చక్రవర్తి నుండి స్వాతంత్రం రాలేదు. ఆయన్ని చంపి పాలనని తమ చేతుల్లోకి తీస్కున్నారు.
జార్ చక్రవర్తి పోతూ పోతూ సంపదను తీసుకు పోలేదు కానీ బ్రిటీషుడు పోతూ పోతూ భారతదేశ సంపదను దోచుకెళ్ళాడు. ఈనాటి ఆ సంపద లెక్క 5 ట్రిలియన్ డాలర్లు అంటున్నారు కొందరు.
ఏవైనా శ్రీశ్రీ ఎఱ్ఱ కళ్ళద్దాలలో రష్యా ఎంత బాగున్నా ఎంత ఎఱ్ఱగా ఉన్నా భారతదేశపు ఎఱుపు పసుపు నలుపు తెలుపు కనపడకపోవటం కేవలం కళ్ళద్దాల మహిమ మాత్రం కాదు