ఇజ్రాయేల్ ని సమర్థిస్తావా?
నిన్న ఓ రోజున నా కూతురు నన్ను ఒక ప్రశ్న వేసింది
నువ్వు ఎవ్వర్ని సమర్థిస్తావూ ఇస్జ్రాయేల్ నా లేక పాలస్తీనా నా అని
చాలా క్లిష్టమైన ప్రశ్న
ఒక భారతీయుడిగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్కుంటే భారతదేశానికి ఇజ్రాయేల్ చాలా మిత్ర దేశం. అదే సమయంలో భారత దేశానికి ఎస్సార్ అరాఫత్ మిత్రుడు, భారతదేశ సందర్శనకి రావటం అనేక ఒప్పందాలమీద సంతకాలు.
భారత దేశం కూడా ఇజ్రాయేల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న సమస్య లాంటి సమస్యనే అనుభవిస్తున్నది.
ఇలాంటి నేపథ్యంలో నేను ఎవర్ని సపోర్ట్ చెయ్యాలీ? చేస్తానూ?
సూటిగా సమాధానం చెప్పాను.
ఎవరైతే ఉగ్రవాదం మీద పోరాడతారో వాళ్ళని సపోర్ట్ చేస్తాను అని చెప్పాను.
అంటే? అన్నది
ఒక దేశంలోకి చొచ్చ్కువచ్చి వందలమంది మీద కాల్పులు జరిపి వందలమందిని బందీలుగా చేస్కున్న వాళ్ళ మీద దాడి చెయ్యాలి
అలా దాడి చేసే సమయంలో తమ మీద దాడులు జరక్కుండా ప్రపంచ దృష్టిని మరల్చేలా జనవాసాల్లో దాక్కుని ముందు ఆడవాళ్ళని ముసలి ముతకని పిల్లల్ని పెట్టి వాళ్ళ వెనక దాక్కున్న వాళ్ళ మీద ఎక్కు పెట్టాలంటే ఎలా?
జనావాసాల కింద బొరియలు చేస్కుని అందులో దాక్కున్న వాళ్ళాని చంపటం ఎలా?
తప్పదు
కొందరు/అందరు బలి అవ్వాల్సిందే
"కానీ పిల్లల్ని చంపటం ఎలా సమర్థిస్తావూ?" మళ్ళీ ప్రశ్న
"పిల్లల్ని ఎరగా వేస్తున్నవాళ్ళు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి" అన్నాను
"ఏవైనా పిల్లల్ని చంపటాన్ని సమర్థించ కూడదు" తన వెర్షన్
"దీనికోసమే ఇలా ప్రపంచాన్ని పోలరైజ్ చేయటం కోసం సానుభూతి కోసమే వాళ్ళు జనావాసాల కింద బొరియలు తవ్వుకున్నది సొరంగాలల్లో దాక్కున్నది" అన్నాను
"ఇదొక గెరిల్లా యుద్ధ తంత్రం" అని చెప్పటానికి ప్రయత్నించాను
"ఇది చాలా చిన్న సమస్య. అయ్యా మీరూ మీరూ పోట్లాడుకోండి కొట్టుకోండి చంపుకోండి. సామాన్యుల ప్రాణాలు బలితీయకండి అని ఎవరూ ముందుకి రాలేదు. అయ్యా మీ దేశం నుండి ఎత్తుకొచ్చిన వాళ్ళు వీళ్ళే తీసుకెళ్ళండి. మా జనావాసాల కింద మీరు దాక్కోకండి.. మా బ్రతుకులు మాకు ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం అని ఎవరూ అనలేదు.... ఈరోజు వరకూ. దీనర్థం ఇది ఒక రాజకీయ సమస్య. రాజకీయ సమస్యలకు పరిష్కారం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరటం లాంటిది" అని ముగించాను
No comments:
Post a Comment