Jun 1, 2019

మైలురాళ్ళు


ఈ టపా 2013 సెప్టెంబరు 10 న రాశాను.
ఆనాటికి నా నడక యజ్ఞం వెయ్యి మైళ్ళు చేరుకుంది.

అదొక గర్వించతగ్గ మైలురాయిలా అనిపించింది.

ఆశ్చర్యంగా కాలం తన బాటలో తాను తనమానానతాను నడిచిపోయింది. ఒక్క నిమిషం కాల ప్రవాహంలో ఊపిరి తీసుకోటానికి ఆగి వెనక్కి చూస్కుంటే ఎన్నో నడకానుభూతులు.

నడకలో గొప్పతనం ఏంటంటే, నడిచినంతసేపు నీతో నువ్వు నీకై నువ్వు నీలో నువ్వు మాట్టాడుకోవచ్చు చూసుకోవచ్చు రమించుకోవచ్చు

అడిగేవాడుడండు
ఆక్షేపించేవాడుండడు
వేలెత్తి చూపేవాడుండడు

ప్రకృతిలో ప్రకృతితో మమేకం అయి
ప్రతీ చెట్టుని
ప్రతీ పుట్టనీ
గట్టుని
కయ్యల్ని
గడ్డి పరకల్ని
అనుభవిస్తూ
కొండకచో కలలు కంటూ

వెయ్యిమైళ్ళ నడక పక్కన పెడితే మధురాంతకం రాజారాం గారి కథ ఒకటి జ్ఞాపకానికొచ్చింది. ఆ కథని మా మోర్జంపాడులో పనిచేసిన తంతితపాలా బంట్రోతుకి అన్వయిస్తే రోజుకి ఎన్ని మైళ్ళు నడిచుంటాడో సదరు బంట్రోతు. అలా ఎన్ని సంవత్సరాలు పని చేసుంటాడో.

చేతికి పెట్టుకునే పెడోమిటరు లేక చేతికి తగిలించుకునే అలాంకారాలు (wearable) వచ్చాక రోజుకి 10000 అడుగులు అనే లెక్క నిజంగానే ఓ కర్త్వయంలా అయి కూర్చుంది చాలా మందికి నాతోబాటుగా. మా అమ్మకీ ఒక fitbit కొనిచ్చాను. రోజుకి 10000 అడుగులు వేస్తున్నారా అంటుంది అమ్మ.

2013 సెప్టెంబరు 10 న 1000 మైళ్ళు అనే మైలురాయి.
ఈరోఝు నా ఐఫోన్ లోని mapmyrun లో రికార్డు చేయబడ్డ నా నడక నన్ను ఎక్కడిదాకా తీసుకెళ్ళిందో చూశాను.

















8,885.72 మైళ్ళు అని అని చూపెట్టింది అప్లికేషన్

No comments:

Post a Comment