పదేళ్ళ క్రితం బ్లాగులు వెలిగిపోతున్న రోజుల్లో విచిత్ర వితండవాదంతో రొటీనుకి భిన్నంగా కిక్కిరిసిన పోయిన సమాజం అనే ఓ మడుగు నుండి తనని తాను బయటకి పడేస్కున్న ఓ చేపలా భావించుకుంటూ కొత్త కొత్త పదజాలాన్ని విరివిగా వాడుతూ కుల దూషణ మత దూషణ చేస్తూ అదేం తిట్టుకాదు, అడగటం తప్పు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ, సినిమా అనేది అతని సొత్తైనట్టు విర్రవీగుతూ.... నడచిన అతని ప్రస్థానం జారుడు మెట్లనీ, ఎంత తనని తాను సమాజం నుంచి బయటేస్కున్నా సమాజం అనేదాన్ని ఓ గదిలో బంధించలేమనీ, సమాజం అన్నాక దానికి కొన్ని *గుడ్డి* నమ్మకాలుంటాయనీ ఆ గుడ్డి నమ్మకాలు నీకైతే ఒక న్యాయం నాకైతే న్యాయం అనీ నమ్మటం....... వెరసి... ఈరోజు బహిష్కరణ.
ఎక్కడనుంచి? ఈరోజు సిటీ నుంచి మరి రేపు? ఎల్లుండి?
ఎందుకీ వెంపర్లాట? ఎందుకీ విపరిత పైత్యం? గుర్తింపుకోసమేనా? ఎవరిక్కావాలీ గుర్తింపు? ఎంతకావాలి గుర్తింపు? సమాజం మనోభావాలను తన్ని నిద్రలేపటం క్రిటిసిజమా?
ఇలాంటివాళ్ళు అడుగడుగునా ఉంటారు. తమ తమ స్థాయిల్లో వంచన చేస్కుంటూ సమాజం నెత్తిన రాళ్ళు పెట్టటానికి ప్రయత్నిస్తారు.
కులం పేరుతో
మతం పేరుతో
ఇజం పేరుతో
చదువు పేరుతో
మేధావి పేరుతో
విర్రవీగుతూ .... వీళ్ళు పైకి కనిపించేది ఒకటి లోపల ఒకటి.
మనిషి తన చుట్టూ ఉన్న సమాజం చెక్కిన శిల్పం!
Subscribe to:
Post Comments (Atom)
>>> వీళ్ళు పైకి కనిపించేది ఒకటి లోపల ఒకటి.>>>
ReplyDeleteగుర్తించినందుకు సంతోషం. అతను కూడా హిందువే ! హిందువుల ముసుగులో ఉన్న "దగుల్బాజీ" కాదు.
ఇక్కడ హిందువు అనే పదం ఎందుకొచ్చిందీ?
Deleteమీకు మైండు లేదు అనటానికి మీ ఎత్తు ఉదాహరణ.
సరే అనుకుందాం.
నేను హిందువునని నే చెప్పానా?
good discovery. I recommend Oscar award for you for the discovery!
ReplyDeleteమిమ్మల్ని "దగుల్బాజీ" అని నేనలేదు. మీరే భుజాలు తడుముకుంటున్నారు.కాస్త ఆలోచించండి.నటనకి సంబంధించిన నిపుణులకు,నటులకు ఆస్కార్ ఇస్తారు. మేధావుల ఆలోచనలకు,తెలివితేటలకు నోబెల్ ఇస్తారనుకుంటా !
ReplyDeleteYou have very good understanding. Great!
ReplyDelete