May 21, 2018

మన్నెముల్లు

మన్నెముల్లు

సురిగాడి చేతిలో ఏదో గుచ్చుకుని విరిగిపోయింది. బహుశా ఓ పేడో లేకపోతే ఓ ముల్లో అయుండచ్చు. వాళ్ళమ్మ పిన్నీసుతో దాన్ని తీసేసింది. అయినా ముల్లు దిగినచోట చిన్నగా వాము ఉండి ఒక కోణంలో నొప్పి అంటున్నాడు. బహుశా ఆ పేడో ముల్లో మొత్తం బయటకొచ్చేకుండా ఇంకా కొంచెం చేతిలో మిగిలిపోయుండాలి. మొన్నోసారి నాకూ అంతే జరిగింది. చిటికెన వేలు రెండో కణుపు దగ్గర పేడు దిగింది, తీసేసాను. మొత్తంరాలేదు. అబి బొబ్బలావచ్చి, చీముకారి మొత్తానికి ఒక నెల్ల తర్వాత పేడు పేడు బయటకి దానంతట అదే వచ్చేసింది. శరీరం ఎంత తీవ్రప్రయత్నం చేస్తుందో కాదా సెల్ఫ్ హీల్ చేస్కోటానికి?

నా చిన్నప్పుడు పల్లెల్లో తిరుణాళ్ళకి వెళ్ళినప్పుడు *మన్నెముల్లు* అని ఓ మూడు పరికరాల సెట్టు అమ్మేవాళ్ళు. దాంట్లో ఒకటి చిటికెన వేలంత పొడవుతో ఉండే చిన్న చిప్పగంటె. రెండోది థోంగ్స్. ముల్లుని పట్టుకుని పీకటానికి. మూడోది కుట్టుకోటానికన్నట్టుగా ఉండే ఓ సూది. ఆ సూదిని మన్నెముల్లు అంటారు.

మన్నెము [ mannemu ] or మన్యము mannemu. [from Skt. మాన్యము.] n. Land given as a token of respect. సమ్మానించి యిచ్చిన కొంత భూభాగము. High-lands, hilly land, hill-country, uplands. Agency tracts. మన్నెపుజ్వరము jungle fever. మన్నెపుదేశము highlands. లోమన్యము the interior of the hills. "అనయంబు రజతాద్రి యట్టి దుర్గంబు మనకు గల్గన నేల మన్నెముల్." BD. iii. 1093. మన్నెకాడుమన్నెదొర or మన్నెపుదొరmannckāḍu. n. A highland chieftain. మన్నెపువారు hill people. మన్నెపుగొడ్డలి a broad axe, a woodman's axe, a highlander's axe. మన్నెముల్లు manne-mullu. n. A large needle used to remove thorns from the feet of goats. "మందులపొడిబుర్ర మన్నెముల్లుతోలుకుళ్లాయి." H. ii. 85. మన్నెరికము manne-rika-mun. Chieftainship, the state of being a lord among the hill people, మన్నెపుదొరతనము. "వలపుల మన్నెరికంబు" Vijayanti. ii. 66. టీ మోహములయొక్క ప్రభుత్వము.

2 comments:

  1. welcome back annay. 2018lo aDapaa daDapaa raayaTam modalupeTTinaTTunnaav. konni gurutulu medilaayi manasulo.

    ReplyDelete
  2. ఉద్యోగం నన్ను కుదిపేస్తోంది. ఇంతలో పిల్లలు పెద్దైపోతున్నారు. వారివెనక నిరంతరం పరుగు తప్పటంలేదు. వాళ్ళ చిన్నప్పుడూ వేళ్ళ వెంట పరుగే. పెద్దైతున్న కొద్దీ.... పరుగే. సమయం దొరికినప్పుడల్లా ఏదోకటి రాయాలని కోరిక. సమయాన్ని నడకకో దొడ్లో తోటమాలి అవతారంలోనో మింగేస్తున్నా.

    ReplyDelete