May 21, 2018

మన్నెముల్లు

మన్నెముల్లు

సురిగాడి చేతిలో ఏదో గుచ్చుకుని విరిగిపోయింది. బహుశా ఓ పేడో లేకపోతే ఓ ముల్లో అయుండచ్చు. వాళ్ళమ్మ పిన్నీసుతో దాన్ని తీసేసింది. అయినా ముల్లు దిగినచోట చిన్నగా వాము ఉండి ఒక కోణంలో నొప్పి అంటున్నాడు. బహుశా ఆ పేడో ముల్లో మొత్తం బయటకొచ్చేకుండా ఇంకా కొంచెం చేతిలో మిగిలిపోయుండాలి. మొన్నోసారి నాకూ అంతే జరిగింది. చిటికెన వేలు రెండో కణుపు దగ్గర పేడు దిగింది, తీసేసాను. మొత్తంరాలేదు. అబి బొబ్బలావచ్చి, చీముకారి మొత్తానికి ఒక నెల్ల తర్వాత పేడు పేడు బయటకి దానంతట అదే వచ్చేసింది. శరీరం ఎంత తీవ్రప్రయత్నం చేస్తుందో కాదా సెల్ఫ్ హీల్ చేస్కోటానికి?

నా చిన్నప్పుడు పల్లెల్లో తిరుణాళ్ళకి వెళ్ళినప్పుడు *మన్నెముల్లు* అని ఓ మూడు పరికరాల సెట్టు అమ్మేవాళ్ళు. దాంట్లో ఒకటి చిటికెన వేలంత పొడవుతో ఉండే చిన్న చిప్పగంటె. రెండోది థోంగ్స్. ముల్లుని పట్టుకుని పీకటానికి. మూడోది కుట్టుకోటానికన్నట్టుగా ఉండే ఓ సూది. ఆ సూదిని మన్నెముల్లు అంటారు.

మన్నెము [ mannemu ] or మన్యము mannemu. [from Skt. మాన్యము.] n. Land given as a token of respect. సమ్మానించి యిచ్చిన కొంత భూభాగము. High-lands, hilly land, hill-country, uplands. Agency tracts. మన్నెపుజ్వరము jungle fever. మన్నెపుదేశము highlands. లోమన్యము the interior of the hills. "అనయంబు రజతాద్రి యట్టి దుర్గంబు మనకు గల్గన నేల మన్నెముల్." BD. iii. 1093. మన్నెకాడుమన్నెదొర or మన్నెపుదొరmannckāḍu. n. A highland chieftain. మన్నెపువారు hill people. మన్నెపుగొడ్డలి a broad axe, a woodman's axe, a highlander's axe. మన్నెముల్లు manne-mullu. n. A large needle used to remove thorns from the feet of goats. "మందులపొడిబుర్ర మన్నెముల్లుతోలుకుళ్లాయి." H. ii. 85. మన్నెరికము manne-rika-mun. Chieftainship, the state of being a lord among the hill people, మన్నెపుదొరతనము. "వలపుల మన్నెరికంబు" Vijayanti. ii. 66. టీ మోహములయొక్క ప్రభుత్వము.

May 19, 2018

ఇది ప్రజాస్వామ్య విజయం ఎలా అవుతుంది?

ఇది ప్రజాస్వామ్య విజయం ఎలా అవుతుంది?
యం.యల్.యే లను అక్కడే ఉంచి, *నిర్బంధించకుండా* వదిలేసి, ఎంత ప్రలోభాలు పెట్టినా *మా పార్టిని మేము వీడము* అని చెప్పగలిగిన నాడు - అది ప్రజాస్వామ్య విజయం.
హోటళ్ళలో క్యాండిడేట్లను దాపెట్టే ప్రతోడు ప్రజస్వామ్య విజయం అనేవాడే

I see loopholes in law.

Windshield

మొన్నోరోజు HOV లైన్లో నా మానాన నేను ఇంటికి కారు నడుపుకుంటూ రేడియో వింటూ వెళ్తున్నా. US 290 expansion గత పదేళ్ళుగా నడుస్తున్నది. సూరిగాడికి పెళ్ళై పిల్ల్లు పుట్టేప్పటికి తప్పక రెడీ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. సరే, మొన్న అలా వెళ్తున్న నేను నా పక్కనే ఓ పెద్ద ట్రైలర్ వెళ్ళటం గమనించాను. అది వెళ్ళిన ఒక నిమిషానికి ఓ పెద్ద శబ్దం. బెలూన్ పగిలిన శబ్దం వినిపించింది. ఏదో ట్రైరో ఏదో బ్లాస్ట్ అయుంటుందని అనుకుని నా మాన నేను ఇంటికొచ్చి, కారాపేసి, తాళం తీస్తూ Windshield right corner వైపుకి అనుకోకుండా చూశాను. రెండు అరచేతుల మేర అద్దం పగిలిపోయుంటాన్ని గమనించి గుండె గతుక్కుమంది. అదే అద్దం మొత్తం పగిలి షాటర్ అయి కళ్ళల్లోనో ముఖంమీదనో పడుంటే అనిపించింది.

ఈ దేశంలో క్రాక్ కొట్టిన అద్దాలతో కార్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎందరో.
పగిలిపోయినా నెర్రె కొట్టిన అద్దంతో తిరగటం ఏమాత్రమూ మంచిది కాదు. సెక్యూర్ అసలు కాదు.
ఈ దేశంలో ప్రతీదానికి బీమా ఉండాలి. ఇండి తీరాలి. బీమా సర్వ రక్ష అనుకుంటాం. కానీ కాదు. బీమా ప్రతినిధి కాలికేస్తే ఏలుకేస్తాడు. ఏలికేస్తే కాలికేస్తాడు. చివరాకరికి డిడక్టబుల్ అంటాడు. అక్కడే మనకి గొళ్ళెం పడుతుందని తెలియని బీమా గొర్రెలం మనం.

వెంటనే బీమావారికి కాలు చేస్నినాను. అమ్మా అయ్యా ఇదీ పరీస్థితి అని. అయ్యోపాపం ఔనా! అరె! అలా అయ్యిందా? సారీనే! బాధపడకు మరి. ఇవన్నీ సహజం...ఎన్నిమాటలు చెప్పిందో ఆమె. మా పెదనాన్నగారి బాబాయి కూతురు కూడా అంత ఇదిగా మాట్టాడుండదు.

అక్కా! సరేకానీ, ఏవన్నా సహాయం చేస్తావా? అన్నాను చివరికి ఆశతో దింపుడు కళ్ళతో.
తమ్మీ! హనీ! నేనిక్కడుంది ఎందుకనుకున్నా! భలేవాడివే! సేఫ్లైట్ అని ఓ కంపెనీతో మనకి మాంచి రిలేషన్ ఉంది. వాడికి చెప్పి నీ అద్దం బిగించేయిస్తా. అయితే నీ డిడక్టబుల్ #$500 కదా! ఏటి? అలా బేలగా చూడకు. అద్దం ఖరీదు #$299 అవుతుంది. వాడొస్తాడు. ఆడబ్బులిచ్చి చక్కగా వేయించుకో అంది ఆమె హుందాగా గొప్పగా పెద్దగా ఓ అక్కలా ఓదార్చుతూ.

కర్మరా బాబూ అనుకుని వాడితో అపాయింటుమెంటు తీస్కుని నిట్టూర్చాను.

ఓ సాయంత్రం వాడొచ్చాడు, సేఫ్లైట్ అని వ్యాన్ వెస్కుని. హహహ! ఏవిటి! హహహ అద్దం పగిలిందే హహహ అంటాడు. అన్నాయ్! నవ్వకు! నీ డబ్బు నాజేబుకి చిల్లు. ఏంచేస్తాం అని వాడికి కారు అప్పగించాను.

కానీ వాడు బాగనే చేసాడని నా అభిప్రాయం.