Nov 20, 2012

ఓ సంఘటన

ఈ మధ్య మా ఏకస్థలబహుళగృహ సముదాయంలో జరిగిన ఓ సంఘటన.
మొన్నోరోజు ఆఫీసునుండి ఇంటికి వెళ్తూ పోస్ట్ చూద్దామని పోస్ట్ డబ్బావైపుగా వెళ్తున్నా. పాత్ వే మీద ఇద్దరు పిల్లలు, నల్లవాళ్ళు కూడా పోస్ట్ బాక్స్ వైపుగా వెళ్తున్నరు.
వారిని క్రాస్ చేస్కుని ముందికి వెళ్ళి నేను కారు పార్కింగ్ చేసి సూరిగాడికి పోస్ట్ బాక్స్ తాళంచెవి ఇచ్చాను వెళ్ళి చూసిరారా అని. వాడు కార్ దిగాడు. అప్పుడు ఆ నల్ల పిల్లలవైపు చూశాను. అందులో ఒకడు నాతో ఏదో చెప్తున్నాడు. నేను అద్దాన్ని కిందకి దింపి ఏంటీ అని అడిగేలోపు వాడు చేబులోంచి తుపాకీ తీసి వేలుమీదగా కిందకి వేళ్ళాడేసి, ఇది బీబీ గన్ (బొమ్మ తుపాకీ) అని చెప్తున్నాడు. నాకర్థం అవ్వలేదు. నాకెందుకు చెప్తున్నాడు? అని. ఓకే వాటెవర్ అన్నాను. నా కారుని దాటుకుంటు పోస్ట్ బాక్స్ వెనక ఉన్న ప్లే ఏరియాలోకి వెళ్ళిపోయారిద్దరు పిల్లలూ. అంతలో సూరిగాడు పోస్ట్ చూసొచ్చి కార్లో కూర్చున్నాడు. నేను క్రీగంట వాళ్ళెంచేస్తున్నారా అని గమనిస్తే, నావైపే చూస్తున్నారు. నేను వారివైపు తల తిప్పేలోపు మాయం అయ్యారు.
నాకు ఆశ్చర్యం వేసింది. ఆ గన్ పుల్ చేసిన పిల్లాడు సూరిగాడు వెళ్ళే బడికే వెళ్తాడు. అంటే ఇంకా ఎలిమెంటరీ స్కూలుకే అన్నమాట. అంటె పట్టుమని టీనేజి కూడా కాదు. ప్రతీరోజూ మా ఇంటి ముందునుండే వెళ్తాడు బడికి, ఇంటికీ. రోజూ చూస్తూనే ఉంటాను వాడ్ని. నాకే ఎందుకు చెప్పాడా అని ఒక పాయింటు.
ఇక నాకు కొంత భయం కూడ వేసింది. ఎందుకంటే సూరిగాడు కూడా వాడితో పాటు ఒకే బస్సులో వెళ్తాడు. ఇలాంటి పెద్ద పిల్లలు ఉన్న బస్సులో ఎలాంటి వెధవ వేషాలు వేస్తే అవి పిల్లలకు ఎలా అంటుకుంటాయా ఆని కొంత భయం.
ఇక వాడు చూపింది బొమ్మ తుపాకీనే అవ్వచ్చు గాక. కానీ బడి అయ్యాక ఇంటికొచ్చినాక దాన్ని బయటకు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందీ? ఏ శనివారమో పిల్లలంతా జేరి బొమ్మ తుపాకులతో ఆడుకోవటం ఒక పార్శ్వం. కానీ బడి ఉన్న రోజున. సాయంత్రం ఇద్దరే అలా తుపాకీతో తిరగాల్సిన అవసరం ఏంటీ? వాడు నాకు దాదాపు ముప్ఫై అడుగుల దూరంలోంచి చూపించాడా తుపాకిని. నల్లగా ఉన్నది. పిస్టల్ అనుకుంటా. అది నిజం తుపాకీనే అయే సంభావ్యత ఎంతా?
ఇలా పలు ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చెస్తుండగా మర్రోజు రెంటల్ ఆఫీస్కి వెళ్ళాను. మేనేజర్ తో మాట్లాడాను. ఇలా జరిగింది అని వివరించాను. కావాలంటే నేను వాళ్ళని గుర్తుపట్టగలను కానీ పట్టను. నా ఉనికిని నేను కాపాడుకోవాలి కదా. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిద్దామని చెప్తున్నా అని చెప్పకొచ్చాను. ఆ సదరు పిల్లల మీద నాకెలాంటి ఇదీ లేదు కానీ, నా సేఫ్టీ నా కుటుంబం సేఫ్టీ అపార్టుమెంటు సేఫ్టీ కూడా ముఖ్యమనే భావనతోనే మీదృష్టికి తీస్కొస్తున్నాను అని వివరించాను. ఇలాంటివి మరికొన్ని సార్లు పునరావృతం అయితే ఈ అపార్టుమెంటుకి ఎవరొస్తారో మీరే ఊహించుకుని తగు సేఫ్టీ చర్యలు తీస్కుంటే బాగుంటుందని నొక్కి చెప్పొవచ్చాను.
ఐతే, చివరికి ఇలా అనిపించింది నాకు.
ఆ పిల్లాడు తుపాకీ చూపుతున్నప్పుడు నేను కార్లోనే కూర్చొనున్నాను. ఒకవేళ అది నిజం తుపాకీ అయుండి, నేను నా దురద్రుష్టం కొద్దీ కారు దిగివారివద్దకు వెళ్ళే ప్రయత్నం చేసుంటే ఏవైయుండేదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. సో! మన అదృష్టం బాగుండి అలా చేయలేదు....
ఆ నల్లపిల్లాడి అదృష్టం బాగుండి నాదగ్గర తుపాకీలేదు. ఇలాంటి పరీస్థితుల్లో మరొకడో మరొకడో అయుంటే వెంటనే తుపాకి తీసి షూట్ చేసుండే అవకాశాలున్నాయి. అది బొమ్మ తుపాకీనే అయున్నప్పటికీ. పిల్లాడు నాకు తుపాకీని చూపించాడేకాని ఎక్కుపెట్టలేదు. అయినా!

మిత్రులారా! గమనిస్తూ ఉండండి. ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే మీ గృహసముదాయ కార్యాలయంలో చెప్పండి. సెక్యూరిటీని టైట్ చేయమని చెప్పండి. పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు బయటకు తెవద్దని మనవి చెయవచ్చు కూడా.

Nov 7, 2012

ఒబామానా రామ్నీనా?

కడపటి వార్తలందేప్పటికి ఇదీ టాలీ
రామ్నని 158
ఒబామా 147
మరొక రెండు మూడు గంటల్లో ఓ స్పష్టమైన దృశ్యానికి రాగలమేమో
రామ్నీ యొక్క బృందం అన్నిరకాలుగా ఒబామా మీద బురదచల్లారు. అది నాకు నచ్చలేదు. ఒకానొక రేడియో ఛానెల్లో రష్ లింబా అనొకడు ఎంత దుష్ప్రచారం చేశాడంటే అంత. అదే రేడియోలో నిన్నటికి నిన్న పార్క్స్ అనేవాడు "రిపబ్లికన్స్ అందరూ మంగళవారం ఓటేయండి, డెమొక్రాట్స్ అందరూ బుధవారం ఓటేయండి" అని పదే పదే చెప్పుకొచ్చాడు. ఎలక్షను జరిగేది మంగళవారం, బుధవారం ఓటేయటానికి ఆస్కారంలేదని వాడి వెధవ హ్యూమర్. దాన్ని నిజంగా తీసుకునే వాళ్ళు కొందరుండచ్చు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాడికి. అంతలో ఎలక్షన్ కమీషనర్ స్వయంగా రేడియో స్టేషనుకి కాల్ చేసి వార్న్ చేశాడు. తప్పు అను. ఐనా వాడు తగ్గలేదు.
ఇక మరొక టాక్ షోలో "ప్రియ మిత్రులారా! మీమీ బ్యాంక్ ఎకౌంట్లనుండు డబ్బు డ్రా చేసేస్కొండి, ఏం జరుగుతుందో చెప్పలేం" అని చెప్పుకొచ్చాడు మరొక కుంక. అదే రేపొద్దున రామ్నీ గెలిస్తే ఏంచేస్తారూ? బొక్కసంలో ధనం లేకుండా ఏంపతకాలు అమలు చేయగలరూ?
సో! వీరి నెగెటివ్ పబ్లిసిటీ ఒబామాకి వరం కానున్నదా?
మీరేమంటారూ?