Sep 20, 2011

సూరిగాడి చెల్లి

అయ్యా
వాడిగోల అయ్యింది. బొమ్మలు గీసీ గీసీ రీములకు రీములు అయ్యాఇ కాయితాలు [వాడింకా గీస్తూనే ఉన్నాడానుకోండి; ఈరోజు రేపట్లో డైనోసార్లు గీసి అవతలేస్తున్నాడు].ఇహ ఇప్పుడు మేడం గారి వంతు.
ఇది లయన్ అట
మీరే చూడండి, అన్నగారికి చెల్లెలు అనిపించుకుంటుందా లేదా?

Sep 13, 2011

peter lik photography

TreeOfHope_940.jpg

పై నిశ్చలన చిత్రాన్ని సంగ్రహించిన వ్యక్తి పేరు పీటర్ లిక్.
అతని నిశ్చలనచిత్రాస్రవంతిని  అతని అంతర్జాల నిలయం http://www.peterlik.com నందు చూడవచ్చును.
ఈమధ్య వెదర్ ఛానల్‌లో మీట్ పీటర్ లిక్ అని ఓ ప్రోగ్రాం వేస్తున్నాడు. బాగుంది. ఆ కార్యక్రమం పేరు from the edge with peter lik. ఇక్కడ చూడచ్చు ఈ కార్యక్రమ వీడియోలు కొన్ని
http://www.weather.com/tv/tvshows/peter-lik/
ఇతను తీసిన కాన్యన్ ఫోటోలు అత్భుతం. మహాత్భుతం.
ఇది చూడండి మచ్చుకి
fs_hidden_canyons_AngelsHeart.jpg


ఇక నా మిత్రుడు టోనీ కి చిన్ననాటి స్నేహితుడు స్కాట్ షెర్మన్. ఇతని ఔట్ డోర్ ఫోటోగ్రఫీ నన్ను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతక ముందు కూడా ఇతని అంతర్జాల నిలయ సమాచారాన్ని అందించాను. మరోమారు ఇదిగో - http://www.rscottsherman.com

ఇక కొన్ని ఫోటో సైట్లు ఇక్కడ ఇస్తున్నా. ఫోటొగ్రఫీ అంటె ఇంటరెస్టు ఉన్నవాళ్ళకు, నేర్చుకుందాం అనుకునేవాళ్ళకు ఈ సైట్లు తరగని స్పూర్తిని ఇవ్వగలవని నా నమ్మకం.
http://www.1x.com
ఇలాంటివి కోకొల్లలు. కొన్ని గుర్తుకి కూడా రావట్లేదు. ప్రస్థుతానికి ఇదొక్కటే
ఆనందించండి

Sep 9, 2011

స్పెసిఫిక్, క్రెడిబుల్ బట్ అన్-కన్ఫర్మ్డ్ త్రెట్

ఒబామా సెనేటుని ఉద్దేశించి పై ప్రశంగిస్తూ
సెప్టెంబరు పదకుండు దాడులు జరిగి పదేళ్ళు కావస్తున్న సందర్భంగా అమెరికా దేశానికి స్పెసిఫిక్, క్రెడిబుల్ బట్ అన్-కన్ఫర్మ్డ్ త్రెట్ ఉన్నట్లు, అందరూ జాగరూకులై ఉండాలనీ, న్యూయార్క్, వాషింగుటన్ ఇత్యాది ప్రధాన నగరాలకు ముప్పు ఉన్నట్లు, కారు బాంబు కానీ ట్రక్కు బాంబుగానీ పేలవచ్చనీ జాగ్రత్తగా ఉండాలనీ పిలుపునిచ్చారు.

మిత్రులారా!
భారతావనిలోకానీ అమెరికాలోకానీ ప్రపంచంలో మరెక్కడన్నా కానీ ఉన్మాదానికి బలియ్యేది సాధారణ పౌరులే. కాబట్టి, చుట్టుపక్కల చూస్తూ గమనిస్తూ, ఏమాత్రం తేడాగా అనిపించినా వెనువెంటనే అధికారులకి తెలియజేస్తూ మిమ్మల్ని మీరు, మీతోపాటు సమాజాన్నీ కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని బ్లాగ్ ముఖంగా యావన్మంది జనాలకూ పిలుపునిస్తున్నాను మరియూ ఉత్సాహపరుస్తున్నాను.

జై హింద్