Dec 8, 2020

ట్రంపిజం

ఆనాడు డ్యూటీలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి అందునా ఒక స్త్రీ మీద చేయిచేసుకుని పదవని కోల్పోయి తన ఉనికినే కోల్పాయాడు ఒక మంత్రి. 

ఈనాడు తన బాధ్యతను తాను నిర్వర్తించినందుకు ఈమె ఇంటి మీదకు తుపాకులతో వేళ్ళారు దుర్మార్గులైన కొందరు.

ఒక దొంగ పుట్టుకతో దొంగ కాడు, ఒక దొంగ తయ్యారు కాబడతాడు.

ఒక దేశాధ్యక్షుడు పుట్టడు, తయ్యారుకాబడతాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో. (మన కర్మ మనదేశంలో ఇంకా కుటుంబ పాలనలో మగ్గుతున్న రాజకీయ కుటుంబాలున్నాయనుకోండి)


ఈమె పేరు జోసిలిన్ బెన్‌సన్, మిషిగన్ రాష్ట్రానికి సెక్రెటరి. రాష్ట్ర సెక్రెటరి ఇంటి మీదకే వేళ్ళారంటే వీళ్ళు ఎంతలా ప్రేరేపితం కాబడ్డారో?

వీళ్ళు ట్రంపిజాన్ని మోస్తున్న సైనికులు అని వేరేగా చెప్పాల్సిన పనిలేదు. తప్పు వీళ్ళదా? వీళ్ళని ప్రేరేపిస్తున్న వ్యవస్థదా?

తప్పు చేసేవాడిదే చేయించేవాడిదా?

తప్పు గొఱ్ఱెదా కాసేవాడిదా? 

ఇంత జరిగినా రిపబ్లికన్ పార్టీ నుంచి గానీ, దేశాధ్యక్షుడి నుంచి గానీ దీన్ని ఖండిస్తూ ఎక్కడా ఒక్క స్టేట్మెంట్ లేదు.

Jocelyn Benson just released a statement: “As my four year old son and I were finishing up decorating the house for Christmas on Saturday night ... dozens of armed individuals stood outside my home shouting obscenities and chanting into bullhorns in the dark of night.”

 

2 comments:

  1. ఇదే ట్రంప్ బదులు వైకాపా వాళ్ళో, జగనో చేస్తే మీరూ సమర్దించడానికి ముందుంటారు.

    ఒక వ్యక్తి/పార్టీ చేసే పనులనుబట్టి సిధ్ధాంతాలను బట్టి ఆ వ్యక్తి మీద ఇష్టమో/ఆ పార్టీ మీద అభిమానమో పెంచుకోవాలి.

    అలా కాకుండా ఎప్పుడైతే కులాభిమానమో/జాత్యాభిమానంతోనో ఒక వ్యక్తి/పార్టీ మీద ఇష్టం పెంచుకొని, వాళ్ళు చేసే ప్రతిపనినీ సమర్ధిస్తే ఇదే జరుగుతుంది.

    అమెరికాలో శ్వేతజాతి దురహంకారులకి, ఆంధ్రాలో మీలాంటి జగనన్న అభిమానులకి పెద్ద తేడా లేదు.

    అక్కడ జీసిలిన్ కి మీరు మద్దతు ఇస్తారు, అదే నిమ్మగడ్డ విషయం వచ్చే సరికి ట్రంప్ అభిమానులు ఏదైతే పాయింట్లు లేవదీస్తున్నారో అవే తెచ్చి అలానే ప్రవర్తిస్తారు, మీకూ వారికీ అట్టే తేడా లేదు.

    ReplyDelete
  2. >>ఒక వ్యక్తి/పార్టీ చేసే పనులనుబట్టి సిధ్ధాంతాలను బట్టి ఆ వ్యక్తి మీద ఇష్టమో/ఆ పార్టీ మీద అభిమానమో పెంచుకోవాలి.<<
    ఒక వ్యక్తి/పార్టీ చేసే పనులనుబట్టి సిద్ధాంతాలనుబట్టి ఓ వ్యక్తి మీద అయిష్టమో/ఆ పార్టీ మీద వ్యతిరేకతనో పెంచుకోవాలి. నిజం.

    >>అలా కాకుండా ఎప్పుడైతే కులాభిమానమో/జాత్యాభిమానంతోనో ఒక వ్యక్తి/పార్టీ మీద ఇష్టం పెంచుకొని, వాళ్ళు చేసే ప్రతిపనినీ సమర్ధిస్తే ఇదే జరుగుతుంది.<<
    ఒక్కసారి ఆంధ్రాలో కులభిమానానికి మూలాలను సోధించండి. మీకే అర్థమౌతుంది.
    జాత్యాభిమానంతో ఒక వ్యక్తి మీద పార్టీ మీద ఇష్టం పెంచుకుని - ఇలా ఇలా జరిగిందీ? ఎప్పుడు జరిగిందీ? ఒక్కసారి 1980లకు వెళ్ళండి. ప్రతీఊరు కులప్రాతిపదికన ఎలా ముక్కలు కాబడ్డదో తెలుసుకండి.


    >>అమెరికాలో శ్వేతజాతి దురహంకారులకి, ఆంధ్రాలో మీలాంటి జగనన్న అభిమానులకి పెద్ద తేడా లేదు.<<
    మీకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లెదు కానీ - నేను జగన్ అభిమానిని అని మీరు ఎలా గంపగుత్తలా కట్టేస్తారూ? తెదేపాని చంద్రబాబుని వ్యతిరెకించటం జగన్ ని సమర్థించటమా?

    >>ఆంధ్రాలో మీలాంటి జగనన్న అభిమానులకి <<
    this is your foolishness to the roof

    >>అక్కడ జీసిలిన్ కి మీరు మద్దతు ఇస్తారు, అదే నిమ్మగడ్డ విషయం వచ్చే సరికి ట్రంప్ అభిమానులు ఏదైతే పాయింట్లు లేవదీస్తున్నారో అవే తెచ్చి అలానే ప్రవర్తిస్తారు, మీకూ వారికీ అట్టే తేడా లేదు.<<
    జోసిలిన్ బెన్సన్ కి నిమ్మగడ్డకి పోలిక పెడుతున్నారంటే - ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీ ఇష్టం.

    ReplyDelete