ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని భర్త ఆయన ముందు దురుసుగా ప్రవర్తించారు. భార్య నటుడితో కలిసి ఫొటో దిగిందని దూషించారు. కశ్మీర్‌లో జరిగిన ఈ సంఘటనను ప్రకాశ్ సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది తనను ఎంతో బాధించిందని అన్నారు. ‘మనం ప్రేమించే వారిని ఎందుకు బాధపెడుతారు?, విభిన్న అభిప్రాయాలు ఉన్న వారిని ఎందుకు ద్వేషిస్తారు?’ అని ప్రశ్నించారు.
‘నేను గుల్మార్గ్‌లోని నా హోటల్‌కి నడుచుకుని వెళ్తున్నా. ఓ మహిళ తన అమ్మాయితో కలిసి నా వద్దకు వచ్చారు. సెల్ఫీ కావాలని అడిగారు. నేను ఇచ్చాను. వాళ్లు చాలా సంతోషించారు. కానీ ఒక్కసారిగా అక్కడికి మహిళ భర్త వచ్చారు. ఆమెను పక్కకు లాగి, దూషించారు. సెల్ఫీ డిలీట్ చేయమని అరిచారు. నేను మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన ఇలా ప్రవర్తించారు.
- ఓ వార్తా పత్రిక
ఈరోజు రేపట్లో హిందు అనటం ఓ బూతు అనీ
హిందూ తీవ్రవాదం అనీ
*సమాజం నుంచి బయటబడ్డ చేపలు* కొన్ని ప్రబలంగా విశ్వసిస్తున్నాయి. ప్రచారం చేస్తున్నాయి.
తమది కాంగ్రేసో లేక లెఫ్ట్ పార్టీనో అర్థంకాక కొట్టుమిట్టాడుతున్నాడు రాహుల్.
లెఫ్టిస్టిక్ భావాలంటే హిందూయిజాన్ని ద్వేషించటం అని కొందరి అభిప్రాయం. పోనీ ఆ భావజాలాన్ని తీవ్రంగా నమ్ముతామా అంటే నమ్మం. అంత లెఫ్ట్ ఆలోచనలే ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ తరపునే పోటీకి దిగచ్చుగా. అబ్బే అలా చేస్తే అస్థిత్వం ఎలా.
ప్రకాశ్ రాజ్ - మోడీని ఎంతలా విమర్శించాడో వార్తా పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది.
పెద్ద విషయం కాదు. ఆంధ్రాలో రోడ్డున పోయే ప్రతోడు మోడీని తిట్టాడు ఎలక్షన్ల ముందు.
ఎలక్షన్లయ్యాక ఏవైందో చూశాం.
సమస్య ఏంటంటే -
తను తన నోటికొచ్చినట్టు తిట్టటం ఒక కోణం.
తనని ఎదురు ప్రశ్నించినప్పుడు తన్నుకొచ్చే నీతి విలువలు ఇంకొక కోణం.
ప్రకాశ్ రాజ్ స్టేట్మెంట్ -
‘మనం ప్రేమించే వారిని ఎందుకు బాధపెడుతారు?, విభిన్న అభిప్రాయాలు ఉన్న వారిని ఎందుకు ద్వేషిస్తారు?’
విభిన్న అభిప్రాయాలున్నవారిని ద్వేషించవద్దుట. మరి తను చేసిందేవిటీ?
తనకి వర్తించదా?
తను అతీతుడా?
ఇది హిపోక్రసీ కాదూ?
Jun 15, 2019
Jun 10, 2019
ఈ రోడ్డు నీ బాబుదా
మొన్నీమధ్య ఈ ప్రకటన చూశాను ఎదో టీవీలో
ఏంతో అర్థవంతంగా అనిపించింది.
ఈ యాడ్ చూసినాకైనా సీటు బెల్టు పెట్టుకోకుండా నడపటం క్షేమంకాదని, నడిపేప్పుడు ఫోన్లు గట్రా చూడకూడదని వాహన చోదకులు గ్రహిస్తారని భావిస్తా.
Click it or Ticket
Labels:
ఆలోచన,
టీవీ,
నా దృష్టిలో,
సమాజం,
సృజనాత్మకత
Jun 1, 2019
మైలురాళ్ళు
ఈ టపా 2013 సెప్టెంబరు 10 న రాశాను.
ఆనాటికి నా నడక యజ్ఞం వెయ్యి మైళ్ళు చేరుకుంది.
అదొక గర్వించతగ్గ మైలురాయిలా అనిపించింది.
ఆశ్చర్యంగా కాలం తన బాటలో తాను తనమానానతాను నడిచిపోయింది. ఒక్క నిమిషం కాల ప్రవాహంలో ఊపిరి తీసుకోటానికి ఆగి వెనక్కి చూస్కుంటే ఎన్నో నడకానుభూతులు.
నడకలో గొప్పతనం ఏంటంటే, నడిచినంతసేపు నీతో నువ్వు నీకై నువ్వు నీలో నువ్వు మాట్టాడుకోవచ్చు చూసుకోవచ్చు రమించుకోవచ్చు
అడిగేవాడుడండు
ఆక్షేపించేవాడుండడు
వేలెత్తి చూపేవాడుండడు
ప్రకృతిలో ప్రకృతితో మమేకం అయి
ప్రతీ చెట్టుని
ప్రతీ పుట్టనీ
గట్టుని
కయ్యల్ని
గడ్డి పరకల్ని
అనుభవిస్తూ
కొండకచో కలలు కంటూ
వెయ్యిమైళ్ళ నడక పక్కన పెడితే మధురాంతకం రాజారాం గారి కథ ఒకటి జ్ఞాపకానికొచ్చింది. ఆ కథని మా మోర్జంపాడులో పనిచేసిన తంతితపాలా బంట్రోతుకి అన్వయిస్తే రోజుకి ఎన్ని మైళ్ళు నడిచుంటాడో సదరు బంట్రోతు. అలా ఎన్ని సంవత్సరాలు పని చేసుంటాడో.
చేతికి పెట్టుకునే పెడోమిటరు లేక చేతికి తగిలించుకునే అలాంకారాలు (wearable) వచ్చాక రోజుకి 10000 అడుగులు అనే లెక్క నిజంగానే ఓ కర్త్వయంలా అయి కూర్చుంది చాలా మందికి నాతోబాటుగా. మా అమ్మకీ ఒక fitbit కొనిచ్చాను. రోజుకి 10000 అడుగులు వేస్తున్నారా అంటుంది అమ్మ.
2013 సెప్టెంబరు 10 న 1000 మైళ్ళు అనే మైలురాయి.
ఈరోఝు నా ఐఫోన్ లోని mapmyrun లో రికార్డు చేయబడ్డ నా నడక నన్ను ఎక్కడిదాకా తీసుకెళ్ళిందో చూశాను.
8,885.72 మైళ్ళు అని అని చూపెట్టింది అప్లికేషన్
Labels:
ఎస్సర్సైజులు,
కాలచ్చేపం బఠాణీలు,
జ్ఞాపకాల దొంతర,
నేను,
మైలురాళ్ళు,
వారోగ్గెం
Subscribe to:
Posts (Atom)